
ప్రపంచంలో ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్‌కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.
ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్‌లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్‌గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్‌లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్‌గా లోపలికి అడుగుపెట్టాడు.
యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment