వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. | Paramour Relationship Person Murder | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..

Published Tue, Jun 17 2014 3:21 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. - Sakshi

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..

భానుపురి :వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చి ంది. వావివరసలు మరచి తన భార్యతో వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడని బావమరిదినే బావ హతమార్చిన ఉదంతమిది. ఈ నెల 13న సూర్యాపేట పట్టణ శివారు జాతీయ రహదారి పక్కన తెల్లవారుజామున జరిగిన హత్య కేసును పోలీ సులు ఛేదించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి.శ్రవణ్‌కుమార్ హత్య కేసు వివరాలు వెల్లడించారు. నూతన్‌కల్ మండలం పోలుమళ్ల గ్రామానికి చెందిన కుంచం రవికి తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన శైలజతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి  కుమార్తె, కుమారుడు జన్మించారు.
 
 కొన్నాళ్ల తర్వాత రవి తన కుటుంబంతో పాటు హైదరాబాద్‌కు వెళ్లి ఉప్పల్ సమీపంలో రెండు టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే వరుసకు తన మేన బావమరిది అయ్యే తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన గోగుల శ్రీకాంత్ కుటుంబం హైదరాబాద్‌లోని బీరంగూడ వద్ద నివాసం ఉంటున్నారు. దీంతో బంధువులు ఉన్న ప్రదేశంలో తాను కూడా ఉండాలని రవి భావిం చాడు. దీంతో తన కుటుం బాన్ని బీరంగూడేనికి మార్చాడు.  నాలుగు నెలల నుంచి రవి భార్య శైలజ తరచు భర్త రవితో ఘర్షణ పడుతోంది. ఆమె ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. దీంతో పలుమార్లు పెద్ద మనుషుల్లో రవి పంచాయితీ పెట్టిం చా డు.
 
 ఆ క్రమంలో కొన్నాళ్ల పాటు శైలజను సూర్యాపేటలో నివాసముండే ఆమె సోదరి వద్దకు పంపించాడు. నెల రోజులు గడిచినప్పటికీ భార్య తిరిగి కాపురానికి తిరిగి రావడం లేదు. ఈ లోపు భార్య శైలజ భర్తతో తనకు ఇబ్బందులు ఉన్నాయని అతడిపై చర్య తీసుకుని విడాకులు ఇప్పించాలని నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న రవి తన భార్య తనపై కేసు పెట్టడమేమిటని బీరంగూడెంలో నివసించే బంధువులను సంప్రదించాడు. అప్పటికే శైలజతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీకాంత్ రవిని సంప్రదించాడు. నీ భార్యను తీసుకొచ్చే బాధ్యత నాదేనని సూర్యాపేటకు వెళ్లి వస్తానని నమ్మబలికాడు. శైలజతో మాట్లాడి కాపురం చేయడానికి ఒప్పించి హైదరాబాద్‌కు రప్పించాడు. కొన్ని రోజులు బాగానే ఉన్న శైలజ వివాహేతర సంబంధానికి భర్త రవి అడ్డు వస్తున్నాడని తిరిగి సూర్యాపేటకు చేరుకుంది.
 
 ఈలోపు కేసు విషయమై రావాలని  నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్ సిబ్బంది రవిని కోరారు. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన శ్రీకాంత్ బైక్‌పై రవి కలిసి నల్లగొండకు బయలుదేరారు. మార్గమధ్యలోకి రాగా నే శ్రీకాంత్ శైలజతో ఉన్న వివాహేతర సంబంధం విషయాన్ని రవికి చెప్పాడు. అయినప్పటికీ అక్కడ అతడిని ఏమనకుండా నేరుగా నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీ సులను సంప్రదించి ఒకరోజు గడువు కావాలని కోరి సూర్యాపేటకు బయలుదేరారు. కేతేపల్లి సమీపంలోకి రాగానే శ్రీకాంత్ వద్ద డబ్బులు లేకపోవడంతో తన సోదరి గ్రామమైన కేతేపల్లి మండలం చెర్కుపల్లికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లగానే రవి మాత్రం శ్రీకాంత్ సోదరి ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉన్నాడు. అక్కడ గంట గడిపిన ఇద్దరు తిరిగి సూర్యాపేటకు చేరుకున్నారు. సూర్యాపేటలో శైలజ సోదరి నివాసంలో లేదు. వారి బంధువులు నివసించే చింతలచెరువులో ఉందని తెలుసుకున్నారు.
 
 అప్పటికే అర్ధరాత్రి కావడంతో శ్రీకాంత్ తాను పాతర్లపహాడ్‌కు వెళ్లి వస్తానని ఈ లోపు మీ తోడళ్లుడుతో మాట్లాడుతూ ఉండూ అని రవికి చెప్పి వెళ్లాడు.  అనంతరం రవి ఓ ఆటోలో పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్దకు చేరుకొని శ్రీకాంత్‌కు ఫోన్ చేసి రప్పించాడు.  ఇద్దరు కలిసి శైలజ వద్దకు చింతలచెరువుకు వెళ్లగా అక్కడ వారు తలుపులు తీయలేదు. దీంతో ఇద్దరు కలిసి హైవే పక్కన జనగామ క్రాస్‌రోడ్డు సమీపంలో గల దుర్గాభవాని దాబాహోటల్ వద్దకు వెళ్లి   టీ తాగారు. అనంతరం పక్కనే ఉన్న పోలంపల్లి శ్రీనివాస్ టైర్ల దుకాణం ముందు కూర్చున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన కుటుంబం ఇబ్బందుల పాలుకావడానికి కారణమైన శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు రవి నిర్ణయించుకున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా రవికి ఆగ్రహం వచ్చి టైర్ల కొట్టు వద్ద పంక్చర్లు చేసేందుకు ఉపయోగించే కర్రతో శ్రీకాంత్ తలపై మోదాడు. అనంతరం రవి అక్కడి నుంచి పరారయ్యాడు.
 
 తెల్లవారుజామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రక్తపు మడుగులో ఉన్న శ్రీకాంత్‌ను పోలీసులు ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు శ్రీకాంత్ తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాడు.   కుంచం రవి సెల్‌ఫోన్ ఆధారంగా కేసును ఛేదించారు. నడిగూడెం మండలం త్రిపురవరంలో ఉన్న రవిని ఐడీ పార్టీ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు.  తానే శ్రీకాంత్‌ను హత్య చేసినట్లు  రవి ఒప్పుకున్నాడు. అతడిని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు.  హత్య కేసును ఒక్కరోజులోనే ఛేదించిన ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసులు, ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐలు ఎంఏ జబ్బార్, రాములు, ఐడీ పార్టీ సిబ్బంది గొర్ల కృష్ణయ్య, గోదేషి కరుణాకర్, కె.అరవింద్ ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement