iphone 16 sales
-
భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే..
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన రిటైల్ స్టోర్లను విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్ మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్‌కాన్, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 20న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దేశంలోని ముంబయి, ఢిల్లీ స్టోర్‌ల్లో భారీగా వినియోగదారుల రద్దీ నెలకొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయిలో రిటైల్ స్టోర్లు ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతోపాటు ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిడ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..‘భారత్‌లో సంస్థ రిటైల్ స్టోర్లు విస్తరించాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా మెరుగైన టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. మా కస్టమర్ల సృజనాత్మకత, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఇష్టాలకు అనువుగా సరైన ఉత్పత్తులను అందించడం సంస్థ బాధ్యత. స్థానికంగా స్టోర్లను పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించే అవకాశం ఉంటుంది’ అన్నారు. -
ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?
సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ముందుగా మార్చి 2025 వరకు దీన్ని యాపిల్ ఉత్పత్తుల్లో తీసుకురావాలని సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. కానీ బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం సంస్థ గతంలో అనుకున్న సమయం కంటే ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఐఓఎస్ 18 సిరీస్‌లో యాపిల్ ఇంటెలిజన్స్ ద్వారా ‘సిరి’లో కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మార్చి 2025 నాటికి ఐఓఎస్ 18.4 వెర్షన్లో సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. కానీ అంతకుముందే ఈ ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిసింది. సంస్థ గతంలో ప్రకటించిన విధంగా ఐఓఎస్ 18 సిరీస్ వర్షన్లను ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలిపారు.అక్టోబర్ 2024: ఐఓఎస్ 18.1 ఏఐ ఫీచర్లు ప్రారంభిస్తారు.డిసెంబర్ 2024: ఐఓఎస్ 18.2తో కొన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెడుతారు.జనవరి 2025: ఐఓఎస్ 18.3తో ‘సిరి’ని మరింత మెరుగుపరుస్తారు.మార్చి 2025: ఐఓఎస్ 18.4తో సమగ్ర యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ప్రవేశపెడుతారు.బ్లూమ్‌బర్గ్ నివేదించిన ప్రకారంగా ముందుగానే యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ఆవిష్కరిస్తే పైన తెలిపిన ఐఓఎస్ వర్షన్ల విడుదల తేదీల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసుకోండి..యాపిల్ ఇంటెలిజన్స్ ‘సిరి’లో గణనీయ మార్పులు చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిరి సందర్భోచితంగా వినియోగదారుల అవసరాలు తీర్చనుంది. ఉదాహరణకు మీ స్నేహితుడు మొబైల్లో మీకు తన కొత్త చిరునామాను పంపితే ‘ఈ చిరునామాను తన కాంటాక్ట్ కార్డ్‌కు యాడ్ చేయమని’ చెబితే సిరి ఆ పని పూర్తి చేస్తుంది. సుదీర్ఘ ఈమెయిళ్లు చదవడం సమయంతో కూడుకున్న వ్యవహారం. సిరి సాయంతో దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా రిప్లై ఇవ్వొచ్చు. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ అధికారికంగా ప్రకటించిన తర్వాతే కంపెనీ అందించే ఫీచర్లపై స్పష్టత వస్తుంది. -
ఐఫోన్ 13 రూ.11కే..?
ఐఫోన్ 13 కేవలం రూ.11కే లభ్యమవుతోందని ఫ్లిప్‌కార్ట్‌లో వెలిసిన ప్రకటనపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా స్టాక్ అయిపోయిందని పాప్అప్ మెసేజ్ రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వినియోగదారులు పెడుతున్న పోస్టులుకాస్తా వైరల్‌గా మారుతున్నాయి.ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 22న రాత్రి 11 గంటలకు కేవలం రూ.11కే ఐఫోన్ 13 బుక్ చేసుకోవచ్చనేలా బ్యానర్లు వెలిశాయి. దాంతో వినియోగదారులు సరిగ్గా రాత్రి 11 గంటలకు ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో స్టాక్ అయిపోయిందని పాప్అప్ మెసేజ్ రావడం గమనించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే తంతు కొనసాగడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. దాంతో వివిధ సామాజిక మాధ్యమాల్లో విభిన్నరీతిలో స్పందించారు.Flipkart Deserves Belt Treatment From GovtThey Put a Banner of iPhone 13 at Just ₹11Product Went Out of Stock But Helps Them in Free Marketing On Social Media, WhatsAppIn Other Countries, They’ll Pay Penalty For Such Malpractices On The Name of Sale & Discount— Ravisutanjani (@Ravisutanjani) September 22, 2024 ‘ఫ్టిప్‌కార్ట్ వినియోగదారులను తప్పదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేస్తుంది. వాట్సప్, సోషల్ మీడియాలో ఉచిత పబ్లిసిటీ కోసం దిగుజారుతుంది. ఇతరదేశాల్లో ఇలా చీప్ ట్రిక్స్ అమలు చేస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’ అని ఒకరు స్పందించారు. ‘ఈ ఆఫర్ నిజంగా నిరాశపరిచింది. నిత్యం తప్పుడు ప్రకటనలు వస్తూన్నాయి. సంస్థ దీనిపై తగిన విధంగా స్పందించాలి. తప్పుదోవ పట్టించే ప్రచారాలకు ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించాలి’ అని ఇంకొక యూజర్ తెలిపారు. ‘వాహ్ తర్వాత ఏమిటి? మ్యాక్‌బుక్ ప్రో రూ.11?’ అని మరో యూజర్ స్పందించారు. ఏదేమైనా, తప్పు ఎవరు చేసినా దానికి ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: ఏఐకు కొత్త అర్థం చెప్పిన ప్రధానిఇటీవల ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు ప్రారంభించిన యాపిల్ దానికంటే ముందు మోడళ్ల రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఇలాంటి ప్రకటనలు చూసి చాలా మంది వినియోగదారులు తక్కువ ధరకే ఇస్తున్నారని భ్రమపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆఫర్ ప్రకటించినపుడు విభిన్న ప్లాట్ఫామ్ల్లో ఆ మోడల్ ధరను పోల్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నమ్మశక్యంగా లేని ఆఫర్‌గా అనిపిస్తే ఆ ప్రకటన ఇస్తున్న కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి వివరాలు ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు. కంపెనీలు కూడా కస్టమర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిలిపేయాలని చెబుతున్నారు. -
ఐఫోన్ 16పై రూ.37,900 డిస్కౌంట్! ఎలాగంటే..
ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ అధికారికంగా భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ సీరీస్ లైనప్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందే మార్గం ఉంది. అదే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.అసలేంటి యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.. సింపుల్‌గా చెప్పాలంటే పాత ఐఫోన్లను ఇచ్చి కొత్త ఐఫోన్‌పై డిస్కౌంట్ పొందడం అన్నమాట. కస్టమర్లు తమ పాత ఐఫోన్లను ఇచ్చి కొత్త ఐఫోన్ 16పై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది ట్రేడ్ చేసే ఐఫోన్ మోడల్ , స్థితిని బట్టి ఉంటుంది.ఐఫోన్ 16 బేస్ 128జీబీ మోడల్ రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. దీనిపై యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ఆన్లైన్, యాపిల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 వంటి పాత మోడల్లను కూడా ఈ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.ఏ మోడల్‌తో ఎంత?మీ వద్ద ఐఫోన్ 15 ఉంటే దీన్ని ఇచ్చి యాపిల్ ట్రేడ్-ఇన్ క్రెడిట్లో ఐఫోన్ 16పై రూ. 37,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఐఫోన్ 14 ఇచ్చేవారు రూ. 32,100 వరకు తగ్గింపును ఆశించవచ్చు. మీ వద్ద ఐఫోన్ 13 ఉంటే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ గరిష్టంగా రూ. 31,000 వరకు క్రెడిట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 12 ఇవ్వడం ద్వారా వినియోగదారులు ట్రేడ్-ఇన్ విలువలో రూ. 20,800 వరకు పొందవచ్చు. ఈ తగ్గింపులు ఫోన్ నిల్వ సామర్థ్యం, బ్యాటరీ స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. -
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్‌కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్‌లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్‌గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్‌గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!
ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ ఈరోజు (సెప్టెంబర్ 20) ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు ప్రారంభించింది. దాంతో మొబైల్ అవుట్లెట్ల వద్ద భారీగా కస్టమర్లు బారులు తీరారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఇటీవల ‘ఇట్స్గ్లోటైమ్’ ట్యాగ్‌లైన్‌తో జరిగిన ఈవెంట్లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ 35 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులుప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్ డాలర్(ప్రస్తుతం రూ.83).