టెక్ వరల్డ్‌లో కింగ్ మేకర్‌గా ఉన్న ఆపిల్ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతుంది. భూమి నుంచి 500 కి.మీ ఎత్తులో ఉండే 'లో ఎర్త్ ఆర్బిట్' సాయంతో సిమ్ లేకుండా వాయిస్ కాల్, బ్రౌజింగ్.. పోయిన వస్తువుల్ని గుర్తించేందుకు ఎయిర్ ట్యాగ్స్, గేమ్ లవర్స్ గేమ్ ఆడి సమయంలో ఢీలా పడిపోకుండా యాక్టీవ్‌గా ఉండేలా వైర్ లెస్ ఇయర్ పాడ్ ఇలా కొత్త కొత్త టెక్నాలజీలను ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో అడుగు ముందుకేసింది. జ్వరాన్ని గుర్తించేందుకు ఉపయోగించే థర్మా మీటర్ వాచ్‌లను (గడియారాలను) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది.
చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్‌పై ఎలన్ మస్క్ కీలక ప్రకటన !
ఇప్పటికి ఎన్ని ధర్మామీటర్‌లు ఉన్నాయంటే
గెలీలియో గెలీల! ఇటలీకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్రయోగాలతో ప్రమేయం లేకుండా సృష్టిలోని నిజాల్ని స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చనే అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని విభేదించారు. ఆ విభేదాలతో ఆర్ధికంగా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు గెలీల.. మూసి ఉన్న గాజు గొట్టంలో గాలిని నింపి దానిని ఒక నీరు ఉన్న పాత్రలో ఉంచినపుడు ఆ గాలి తరగాల ఆధారంగా థర్మామీటర్‌ను కనిపెట్టారు. ఇన్నోవేటర్స్ ఆ ధర్మామీటర్‌ను కాలానికి అనుగుణంగా మారుస్తూ వచ్చారు. అలా వచ్చినవే మనో మెట్రిక్ థర్మామీటర్, లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్, గ్యాస్ థర్మామీటర్, బయోమెటల్ థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్‌లు .. తాజాగా కరోనా కారణంగా ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ వినియోగం ఎక్కువైంది. అయితే రాను రాను ఈ థర్మామీటర్‌లు కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది.
వాచ్ థర్మామీటర్ అంటే!
యూజర్లకు అనుగుణంగా ఆయా టెక్ దిగ్గజాలు ధర్మా మీటర్‌ల స్థానంలో వాచ్ థర్మామీటర్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇప్పటికే సౌత్ కొరియా టెక్ జెయింట్ శాంసంగ్ గతేడాది ' Samsung Galaxy Watch Active 2' పేరుతో బ్లడ్ ప్రెజర్ ను గుర్తించేందుకు స్మార్ట్‌వాచ్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా ఆపిల్ సైతం ప్రత్యర్ధి టెక్ కంపెనీలకు చెక్ పెట్టేలా థర్మామీటర్ వాచ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాచ్ సాయంతో బ‍్లడ్ ప్రజెర్, టెంపరేచర్, స్లీప్, బ్లడ్ షుగర్ లను గుర్తించేలా బిల్డ్ చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. వాచ్ బిల్డ్ చేయడం కంప్లీట్ అయినా మార్కెట్‌లోకి వచ్చే ఏడాది విడుదల కానుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment