Lonavala
-
150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’
ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ట్రెక్కింగ్ సమయంలో జోరున వర్షం. వర్షం ధాటికి వెనక్కి రాలేం. ముందుకు రాలేం. అలా అని అక్కడే ఉండిపోలేం. అచ్చం ఆ కుర్రాడు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి పై నుంచి 130 నుంచి 150 అడుగుల లోయలో పడ్డాడు. కాళ్లు విరిగి రక్తపు మడుగులో ఉన్న బాధితుడు ప్రాణాలు కాపాడమని హాహాకారాలు చేస్తున్నాడు. కానీ పట్టించుకునే నాథుడే లేడే! స్నేహితులు ఎక్కడున్నారో తెలియదు. అయినా ప్రాణాలతో బయటపడ్డాడు. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ సైతం త్వరగా కోలుకోవాలని ఆ బాలుడికి మెయిల్ పెట్టారు లోనావాలా పర్వత ప్రాంతం! మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పరవశింపజేసే జలపాతాలతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్తంత ఉపశమనం పొందేందుకు ముంబైకు 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనావాలాకు ముంబై, పూణేల ప్రాంతాల వారు ఇక్కడ వాలిపోతుంటారు. చదవండి👉 స్మార్ట్ వాచ్‌ను విసిరి కొట్టాలనుకుంది..కానీ అదే ఆ యువతి ప్రాణాల్ని కాపాడింది! అలాగే పూణేకు చెందిన 17ఏళ్ల స్మిత్ మేథా తన స్నేహితులతో కలిసి లోనావాలాకు వెళ్లాడు.మధ్యాహ్నం 3గంటల సమయంలో లోనావాల పర్వతం మీద ట్రెక్కింగ్ చేస్తుండగా కురుస్తున్న కుండపోత వర్షానికి పర్వతం మీద నుంచి సుమారు 130 నుంచి 150 అడుగుల లోయలో ఉన్న ఓ చెట్టు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు విరిగాయి. ప్రమాద స్థితిలో ఉన్నా తనని కాపాడమని కేకలు వేశాడు. కానీ ఫలితం లేదు. ఫోన్ సిగ్నల్స్ లేవు. కానీ ఆ యువకుడు శురక్షితంగా ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఎలా అంటారా? ఆపిల్ వాచ్ సిరీస్ 7 వల్ల. చదవండి👉 అమ్మ బాబోయ్! పేలుతున్న స్మార్ట్‌వాచ్‌లు, కాలిపోతున్న యూజర్ల చేతులు! ఐఫోన్ 13 లేదు తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నానని సమాచారం అందించేందుకు తన వద్ద ఐఫోన్ 13 లేదు. ఉన్న స్మార్ట్ ఫోన్లో సిగ్నల్స్ లేవు. కానీ అప్పుడే తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ యాపిల్ వాచ్ 7 సిగ్నల్స్ పనిచేస్తుంది. ఆ వాచ్ సాయంతో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి వివరించాడు. అతని స్నేహితులు ప్రథమ చికిత్స చేసి అతి కష్టం మీద అతన్ని పైకి తీసుకొచ్చారు. పైకి చేరుకున్న తర్వాత, మేథా వెంటనే తన లైవ్ లొకేషన్‌ను అతని తల్లిదండ్రులకు పంపాడు. లోనావాలాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ముంబైకి చెందిన ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చివరకు దాదాపు ఒక నెల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. తన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు,స్నేహితులు వాకాబు చేస్తున్నారు. అప్పుడే డిసైడ్ అయ్యా. నాకు ప్రమాదం ఎలా జరిగింది? యాపిల్ వాచ్ నా ప్రాణాలు ఎలా కాపాడింది? అని వివరిస్తూ టిమ్‌కుక్ మెయిల్ చేశాడు. ఆశ్చర్యంగా మేథా ప్రమాదం గురించి తెలుసుకున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఆ బాలుడికి మెయిల్‌కు రిప్లయి ఇచ్చాడు. మీరు కోలుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు పూర్తిగా, మరింత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని మెయిల్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. చదవండి👉 వావ్..కంగ్రాట్స్ మేడమ్.. మీరు గర్భవతి అయ్యారు!! -
నా దగ్గర బికినీ ఉన్న విషయం నాకే తెలియదే: నటి
ముంబై: నవ్వుతూనే వెన్నుపోటు పొడిచే వాళ్లు ఎక్కువయ్యారంటూ హిందీ టీవీ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రూపాలి గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలు ఎందుకు రాస్తారంటూ మీడియాను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించిన రూపాలి గంగూలీ.. స్టార్ ప్లస్ సీరియళ్లతో నటిగా గుర్తింపు పొందారు. బిగ్‌బాస్ హిందీ సీజన్- 2006లో పాల్గొన్న ఆమెకు ఇన్‌స్టాలో 10 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు తన అప్డేట్లతో అభిమానులను అలరించే రూపాలి బుధవారం ఓ ఫొటోను షేర్ చేశారు. తన కొడుకు రుద్రాక్ష పుట్టిన రోజు సందర్భంగా భర్త అశ్విన్‌తో కలిసి లోనావాలకు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఈ క్రమంలో కొన్ని ఎంటర్టైన్మెంటు చానెళ్లు.. బికినీలో రూపాలి గంగూలీ చాలెంజ్ అంటూ వార్తలు రాశాయి. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. ‘‘నా దగ్గర బికినీ ఉందని నాకే తెలియదు!! నాకంటే నా గురించి మీకే ఎక్కువగా తెలుసు. రాంగ్ రిపోర్టింగ్’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడం సరికాదని హితవు పలికారు. అయితే, ఈ విషయంలో అభిమానులు రూపాలికి మద్దతు పలుకుతుండగా, కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె తీరును విమర్శిస్తున్నారు. కాగా స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే అనుపమ సీరియల్లో లీడ్ రోల్ పోషించిన రూపాలి.. కుటుంబం కోసం తన ఆశలు, ఆశయాలు త్యాగం చేసి మంచి గృహిణిగా, తల్లిగా పేరు తెచ్చుకునే క్యారెక్టర్లో జీవించారు. ఎంతగా ఒదిగి ఉన్నా భర్త సంతృప్తి పొందకపోగా తనను పదే పదే విమర్శిస్తుండటంతో అస్థిత్వం కోసం ఎంతదాకానైనా వెళ్లేందుకు సిద్ధమంటూ ఆత్మాభిమానం చాటుకునే పాత్రలో మెప్పించి మంచి మార్కులు కొట్టేశారు. చదవండి: ప్రభాస్ అస్సలు అలాంటి వాడు కాదు: కృతి సనన్ Mujhe nahi pata tha ki mere paas bikini hai bhi !! Kamaal hai aap logon ko mujhse zyaada pata hai 😈 #gossip #wrongreporting https://t.co/35wH7ANTqM — Rupali Ganguli (@TheRupali) August 27, 2021 View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
ఇంజనీరింగ్ విద్యార్థుల దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇద్దరు ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా కొట్టి చంపారు. లోనావాలా, ఐఎన్ఎస్ శివాజీ సమీపంలోని కొండ మీద నగ్నంగా పడివున్న రెండు మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. సింగద్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న మరో విద్యార్థినిగా వీరిని గుర్తించారు. ఈ జంటల హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. అహ్మద్‌నగర్ కు చెందిన విద్యార్థి( 22), పుణేకు చెందిన అతని స్నేహితురాలు అనూహ్యంగా శవాలై తేలారు. చేతులను వెనక్కి కట్టివేసి, తలపై పదునైన ఆయుధంతో బలంగా మోదడంతో చనిపోయి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో బాధితుని బైక్‌తో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా బాధితులను గుర్తించిన పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మరోవైపు హత్యకు గరైన యువతికి ఇప్పటికే ఉద్యోగం వచ్చిందని కోర్సు పూర్తయిన తర్వాత జాబ్‌లో చేరేందుకు యోచిస్తున్నట్లు కళాశాల అధికారులు చెప్పారు. అలాగే హాస్టల్ నుంచి తన స్నేహితునితో కలసి బయటికి వెళుతున్నానని, ఆలస్యంగా వస్తానంటూ సన్నిహితులతో చెప్పి వెళ్లిందని తెలిపారు. -
లోనావాలా, ఖండాల పర్యాటక ప్రాంతాల్లో పోలీసు భద్రత
హెచ్చరిక బోర్డులున్నా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్న పోలీసులు అత్యుత్సాహంతో పర్యాటకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వ్యాఖ్య పింప్రి : లోనావాలా, ఖండాలా పరిసర ప్రాంతాలలో పర్యాటకుల భద్రతకోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అధిక సంఖ్యలో బలగాలు మోహరించారు. వర్షాకాలంలో లోనావాలా, ఖండాలా ప్రాంతాలకు లక్షలాది మంది పర్యాటకులు తరలి వస్తుంటారు. శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ రెండు రోజులపాటు పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి వై.ఎస్.పాటిల్ మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతాలలో ప్రమాద హెచ్చరికల సూచన బోర్డులు ఉన్నప్పటికి కొంత మంది పర్యాటకులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. లోనావాలాలోని టైగర్ పాయింట్ నుంచి బయలు దేరి పిరమిడ్ ఆకారంలోని శిఖరాన్ని చూడటానికి వెళ్లి లోయలో పడి మరిణించిన ఘటనలు గతంలో అనేకం జరిగాయని చెప్పారు. రేలింగ్ ఎక్కేముందు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజామాచి, లోహ్‌గఢ్ కోట పరిసరాలు, కర్జత్ దర్శనం అత్యంత ప్రమాదకర పర్యాటక స్థలాలని, పర్యాటకులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించాలి గానీ అత్యుత్సాహం ప్రదర్శించకూడదని హెచ్చరిస్తున్నారు.