![Flipkart Big Diwali Sale 2022 offers on Iphone 13 Samsung Galaxy Z Flip 3 details - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/12/Flipkart.jpg.webp?itok=ppYVp5iF)
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రానున్న దీపావళి సందర్భంగా బిగ్ సేల్ ప్రకటించింది. ఈ సందర్బంగా 30వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సాధారణ యూజర్లకు సంబంధించిన ఈ సేల్ అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా నథింగ్, గూగుల్, శాంసంగ్, రియల్ మీ, పోకోతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎస్‌బీఐ కార్డుకొనుగోళ్లపై అదనపు తగ్గింపు కూడా లభ్యం. (Maiden Pharma వివాదాస్పద మైడెన్‌కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు)
ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 13పై కళ్లు చెదిరే అఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆపిల్ ఐఫోన్ 128 జీబీ ధర రూ. 58,900. దీనికి రూ. 2 వేల అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే రూ.16,900 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ల తరువాత ఐఫోన్ 13ని దాదాపు రూ. 45,000కి సొంతం చేసుకోవచ్చన్న మాట.
రెండు నెలల క్రితం మార్కెట్‌లోకి వచ్చిన నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దాదాపు రూ. 27,000కి అందుబాటులో ఉంది. దీనికి ఎస్‌బీఐ ఆఫర్ కూడా అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ తగ్గింపు తర్వాత రూ.59,999కి అందుబాటులో ఉంది. ఇంకా గూగుల్ పిక్స్‌ల్ 6ఏ ఫోను రూ. 27,999కి అందుబాటులో ఉంది. వీటి కొనుగోళ్లపై అదనంగా ఎస్‌బీఐ 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.
గృహోపకరణాలపై 75 శాతం, టీవీలపై కూడా ఆఫర్
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్టీ సందర్భంగా టీవీలు, ఆడియో ఉత్పత్తులపై తగ్గింపులను కూడా అందిస్తుంది. గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులు రూ. 17,249కే 4కె టీవీలను కొనుగోలు చేయవచ్చు. అలాగే సాధారణ హెచ్‌డీ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment