రూ.10 వేల కంటే తక్కువ ధర..! హాట్‌కేకుల్లా అమ్ముడైన 30 లక్షల స్మార్ట్‌ఫోన్స్‌ ..! | POCO Sells Over 30L C-Series Smartphones On Flipkart | Sakshi
Sakshi News home page

రూ.10 వేల కంటే తక్కువ ధర..! హాట్‌కేకుల్లా అమ్ముడైన 30 లక్షల స్మార్ట్‌ఫోన్స్‌ ..!

Published Sun, Dec 19 2021 7:40 PM | Last Updated on Sun, Dec 19 2021 8:08 PM

POCO Sells Over 30L C-Series Smartphones On Flipkart - Sakshi

POCO Sells Over 30L C-Series Smartphones On Flipkart: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం పోకో భారత్‌లో బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో బీభత్సం సృష్టించింది.  తక్కువ సమయంలో సుమారు 30 లక్షలకు పైగా పోకో సీ-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

బడ్జెట్‌ ఫ్రెండ్లీ ధరలతో పోకో ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 న పోకో సీ-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో లాంచ్‌ చేసింది.  POCO C3, POCO C31 మోడళ్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. రూ. 10,000 కంటే తక్కువ ధర సెగ్మెంట్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందాయి.అదిరిపోయే ఫీచర్స్‌, ట్రిపుల్‌ కెమెరా, బిగ్‌ బ్యాటరీ వంటి ఫీచర్స్‌తో  పోకో సీ-సిరీస్‌ ఫోన్స్‌ బడ్జెట్‌​ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌గా నిలిచాయి. 

POCO C3 ఫీచర్స్‌..!

  • 6.53 అంగుళాల HD+ డిస్‌ప్లే 
  • మీడియాటెక్‌ హెలియో జీ35 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 13ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
  • 5ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4జీబీ ర్యామ్‌+ 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 5000 mAh బ్యాటరీ
  • 10W ఛార్జింగ్‌ సపోర్ట్‌

చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దుమ్ములేపిన వ‌న్‌ప్ల‌స్ ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement