దెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ దళాల చేతిలో ఇటీవల హత్యకు గురైన యాహ్యా సిన్వర్ స్థానంలో చీఫ్‌గా ప్రస్తుతానికి ఎవరినీ నియమించరాదని హమాస్ నిర్ణయించింది. ఇకపై ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు ఐదుగురు సభ్యుల కమిటీ నాయకత్వం వహించనుంది. ఈ కమిటీ దోహా కేంద్రంగా పని చేస్తుంది. అగ్ర నేతలందరినీ ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో 2025 మార్చిలో జరిగే గ్రూప్ తదుపరి ఎన్నికల దాకా చీఫ్‌గా ఎవరినీ నియమించరాదని హమాస్ నాయకత్వం భావించినట్టు తెలుస్తోంది.
యాహ్యా సిన్వర్ మరణానికి ఏడాది ముందునుంచే అజ్ఞాతంలోకి గడుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా కీలక నిర్ణయాలను ఈ కమిటీయే తీసుకుంటూ వస్తోంది. ఇందులో గాజాకు ఖలీల్ అల్ హయా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబారిన్, విదేశాల్లోని పాలస్తీనియన్లకు ఖలీద్ మషాల్ ప్రతినిధులుగా ఉన్నారు. నాలుగో సభ్యుడు హమాస్ షూరా అడ్వైజరీ కౌన్సిల్ అధిపతి మహ్మద్ దర్వీష్.
ఐదో సభ్యుడైన హమాస్ పొలిటికల్ బ్యూరో కార్యదర్శి పేరును భద్రతా కారణాల రీత్యా బయట పెట్టడం లేదని సంస్థ పేర్కొంది. వీరంతా ప్రస్తుతం ఖతర్‌లో ఉన్నారు. యుద్ధ సమయంలో ఉద్యమాన్ని, అసాధారణ పరిస్థితులను, భవిష్యత్ ప్రణాళికలను నియంత్రించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా దీనికి ఉంది.
ఇరాక్‌లో ఐఎస్ గ్రూప్ కమాండర్ హతం
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్ లీడర్, మరో ఎనిమిది మంది సీనియర్ నేతలను తమ బలగాలు చంపేశాయని ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్–సుడానీ మంగళవారం ప్రకటించారు. సలాహుద్దీన్ ప్రావిన్స్‌లోని హమ్రిన్ కొండప్రాంతంలో బలగాలు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో జస్సిమ్ అల్–మజ్రౌయి అబూ అబ్దుల్ ఖాదర్ అనే ఐఎస్ గ్రూప్ కమాండర్ హతమయ్యాడన్నారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మిగతా వారి వివరాలను ప్రకటిస్తామన్నారు. అంతర్జాతీయ సంకీర్ణ బలగాలిచ్చిన సమాచారం, మద్దతు తో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ తెలిపింది. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, సామగ్రిని స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
చదవండి: హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి
Comments
Please login to add a commentAdd a comment