
అవార్డుతో వెంకటరత్నకుమార్
పోరుమామిళ్ల: వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల రాఘవేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ వెంకటరత్నకుమార్ అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీలో అడ్వాన్స్‌డ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ డెంటిస్ట్రీ ఆఫ్ పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ప్రపంచంలో దంత వైద్యంలో అత్యున్నత పురస్కారం ‘ది హ్యారీ డబ్లు్య.ఎఫ్.డ్రస్సెల్’ అవార్డు సాధించారు.
ఈ విద్య అభ్యసించిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి డాక్టర్‌గా వెంకటరత్నకుమార్ నిలిచారు. కోర్సు పూర్తి చేసి అవార్డును సొంతం చేసుకోవడమే కాక అమెరికాలోని వాషింగ్‌టన్ ‘రివార్డ్స్ డెంటల్ క్లినిక్’లో దంత వైద్యుడిగా రూ.1.25 కోట్ల వేతన ప్యాకేజీతో నియమితులయ్యారు. కాగా, రత్నకుమార్ 2014లో కడప రిమ్స్‌లో దంత వైద్యంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. రత్నకుమార్ తండ్రి రుద్రవరం శ్రీనివాసులు విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. తల్లి దేవి గృహిణి.
Comments
Please login to add a commentAdd a comment