
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ యాపిల్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. యాపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్, ఇవాన్స్ హాంకీ తన పదవికి రాజీనామా చేశారు. 2019 నుంచి ఆమె ఈ పదవిలో ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ స్థానంలో హాంకీ బాధ్యతలు స్వీకరించారు.
హాంకీ స్థానంలో ఎవర్ని నియమించిందీ యాపిల్ అధికారంగా ప్రకటించలేదు. అయితే కొత్త నియామకంగా జరిగేదాకా ఆమె తన పదవిలో కొనసాగ నున్నారు. కాగా ఐమాక్, ఐపాడ్ ఐఫోన్‌ల పరిచయం వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరిగా జోనీ ఐవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌తో కలిసి విభిన్నమైన యాపిల్ ఉత్పత్తులకు నాంది పలికారు. అయితే తన సొంత స్వతంత్ర కంపెనీ స్థాపన నేపథ్యంలో యాపిల్ నుంచి ఆయన నిష్క్రమించడం అప్పట్లో వ్యాపార వర్గాల్లో చర్చకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment