
సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఇప్పుడు బయటకు తీసుకెళ్లి వాడుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ పోర్టబుల్ ఫ్యాన్. పేరు ‘క్రోబాట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్’. దీనికున్న ఈజీ డిటాచబుల్ రెక్కల సాయంతో ఎక్కడకు కావాలనుకుంటే అక్కడకు ఇట్టే తీసుకెళ్లవచ్చు.
ఏదైనా ఎత్తైన హుక్‌కు తగిలించి.. సీలింగ్ ఫ్యాన్‌లా స్టాండ్‌కు బిగించి టేబుల్ ఫ్యాన్‌లా వాడుకోవచ్చు. అంతేకాదు, ఇందులో లైటింగ్ సిస్టమ్ ఉండటంతో ఇది ల్యాంప్‌గానూ పనిచేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ధర రూ. 1,649 మాత్రమే!