గుంటూరు క్రైం: గుంటూరులో ఒక వృద్ధురాలు హత్యకు గురైంది. ఈ సంఘటన గురువారం గుంటూరు పట్టణంలోని బ్రాడీపేటలో జరిగింది. వివరాలు.. బ్రాడీపేటకు చెందిన ఎర్రం సుబ్బాయమ్మ(65) అనే వృద్ధువాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వివరాలు...గురువారం సాయంత్రం పాఠశాలకు వెళ్లి వచ్చిన మనవరాలు హాసిని రక్తం మడుగులో ఉన్న సుబ్బాయమ్మను చూసింది. అనంతరం హాసిని తన తల్లి గుంటూరు ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)లో అసిస్టెంట్ ప్రొపెసర్‌గా పని చేస్తున్న రాజ్యలక్ష్మికి సమాచారం అందించింది. రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చి తన తల్లిని 108లో ఆస్పత్రికి తరలించింది. తీవ్ర రక్తశ్రావంతోనే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. కాగా, విజయవాడలో డెంటిస్టు డాక్టరు అయిన రాజ్యలక్ష్మి భర్త తన వద్ద పని చేసే జానీబాజీ అనే వ్యక్తి ఈ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.