సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. వారం రోజుల క్రితం అనంతారం గ్రామానికి చెందిన బాలయ్య అనే వృద్ధుడు శ్వాసకోశ సంబంధిత సమస్యతో జిల్లా ఆసుపత్రిలో చేరాడు. అప్పటినుంచి ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజులు క్రితం ఆయనకు పంటి సమస్య వచ్చింది. అన్నం తినలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాన్ని స్టాఫ్ నర్సులకు తెలియజేయగా వారు దంత వైద్యులకు మూడు రోజులుగా సమాచారం ఇస్తున్నారు.
చదవండి: ‘నేను ఐపీఎస్ అధికారిని.. తొలిచూపులోనే నచ్చావ్.. పెళ్లి చేసుకుందాం’
ఆసుపత్రిలో ముగ్గురు డెంటిస్టులు ఉన్నా ఒక్కరు కూడా పేషెంట్ వద్దకు వచ్చి, చూడలేదు. చివరకు శుక్రవారం ఓ డాక్టర్ బెడ్ వద్దకు రాకుండా, పేషెంట్‌ను చూడకుండానే ఒక క్రీమ్ పేరు రాసి, వాడమని పంపించడం గమనార్హం. ఆసుపత్రిలో అడిగేవారు లేకపోవడంతో పేషెంట్లను పట్టించుకునేనాథుడే కరువయ్యాడని బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి, రోగులకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చదవండి: యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment