
అసలే ఎండాకాలం.. భానుడి భగభగలు కారణంగా రోడ్డు మీదనే కాదు, ఇంట్లో ఉండటం కూడా కష్టతరమైపోయింది. డబ్బున్నవాళ్ళు ఏసీలు, కూలర్లు వంటివి కొనేస్తుంటారు. పేదవాళ్ళు ఫ్యాన్లకు మాత్రమే పరిమితమవుతారు. ఇప్పటికే మార్కెట్లో లెక్కకు మించిన ఫ్యాన్లు వివిధ ధరలలో అందుబాటులోకి వచ్చేసాయి. కాగా గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ కంపెనీ ఓ సరికొత్త ఫ్యాన్‌ను పరిచయం చేసింది. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (FMEG) కంపెనీలలో ఒకటైన గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ 'విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్'ను పరిచయం చేసింది. 360 డిగ్రీలు కదిలే ఈ ఫ్యాన్ మంచి కూలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది హై-గ్రేడ్ ప్లాస్టిక్ చేత నిర్మితమై ఉంది.
విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్.. మూడు స్పీడ్ సెట్టింగ్‌లతో పాటు, నార్మల్, బ్రీజ్, నైట్ వంటి మల్టిపుల్ ఆపరేటింగ్ మోడ్‌లను పొందుతుంది. ఇన్‌ఫ్రారెడ్ (IR) రిమోట్ సౌలభ్యంతో.. అడ్జస్టబుల్ సెట్టింగ్‌లు సులభంగా ఉంటాయి. అంతే కాకుండా స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఫ్యాన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ఎక్కువ రోజులు ఇది పనిచేసేలా ఉండటానికి కంపెనీ హై-గ్రేడ్ కాపర్ మోటార్‌ను ఇందులో ఫిక్స్ చేసింది. ఎనిమిది గంటల వ్యవధిలో ఈ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవడానికి ఒక టైమర్ కూడా ఇందులో ఉంటుంది. విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్ ధర అమెజాన్‌లో రూ. 11,427. కెంపెనీ దీనిపై రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుంది.