ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా మరణించిన ఓ యువతి మృతదేహాన్ని ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా గుర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు అకస్మికంగా దాడిచేశారు. ఒకవైపు రాకెట్లుతో, మరోవైపు తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో మెల్లనాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్ వాల్డ్‌మాన్ కుమార్తె డేనియల్ మరణించారు. స్నేహితుడితో కలిసి ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వెళ్లిన డేనియల్ హమాస్ దాడిలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనంతరం డేనియల్ ఫోన్ నుంచి వాల్డమన్ ఫోన్‌కు అత్యవసర కాల్ వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు.
అయితే కుమార్తెను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అనంతరం కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా లోకేషన్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు డేనియల్ ఆపిల్ వాచ్ నుంచి సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ అందిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. కుమార్తె మృతదేహం కనిపించింది. ఆమెతోపాటు వెళ్లిన డేనియల్ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించింది. వారిద్దరికి త్వరలో పెళ్లి చేయాలని భావించినట్లు వాల్డమన్ తెలిపారు. అంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డేనియల్ ఐఫోన్‌లో క్రాష్ డిటెక్షన్ కాల్ టెక్నాలజీ ఉందని, అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే తనకు అత్యవసర కాల్ వచ్చినట్లు వాల్డమన్ వెల్లడించారు. ఆ కాల్ రావడంతోనే తమ కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిపారు. (బైక్‌పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!)
యాపిల్ ఐఫోన్, వాచ్‌లో ఉన్న క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అందించిన ఫోన్ నంబర్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఆ ప్రాంతం లోకేషన్‌ను కూడా షేర్ చేస్తుంది. ఫలితంగా తమ ఆత్మీయులను త్వరగా కాపాడుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment