డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో.. | Speech Therapist Sues Dentist For Rs 11 Crore | Sakshi
Sakshi News home page

డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..

Published Wed, Jul 24 2024 10:43 AM | Last Updated on Wed, Jul 24 2024 11:30 AM

Speech Therapist Sues Dentist For Rs 11 Crore

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు ఒక్కోసారి తమ జీవితాన్ని లేదా కెరీర్‌ని కోల్పోవాల్సి వస్తుంటుంది. 'వ్యైద్యో నారాయణ హరిః" అన్న మాటకు ఎంతో విలువ ఇచ్చి మరీ రోగి చికిత్స తీసుకోవడానికి వైద్యుడి వద్దకు వస్తాడు. వైద్యులు కూడా ఆ మాటను నిజం చేసేలా వారి సమస్యను నయం చేయాలే గానీ మరింత విపత్కర స్థితిలో పడేయకూడదు. ఇలా వైద్యుడి తప్పిదాల కారణంగా ప్రాణాలు లేదా భవితవ్యాన్ని కోల్పోయిన వారెందరో ఉన్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఒక స్పీచ్‌ థెరపిస్ట్‌. 

ఏం జరిగిందంటే..అలిసన్‌ వింటర్‌బోథమ్‌ అనే 55 ఏళ్ల స్పీచ్‌ థెరపిస్ట్‌ 2020 నవంబర్‌లో  దంత వైద్యడు డాక్టర్‌ అరాష్‌ షహరాక్‌ వద్ద పంటి సమస్యకు చికిత్స తీసుకుంది. ఆమె కొంతకాలంగా కుడి జ్ఞాన దంతంతో ఇబ్బంది పడతుండంతో చికిత్స కోసం వైద్యుడు షహారాక్‌ వద్దకు వచ్చింది. అయితే ఈ జ్ఞానదంతం రిమూవ్‌ చేసే సర్జరీలో నాలుక తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత నుంచి అలిసన్‌ వింటర్‌బోథమ్‌ పరిస్థితి ఘెరంగా మారిపోయింది. ఆమె జిహ్వ నాడి దెబ్బతిని కొద్దిగా మాట్లాడినా భయానక నొప్పిని భరించాల్సి వచ్చేది. చెప్పాలంటే పెదవి విప్పి మాట్లాడాలంటేనే నరకం అనేలా పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. హాయిగా రెండు మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి. అసలు నాలుకకు సంబంధించిన చికిత్స ప్రక్రియలో ఇలాంటి రిస్క్‌ ఉంటుందని ముందుగా హెచ్చరించకపోవడంతోనే తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నానని అలిసన్‌ ఆరోపిస్తోంది. 

స్పీచ్‌ థెరపిస్ట్‌గా పనిచేసే నాకు ఈ పరిస్థితి కారణంగా తన కెరీర్‌ నాశనమయ్యిందంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అంతేగాదు తాను ఎదర్కొంటున్న ఈ నొప్పిని మంటతో పోల్చారు. మాట్లాడుతున్న ప్రతిసారి నాలుక కాలిపోతున్నట్లుగా జలదరింపు వస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. అందువల్లో తాను రోజుకి ఇద్దరు లేదా ముగ్గురు క్లయింట్లకు మాత్రమే స్పీచ్‌థెరపిస్ట్‌గా కౌన్సిలింగ్‌ ఇవ్వగలుగుతున్నాని పిటిషన్‌లో వివరించారు. అందుకుగానూదంత వైద్యుడు తనకు  దాదాపు రూ. 11 కోట్లు వరకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.   

అయితే వైద్యుడు షహరక్‌ మాత్రం తాను అతనికి ఈ చికిత్స ప్రక్రియ గురించి కూలంకషంగా వివరించానని, ఇలా ఇంత పెద్ద రిస్క్‌ ఎదురవ్వుతుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. న్యాయస్థానం వాదోపవాదాలు, విచారణ అనంతరం ఏం తీర్పు ఇస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి క్రిటికల్‌ సర్జరీ విషయంలో ఎదురయ్యే దుష్పరిణామాలు గురించి పేషంట్‌కి వివరించి లేదా సన్నద్ధం చేసి గానీ వైద్యలు ముందుకుపోకూడదు. అలా కాదని ముందుకువెళ్లితే ఒకవేళ రోగికి ఏదైన నష్టం వాటిల్లితే అందుకు భాద్యులు ఎవరూ అనేది ఒక్కసారి ఆలోచించండి.

(చదవండి: హెల్త్‌కేర్ బడ్జెట్ 2024-25: కేన్సర్‌ రోగులకు భారీ ఊరట!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement