భారత ఐటీ సర్వీస్ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై యూఎస్‌కు చెందిన ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కోర్టుకు వెళ్లింది. తమ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. గతంలో ఉద్యోగులను అక్రమంగా చేర్చుకుంటోందని కాగ్నిజెంట్‌కు ఇన్ఫోసిస్ లేఖాస్త్రం సంధించిన 8 నెలల తర్వాత కాగ్నిజెంట్ ఈ రూపంలో ఇన్ఫోసిస్‌కు షాకిచ్చింది.
నివేదికల ప్రకారం.. తమ డేటాబేస్‌ల నుంచి ఇన్ఫోసిస్ చట్టవిరుద్ధంగా డేటాను సేకరించిందని, పోటీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి దాన్ని ఉపయోగించిందని కాగ్నిజెంట్ వ్యాజ్యంలో పేర్కొంది. అయితే కాగ్నిజెంట్ ఇంకా దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. “ఇన్ఫోసిస్‌కు దావా గురించి తెలిసింది. మేము ఆ ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నాం. విషయాన్ని కోర్టులో చూసుకుంటాం” అని ఇన్ఫోసిస్ ప్రతినిధి తెలిపారు.
న్యూజెర్సీ ముఖ్య కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్.. ట్రైజెట్టో ఫేసెస్, క్యూఎన్‌ఎక్స్‌టీ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తోంది. హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ట్రైజెట్టో సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి ఇన్ఫోసిస్ 'టెస్ట్ కేసెస్ ఫర్ ఫేసెట్స్'ను రూపొందించిందని, ట్రైజెట్టో డేటాను ఇన్ఫోసిస్ ఉత్పత్తికి రీప్యాక్ చేసిందని నివేదికలు పేర్కొన్నాయి.
బెంగుళూరుకు చెందిన భారతీయ ఐటీ మేజర్ క్యూఎన్‌ఎక్స్‌టీ నుంచి రహస్యమైన ట్రైజెట్టో సమాచారం, వాణిజ్య రహస్యాలను సేకరించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని ఫిర్యాదులో కాగ్నిజెంట్ పేర్కొంది. ఇందు కోసం భారీ నష్టపరిహారాన్ని కాగ్నిజెంట్ కోరింది. అలాగే తమ వ్యాపార రహస్యాల దుర్వినియోగాన్ని ఆపాలని ఇన్ఫోసిస్‌ను ఆదేశించాలని అభ్యర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment