
మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో కంటికి కూడా అంతే అవసరం. రోజూ కొద్ది సేపు ఈ కంటి వ్యాయామాలు చెయ్యడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించవలసిన అవసరం లేదు. ఎప్పుడు.. ఎక్కడ... ఎలా వీలయితే అలా సులువుగా చేసుకోవచ్చు. ఏం లేదు... పైకి, కిందికీ, పక్కలకూ కళ్ళను కదుపుతూ కొంతసేపు కంటి వ్యాయామాలు చేస్తే సరిపోతుంది.
అలాగే కంటికి మంచి చేసే ఆహారం కూడా ఉంది. ఆకుకూరల్లో కరివేపాకు, పొన్నగంటి, మెంతికూర, తోటకూర కంటిచూపును కాపాడుకోవడానికి దోహదం చే స్తాయి. పండ్లలో బొప్పాయి, మామిడి, ఉసిరి మంచిది. అలాగే క్యారట్, కోడిగుడ్డు,పాలు కంటికి మేలు చేస్తాయి.
20–20–20
ఎక్కువగా కంప్యూటర్ ముందు పని చేసేవారికి కళ్లు బాగా అలసటకు గురవుతాయి. అలాంటివారు ఈ 20–20–20 రూల్ ని ΄ాటించాలి. అది వెరీ సింపుల్. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుని కంప్యూటర్‌ని కాకుండా 20 మీటర్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్లపాటు చూడండి. ఇదే 20–20–20 రూల్. అలాగే కంప్యూటర్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కళ్ళు దెబ్బతినకుండా ఉండడం కోసం యాంటీ గ్లేర్ గ్లాసెస్‌ను ఉపయోగించండి.
ఇంతవరకూ ఏ సమస్యలూ లేక΄ోతే ఏడాదికి కనీసం ఒక్కసారైనా కంటిపరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే కళ్లజోడు వాడుతున్నవారయితే ఏడాదికి రెండుసార్లు విధిగా కంటిపరీక్షలు చేయించుకోవడం మంచిది. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మంచి ఆహారం తీసుకోవడం వల్ల కంటి వ్యాధులు ఉన్నవారికి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఏ వ్యాధీ లేనివారు భవిష్యత్తులో కంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.