ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ట‍్రెక్కింగ్‌కు వెళ్లాడు. ట్రెక్కింగ్ సమయంలో జోరున వర్షం. వర్షం ధాటికి వెనక్కి రాలేం. ముందుకు రాలేం. అలా అని అక్కడే ఉండిపోలేం. అచ్చం ఆ కుర్రాడు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి పై నుంచి 130 నుంచి 150 అడుగుల లోయలో పడ్డాడు. కాళ్లు విరిగి రక్తపు మడుగులో ఉన్న బాధితుడు ప్రాణాలు కాపాడమని హాహాకారాలు చేస్తున్నాడు. కానీ పట్టించుకునే నాథుడే లేడే! స్నేహితులు ఎక్కడున్నారో తెలియదు. అయినా ప్రాణాలతో బయటపడ్డాడు. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ సైతం త్వరగా కోలుకోవాలని ఆ బాలుడికి మెయిల్ పెట్టారు
లోనావాలా పర్వత ప్రాంతం! మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పరవశింపజేసే జలపాతాలతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్తంత ఉపశమనం పొందేందుకు ముంబైకు 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనావాలాకు ముంబై, పూణేల ప్రాంతాల వారు ఇక్కడ వాలిపోతుంటారు.
చదవండి👉 స్మార్ట్ వాచ్‌ను విసిరి కొట్టాలనుకుంది..కానీ అదే ఆ యువతి ప్రాణాల్ని కాపాడింది!
అలాగే పూణేకు చెందిన 17ఏళ్ల స్మిత్ మేథా తన స్నేహితులతో కలిసి లోనావాలాకు వెళ్లాడు.మధ్యాహ్నం 3గంటల సమయంలో లోనావాల పర్వతం మీద ట్రెక్కింగ్ చేస్తుండగా కురుస్తున్న కుండపోత వర్షానికి పర్వతం మీద నుంచి సుమారు 130 నుంచి 150 అడుగుల లోయలో ఉన్న ఓ చెట్టు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు విరిగాయి.
ప్రమాద స్థితిలో ఉన్నా తనని కాపాడమని కేకలు వేశాడు. కానీ ఫలితం లేదు. ఫోన్ సిగ్నల్స్ లేవు. కానీ ఆ యువకుడు శురక్షితంగా ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఎలా అంటారా? ఆపిల్ వాచ్ సిరీస్ 7 వల్ల.
చదవండి👉 అమ్మ బాబోయ్! పేలుతున్న స్మార్ట్‌వాచ్‌లు, కాలిపోతున్న యూజర్ల చేతులు!
ఐఫోన్ 13 లేదు
తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నానని సమాచారం అందించేందుకు తన వద్ద ఐఫోన్ 13 లేదు. ఉన్న స్మార్ట్ ఫోన్‌లో సిగ్నల్స్ లేవు. కానీ అప్పుడే తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ యాపిల్ వాచ్ 7 సిగ్నల్స్ పనిచేస్తుంది. ఆ వాచ్ సాయంతో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి వివరించాడు. అతని స్నేహితులు ప్రథమ చికిత్స చేసి అతి కష్టం మీద అతన్ని పైకి తీసుకొచ్చారు.
పైకి చేరుకున్న తర్వాత, మేథా వెంటనే తన లైవ్ లొకేషన్‌ను అతని తల్లిదండ్రులకు పంపాడు. లోనావాలాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ముంబైకి చెందిన ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చివరకు దాదాపు ఒక నెల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. తన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు,స్నేహితులు వాకాబు చేస్తున్నారు. అప్పుడే డిసైడ్ అయ్యా. నాకు ప్రమాదం ఎలా జరిగింది? యాపిల్ వాచ్ నా ప్రాణాలు ఎలా కాపాడింది? అని వివరిస్తూ టిమ్‌కుక్ మెయిల్ చేశాడు.
ఆశ్చర్యంగా
మేథా ప్రమాదం గురించి తెలుసుకున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఆ బాలుడికి మెయిల్‌కు రిప్లయి ఇచ్చాడు. మీరు కోలుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు పూర్తిగా, మరింత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని మెయిల్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment