bhanupuri
-
57 రోజులు... 19 హత్యలు
మాయమైపోతున్నాడమ్మా....మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒకే ఒక్కడు యాడ ఉన్నాడో కానీ కంటికే కానరాడు అంటూ ఓ సినీకవి అంతరించిపోతున్న మానవ సంబంధాలపై రాసిన మాటలు అక్షరసత్యాలు అనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలు, వివాహేతర సంబంధాల కారణంగా ఈ రెండు నెలల కాలంలో హత్యల పరంపర కొనసాగింది. కేవలం 57 రోజుల వ్యవధిలోనే 19 హత్యలు జరిగాయి. భానుపురి :ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న..ఇందుకు పథక రచన చేసిన తండ్రి..డబ్బులు ఇవ్వలేదని తాతను చంపిన మనుమడు.. తన భార్యతో చనువుగా ఉన్న స్నేహితుడిని ఇంటికి పిలిపించి పూటుగా మందు తాపించి చంపిన వ్యక్తి.. ఆర్థిక లావాదేవీలతో ఇద్దరిని కిరాతంగా నరికి చంపిన నిందితులు.. ఇలాంటి వ్యాఖ్యలు వింటానికే భయమేస్తోంది కదూ.. ఇవి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల్లో కొన్ని మాత్రమే. వీటిలో కొన్ని క్షణికావేశంలో జరిగితే..మరికొన్ని కక్ష, ప్రతికారంతో రగిలిపోయి పథకం ప్రకారం చేసినవి. మొత్తంగా జిల్లాలో 57రోజుల్లో 19 హత్యలు జరిగాయి. గతంలో రాజకీ య హత్యలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయి. కానీ జిల్లాలో వారంలో కనీసం రెండు హత్యలైనా ఏదో ఒక చోట జరుగుతున్నాయి. హత్యలకు ముఖ్యంగా భూవివాదా లు, వివాహేతర సంబంధాలు కారణాలుగా ఉంటున్నాయి. జిల్లాలో రెండు నెలల్లో సు మారు 19 మంది హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీటిలో భూవివాదాలు, అక్రమ సంబధాల కారణంతో జరిగిన హత్యలే అధికంగా ఉన్నాయి. కేవలం డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తృణప్రాయంగా తీస్తున్నారు. అదే విధంగా అక్రమ సంబంధాల కారణంగా హత్యలకు పాల్పడుతున్నారు. గొంతు కోసి.. ఇటీవల జరిగిన కొన్ని హత్యల్లో దుండగులు వ్యవహరించిన తీరు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది. గొంతులు కోసి ప్రాణం తీస్తున్నారు. ఇటీవల కనగల్ మండలం కమ్మరిగూడెంలో గౌసొద్దీన్, రవికుమార్‌లను కేవలం ముఖం, గొంతుపైనే నరికారు. దాదాపు శరీరం నుంచి తలవేరయ్యే దాకా నరికారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో నల్లగొండ మాజీ కౌన్సిలర్ గుత్తా రాజేందర్‌రెడ్డిని కూడా గొంతు కోసి చంపారు. రెడ్యానాయక్‌ను కూడా తాడుతో గొంతుకు చుట్టి చంపారు. మరెక్కడైనా నరికితే బతికి బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్న దుండగులు గొంతులను కోయడంగానీ, తెగిపోయే వరకు నరకడం గానీ, తాడుతో ఉరి వేయడంగానీ చేస్తున్నారు. మే 26 నుంచి.. మే 26న బీబీనగర్ మండలం జంపల్లి గ్రామానికి చెందిన కేతావత్ రెడ్యానాయక్ ను తండ్రి, అన్న కలిసి కిరాయి హంతకుల తో కిడ్నాప్ చేయించారు. అదేరోజు తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గుట్టలో హత్య చేసి పడేశారు. ఈ విషయం జూలై9వ తేదీన వెలుగులోకి వచ్చింది. మే 30న తుర్కపల్లి మండల పరిధిలోని మోతీరాంతండాలో రాతీరాం అనే వ్యక్తిని అదే తండాకు చెందిన మహేందర్ హత్య చేసి అతని ఒంటిపై ఉన్న నగలను అపహరించాడు. అనంతరం అతను జైలు నుంచి విడుదల అయ్యాక రాతీరాం కుటుంబ సభ్యులు ప్రతీకారంతో మహేందర్‌ను హత్య చేశారు. జూన్ 9న భువనగిరి పట్టణంలోని రామక్రిష్ణాపురంలో రైతు బండ యాదగిరిని భూవివాదాల కారణంగా పొలం వద్ద హత్య చేశారు. 13న సూర్యాపేటలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గోగుల శ్రీకాంత్‌ను కుంచం రవి అనే వ్యక్తి హత్య చేశాడు. 20న హాలియాలో భూవివాదాల కారణంగా వంగూరి సైదులును చంపివేశారు. 22న కోదాడలోని శ్రీరంగాపురంలో గుర్తు తెలియని వ్యక్తిని డబ్బు కోసం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. 23న నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో నల్లగొండ మాజీ కౌన్సిలర్ గుత్తా రాజేందర్‌రెడ్డిని స్నేహితుడే హత్య చేశారు. ఈ హత్యకు స్నేహితుడి భార్యతో రాజేందర్‌రెడ్డి చనువుగా ఉంటున్నాడన్నది ప్రధాన ఆరోపణ. 26న కనగల్ మండల పరిధిలోని దర్వేశిపురం వద్ద వివాహేతర సంబంధాల కారణంతో విజయ అనే మహిళను నూర్ మహ్మద్ హత్య చేశాడు. 27న పెద్దవూర మండల పరిధిలోని వెల్మగూడెంలో డబ్బు లావాదేవీల విషయంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ వెంకటేశ్వర్లును హత్య చేశారు. జూలై 1న శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో ఆస్తి తగాదా విషయంలో బంధువులు గుండెబోయిన వెంకటయ్యను హత్య చేశారు. 2న గరిడేపల్లి మండల పరిధిలోని కోనాయిగూడెంలో భూవివాదాల కారణంగా అంబటి జగన్ హత్యకుగురయ్యాడు. 3న హైదరాబాద్‌లో జిల్లాలోని చింతపల్లికి చెందిన రియల్టర్ అల్గుబెల్లి వెంకటరెడ్డిని డబ్బు విషయంలో దుండగులు హత్య చేశారు. 7న బీబీనగర్ మండల పరిధిలోని గూడూరులో వివాహేతర సంబంధం పెట్టుకుందని జ్యోతి అనే మహిళను భర్త హత్య చేశాడు. నీళ్లులేని బావిలో పడేశాడు. 8న కనగల్ మండలం కుమ్మరిగూడెంలో ఆర్థిక లావాదేవీల కారణంగా ప్రత్యర్థులు గౌసొద్దీన్, రవికుమార్‌లను కత్తులు, వేటకొడవళ్లతో నరికి చంపారు. 10న వేములపల్లి మండలంలో డబ్బులు ఇవ్వలేదని తాత పగడాల మారయ్యను మనవడు హత్య చేశాడు. 11న తుర్కపల్లి మండల పరిధిలోని గొల్లగూడెంలో ధరావత్ నర్సింహనాయక్‌ను డబ్బు కోసం హ త్య చేశారు. 16న మల్లెపల్లిలో భూవివాదాల కారణం గా మాజీ సర్పంచ్ భర్త రమావత్ రవికుమార్ హత్యకు గురయ్యాడు. -
కిడ్నాప్ చేశారని ఆందోళన
భానుపురి :మున్సిపల్ పాలకవర్గం ఎన్నికల సందర్భంగా టీడీపీ, సీపీఎం కౌన్సిలర్లను టీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని సీపీఎం నాయకులు ఆ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, సీపీఎం నాయకుల మధ్య స్వల్ప తగాదా నెలకొంది. గమనించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అందరిని సముదాయించారు. సీపీఎం నాయకులతో చర్చిం చారు. తెలంగాణను సాధించిన పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులను ఆయన కోరారు. తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, వీరిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని సమాచారం రావడంతో తమ నాయకులు వెళ్లి టీడీపీ కౌన్సిలర్ గునగంటి వంశీధర్, సీపీఎం కౌన్సిలర్ అనుములపురి రామకృష్ణను వారి చెర నుంచి విడిపించి తీసుకువచ్చారని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. కౌన్సిలర్‌ను పంపించాలి తమ పార్టీ కౌన్సిలర్ రామకృష్ణను టీఆర్ఎస్ నాయకులు వెంటనే తమ వద్దకు పంపించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు. టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణను కిడ్నాప్ చేశారన్న సమాచారం మేరకు పలువురు సీపీఎం నాయకులు ఆ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కౌన్సిలర్‌ను పంపించాలని కోరినా పంపించకపోవడంతో వారు విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని టీఆర్ఎస్ నాయకులు బలవంతంగా తీసుకువచ్చారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పట్టణంలో ఇబ్బందికర రాజకీయాలు చేసేవారని, ఆయన దారిలోనే ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి జగదీష్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు మల్లు నాగార్జున్‌రెడ్డి, నూకల మధుసూదన్‌రెడ్డి, ఎల్గూరి గోవింద్, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, పల్లేటి వెంకన్న తదితరులు ఉన్నారు. టీడీపీలో తేలని చైర్పర్సన్ అభ్యర్థి చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీలో బుధవారం లొల్లి జరిగింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు మహిళలు బత్తుల ఝాన్సీరాణి, బూర సుష్మారాణి, నేరేళ్ల లక్ష్మి చైర్పర్సన్ రేసులో ఉన్నారు. అయితే ఆ పార్టీ నాయకులు వారం రోజులపాటు సభ్యులను క్యాంప్‌నకు తరలించారు. తీరా ఎన్నిక వచ్చే సరికి ముగ్గురిలో ఎవరిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పార్టీ అధిష్టానం చైర్పర్సన్ అభ్యర్థిగా బత్తుల ఝాన్సీరాణిని ఎంపికచేస్తూ ప్రిసైడింగ్ అధికారికి నివేదిక అందించింది. బీజేపీలో పదవి కోసం.. బీజేపీలో నుంచి నలుగురు కౌన్సిలర్లు గెలుపొందారు. పాలకవర్గం ఎన్నికలో టీడీపీ వారికి సహకరించేందుకు వీరు ఒప్పందానికి వచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. టీడీపీ వారికి చైర్పర్సన్ పదవి, బీజేపీకి వైస్ చైర్పర్సన్ పదవి ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ పదవిని గోదల భారతమ్మకు ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. చైర్పర్సన్ మహిళ ఉన్నప్పుడు వైస్ చైర్మన్ పదవిని పురుషులకు ఇవ్వాలని బీజేపీలోని కొందరు కౌన్సిలర్లు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానంతో రాజీ పడక మిగిలిన కౌన్సిలర్లు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు నలుగురిని బలిగొన్నాయి. సూర్యాపేట వద్ద గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన భార్యాభర్తలు దుర్మరణం పాలవగా భువనగిరిలో సోదరి అంత్యక్రియలకు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. బీబీనగర్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మరణించాడు. భానుపురి : పట్టణంలోని ఐఎంఐ ఫంక్షన్‌హాల్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. సంఘటనకు సంబంధించిన వి వరాలు.. గుంటూరు జిల్లా చుండూరుకు చెం దిన గుడిసె శేషయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని చి కిత్స నిమిత్తం సొంత కారులో హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. కారులో శేషయ్యతో పాటు అతని భార్య ధనమ్మ, కుమారుడు అనిల్ ఉ న్నారు. అనిల్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. మార్గమధ్యంలో సూర్యాపేటలోని ఐఎంఏ ఫంక్షన్‌హాల్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న క్రమం లో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో శేషయ్య(48) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ధనమ్మ(46), అనిల్‌ను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ ధనమ్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలాని కెళ్లి పరిశీలించారు. శేషయ్య మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
భానుపురి :వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చి ంది. వావివరసలు మరచి తన భార్యతో వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడని బావమరిదినే బావ హతమార్చిన ఉదంతమిది. ఈ నెల 13న సూర్యాపేట పట్టణ శివారు జాతీయ రహదారి పక్కన తెల్లవారుజామున జరిగిన హత్య కేసును పోలీ సులు ఛేదించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి.శ్రవణ్‌కుమార్ హత్య కేసు వివరాలు వెల్లడించారు. నూతన్‌కల్ మండలం పోలుమళ్ల గ్రామానికి చెందిన కుంచం రవికి తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన శైలజతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి కుమార్తె, కుమారుడు జన్మించారు. కొన్నాళ్ల తర్వాత రవి తన కుటుంబంతో పాటు హైదరాబాద్‌కు వెళ్లి ఉప్పల్ సమీపంలో రెండు టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే వరుసకు తన మేన బావమరిది అయ్యే తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన గోగుల శ్రీకాంత్ కుటుంబం హైదరాబాద్‌లోని బీరంగూడ వద్ద నివాసం ఉంటున్నారు. దీంతో బంధువులు ఉన్న ప్రదేశంలో తాను కూడా ఉండాలని రవి భావిం చాడు. దీంతో తన కుటుం బాన్ని బీరంగూడేనికి మార్చాడు. నాలుగు నెలల నుంచి రవి భార్య శైలజ తరచు భర్త రవితో ఘర్షణ పడుతోంది. ఆమె ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. దీంతో పలుమార్లు పెద్ద మనుషుల్లో రవి పంచాయితీ పెట్టిం చా డు. ఆ క్రమంలో కొన్నాళ్ల పాటు శైలజను సూర్యాపేటలో నివాసముండే ఆమె సోదరి వద్దకు పంపించాడు. నెల రోజులు గడిచినప్పటికీ భార్య తిరిగి కాపురానికి తిరిగి రావడం లేదు. ఈ లోపు భార్య శైలజ భర్తతో తనకు ఇబ్బందులు ఉన్నాయని అతడిపై చర్య తీసుకుని విడాకులు ఇప్పించాలని నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న రవి తన భార్య తనపై కేసు పెట్టడమేమిటని బీరంగూడెంలో నివసించే బంధువులను సంప్రదించాడు. అప్పటికే శైలజతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీకాంత్ రవిని సంప్రదించాడు. నీ భార్యను తీసుకొచ్చే బాధ్యత నాదేనని సూర్యాపేటకు వెళ్లి వస్తానని నమ్మబలికాడు. శైలజతో మాట్లాడి కాపురం చేయడానికి ఒప్పించి హైదరాబాద్‌కు రప్పించాడు. కొన్ని రోజులు బాగానే ఉన్న శైలజ వివాహేతర సంబంధానికి భర్త రవి అడ్డు వస్తున్నాడని తిరిగి సూర్యాపేటకు చేరుకుంది. ఈలోపు కేసు విషయమై రావాలని నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్ సిబ్బంది రవిని కోరారు. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన శ్రీకాంత్ బైక్‌పై రవి కలిసి నల్లగొండకు బయలుదేరారు. మార్గమధ్యలోకి రాగా నే శ్రీకాంత్ శైలజతో ఉన్న వివాహేతర సంబంధం విషయాన్ని రవికి చెప్పాడు. అయినప్పటికీ అక్కడ అతడిని ఏమనకుండా నేరుగా నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీ సులను సంప్రదించి ఒకరోజు గడువు కావాలని కోరి సూర్యాపేటకు బయలుదేరారు. కేతేపల్లి సమీపంలోకి రాగానే శ్రీకాంత్ వద్ద డబ్బులు లేకపోవడంతో తన సోదరి గ్రామమైన కేతేపల్లి మండలం చెర్కుపల్లికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లగానే రవి మాత్రం శ్రీకాంత్ సోదరి ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉన్నాడు. అక్కడ గంట గడిపిన ఇద్దరు తిరిగి సూర్యాపేటకు చేరుకున్నారు. సూర్యాపేటలో శైలజ సోదరి నివాసంలో లేదు. వారి బంధువులు నివసించే చింతలచెరువులో ఉందని తెలుసుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో శ్రీకాంత్ తాను పాతర్లపహాడ్‌కు వెళ్లి వస్తానని ఈ లోపు మీ తోడళ్లుడుతో మాట్లాడుతూ ఉండూ అని రవికి చెప్పి వెళ్లాడు. అనంతరం రవి ఓ ఆటోలో పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్దకు చేరుకొని శ్రీకాంత్‌కు ఫోన్ చేసి రప్పించాడు. ఇద్దరు కలిసి శైలజ వద్దకు చింతలచెరువుకు వెళ్లగా అక్కడ వారు తలుపులు తీయలేదు. దీంతో ఇద్దరు కలిసి హైవే పక్కన జనగామ క్రాస్‌రోడ్డు సమీపంలో గల దుర్గాభవాని దాబాహోటల్ వద్దకు వెళ్లి టీ తాగారు. అనంతరం పక్కనే ఉన్న పోలంపల్లి శ్రీనివాస్ టైర్ల దుకాణం ముందు కూర్చున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన కుటుంబం ఇబ్బందుల పాలుకావడానికి కారణమైన శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు రవి నిర్ణయించుకున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా రవికి ఆగ్రహం వచ్చి టైర్ల కొట్టు వద్ద పంక్చర్లు చేసేందుకు ఉపయోగించే కర్రతో శ్రీకాంత్ తలపై మోదాడు. అనంతరం రవి అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రక్తపు మడుగులో ఉన్న శ్రీకాంత్‌ను పోలీసులు ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు శ్రీకాంత్ తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాడు. కుంచం రవి సెల్‌ఫోన్ ఆధారంగా కేసును ఛేదించారు. నడిగూడెం మండలం త్రిపురవరంలో ఉన్న రవిని ఐడీ పార్టీ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. తానే శ్రీకాంత్‌ను హత్య చేసినట్లు రవి ఒప్పుకున్నాడు. అతడిని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు. హత్య కేసును ఒక్కరోజులోనే ఛేదించిన ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసులు, ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్ఐలు ఎంఏ జబ్బార్, రాములు, ఐడీ పార్టీ సిబ్బంది గొర్ల కృష్ణయ్య, గోదేషి కరుణాకర్, కె.అరవింద్ ఉన్నారు. -
అంగన్వాడీలు..అరెస్ట
భానుపురి, అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను సోమవా రం సూర్యాపేట పట్టణ సమీపంలో పో లీసులు అడ్డుకున్నారు. సూర్యాపేట పట్టణంతో పాటు జగ్గయ్యపేట, నిడదవోలు, నందిగామ, తిరువూరు, ఖమ్మం ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది అంగన్వాడీలను అదుపులోకి తీ సుకొని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. అంగన్వాడీలను సొంతపూచీకత్తుపై మధ్యాహ్న సమయంలో పోలీ సులు స్టేషన్ నుంచి బయటకు పంపిం చారు. అంగన్వాడీలను పోలీసులు ని ర్బంధించడాన్ని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు స్టేషన్ ఎదుట రా స్తారోకో చేశారు. అదే విధంగా స్టేషన్లో ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్రాజగోపాల్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డి, సీపీఎం డివి జన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంపటి గురూజీ, వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు పెద్దిరెడ్డి రాజా, మల్లు నాగార్జునరెడ్డి, ఎల్గూరి గోవింద్, షఫీఉల్లా, నేరెళ్ల మధుగౌడ్, బాలసైదులుగౌడ్, సాయికుమార్, కోట గోపి, పెంటయ్య స్టేషన్ వద్దకు చేరుకొని అంగన్వాడీల ఆందోళనకు మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ అంగన్వాడీలు కొన్ని రో జు లుగా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వివిధ రూపాల్లో ఆం దోళనలు కొనసాగిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నా రు. అంగన్వాడీలకు ప్రభుత్వం కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీలు సుజాత, రమణ, అలివేలు, పద్మ, శైలజ, నాగమణి, నాగలక్ష్మి, ప్రభావతి పాల్గొన్నారు.