ఈజీగా బరువు తగ్గడం అనేది లేటెస్ట్ హాట్ టాపిక్. అందుకే ఇన్‌ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ వెయిట్ లాస్ జర్నీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూఉంటారు. తాజాగా ఫిట్‌నెస్ ఇన్‌ప్లూయెన్సర్ రిధిశర్మ ఎలాంటి కఠినమైన డైట్ పాటించకుండానే విజయ వంతంగా 20 కిలోల బరువును తగ్గించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
రిధి శర్మ అందించిన వివరాల ప్రకారం పీసీఓఏస్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, జిమ్‌కు వెళ్లకుండా, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ తనబరువును గణనీయంగా తగ్గించుకుంది. రిధి శర్మ పాటించిన నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం.
నో ఫాస్ట్‌ఫుడ్, ఇంటి ఫుడ్డే ముద్దు
చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంది. రోజూ నడవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి చక్కటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె దీనిని సాధించింది. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా, చిక్కుళ్ళు , గింజధాన్యాలు, తింటే శక్తిని పెంచుకోవడంతో కడుపు నిండిన భావన కలుగు తుందని రిధి శర్మ వివరించారు.
>
ఇంట్లోనే వ్యాయామం
జిమ్ మెంబర్‌షిప్ కోసం ఖర్చు చేయడం మానేసిన శర్మ, వారాంతంలో మినహా ప్రతి రోజూ 30-40 నిమిషాల ఇంట్లోనే వ్యాయామాలు చేసింది. యోగా మ్యాట్, రెండు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్‍తో దీన్ని సాధించానని చెప్పారు. తన వ్యాయామంలో పైలేట్స్ (కండరాలకుబలంచేకూర్చే ఆసనాలు) స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఉండేవని తెలిపారు.
కంటినిడా నిద్ర
ప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడిందట. ఇదే బరువు తగ్గే తన ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించిందని తెలిపింది. వాకింగ్ తన జర్నీలో పెద్ద గేమ్ ఛేంజర్ అని, రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపింది. కేవలం కడుపు మాడ్చుకోవడం కాకుండా, శ్రద్ధగా వ్యాయామం చేసి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పింది రిధి.
నోట్: బరువు తగ్గడం అనేది శరీర పరిస్థితులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపవాసం ఉండటం ఒఒక్కటే పరిష్కారం కాదు. కచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే, ఎందుకు బరువు పెరుగుతోందనే కారణాలను విశ్లేషించుకొని, నిపుణుల సలహా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బరువు తగ్గే ప్లాన్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment