స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే గడిచిన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర‍్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పట్టు సాధించాలని చూస్తుంది.
ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ 9ఐ'ని మార్కెట్‌కి పరిచయం చేయనుంది. జనవరి 18న రియల్ మీ' ఇండియాలో నిర్వహిస్తున్న ఈవెంట్‌లో రియల్ మీ 9ఐ ఫోన్ తో పాటు స్పెసిఫికేషన్‌ల గురించి ప్రకటన చేయనుంది. ఈ వారం వియాత్నంలో జరిగిన ఈవెంట్‌లో రియల్ మీ సంస్థ 'రియల్ మీ 9ఐ' విడుదల చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ధరతో పాటు ఫీచర్లు లీకయ్యాయి. అయితే ఇప్పుడు మనం లీకైన ఆ ఫోన్ స్పెసిఫికేషన్‌లతో పాటు దాని ధరెంతో తెలుసుకుందాం.
రియల్ మీ 9ఐ స్పెసిఫికేషన్స్
రియల్ మీ 9ఐ 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఎల్‌సీడీ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ పంచ్‌హోల్‌తో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ,పీక్ బ్రైట్ నెస్ 480 నిట్స్, పిక్సెల్ డెన్సిటీ 401పీపీఐ, పంచ్ హోల్‌తో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680, మోడెస్ట్ 4జీ ప్రాసెసర్. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంట్నల్ స్టోరేజ్‌తో పాటు గరిష్టంగా 1టీబీ మైక్రో ఎస్ కార్డ్‌తో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. మెమరీ కార్డ్ కోసం ప్రత్యేక స్లాట్ను అందిస్తుంది. రియల్ మీ 9ఐ ఫోన్ వెనుక 50 మెగా ఫిక్సెల్‌తో మూడు కెమెరాలు, 2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 గాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ-సీ పోర్ట్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లు ఉన్నాయి.
భారతదేశంలో రియల్ 9ఐ ఫోన్ ధర
వియాత్నంలో రియల్ 9ఐ ఫోన్ ధర రూ.20,500 ఉండగా, భారత్‌లో ఈ వేరియంట్ ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫోన్ ధర భారత్‌లో ఎంతుందో తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా కాస్ట్ ఎంతైనా..ఫోన్‌లోని ఈ ఫీచర్ ముందు దిగదుడుపే!
Comments
Please login to add a commentAdd a comment