![iphone 16 series sales started from today interesting facts of apple](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/20/apple02.jpg.webp?itok=LcJgdVTO)
ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ ఈరోజు (సెప్టెంబర్ 20) ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు ప్రారంభించింది. దాంతో మొబైల్ అవుట్‌లెట్ల వద్ద భారీగా కస్టమర్లు బారులు తీరారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఇటీవల ‘ఇట్స్‌గ్లోటైమ్’ ట్యాగ్‌లైన్‌తో జరిగిన ఈవెంట్‌లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్ అతిపెద్ద సంస్థ.
కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.
యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.
2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.
యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ 35 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).
ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులు
ప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.
యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.
యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.
యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.
స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్ డాలర్(ప్రస్తుతం రూ.83).
Comments
Please login to add a commentAdd a comment