Speech Therapist
-
డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు ఒక్కోసారి తమ జీవితాన్ని లేదా కెరీర్‌ని కోల్పోవాల్సి వస్తుంటుంది. 'వ్యైద్యో నారాయణ హరిః" అన్న మాటకు ఎంతో విలువ ఇచ్చి మరీ రోగి చికిత్స తీసుకోవడానికి వైద్యుడి వద్దకు వస్తాడు. వైద్యులు కూడా ఆ మాటను నిజం చేసేలా వారి సమస్యను నయం చేయాలే గానీ మరింత విపత్కర స్థితిలో పడేయకూడదు. ఇలా వైద్యుడి తప్పిదాల కారణంగా ప్రాణాలు లేదా భవితవ్యాన్ని కోల్పోయిన వారెందరో ఉన్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఒక స్పీచ్ థెరపిస్ట్. ఏం జరిగిందంటే..అలిసన్ వింటర్‌బోథమ్ అనే 55 ఏళ్ల స్పీచ్ థెరపిస్ట్ 2020 నవంబర్‌లో దంత వైద్యడు డాక్టర్ అరాష్ షహరాక్ వద్ద పంటి సమస్యకు చికిత్స తీసుకుంది. ఆమె కొంతకాలంగా కుడి జ్ఞాన దంతంతో ఇబ్బంది పడతుండంతో చికిత్స కోసం వైద్యుడు షహారాక్ వద్దకు వచ్చింది. అయితే ఈ జ్ఞానదంతం రిమూవ్ చేసే సర్జరీలో నాలుక తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత నుంచి అలిసన్ వింటర్‌బోథమ్ పరిస్థితి ఘెరంగా మారిపోయింది. ఆమె జిహ్వ నాడి దెబ్బతిని కొద్దిగా మాట్లాడినా భయానక నొప్పిని భరించాల్సి వచ్చేది. చెప్పాలంటే పెదవి విప్పి మాట్లాడాలంటేనే నరకం అనేలా పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. హాయిగా రెండు మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి. అసలు నాలుకకు సంబంధించిన చికిత్స ప్రక్రియలో ఇలాంటి రిస్క్ ఉంటుందని ముందుగా హెచ్చరించకపోవడంతోనే తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నానని అలిసన్ ఆరోపిస్తోంది. స్పీచ్ థెరపిస్ట్‌గా పనిచేసే నాకు ఈ పరిస్థితి కారణంగా తన కెరీర్ నాశనమయ్యిందంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అంతేగాదు తాను ఎదర్కొంటున్న ఈ నొప్పిని మంటతో పోల్చారు. మాట్లాడుతున్న ప్రతిసారి నాలుక కాలిపోతున్నట్లుగా జలదరింపు వస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. అందువల్లో తాను రోజుకి ఇద్దరు లేదా ముగ్గురు క్లయింట్లకు మాత్రమే స్పీచ్థెరపిస్ట్గా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నాని పిటిషన్లో వివరించారు. అందుకుగానూదంత వైద్యుడు తనకు దాదాపు రూ. 11 కోట్లు వరకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైద్యుడు షహరక్ మాత్రం తాను అతనికి ఈ చికిత్స ప్రక్రియ గురించి కూలంకషంగా వివరించానని, ఇలా ఇంత పెద్ద రిస్క్ ఎదురవ్వుతుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. న్యాయస్థానం వాదోపవాదాలు, విచారణ అనంతరం ఏం తీర్పు ఇస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి క్రిటికల్ సర్జరీ విషయంలో ఎదురయ్యే దుష్పరిణామాలు గురించి పేషంట్‌కి వివరించి లేదా సన్నద్ధం చేసి గానీ వైద్యలు ముందుకుపోకూడదు. అలా కాదని ముందుకువెళ్లితే ఒకవేళ రోగికి ఏదైన నష్టం వాటిల్లితే అందుకు భాద్యులు ఎవరూ అనేది ఒక్కసారి ఆలోచించండి.(చదవండి: హెల్త్‌కేర్ బడ్జెట్ 2024-25: కేన్సర్ రోగులకు భారీ ఊరట!) -
కంప్యూటర్ పిచ్చి... వదిలించేదెలా?!
కిడ్స్ మైండ్ సెట్ మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. ఈ మధ్య మేం ఏదైనా కాదన్నా, కోపంతో ఓ మాట అన్నా ఉక్రోషం వచ్చేస్తోంది వాడికి. ఓ మూలకు పోయి నిలబడుతున్నాడు. పైకి ఏడవడం లేదు కానీ దుఃఖపడుతున్నాడని అర్థమవుతోంది. అలాంటప్పుడు మాట్లాడిస్తే నత్తి వచ్చేస్తోంది. ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు. ఈ మధ్యనే అలా అవుతోంది. ఎందుకు? ఇదేమైనా మానసిక సమస్యా? - రాజ్యలక్ష్మి, నంద్యాల బాబుకు ఈ మధ్య స్ట్రెస్ ఏమైనా ఎక్కువైందా? ఒకవేళ స్కూల్లో చదువు వల్ల కానీ, ఫ్రెండ్స్ టీజ్ చేయడం వల్ల కానీ తనకు ఏమైనా ఇబ్బందిగా ఉందేమో గమనించండి. వీలైతే తననే బుజ్జగించి అడగండి. చెబితే సరే. లేదంటే ఒత్తిడి చేయకుండా మరో మార్గంలో తెలుసుకోడానికి ట్రై చేయండి. ఏదీ లేకపోతే తనని మార్చడానికి మీరే మెల్లగా ప్రయత్నించాలి. తను చెప్పినట్టే ప్రతిసారీ వినడం ఎందుకు సాధ్యం కాదో వివరించండి. వీలైనంత వరకూ కసురు కోవడం, తిట్టడం లాంటివి చేయకండి. సాధ్యమైనంత నెమ్మదిగానే డీల్ చేయండి. అలా అని బాధపడతాడేమోనని అడిగినవన్నీ ఇచ్చెయ్యకండి. మీ ప్రయత్నాలన్నీ చేసినా బాబు మారకపోతే కౌన్సెలర్‌కు చూపించండి. వాళ్లే చూసుకుంటారు. నత్తికి మాత్రం ఓసారి స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించండి. స్ట్రెస్ వల్లే ఇలా వస్తోందా లేక ఇంకేదైనా సమస్య ఉందా అనేది వాళ్లే చెప్పగలరు. మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ చదువులో చాలా చురుకు. ఎక్కువ చదువుతాడు. బాగా నాలెడ్జ్ ఉంది. క్విజ్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొని బోలెడు ప్రయిజులు తెచ్చుకున్నాడు. అందుకే వాడికి పనికి వస్తుందని కంప్యూటర్ కొనిచ్చాం. కానీ ఈమధ్య ఓసారి వాడి గదిలోకి వెళ్లినప్పుడు... వాడు పిచ్చి పిచ్చి వీడియోలు, ఫొటోలు చూడటం కనిపించింది. గమనించనట్టే వచ్చే శాను. ఇలాంటివి చేస్తే వాడి భవిష్యత్తు ఏమవు తుందోనని భయంగా ఉంది. మాకు విషయం తెలిసిందని తెలిస్తే ఎలా రియాక్టవుతాడోనని మరో భయం. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి? - పి.స్వర్ణ, హైదరాబాద్ బాబుతో తప్పకుండా ఈ విషయం మాట్లాడండి. ఈ వయసులో ఇటువంటివి జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదు. తప్ప కుండా తనకి తప్పొప్పులు తెలిసేలా చేయాలి. కాబట్టి కూర్చోబెట్టి వివరిం చండి. అవసరమైతే పనిష్మెంట్గా ఒక వారం పది రోజుల పాటు కంప్యూటర్ తీసేసుకోండి. తిరిగి ఇచ్చేటప్పుడు అన్ని రూల్స్ పెట్టి ఇవ్వండి. తప్పితే కంప్యూటర్ పూర్తిగా తీసేసుకుంటానని చెప్పండి. ఇంటర్నెట్ కూడా అవసరం మేరకే ఉండేలా జాగ్రత్తపడండి. ఓ సమయం దాటాక ఇంటర్నెట్ రాకుండా చేసేయండి. కంప్యూటర్లు, ల్యాప్‌టాపుల్లో పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయండి. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్లని కరెక్ట్ చేయడం మన బాధ్యత. కానీ అది వాళ్లలో మార్పు తీసుకు వచ్చేలా ఉండాలి తప్ప అవమానించేలా, సిగ్గు పరిచేలా ఉండకూడదు. కాబట్టి కాస్త కూల్‌గానే డీల్ చేయండి. మా పాప ఆరో తరగతి చదువుతోంది. తెలివితేటల వరకూ ఎటువంటి సమస్యా లేదు. అయితే పాప ప్రవర్తనతోనే కాస్త ఇబ్బంది. ఎందుకో తెలియదు కానీ తనకు స్వార్థం చాలా ఎక్కువ. ఎవరితోనూ ఏదీ షేర్ చేసు కోడానికి ఇష్టపడదు. చివరికి తన తమ్ముడితో కూడా ఇది నీది, ఇది నాది అని వాదిస్తూ ఉంటుంది. ఎవరికీ ఏమీ పెట్టదు, ఇవ్వదు. అలా ఉండకూడదని, అందరితోనూ పంచు కోవడం చాలా గొప్ప లక్షణమని నా భార్య, నేను చాలాసార్లు చెప్పాం. కానీ తన తీరు మారలేదు. ఎందుకిలా చేస్తోంది? చిన్నప్పుడే ఇలా ఉంటే తను మంచి వ్యక్తి ఎలా అవుతుంది? సలహా ఇవ్వండి. - ప్రవీణ్‌రెడ్డి, విజయవాడ చాలామంది పిల్లలు ఈ వయసులో ఇలాంటివి చేస్తారు. కానీ మరీ ఇలా మాత్రం ఉండకూడదు. షేర్ చేసుకోవాలని మీరు ఆల్రెడీ చెప్పారు. కానీ తను అలా చేయడం లేదు. కాబట్టి ఈసారి బలవంతంగానైనా ఆ పని చేయించండి. దగ్గరుండి వాళ్లకీ వీళ్లకీ తనతోనే ఏమైనా ఇప్పించండి. తను ఒప్పుకోకపోయినా, కోపం వచ్చినా వదిలి పెట్టవద్దు. అలాగే, షేర్ చేసుకోవడం వల్ల వచ్చే మంచి ఫలితాలేమిటో కూడా తనకి చెప్పండి. మనం ఇవ్వడం వల్ల ఎదుటివాళ్లు ఎలా సంతోషపడతారు, వాళ్లు కూడా తమకున్న వాటిని ఎలా పంచుతారు, ఎలా దీవిస్తారు వంటివన్నీ తనకు అనుభవమయ్యేలా చేయండి. అప్పుడు తనకే అలవాటవు తుంది. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టు సాయం తీసుకోండి. డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
ఈ బుల్లెట్ ఎక్కి హిమాలయాలకు వెళ్లండి....
యాత్రా సాహిత్యం ఎక్కడో కొన్ని పర్వతాలుంటాయి. మరెక్కడో కొన్ని నదులు. కొన్ని చోట్ల చెట్లు ఆకాశంపై గీతలు గీస్తూ తలలు కదుపుతూ ఉంటాయి. కొన్ని చోట్ల బండరాళ్లు పరుపుల కంటె సుఖంగా మారి సేద దీరేందుకు సిద్ధమై ఉంటాయి. కొన్ని చోట్ల కల్మషం లేని గాలి హృదయాన్ని కడగడానికి రూపాయి అక్కర్లేకుండా రెడీగా ఉంటుంది. కొన్నిచోట్ల నిగూఢమైన సరస్సులు మిమ్మల్ని మబ్బులతో పాటు ప్రతిబింబించడానికి మౌనంగా ఎదురుచూస్తుంటాయి. చాలాచోట్ల ప్రకృతి శక్తులు మీ రాక కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని ఆశీర్వదిద్దామని కాచుకొని ఉంటాయి. కాకపోతే మనం వెళ్లం అంతే. ఆఫీసు, ఇల్లు, కూరగాయల మార్కెట్టు, అడపా దడపా గుడో గోపురమో... ఇంతేనా? కాని కొందరు అదృష్టవంతులు ఈ సంకెలలను ఛేదించుకుంటారు. కాళ్లకు చక్రాలు కట్టుకుంటారు. భుజాలకు రెక్కలు. మరి తుర్రుమంటూ ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంటారు. చలనం మనిషికి మూలశక్తి. ప్రయాణం అందుకు చోదక శక్తి. నిలువనీరులా ఎంతకాలం? ప్రవహించి చూడటంలోనే ఉంది ప్రాణాధారం. పూణెలో స్పీచ్ థెరపిస్ట్‌గా పని చేసే అజిత్ హరిసింఘాని తన ఐదు పదుల వయసులో 2004లో ఒక ప్రయాణం చేశారు. అదీ బస్సులోనో రైల్లోనో కాదు. జన సమృద్ధంగా ఉంటే మానవ కాంక్రీటు నగరాల్లోకి కాదు. హిమాలయాలలోకి. వందల కిలోమీటర్ల పాటు నరమానవుడు కనిపించని లేహ్ మైదానాలలోకి. ప్రాణాంతకమైన కొండఅంచు దారుల్లోకి. మనిషిని గడ్డ కట్టించే చలిలోకి. ఆక్సిజన్ సరిగా అందని ఉన్నత అంతస్తుల్లోకి. ఒక్కడే ఒక బుల్లెట్ ఎక్కి వెనుక కొన్ని సామాన్లు కట్టుకొని అలా వెళుతూ వెళుతూ ఆయన ఏం చూశారు? నిర్మలమైన మనుషుల్ని చూశారు. వినయం ఉట్టిపడే ప్రకృతిని చూశారు. అంతేనా? మనుషులు ఎన్ని రకాలుగా బతుకుతారో చూశారు. తన బతుకును వారి బతుకుతో బేరీజు వేసుకొని తానెంత అదృష్టవంతుడినో కదా అని సృష్టికర్తకు కృతజ్ఞతలు చెప్పారు. 4,300 కిలోమీటర్ల పాటు ఒక్కళ్లమే ప్రయాణించడం, మనతో మనం మాత్రమే ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనసుకు పట్టిన చాలా మకిలి వదిలిపోతుంది. అది తుడిచిన అద్దంలా మారుతుంది. జీవం కొత్త శక్తుల్ని ఇముడ్చుకుంటుంది. అతడు ఇంతకు ముందరి మనిషి ఎంత మాత్రం కాదు. పరిణతి చెందుతాడు. ప్రయాణమే పరిణతి. దర్శించడమే పరిణతి. బాహ్య ప్రయాణం, అంతర్గత ప్రయాణం రెండూ ఈ పుస్తకంలో మనం చూస్తాం. ఇంత సాహసం చేస్తే? చాలా గొప్ప. చేయలేనివారు ఈ పుస్తకం చదివితే? కనీసం ఆ గొప్పను పరోక్షంగా అయినా ఆస్వాదించవచ్చు. కొల్లూరి సోమసుందర్ అనువాదం చాలా సరళంగా సూటిగా మూల రచయిత స్వయంగా తెలుగులో రాసినంత ప్రభావవంతంగా ఉంది. దాసరి అమరేంద్ర ముందుమాట బోనస్. డైరీ డిసెంబర్ 14 ఆదివారం హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉ. 10 గం. నుంచి విప్లవ కవి జ్వాలాముఖి వర్ధంతి సభ. డాక్టర్ జతిన్, కె.కె.రంగనాథాచార్యులు, డి.పాపారావు, నిఖిలేశ్వర్ తదితరులు పాల్గొంటారు. డిసెంబర్ 14 ఆదివారం విశాఖ పౌరగ్రంథాలయం (విశాఖ)లో కవయిత్రి జగద్ధాత్రి కవితా సంపుటి ‘సహచరణం’ ఆవిష్కరణ. సయ్యద్ సలీం, ఎల్.ఆర్.స్వామి, చందు సుబ్బారావు తదితరులు పాల్గొంటారు. డిసెంబర్ 14 ఆదివారం హైదరాబాద్ లా మకాన్లో సాయంత్రం ఆరుగంటలకు రచయిత వేంపల్లి గంగాధర్‌కు వాసిరెడ్డి సీతాదేవి కథాపురస్కార ప్రదానోత్సవం. గ్రంథి భవానీప్రసాద్, ఆవుల మంజులత, ఓల్గా తదితరులు పాల్గొంటారు. డిసెంబర్ 14 ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతి సమావేశమందిరంలో ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు ప్రఖ్యాత నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు శతజయంతి ముగింపు సందర్భంగా చర్చా సదస్సు. నిర్వహణ: సాహిత్య అకాడమీ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్. ద్వా.నా.శాస్త్రి, ఎస్.వి.సత్యనారాయణ, సి.మృణాళిని, లింగాల రామతీర్థ తదితరులు పాల్గొంటారు. కొవ్వలి కుమారులు కొవ్వలి లక్ష్మీనారాయణ, కొవ్వలి నాగేశ్వరరావు కూడా పాల్గొంటారు. అదే సందర్భంలో సాయంత్రం 5.30 గం.లకు సుప్రసిద్ధ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌తో ‘కథా సంధ్య’ కార్యక్రమం ఉంటుంది. ఆయన తన కథను చదివి పాఠకులతో ముచ్చటిస్తారు. సాక్షి సాహిత్యం: సాక్షి సాహిత్యం పేజీపై మీ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను రాయండి: sakshiliterature @gmail.com సమీక్షకు రెండు కాపీలు పంపాలి. రచనలు అందాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. -
మా అబ్బాయికి ఆటిజమ్... ఏ విధమైన ఆహారం ఇవ్వాలి?
మా అబ్బాయికి ఆటిజమ్ ఉంది. మేము ఇంతవరకూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లలేదు. అయినప్పటికీ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి రకరకాల విధానాల ద్వారా వాడిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఆటిజమ్ ఉన్న పిల్లలకు కెసీన్, గ్లూటెన్ లేని ఆహారాన్ని ఇవ్వాలని స్పీచ్ థెరపిస్ట్ చెప్పడంతో... పాలు, గోధుమ ఉత్పత్తులు ఇవ్వడం పూర్తిగా తగ్గించేశాము. అయితే అప్పటినుంచి వాడు బరువు తగ్గిపోతున్నాడు. మాకు ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. - కె. విశాల, వరంగల్ ఇటీ వలికాలంలో ఎక్కడ చూసినా తరచు వినిపిస్తున్న పదం ఆటిజం. ప్రత్యేకమైన కారణాలేమీ లేనప్పటికీ పిల్లల్లో అతి చిన్న వయస్సు నుంచే ఈ లక్షణాలు కనపడుతున్నాయి. దీనికి కారణాలు, చికిత్స పద్ధతుల గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలాకాలంగా ఆటిజమ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు వైద్యుల సలహా సిఎఫ్జిఎఫ్ డైట్ ఇస్తున్నారు. అది సంపూర్ణమైన చికిత్సాపద్ధతి కానప్పటికీ, కొందరు పిల్లల్లో అసలు పని చేయనప్పటికీ, మొత్తం మీద దానిద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలను బట్టి ఆహారంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. దీనిని మంచి అనుభవజ్ఞులైన పిల్లల వైద్యనిపుణులు, పిల్లల మానసిక చికిత్సావేత్తలు మాత్రమే గుర్తించగలరు. మీరు కనుక మీ పిల్లవాడికి సిఎఫ్జిఎఫ్ డైట్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం దాని మూలంగా విటమిన్లు, ఇతర పోషకాల లోపం ఉండబోదని నిర్థారించుకున్న తర్వాతనే ఆ విధమైన డైట్ ఇవ్వడం ప్రారంభించాలి లేకుంటే పిల్లల్లో విటమిన్లు, ధాతువుల లోపంతో ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చాలామంది తల్లిదండ్రులలో తలెత్తే సందేహం ఏమిటంటే... ఈ విధమైన తమ పిల్లలకు ఎంతకాలం పాటు ఇవ్వాలని. సాధారణంగా ఈ విధమైన డైట్ ఇవ్వడం మొదలు పెట్టిన నాలుగు వారాల నుంచి మూడు నెలల్లోగానే పిల్లల ప్రవర్తన, సామాజిక బాధ్యత వంటి అంశాలలో మార్పు కనిపించడం మొదలవుతుంది. పిల్లల భావోద్వేగాలు, మాటతీరు, ఇతరుల కళ్లల్లో కళ్లుపెట్టి సూటిగా చూడటం, పిలిచినప్పుడు స్పందించే విధానం, తోటివారితో మెలిగే తీరు వంటి వాటిలో మార్పును గుర్తించవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏవిధమైన మార్పునూ కనిపెట్టలేకపోతే చైల్డ్ సైకియాట్రిస్ట్ వాటిని సులువుగా గుర్తిస్తారు. అయితే అదొక్కటే సరిపోదు. ఆహారంలో మార్పులతోబాటు వారి అవసరాలకు అనుగుణంగా బయో మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఆటిజమ్ ఉన్న పిల్లలందరికీ ఒకేవిధమైన చికిత్సా పద్ధతి ఉండదు. వారి ప్రవర్తన, శారీరక స్థితిగతులు, తదితర లక్షణాల ఆధారంగానే చికిత్స చేయాలి. మీరు మీ అబ్బాయిని వెంటనే సుశిక్షితులు, అనుభవజ్ఞులైన చైల్డ్ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి, వారి సలహా మేరకు తగిన చికిత్స ఇప్పించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్