పోకో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై రూ. 7000 వరకు భారీ తగ్గింపు..! | Flipkart Big Diwali Sale Poco Offers 7000 Discount On Some Models | Sakshi
Sakshi News home page

Poco: పోకో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై రూ. 7000 వరకు భారీ తగ్గింపు..!

Published Wed, Oct 27 2021 8:56 PM | Last Updated on Wed, Oct 27 2021 9:01 PM

Flipkart Big Diwali Sale Poco Offers 7000 Discount On Some Models - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీవాళి సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్‌ దీవాళి సేల్‌ అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు జరగనుంది. ఈ సేల్‌ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ పోకో పలు స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. సుమారు రూ. 7000 వరకు భారీ తగ్గింపును కొనుగోలుదారులకు అందించనుంది. పోకో ఎక్స్‌ 3ప్రో, పోకో ఎమ్‌2 ప్రో, పోకో సీ3 ఇతర మోడళ్లపై కూడా డిస్కౌంట్‌ను పోకో అందిస్తోంది.  కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లపై డిస్కౌంట్లను చివరిసారిగా అందిస్తామని పోకో ఒక ప్రకటనలో పేర్కొంది. వీటితో పాటుగా పలు బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది

బిగ్‌ దీవాళి సేల్‌లో భాగంగా పోకో ఎక్స్‌3 ప్రో మోడల్‌పై సుమారు రూ. 7,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ పోకో ఎక్స్‌3 ప్రో ధర రూ. 16,999 కే రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.23,999. 8జీబీ ర్యామ్‌ పోకో ఎక్స్‌3 ప్రో ధర రూ. 18,999 గా ఉండనుంది. 

పోకో ఎమ్‌2ప్రో (4జీబీర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌)పై సుమారు రూ. 6000 తగ్గింపుతో కొనుగోలుదారులకు రూ. 10799 అందుబాటులో ఉండనుంది. 6జీబీ ర్యామ్‌ వేరియంట్ ధర  రూ. 11,749కు లభించనుంది. 

బడ్జెట్‌ ఫోన్లలో పోకో సీ3 మోడల్‌పై 3జీబీర్యామ్‌+32 ఇంటర్నల్‌స్టోరేజ్‌ వేరియంట్‌పై రూ. 3000 తగ్గింపుతో రూ. 6,749కే కొనుగోలుదారులకు లభించనుంది. 

పోకో ఎమ్‌3, పోకో ఎమ్‌3 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుదారులకు వరుసగా రూ. 9899, రూ. 13249కు లభిస్తాయి. 

పోకో సీ31 రూ. 7,649కి రిటైల్ చేయగా, పోకో ఎఫ్‌3 జీటీ రూ. 23749కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

చదవండి: షావోమీ దీవాళి విత్‌ ఎమ్‌ఐ సేల్‌..! 5 లక్షల నగదు గెల్చుకునే అవకాశం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement