ఐఫోన్ 13 కేవలం రూ.11కే లభ్యమవుతోందని ఫ్లిప్‌కార్ట్‌లో వెలిసిన ప్రకటనపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా స్టాక్ అయిపోయిందని పాప్‌అప్ మెసేజ్ రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వినియోగదారులు పెడుతున్న పోస్టులుకాస్తా వైరల్‌గా మారుతున్నాయి.
ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 22న రాత్రి 11 గంటలకు కేవలం రూ.11కే ఐఫోన్ 13 బుక్ చేసుకోవచ్చనేలా బ్యానర్లు వెలిశాయి. దాంతో వినియోగదారులు సరిగ్గా రాత్రి 11 గంటలకు ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో స్టాక్ అయిపోయిందని పాప్‌అప్ మెసేజ్ రావడం గమనించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే తంతు కొనసాగడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. దాంతో వివిధ సామాజిక మాధ్యమాల్లో విభిన్నరీతిలో స్పందించారు.
Flipkart Deserves Belt Treatment From Govt
They Put a Banner of iPhone 13 at Just ₹11
Product Went Out of Stock But Helps Them in Free Marketing On Social Media, WhatsApp
In Other Countries, They’ll Pay Penalty For Such Malpractices On The Name of Sale & Discount— Ravisutanjani (@Ravisutanjani) September 22, 2024
‘ఫ్టిప్‌కార్ట్ వినియోగదారులను తప్పదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేస్తుంది. వాట్సప్, సోషల్ మీడియాలో ఉచిత పబ్లిసిటీ కోసం దిగుజారుతుంది. ఇతరదేశాల్లో ఇలా చీప్ ట్రిక్స్ అమలు చేస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’ అని ఒకరు స్పందించారు. ‘ఈ ఆఫర్ నిజంగా నిరాశపరిచింది. నిత్యం తప్పుడు ప్రకటనలు వస్తూన్నాయి. సంస్థ దీనిపై తగిన విధంగా స్పందించాలి. తప్పుదోవ పట్టించే ప్రచారాలకు ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించాలి’ అని ఇంకొక యూజర్ తెలిపారు. ‘వాహ్ తర్వాత ఏమిటి? మ్యాక్‌బుక్ ప్రో రూ.11?’ అని మరో యూజర్ స్పందించారు. ఏదేమైనా, తప్పు ఎవరు చేసినా దానికి ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఏఐకు కొత్త అర్థం చెప్పిన ప్రధాని
ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు ప్రారంభించిన యాపిల్ దానికంటే ముందు మోడళ్ల రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఇలాంటి ప్రకటనలు చూసి చాలా మంది వినియోగదారులు తక్కువ ధరకే ఇస్తున్నారని భ్రమపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆఫర్ ప్రకటించినపుడు విభిన్న ప్లాట్‌ఫామ్‌ల్లో ఆ మోడల్ ధరను పోల్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నమ్మశక్యంగా లేని ఆఫర్‌గా అనిపిస్తే ఆ ప్రకటన ఇస్తున్న కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి వివరాలు ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు. కంపెనీలు కూడా కస్టమర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిలిపేయాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment