summer
-
ఈ వేసవిలో 10 శాతం పెరగనున్న... విద్యుత్ డిమాండ్!
న్యూఢిల్లీ: ప్రపంచమంతటా విద్యుత్ డిమాండ్ ఏయేటికాయేడు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వేసవిలో భారత్‌లో విద్యుత్ డిమాండ్ 9 నుంచి 10 శాతం పెరగనుందని గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ‘ఎంబర్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’అంచనా వేసింది. ‘‘ఏప్రిల్ నుంచి జూన్ దాకా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. వడగాల్పుల రోజులు కూడా పెరుగుతాయి. అందుకే విద్యుత్ డిమాండ్ బాగాపెరగనుంది’’అని మంగళవారం విడుదల చేసిన కొత్త నివేదికలో వెల్లడించింది. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో ఎయిర్ కండిషన్ల సంఖ్య మరో 15 కోట్ల దాకా పెరుగుతుందని పేర్కొంది. దాంతో 2035 నాటికి పీక్ అవర్ విద్యుత్ డిమాండ్ ఏకంగా 180 గిగావాట్లకు పెరిగి విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర భారం పడుతుందని తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా.. 2024లో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాది ప్రపంచ విద్యుత్ డిమాండ్ పెరుగుదలలో ఐదో వంతుకు వడగాలులే కారణం. దాంతో ప్రపంచ విద్యుత్ రంగ ఉద్గారాలు 2024లో 1.6 శాతం పెరిగాయి. 22.3 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైంది. దాంతో మొత్తం ఉద్గారాలు రికార్డు స్థాయిలో 1,460 కోట్ల టన్నులకు పెరిగాయి.భారత్‌లో... 2024 ఏప్రిల్–జూన్ మధ్య మన దేశంలో విద్యుత్ డిమాండ్ 10.4 శాతం పెరిగింది. మొత్తం విద్యుత్ వాడకంలో ఎయిర్ కండిషనర్ల వాటాయే 30 శాతం! 2024 మే 30న జాతీయ స్థాయిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 250 గిగావాట్లు దాటింది. ఇది అంచనాల కంటే 6.3 శాతం ఎక్కువ! 2024లో దేశంలో వడగాల్పుల తరచుదనం, తీవ్రత పెరిగాయి. జాతీయ గృహ విద్యుత్ వినియోగం వాటా 2012–13లో 22 శాతం కాగా 2022–23 నాటికి 25 శాతానికి పెరిగింది. ఆర్థిక వృద్ధి, పెరిగిన వేడి వంటివి శీతలీకరణకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో చైనా, నైజీరియా, ఇండొనేíÙయా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, అమెరికా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. -
గతేడాది కంటే మరింత పాతాళానికి..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుకుంటున్నాయి. వేసవి నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. మహా హైదరాబాద్ (Hyderabad) శరవేగంగా విస్తరిస్తూ కాంక్రీట్ జంగిల్‌గా మారుతుండటమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. మరోవైపు వర్షపునీరు, ఆయా అవసరాలకు వినియోగించిన నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు.ఎండలు ముదురుతుండటంతో భూగర్భజలాల మట్టం (Ground Water Level) రోజురోజుకూ లోతుకు పడిపోతోంది. కేవలం రెండు నెలల వ్యధిలోనే 10 నుంచి 23 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, అమీర్‌పేట్, సరూర్‌నగర్, మారేడుపల్లి మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకు నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీంతో నగరవాసులు నీటి ఎద్దడితో అవస్థ పడుతున్నారు.శివారులో మరింత... కోర్‌సిటీ (Core City) కంటే శివారు ప్రాంతాల్లోనే భూగర్భనీటి మట్టం మరింత కిందికి దిగజారుతోంది. ఒకప్పటి శివారు ప్రాంతాలన్నీ ఇప్పుడు నగరంలో అంతర్భాగమయ్యాయి. పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ (Real Estate) వెంచర్లుగా మారగా, చెరువులు, కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. భారీ నిర్మాణాలు జరుగుతుండటంతో బోరు బావుల తవ్వకాలు బాగా పెరిగాయి. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడినప్పటికీ భూమిలోకి నీరు ఇంకకపోవడం, చెరువులు, కుంటలు మాయమవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి.మూడు నెలల నుంచే... వర్షకాలంలో పడిన వర్షాలతో ఈ ఏడాది జనవరి వరకు ఆశాజనకంగా కన్పించిన భూగర్భ జలాలు ఆ తర్వాత దిగువకు పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ నాటికి సగటున 10.10 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు భూగర్భజలాల నీటిమట్టాలు దిగువకు పడిపోయాయి. గత రెండేళ్లలో భూగర్భజలాల నీటిమట్టం పరిస్ధితి పరిశీలిస్తే పాతబస్తీలో సగటున 7.91 మీటర్లు, సికింద్రాబాద్ డివిజన్లో 12.30 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) పరిధిలో 15 నుంచి 18 మీటర్ల వరకు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో 13.42 మీటర్లకు దిగువకు పడిపోయాయి. -
సమ్మర్లో ఎయిర్ కూలర్స్, ఏసీలు వాడేస్తున్నారా..?
ఎండలు బాగా ముదిరాయి. స్థోమత ఉన్నవారు ఎయిర్ కండిషనర్స్నూ, అంతగా స్థోమత లేనివారు ఎయిర్ కూలర్స్నూ వాడుతుంటారు. ఏసీల కారణంగా గదిలో ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో మెయింటెయిన్ అవుతుండటంతో టు అందులోని కొన్ని ఫిల్టర్లు చాలా చాలా చిన్నగా, అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) బారి నుంచీ కాపాడతాయి. శబ్దకాలుష్యాన్నీ నివారించి... చెవి, ఇతరత్రా సమస్యలు రాకుండా చూస్తాయి. కానీ వాటివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అలాగే ఎయిర్ కూలర్స్లో, లీజియొన్నెల్లా అనే బ్యాక్టీరియా పెరిగి ‘లీజియొన్నేరిస్ డిసీజ్’కు గురయ్యే ముప్పు ఉంటుంది. ఏసీలూ, కూలర్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలూ, అవి రాకుండా నివారించే జాగ్రత్తలను తెలుసుకుందాం. ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి... తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ చాలాసేపు ఏసీలో గడపడం వల్ల ఆ చల్లదనం మూలాన కొందరిలో ఒళ్లునొప్పులు, తలనొప్పితోపాటు తీవ్రమైన నీరసం, నిస్సత్తువగా అనిపించవచ్చు. శ్వాస సమస్యలు : గదిలోని ఏసీగానీ లేదా కారులోని ఏసీగానీ చాలాసేపు ఆన్‌లో ఉండటం, దాంతో గది లేదా కార్ డోర్స్ / గ్లాసెస్ ఎప్పుడూ మూసేసే ఉండటంతో అక్కడి సూక్ష్మజీవులతో పక్కనే ఉన్న ఇతరులకు ఆ సమస్యలు వ్యాపించవచ్చు. కొందరిలో ఆస్తమానూ, పిల్లికూతలనూ ప్రేరేపించవచ్చు. అందువల్ల... ఏసీ గదిలోగానీ లేదా ఏసీ ఆన్ చేసి ఉన్న కారులోగానీ అదేపనిగా చాలాసేపు ఉండటం అంత మంచిది కాదు. తేలిగ్గా వడదెబ్బకు గురికావడం : ఎప్పుడూ ఏసీలో ఉండేవారు దానికి అలవాటైపోయి తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. చర్మం పొడిబారడం : చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గి, చర్మం పొడిబారుతుంది. ఫలితంగా దురదలు వచ్చే అవకాశాలెక్కువ. వీళ్లు చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లు : ఎక్కువ సేపు ఏసీలో ఉండేవారికి అంతగా దాహంగా అనిపించకపోవడంతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దాంతో ఇలాంటివాళ్లలో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలెక్కువ. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం : కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యురైటిస్ (నరాల చివరలు మొద్దుబారినట్లుగా అయిపోయి స్పర్శ అంతగా తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవాళ్లలో ఆ సమస్యలు కాస్త తీవ్రమవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏసీలోని ఫిల్టర్స్ తరచూ శుభ్రపరుస్తూ ఉండటం ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడిగినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే బిగించడం ఎప్పుడూ ఏసీలో ఉండేవారు సాయంత్రాలూ లేదా రాత్రిపూట స్వాభావికమైన చల్లగాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉండటం. ఏసీ సరిపడక ఏవైనా ఆరోగ్యసమస్యలు వస్తే ఏసీని వాడకపోవడం లేదా గది చల్లబడే వరకు ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేసుకుని ఫ్యాన్ వేసుకోవడం. వాటర్ కూలర్‌తో వచ్చే నిమోనియా నివారణ ఇలా... కిందటేడాది వాటర్ కూలర్ వాడాక దాన్ని మూల పెట్టేసి ఉంచి, ఇప్పుడు ఎండలు ముదరగానే వాడటానికి తీసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గతంలో మిగిలి ఉన్న నీళ్లలో లీజియోనెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు.దాంతో ‘లీజియోన్నేరిస్ డిసీజ్’ అనే ఒక రకం నిమోనియా వచ్చే అవకాశముంది. దీన్నే ‘వాటర్‌కూలర్ నిమోనియా’ అని కూడా అంటారు. చాలాకాలం వాడని కూలర్స్ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్‌మైట్స్ ఉండి, నేరుగా ఆన్ చేస్తే అది ఆస్తమా బాధితుల్లో సమస్యను ట్రిగర్ చేయవచ్చు. మామూలు వ్యక్తులకు సైతం దగ్గు, ఆయాసం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే బయటకు తీయగానే వాటర్‌కూలర్ అడుగున ఏమాత్రం చెమ్మలేకుండా చేసేందుకు ఆరుబయట ఆన్ చేసి పెట్టి దాదాపు గంటసేపు అలాగే ఉంచాలి. అడుగున ఒక్క చుక్క నీళ్లు లేకుండా డ్రైగా అయిపోయాకే వాటర్ కూలర్ వాడటం మొదలుపెట్టాలి.(చదవండి: ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..) -
వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!
పాలకొల్లు సెంట్రల్: వేసవిలో చిన్నారులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభమైందంటే చాలు చికెన్ పాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు పాలకొల్లు మండలం లంకలకోడేరు పీహెచ్సీ వైద్యుడు అడ్డాల ప్రతాప్ కుమార్.చికెన్ పాక్స్ అన్ని వయసుల వారికి సోకినా.. ముఖ్యంగా చిన్నారులకు వేగంగా సోకే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి సోకిన వారు ఆహారం సరిగా తీసుకోలేకపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో నీరసంగా కనిపిస్తుంటారు. ఆటలమ్మ, గవద బిళ్లల లక్షణాలు కనిపించిన వెంటనే సంబందిత వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీ బయోటిక్ మందులు వాడాల్సి ఉంటుంది.గవద బిళ్లలుచల్లటి పానీయాలు అతిగా తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి గవద బిళ్లలు వస్తాయి. ప్రధానంగా లాలాజల గ్రంధులు ఉబ్బడంతో గవద బిళ్లలు ఏర్పడతాయి. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. ఏ ఆహారం తిన్నా నోటిలో నీళ్లు వేసుకుని పుక్కిలించాలి. ఎంఎంఆర్ టీకా వేయించుకోవడం వల్ల గవద బిళ్లలు రాకుండా నివారించవచ్చు. గవద బిళ్లలకు మందులు వాడితే మూడు రోజుల్లో తగ్గుతుంది. వాపు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ఏడు రోజులు పడుతుంది.చికెన్ పాక్స్ఆటలమ్మ వైరస్ వల్ల వస్తుంది. జ్వరం.. శరీరంలో వేడి ఎక్కువై పొక్కులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో స్కిన్ ఎలర్జీని కూడా ఆటలమ్మ అనుకుంటారు. ఆటలమ్మ అరి చేతులు, పాదాలు, నెత్తి మీద రాదు. అలా వచ్చాయంటే అవి స్కిన్ ఎలర్జీగా గుర్తించాలి. ఆటలమ్మ సోకిన వాళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ప్రతి రోజూ శుభ్రంగా స్నానం చేయాలి. టీకా అందుబాటులో ఉంది. వేయించుకోవడం మంచిది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి దురద ఎక్కువగా ఉంటుంది. ఒక చోట గోకి మరో చోటు గోకితే అక్కడ పొక్కులు వస్తాయి. అందువల్ల గోర్లు పెరగకుండా చూసుకోవాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలుఆటలమ్మ సోకిన వారిని ఇంట్లో మిగిలిన సభ్యులకు దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే అందించాలి. గవద బిళ్లలు వచ్చిన వారికి గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. మూఢ నమ్మకాలు, అపోహలకు పోకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు సోకకుండా ఉండాలంటే వేడి నీళ్లు తాగడంతో పాటు.. శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -
ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..!
వేసవిలో చర్మ సంరక్షణ, మేకప్ గురించి కొంత ఆందోళన సహజం. ఎండకు చర్మం కమిలిపోవడం, మేకప్ చెదిరిపోవడం సహజంగా జరుగుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా...ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. లేదంటే ఎస్పిఎఫ్ ఉన్న మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీనివల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది.బయటకు వెళ్లినప్పుడు పట్టిన చెమటను తుడవడానికి టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. చెమట పట్టిన చోట టిష్యూ పేపర్‌ను అద్దితే, త్వరగా పీల్చుకుంటుంది. దీని వల్ల మేకప్ చెదిరి΄ోకుండా ఉంటుంది.మేకప్ తొలగించిన తర్వాత చర్మం విశ్రాంతి పొందడానికి హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. జిడ్డు పోవడానికి కీర, దోస రసం, అలొవెరా జెల్ మాస్క్‌లా వాడి, ఐదు నిమిషాల్లో చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల చర్మం తాజాగా మారుతుంది.చెమట వల్ల చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. సబ్బులకు బదులు బాడీ, ఫేస్ వాష్‌లతో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మంపై గల సూక్ష్మ రంధ్రాలు సహజ నూనెలు కోల్పోవు.ఈ కాలం త్వరగా అలసట వచ్చేస్తుంటుంది. అందుకని, రోజూ పడుకునేముందు కళ్ల కింద అవకాడో లేదా అలొవెరా క్రీమ్ లేదా ఫిష్ ఆయిల్‌తో మృదువుగా వేలి కొనలతో అప్లై చేయాలి. లేదంటే ఐ క్రీమ్ వాడచ్చు. వారంలో రెండు సార్లు పాదాలను స్క్రబ్ చేసి, ఫుట్ క్రీమ్‌ను ఉపయోగించాలి. సంతోషి సౌందర్య నిపుణురాలు(చదవండి: సమ్మర్ ఫ్యాషన్: ప్లస్ సైజ్..ప్లస్ స్టైల్..) -
ప్లస్ సైజ్..ప్లస్ స్టైల్..
సరైన ఫిటింగ్‌తో డ్రెస్సింగ్ ఉంటేనే బాగుంటుంది అనేది చాలామందిలో ఉండే ఆలోచన. ప్రస్తుత రోజుల్లో ఎంత వదులైన డ్రెస్ వేసుకుంటే అంత స్టైలిష్‌గా ఉంటాం అనేది అసాధారణ ఆలోచనగా మారింది. ట్యునిక్స్, కుర్తీస్, షర్ట్స్, టాప్స్, ప్రాక్స్.. ఏ మోడల్ డ్రెస్ అయినా వదులుగా ఉండటం వల్ల ఈ వేసవికి తగినట్టు సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉంటుంది. ప్లస్ సైజ్ డ్రెస్సుల్లో ప్లస్ స్టైల్ మార్కులూ కొట్టేయవచ్చు. చిన్నపిల్లలు పెద్దవాళ్ల డ్రెస్సులు వేసుకొని, వాటిలో మునిగినొతున్నట్టు కనిపించినా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి ఆనందాన్ని ఈ సీజన్లో ఓవర్సైజ్డ్ డ్రెస్సులు ధరించి పొందవచ్చు. చూపరుల నుంచి ‘ఎంత స్టైలిష్‌గా ఉన్నారు...’ అనే కితాబులూ దవచ్చు. పూర్తిగా శరీరం అంతా కప్పేసినట్టుగా ఉన్నా ఈవెంట్లో ప్రత్యేకంగా కనిపిస్తారు. స్లిమ్‌గా ఉన్నవారు కూడా ఈ సీజన్లో ప్లస్ సైజ్ డ్రెస్సులు వేసుకొని హాయిగా తిరిగేయవచ్చు. ఈ స్టైల్‌ని ఎవరికి వారు వినూత్నంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. వదులైన ట్యునిక్స్ ధరించినప్పుడు నడుము దగ్గర బెల్ట్‌తో ఓ స్టైల్‌ని, ముడి వేసి మరో స్టైల్‌ని సృష్టించవచ్చు. జీన్స్‌కి టాప్‌గా ఉపయోగించే వదులైన షర్ట్స్ ధరించినప్పుడు పూర్తిగా టక్ చేసి లేదా సగం టక్ చేసి స్టైలిష్‌గా కనిపించవచ్చు. స్ట్రీట్ స్టైల్‌ను పోలి ఉండే ఈ డ్రెస్సింగ్‌లో లేయర్డ్ ఔట్‌ఫిట్స్‌ను కూడా ధరించవచ్చు. ఒక ప్రింటెడ్ ట్యునిక్ వేస్తే, దాని మీదకు ట్రాన్స్పరెంట్ ప్లెయిన్ మరో ట్యునిక్ను వేసుకోవచ్చు. లేయర్డ్ లోనూ లూజ్ టాప్స్నే ఎంచుకోవాలి. ఈ తరహా ఔట్ఫిట్స్తోనే స్టైల్‌ను క్రియేట్ చేయవచ్చు కాబట్టి ఇతరత్రా హంగులేవీ అక్కర్లేదు. సింపుల్ వెస్ట్రన్ జ్యువెలరీ, లూజ్ అండ్ బన్ కేశాలంకరణ్, పాదరక్షల విషయంలో ఫ్లాట్స్ ధరిస్తే చాలు. సీజన్‌కి తగిన సౌకర్యవంతమైన స్టైల్లో మెరిసిపోవచ్చు. వదులుగా ఉంటాయి కాబట్టి సిల్క్, కాటన్, షిఫాన్, ఆర్గంజా... ఏ ఫ్యాబ్రిక్ అయినా ఎంచుకోవచ్చు. టాప్ టు బాటమ్ ప్లెయిన్, ప్రింట్స్ కూడా బాగుంటాయి. (చదవండి: -
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
ముంబై, ఉప నగరాల్లో మొన్నటిదాకా 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 37, 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పదిహేను రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల దెబ్బకు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో చిన్న చిన్న క్లినిక్‌లు మొదలుకుని ప్రభుత్వ, ప్రైవేటు, బీఎంసీ తదితర ప్రధాన ఆసుపత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. ఎండలు ముదరడంతో విధులకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం ఇల్లు కదిలే గృహిణులు, సామాన్యులు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతీరోజు రెండు నుంచి మూడు లీటర్లకుపైగా నీరు తాగాలని, అవసరమైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కళ్లు తిరగడం, వాంతులు, కాళ్లు, చేతుల నొప్పులు, దురద , మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపం క్లినిక్‌లు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జె.జె.ఆసుపత్రి ప్రొఫెసర్ డా.మధుకర్ గైక్వాడ్ సూచించారు. లేదంటే వడదెబ్బతో తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. – డా.మధుకర్ గైక్వాడ్అద్దాల మేడలూ కారణమే ముంబైలో అనేక బహుళ అంతస్తుల భవనాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బేస్మెంట్పై అదనపు భారం పడకుండా , అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో 90 శాతం భవనాలకు నీలం రంగు అద్దాలు బిగిస్తున్నారు. నగరంలో వేడిమి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – ఆరోగ్య నిపుణులు చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅకాల వర్షాలకు అవకాశం వేసవి ఎండలతో సతమతమవుతున్న ముంబైకర్లపై మరో పిడుగు పడనుంది. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.– ఐఎండీచదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్! -
Best Places to Visit వేసవి విహారం
వేసవి విహారానికి నగరం సన్నద్ధమవుతోంది. నచ్చిన ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక ప్రియులు ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల సందర్శనకు బయలుదేరుతారు. కొందరు కుటుంబాలతో సహా కలిసి పర్యటిస్తే, మరికొందరు సోలో టూర్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ట్రావెల్స్ సంస్థలు, పర్యాటక ఏజెన్సీలు పర్యాటకుల అభిరుచికి తగినవిధంగా విభిన్న వర్గాలకు చెందిన ప్యాకేజీలను అందజేస్తున్నాయి. జాతీయ పర్యటనల్లో ఎక్కువ మంది హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, ఊటీ, కూర్గ్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుండగా, అంతర్జాతీయ పర్యటనల్లో ఇటీవల కాలంలో మధ్య ఆసియా ప్రత్యేక ఆకర్షణగా మారినట్లు టూరిజం సంస్థలు పేర్కొంటున్నాయి. తక్కువ బడ్జెట్లో యూరప్‌లో పర్యటించిన అనుభూతిని కలిగించే కజఖిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్కమెనిస్తాన్ తదితర దేశాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది చల్లటిప్రదేశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆ తరువాత ఆధ్యాతి్మక, చారిత్రక ప్రదేశాలకు సైతం డిమాండ్ ఉందని పర్యాటక సంస్థలు చెబుతున్నాయి. ఈ మేరకు హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, కర్ణాటకలోని హిల్‌స్టేషన్‌గా పేరొందిన కూర్గ్, తమిళనాడులోని ఊటీకి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో బుకింగ్స్ వస్తున్నట్లు హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆ తరువాత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరొందిన హంపి, విరూపాక్ష ఆలయం, విఠల ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలు. రాతి దేవాలయాలు, శిలలతో కూడిన శిల్పాలకు ప్రసిద్ధి చెందిన మహాబలిపురం. వారణాసి, అయోధ్య, ఢిల్లీ, జైపూర్ వంటి ప్రదేశాలకు సైతం ఎక్కువ మంది తరలి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అంచనా. ప్రైవేటు సంస్థలతో పాటు ఐఆర్సీటీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు సైతం ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి. ఏటా రెండు లక్షల మంది..జాతీయ, అంతర్జాతీయ పర్యటనలకు ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తునట్లు అంచనా. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ సుమారు 15,000 మంది విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, బంధువుల వద్దకు వెళ్లేవాళ్లు కాకుండా కనీసం 5 వేల మంది పర్యాటకులు ఉన్నట్లు అంచనా. అలాగే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతి సంవత్సరం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రతి రోజూ సుమారు 3 లక్షల మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా వారిలో 30 వేల మందికి పైగా కేవలం పర్యాటకప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లేవాళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆహ్లాదం.. ఆనందం.. ఇటీవల కాలంలో మధ్య ఆసియా ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాల పర్యటనలకు వెళ్లేవారిలో దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా తదితర దేశాల తరువాత మధ్య ఆసియా దేశాలకు ఎక్కువమంది వెళ్తున్నారు. కజికిస్తాన్‌లోని ఎత్తైన పర్వతాలు, రిసార్ట్‌లతో ఆకట్టుకునే ప్రాంతాలు, అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ను తలపించే అందమైన ప్రాంతం చారిన్ కాన్యన్, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన బైకనూర్ కాస్మోడ్రోమ్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.అలాగే ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరాలు, మధ్యయుగపు ఇస్లామిక్ కట్టడాలతో నిండి ఉన్న బుఖారా, మౌసోలియమ్స్, ఖివా వంటి ప్రాంతాలను పర్యాటకులు ఎంపిక చేసుకుంటున్నారు. నగర పర్యాటకులను ఆకట్టుకుంటున్న మరో అందమైన దేశం అజర్బైజాన్. తక్కువ బడ్జెట్లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఈ దేశంలో రాజధాని బాకు ఆధునిక ఆర్కిటెక్చర్‌తో చారిత్రక ప్రదేశాలతో నిండి ఉంటుంది. షెకీ మరో పురాతన నగరం. ఇది ప్యాలెస్‌ల నగరంగా పేరొందింది. అలాగే ప్రకృతి సౌందర్యం, పర్వతాలు, వినోదభరితమైన పార్కులతో కూడిన గాబాలా నగరం కూడా అజర్‌బైజాన్‌లోనే ఉంది. -
beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్
నగరంలో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దీంతో వేడిని తట్టుకునేందుకు నగర వాసులు వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నారు.. ఇందులో భాగంగా ఏసీలు, కూలర్లు వంటివి లేకుండా ఉండలేని పరిస్థితి.. అయితే దీనికి భిన్నంగా వేడి నుంచి ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గమైన మొక్కలను పెంచుతున్నారు. ఇంటి వాతావరణం చల్లబరిచేందుకు ఇదో చక్కటి మార్గమని నిపుణులు చెబుతున్నారు. నర్సరీల్లోనూ ఇటీవల కాలంలో ఇంటీరియర్ ప్లాంట్స్ అధిక మొత్తంలో అమ్ముడుపోతున్నాయని పలువురు నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవ్వడంతో ఎక్కువ మంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని ఇంటీరియర్ డిజైనర్స్ సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ ప్లాంట్స్ గురించిన మరిన్ని విశేషాలు.. – సాక్షి, సిటీబ్యూరో వేసవి తాపానికి ఎండలు మాత్రమే ప్రధాన కారణం కాదు. పరిమితికి మించిన వాహనాల కాలుష్యం, పరిశ్రమలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. అయితే గతంలో ఇంటి వద్ద మెక్కల పెంపకం కొందరికి హాబీగా ఉండేది. ఇప్పుడు ఇదో ఫ్యాషన్‌లా మారింది. కొందరు అందానికి, మరి కొందరు ఆరోగ్యం కోసం పెంచుతుంటే, ఇంకొందరు తాము ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని లక్షలు వెచ్చించి ఇంపోర్టెడ్ మొక్కలను పెంచుతున్నారు. దీంతో బాల్కనీ, డోర్స్ముందు ఖాళీ ప్రదేశంలోనే మనీ ప్లాంట్స్ వంటివి పెంచుతున్నారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!ముఖ్యంగా గాలిలోని టాక్సిన్లను హరించే హెర్బల్ ప్లాంట్స్, ఆక్సిజన్ స్థాయిలను పెంచే అరుదైన మొక్కలు, ఆహ్లాదాన్ని అందించే అలంకరణ మొక్కలు ఎంపిక చేసుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే సకులెంట్స్, డిజర్ట్ ప్లాంట్స్ పెంచుతున్నారు. మరికొందరు అరుదైన లక్షణాలున్న మొక్క జాతులు, నీటిలో పెంచే ఆక్వా ప్లాంట్స్, బోన్సాయ్ మొక్కలు, క్రీపర్స్, హ్యాంగింగ్స్ పెంచుతున్నారు. వివిధ రకాల మొక్కలు..మోస్టరైజమ్, పెడల్లీఫ్, ఫిలిడాండ్రమ్, రబ్బర్ ప్లాంట్, పీస్ లిల్లీస్ పెంచుకోవచ్చని నిపుణుల సూచన. ఇండోర్, ఔట్‌డోర్‌లోనూ పెరిగే మనీ ప్లాంట్, ఇంటి ముందు కానీ సూర్యరశ్మి పడే ఇంటిలోపలి వాతావరణంలో అడీనియం, అరేలియా, హెల్కోనియా, దురంతా, పెంటాస్, గ్లోరోఫైటమ్, గ్రోటాన్, పెనివత్, సైకస్ తదితర జాతి మెక్కలను పెంచుకోవచ్చు. విలాసవంతమైన ఇళ్లలో బర్డ్ ఆఫ్ ప్యారడైస్, మేరీ గోల్డ్‌లాంటి అరుదైన మొక్కలను పెంచుతున్నారు. నగర నలుమూలలా అన్ని రకాల మెక్కలు దొరికే నర్సరీలు అందుబాటులో ఉన్నాయి.చదవండి: విద్యుత్తు లేకుండా ఆకుకూరలను 36 గంటలు నిల్వ ఉంచే బాక్స్! -
ఎండల్లో ఒళ్లు జాగ్రత్త..!
మానవ మనుగడకు ఎండ ఎంత అవసరమో... అందులోని రేడియేషన్‌తో... అందునా ముఖ్యంగా రేడియేషన్ స్పెక్ట్రమ్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో అంత ప్రమాదం. ఎండ ఎప్పుడూ బాహ్య అవయవమైన చర్మంపైనే పడుతుంది కాబట్టి మొదటి ప్రమాదం మేనికే. పైగా ఇప్పుడు వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లతో ΄ోలిస్తే ఫిబ్రవరి మొదటి వారాల్లోనే ఎండ తీవ్రతలు మొదలయ్యాయి. ఈ ఎండల్లో రేడియేషన్ నుంచి ముఖ్యంగా అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాల దుష్ప్రభావాలనుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సూర్యకాంతిలో అల్ట్రావయొలెట్ రేడియేషన్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అందులోని అల్ట్రా వయొలెట్–ఏ, అల్ట్రా వయొలెట్–బీ, అల్ట్రా వయొలెట్–సీ (వీటినే సంక్షిప్తంగా యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ అంటారు) అనే మూడు రకాల రేడియేషన్లు వాతావరణంలో ప్రవేశించాక ప్రధానంగా యూవీ–ఏ, యూవీ–బీ కిరణాలు చర్మంపై పడతాయి. అదృష్టవశాత్తూ అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌లోని ప్రమాదకరమైన యూవీ–íసీ వాతావరణంలోకి ఇంకి΄ోతాయి. దాంతో యూవీఏ, యూవీబీ రెండూ చర్మంపై పడతాయి. అయితే ఈ రేడియేషన్‌లో దాదాపు 5 శాతం తిరిగి వెనక్కు వెళ్తాయి. మరికొంత పరిమాణం అన్నివైపులకూ చెదిరిపోతుంది. ఎండ తీవ్రంగానూ, నేరుగా పడే భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు గానీ... నిజానికి మంచు కప్పి ఉన్న ప్రాంతాల్లోనే రేడియేషన్ ప్రభావమెక్కువ. అంటే భూమధ్య రేఖ కంటే ధ్రువాల వైపు ΄ోతున్న కొద్దీ, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ..., అలాగే వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ ఈ రేడియేషన్‌లోని యూవీ కిరణాల తీవ్రత పెరుగుతుంది. రేడియేషన్‌లో ప్రమాదకరమైనది యూవీ–బీ... యూవీ–ఏ, యూవీ–బీలలో రెండోది (యూవీ–బీ) చాలా ప్రమాదకరమైనది. అది చర్మం తాలూకు ‘ఎపిడెర్మిస్’ అనే పొరను తాకాక అక్కడి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రి΄్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకి΄ోయేలా చేస్తాయి. ఆ తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’నూ తాకుతాయి. అక్కడి ఇంట్రావాస్కులార్ హీమోగ్లోబిన్, డెర్మిస్లోని టిష్యూ బైలింబిన్ అనే కణజాలాలు వాటిని గ్రహించి మళ్లీ వెనకకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు రావడం జరుగుతుంది. అలాంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున లేదా తీవ్రంగా జరిగినప్పుడు చర్మంపై అవి దుష్ప్రభావాల రూపంలో వ్యక్తమవుతాయి. ఇన్‌డోర్స్‌లో ఉన్నా ప్రమాదమే... ఇండ్లలో ఉన్నవాళ్ల మీద అల్ట్రావయొలెట్ రేడియేషన్ దుష్ప్రభావం ఉండదన్నది చాలా మందిలో ఉండే మరో అ΄ోహ. ఆరుబయటితో పోలిస్తే ఇన్‌డోర్స్‌లో కాస్త తక్కువే అయినా... రేడియేషన్ దుష్ప్రభావాలు గదుల్లో ఉన్నా ఎంతోకొంత ఉండనే ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు మనకు అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఉండదని అనుకుంటాంగానీ... ఇళ్లలో ఉండే ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మి ఉన్నప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఎండ వల్ల పెరిగే తీవ్రత... కొందరిలో ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి ముందుగానే ఉండవచ్చు. అయితే తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్కువ సేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న వ్యాధి తీవ్రత పెరగవచ్చు. ఆ ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని... యాక్నె (మొటిమలు) అటోపిక్ ఎగ్జిమా (స్కిన్ అలర్జీ) పెలగ్రా లూపస్ అరిథమెటోసిస్, హెర్పిస్ సింప్లెక్స్ బుల్లస్ పెఫిగోయిడ్ లైకెన్ ప్లానస్ సోరియాసిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మెలాస్మా వంటివి ముఖ్యమైనవి. రేడియేషన్ వల్ల చర్మానికి జరిగే అనర్థాలివి... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల...సన్ బర్న్స్ సన్ ట్యానింగ్ చర్మం మందంగా మారడం గోళ్లకు నష్టం కావడం అసలు వయసు కంటే పెద్ద వయసు వారిగా కనిపించడం. ఇక ఈ అంశాల గురించి వివరంగా చెప్పాలంటే... సన్‌బర్న్స్: రేడియేషన్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మొట్టమొదట కణాల్లోని చర్మకణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. అంతకంటే ముందు మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే ముఖం మీద, చేతుల మీద త్వరగా కనిపిస్తుంది. బాగా ఫెయిర్‌గా ఉండి తెల్లటి చర్మంతో ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. అయితే మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. సన్ ట్యానింగ్ : ఎండ తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారి అలా అది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు (నల్లబారడం) మొదట తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎండలోనే ఉండేవారిలో రంగు మారడం చాలాకాలం పాటు కొనసాగి, ఆ మారిన రంగు కాస్తా అలాగే చాలాకాలం పాటు ఉండిపోతుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా, ఎర్రగా ఉన్నవారిలో ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం గోళ్ల మీద కూడా...ఎండకు అదేపనిగా ఎక్స్΄ోజ్ అవుతుండే గోళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముంది. నిత్యం అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు గురయ్యే గోళ్లలో వేలి నుంచి గోరు విడివడి ఊడి΄ోయే అవకాశముంటుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘ఒనైకోలైసిస్’ అంటారు. ఎండ తీవ్రతతో వచ్చే చర్మవ్యాధులివి... ఎండలోని అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు అదేపనిగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. అవి... పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ : ఇవి యుక్తవయస్కుల్లో, పిల్లల్లో ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన, ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ రావడం, అరచేతి పైనా, మెడ వెనక ఈ ర్యాష్ కనిపిస్తుంది. ఇందులో దురద కూడా ఎక్కువే. ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆక్టినిక్ ప్రూరిగో: ఈ సమస్య ప్రధానంగా అమ్మాయిల్లో ఎక్కువ. చర్మం అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువ. మొదట చిన్న చిన్న దురద పొక్కుల్లాగా వచ్చి, అవి పెచ్చులు కట్టి, మచ్చలా మారుతుంటాయి. అలా వచ్చిన మచ్చ ఎన్నటికీ పోదు. హైడ్రోవాక్సినిఫార్మ్ : ఈ సమస్య పిల్లల్లో కనిపించడం ఎక్కువ. ఇవి దురదగా ఉండే రక్తపు నీటి పొక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారి, ఆ తర్వాత ఎండి, రాలిపోతాయి. అటు తర్వాత అక్కడ చికెన్పాక్స్లో ఉండే మచ్చలాంటిది పడుతుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఈ పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ అట్రికేరియా: ఎండకు బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్లల్లో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా, దద్దుర్లు వస్తాయి. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్: ఇదో రకం స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా, మెరుస్తున్నట్లుగా, మందంగా మారి, దురద వస్తుంది. అది వచ్చిన చోట చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. ఇది ముఖ్యంగా ముఖం మీద ఎక్కువగా కనిపించినప్పటికీ మాడు, వీపు, మెడ, ఛాతి, చేతుల మీదికి కూడా వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ అలర్జీ, పుప్పొడితో కనిపించే అలర్జీలతోపాటు కలిసి వస్తుంది. చర్మ కేన్సర్లు : నిరంతరం నేరుగా, తీక్షణంగా పడే ఎండలో ఎక్కువగా ఉండేవారికి చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిల్లో మెలనోమా, నాన్మెలనోమా అని రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌తో ఉండే కొన్ని ప్రయోజనాలివి... అల్ట్రా వయొలెట్ రేడియేషన్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి... విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ కాక΄ోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ విటమిన్–డి చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదల, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం, ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కొంతమేరకు అవసరమవుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఉపయోగిస్తుంటారు. పుట్టుకామెర్ల చికిత్సలో : నవజాత శిశువుల్లో వచ్చే పుట్టుకామెర్లు (జాండీస్)ను తగ్గించడం కోసం అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. ఎండలో ఉండే వ్యవధి, తీవ్రత... పెరుగుతున్న కొద్దీ దుష్ప్రభావాల పెరుగుదల... ఎండకు ఎంతసేపు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుంటే దుష్ప్రభావాలూ అంతగా పెరుగుతాయి. అలాగే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాలూకు తీవ్రత పెరుగుతున్నకొద్దీ నష్టాల తీవ్రత దానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు ‘ఫొటో ఏజింగ్’ ఒక ఉదాహరణ. ఫొటో ఏజింగ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ అంటే... ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి తన వాస్తవ వయసుకంటే ఎక్కువ వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటాడు. అల్ట్రా వయొలెట్–బి రేడియేషనే ఇందుకు కారణం. ఆ కిరణాల వల్ల ముఖం అలాగే మేని మీద ముడుతలు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం, నల్లటి మచ్చలు రావడం, వదులుగా మారి΄ోవడం, తన పటుత్వం కోల్పోవడం వల్ల ఇలా ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది. యూవీ రేడియేషన్ అనర్థాల నుంచి కాపాడుకోవడం ఇలా... ప్రధానంగా వేసవితో పాటు మిగతా అన్ని కాలాల్లోనూ ఎండ తీక్షణత ఎక్కువగా ఉండే సమయంలో అంటే... ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు (పొడడైన స్లీవ్స్ ఉండే దుస్తులు) తొడగడం మంచిది. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కవర్ అయ్యేలా చేసే బ్రిమ్ హ్యాట్స్తో పాటు వీలైతే సన్‌గ్లాసెస్ కూడా వాడుకోవడం మంచిది. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందుగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా ఉన్న మంచి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి మూడు గంటలకు ఓసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టాంట్ సన్‌స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సన్‌స్క్రీన్స్ ఎంచుకునే ముందర ఒకసారి చర్మవ్యాధి నిపుణలను సంప్రదించి తమకు సరిపడే ఎస్పీఎఫ్ను తెలుసుకుని వాడటం మంచిది. డీ–హైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తాగుతుండాలి. డా. వై. అరుణ కుమారి, సీనియర్ డెర్మటాలజిస్ట్ (చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!) -
సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!
మన ఆరోగ్య సంరక్షణలో తాజా కూరగాయలు, పండ్లకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతారు. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు తింటే అదనపు ప్రయోజనం ఉంటుందని మీకు తెలుసా. రోజు ఉప్మా, ఇడ్లీ లాంటివి తిని బోర్ కొట్టిందా? మరింత ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లను తీసుకోవాలని భావిస్తున్నారా. ఖాళీ కడుపుతో శక్తికి గేమ్-ఛేంజర్‌గా పనిచేసే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.ఉదయాన్నే పండ్లు తీసుకోవడంతో రోజంతా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయి. మలబద్దకం, కడుపు కేన్సర్, డయేరియా, ఎముకల ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియ అద్భుతంగా పని చేస్తుంది. రక్తపోటును నియంత్రించవచ్చు. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మెరుస్తూ, యవ్వనంగా కనిపిస్తారు. ముఖ్యంగా అధిక బరువును నియంత్రించుకోవచ్చు. పుచ్చకాయ: జ్యూసీ జ్యూసీగా పుచ్చకాయశరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రిఫ్రెషింగ్ రుచితోపాటు, మంచి హైడ్రేటింగ్‌గా పనిచేస్తుంది. ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల ఉదయం తీసుకుంటే చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. పుచ్చకాయలో లైకోపీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. లిక్విడ్స్, ఎలక్ట్రోలైట్లతో నిండిన పుచ్చకాయతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా హైడ్రేట్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.బొప్పాయి: బొప్పాయిలో పపైన్, కైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. విటమిన్లు A, C , E లతో నిండిన బొప్పాయితో బరువు కూడా తొందరగా తగ్గుతాం. ఇందులోని ఎంజైమ్‌లు జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడతాయి. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.పైనాపిల్ : విటమిన్ సి , మాంగనీస్ పుష్కలంగా లభించే పైనాపిల్ రోగనిరోధక వ్యవస్థకు ఒక సూపర్ హీరో అని చెప్పవచ్చు. ఎముకలను బలోపేతం చేస్తుంది. ఉబ్బరం , వాపు కూడా తగ్గుతుంది.ఆపిల్స్: పెక్టిన్ తో నిండిన ఆపిల్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆకలికి తట్టుకుంటుంది. క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు బోనస్.మెదడు పనితీరును ,మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించికివి: విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లతో నిండిన కివీ పండ్లు చాలా శక్తినిస్తాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. చర్మ ఆరోగ్యం , జీర్ణక్రియకు అద్భుతాలు చేస్తుంది. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్యాక్టినిడిన్ కూడా ఉంటుంది. ఉదయమే ఈ పండును తినడం అంటే పోషకాలతో కూడిన ఫుడ్‌ను శరీరానికి అందించడమే. అరటిపండ్లు: అరటిపండ్లు పొటాషియానికి గొప్ప మూలం. ఇవి గుండెకు మంచిది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి , కండరాల పనితీరుకు ఇది అవసరం. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్లు సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి.బెర్రీ: కడుపు నిండిన అనుభూతికోసం ఈ పండ్లు ఉత్తమం. విటమిన్లు సి , కె, అలాగే పొటాషియం, కాపర్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి, ముఖ్యంగా మూత్రపిండాలు, ప్రేగులు, గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, రోగనిరోధక వ్యవస్థకు బలాన్నిస్తాయి కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడతాయి. -
వేసవిలో అక్కడకు వెళితే మాడి మసైపోతారు
శ్రీగంగానగర్ (రాజస్థాన్): వేసవికాలం రాకముందే దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల వడగాడ్పులకు జనం విలవిలలాడిపోతున్నారు. వేసవి ప్రవేశించకముందే ఇలా ఉంటే, ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే మనదేశంలోని ఒక జిల్లాలో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఆ సమయంలో అక్కడికి ఎవరైనా వెళితే మాడిమసైపోవాల్సిందే..రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా(Sri Ganganagar District)లో వేసవిలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతం భారత్‌లో అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా గుర్తించారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ జిల్లాలో వేసవికాలం దడ పుట్టిస్తుంది. గతంలో ఈ జిల్లా బికనీర్‌లో భాగంగా ఉండేది. ఆ తరువాత దీనిని మరో జిల్లాగా మార్చారు. శ్రీగంగానగర్ జిల్లాకు దక్షిణాన బికనీర్, పశ్చిమాన పాకిస్తానీ పంజాబ్, ఉత్తరాన భారత పంజాబ్ ప్రాంతంలోని ఫాజిల్కా జిల్లాలు ఉన్నాయి.వేసవి కాలంలో శ్రీగంగానగర్ జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకుపైగా ఉంటుంది. ఫలితంగా జిల్లాలో మధ్యాహ్నం సమయంలో రోడ్లపై ఒక్కరు కూడా కనిపించరు. రాజస్థాన్(Rajasthan)లోని ఈ జిల్లా గోధుమ, ఆవాలు, పత్తి పంటలకు ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో పంజాబీ ప్రజలు ఈ జిల్లాలో నివసిస్తున్నారు. ఇక్కడి మహిళలు ఎంబ్రాయిడరీ చేసిన స్కార్ఫ్‌లను ధరిస్తుంటారు. శ్రీ గంగానగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలకు ఒక కారణం ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చే వేడిగాలులు కారణంగా ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 50 డిగ్రీలు కూడా దాటుతుంటాయి. శ్రీగంగానగర్‌లో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు అటుఇటుగా నమోదువుతుంటుంది. ఇది కూడా చదవండి: ఏప్రిల్ 19 నుంచి కట్రా- శ్రీనగర్ ‘వందేభారత్’ -
టీచర్లకు ‘ప్రవేశ’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: సమ్మర్లో సర్కారీ టీచర్లకు సరికొత్త పరీక్ష ఉండనుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించే పోటీని ప్రభుత్వం పెట్టబోతోంది. ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం ఇప్పటికే జరిగింది. ఇందులో భాగంగా ప్రతి టీచర్‌కూ విద్యార్థులను చేర్పించేందుకు టార్గెట్ పెడతారు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించి తీరాల్సి ఉంటుంది. ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ ఇస్తారు. ఇవి వారి సర్విస్ రికార్డులోకి ఎక్కుతాయి. పదోన్నతులు, బదిలీల సమయంలో వీటిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు.ఇక విద్యార్థుల కోసం క్షేత్రస్థాయికి వెళ్ళే టీచర్లకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఊరూరా ప్రచా రం చేపట్టాలని కూడా నిర్ణయించారు. వీటన్నింటికీ సిద్ధమవ్వాలని జిల్లా అధికారులకు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏటా వేసవిలో బడిబాట కార్యక్రమం చేపడుతున్నా..మొక్కుబడిగానే సాగు తోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చేరికలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎందుకు తగ్గుతున్నారు? ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు రానురాను తగ్గుతున్నాయి. 2022–23లో 28.80 లక్షలు చేరితే, 2024–25 నాటికి ఈ సంఖ్య 25.13 లక్షలకు తగ్గింది. అంటే 3.5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారన్న మాట. మరోవైపు ప్రైవేటు స్కూళ్ళలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. 22–23లో 30.17 లక్షల మంది ఉంటే, 24–25లో ఈ సంఖ్య 37 లక్షలకు చేరింది. అంటే దాదాపుగా 7 లక్షలు పెరిగారు. ఈ పరిస్థితిపై విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిది. దీనిపై ముఖ్యమంత్రి అధికారులతో ఇటీవల సమీక్షించారు. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిది.ప్రభుత్వ బడులపై విశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఇందులో టీచర్లూ కీలక పాత్ర పోషించేలా చూడాలని సూచించింది. ఇంకోవైపు ‘ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తోంది. మౌలిక వసతులూ కల్పిస్తున్నాం. ప్రైవేటు కన్నా, ప్రభుత్వ స్కూళ్ళలోనే అర్హత గల టీచర్లున్నారు. అయినా పిల్లలెందుకు చేరడం లేదు?’అని సీఎం అనేకసార్లు విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చేరికలను విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లల చేరికలు పెరిగేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. -
టమాటా ధర భారీగా పతనం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులకు ఏటా వేసవిలో టమాటానే ప్రధాన పంట. ఈ దఫా సీజన్ మొదలైనప్పటినుంచి టమాటా ధర భారీగా పతనమయ్యింది. పలమనేరు టమాటా మార్కెట్లో గురువారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.90, కనిష్ట ధర రూ.30 మాత్రమే పలికింది. దీనితో కనీసం టమాటాలను కోసే కూలీల ఖర్చు సైతం రైతులకు దక్కని పరిస్థితి నెలకొంది. – పలమనేరు పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో సాగు వివరాలు వేసవిలో టమాటా సాధారణ సాగు: 5 వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట: 7వేల హెక్టార్లు ఇప్పుడు కోత దశలో ఉన్న తోటలు: 600 హెక్టార్లుబయటి రాష్ట్రాల్లో సీజన్... ప్రస్తుతం చత్తీస్ఘడ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాల్లో సీజన్ ఆఖరు దశలో ఉంది. అక్కడి అవసరాలకు లోకల్ సరుకు సరిపోతోంది. దీంతో అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో లోకల్ వ్యాపారులు మాత్రమే ఇక్కడి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. దీనితో టమాటా ధర అమాంతం పడిపోయింది. అనంతపురం జిల్లాలో రోజుకు 700 మెట్రిక్ టన్నులు... ఇక అనంతపురం జిల్లానుంచి ఎక్కువగా టమాటాలు స్థానిక మార్కెట్లకు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో 700 మెట్రిక్ టన్నుల టమాటా ప్రతిరోజూ మార్కెట్లకు వస్తోంది. నిత్యం అక్కడినుంచి 300 టన్నుల దాకా సరుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని పలు మార్కెట్లకు చేరుతోంది. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉంటోంది. ప్రభుత్వం ఆదుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరా పొలంలో టమాటా పేపర్ చేసి నాటాలంటే రూ.2 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి.ఈ ధరతో పంట పెట్టుబడి కూడా దక్కదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – రామన్న, కురపల్లి, పలమనేరు మండలంవచ్చేనెల నుంచి ఎగుమతులకు అవకాశం నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏప్రిల్ 2 నుంచి ఎగుమతులకు టెండర్లను పిలిచాం. ఆ తర్వాత ధరలు ఆశాజనకంగా ఉండొచ్చు. – సంజీవ కుమార్, ఏఎంసీ సెక్రటరీ, పలమనేరు -
పాపికొండల్లో.. అరుదైన అతిథులు!
వేలాది పక్షి జాతుల నిలయంగా పాపికొండలు అటవీ ప్రాంతం అలరాలుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 1,01,200 హెక్టార్లలో ఇది విస్తరించి ఉంది. వేసవిలోనూ ఇక్కడ చల్లటి వాతావరణం ఉండటంతో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది పక్షుల గణనలో 46,700 వరకు వివిధ రకాల పక్షి జాతులున్నట్టు గుర్తించామని వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ మడ అడవుల వద్ద క్రిస్టడ్ సర్పెంట్ ఈగల్(నల్ల పాముల గద్ద), మలబార్ పైడ్ హార్న్‌బిల్, స్కేర్లెట్ మినివెట్, ఇండియన్ స్కిమ్మర్‌తో పాటు మరో ఆరు రకాల అరుదైన వలస పక్షులను గుర్తించినట్టు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అధికారి మహేష్ చెప్పారు. – బుట్టాయగూడెం -
మామిడికాయతో ఆవకాయేనా..? తియ్యటి మిఠాయిలు కూడా చెసేయండి ఇలా..!
పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు. పచ్చిమామిడితో వంటకాలే కాదు... పుల్లని మామిడితో తియ్యటి మిఠాయిలూ సృష్టించొచ్చు. షర్బత్లూ తాగించొచ్చు.కావలసినవి: పచ్చి మామిడికాయ–1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా–అరకప్పు, పంచదార–1 కప్పు, నీర –1 కప్పు, నెయ్యి– 2 చెంచాలు.తయారీ: మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి; ఈ పేస్ట్‌లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేతపాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.పచ్చి మామిడి హల్వాకావలసినవి: పచ్చి మామిడికాయ – 1, వెర్మిసెల్లీ – 1 కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి పావుకప్పు, జీడిపప్పు పొడి – 2 చెంచాలు, యాలకుల పొడి – 2 చెంచాలుతయారీ: మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులువదులుతున్నప్పుడు దించేసుకోవాలి.మ్యాంగో బనానా షర్బత్కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2, పంచదార – 1 కప్పు, అరటిపండు – 1, జీలకర్ర పొడి – 1 చెంచా, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంతతయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు ΄ోసి పల్చని జ్యూస్‌లా బ్లెండ్ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడ΄ోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. (చదవండి: -
ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. (చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు) -
గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం సాయంత్రం 4.39 గంటలకు గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకొని కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో విద్యుత్ డిమాండ్ 17వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. గతేడాది సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,557 మెగావాట్లే. గతేడాది మార్చి 8న నమోదైన 15,523 మెగావాట్ల గరిష్ట డిమాండే ఈ ఏడాది ప్రారంభం వరకు అత్యధికం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 5న డిమాండ్ 15,752 మెగావాట్లకు పెరిగి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ పలుమార్లు కొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుత నెలలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16వేల మెగావాట్లకు మించి నమోదవుతోంది. ఈ నెల 18న 335.19 మిలియన్ యూనిట్ల రోజువారీ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో సైతం గురువారం 11,017 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. డిమాండ్ ఎంత పెరిగినా కోతల్లేని సరఫరా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, రెప్పపాటు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన సంస్కరణలు, రూపొందించిన ముందస్తు ప్రణాళికలతో పాటు విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి తీసుకున్న చర్యలతో ఇది సాధ్యమైందన్నారు. ఒక్క వినియోగదారుడికి సమస్య రావొద్దు: సందీప్‌కుమార్‌సుల్తానియా వేసవిలో ఏ ఒక్క వినియోగదారుడికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై గురువారం ఆయన సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ 30 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. గత వేసవి అనుభవాల దృష్ట్యా ఈ వేసవిలో ఓవర్ లోడ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పలు సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో గరిష్ట డిమాండ్ 5,000 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశామని, ఆ మేరకు సరఫరాకు సిద్ధంగా ఉన్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. -
చంటి పిల్లలతో జాగ్రత్త : నాటు వైద్యంతో ప్రమాదం!
వేసవి కాలం ప్రారంభమైతే చాలు చికెన్ ఫాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటి సమస్య పిల్లల్లో అధికంగా కనిపిస్తాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఈ సమస్యలతో చిన్నపిల్లలు బాధపడుతున్నారు. చాలా మంది తమ పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకువస్తుంటే.. కొంతమంది పూర్వకాలం పద్ధతుల్లో నాటు వైద్యం చేయిస్తున్నారు. అన్ని వయసుల వారికి ఈ వ్యాధులు సోకే అవకాశం ఉన్నా చిన్నారులకు త్వరగా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి జలుబు, జ్వరం, శరీరంపై పొక్కులు, దవడలకు ఇరువైపులా బిళ్లలు, నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ముందు జాగ్రత్తతోనే ఈ ప్రమాదకర అంటువ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, 15 ఏళ్లలోపు బాలబాలికలపై మరింత శ్రద్ధ వహించాలంటున్నారు. జాగ్రత్త వహించాలి రామచంద్రపురం నియోజకవర్గంలోని ఐదేళ్లలోపు చిన్నారులు కాజులూరు మండలంలో 3887 మంది, కె.గంగవరం మండలంలో 4922 మంది, రామచంద్రపురం మండలంలో 3890 మంది మొత్తం 12,699 మంది చిన్నారులు ఉన్నారు. ఈ వేసవిలో వారిపట్ల మరింత శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఈ వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా వ్యాధి సోకిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఆకలి లేకపోవడంతో ఆహారం సరిగ్గా తీసుకోలేక బాగా నీరసించిపోతారు. చర్మంపై నీటి పొక్కులు, దురదలు వంటి లక్షణాలు వారం నుంచి పదిహేను రోజులకు పైగా బాధిస్తాయి. తొలుత జలుబుతో ప్రారంభమయ్యే ఈ వ్యాధులు క్రమంగా వాటి ప్రభావం చూపుతాయి. శరీరంపై నీటి పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే ఆటలమ్మగా గుర్తించి తక్షణం వైద్యులను సంప్రదించాలి. నాటు వైద్యం వైపు వెళ్లరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా, వేగంగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. ఆటలమ్మ... జాగ్రత్తలు సాధారణంగా ఈ వ్యాధి వారం నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆటలమ్మ అంటువ్యాధి కావడం వల్ల వ్యాధి సోకిన వారిని మిగిలిన వారికి దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిన పిల్లలను పాఠశాలకు పంపకూడదు. ప్రతి రోజూ స్నానం చేయవచ్చు. జ్వరం ఉంటే వేడి నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. దురద రాకుండా పరిశుభ్రత పాటించాలి. చిన్నారులకు చేతి గోళ్లు తీసివేయడం మంచిది. మంచి పౌష్టికాహారం అందించాలి. ఆటలమ్మ వచ్చిన వారు కోరినవన్నీ ఇవ్వాలన్న అపోహతో అన్ని రకాల తినుబండారాలను ఇవ్వడం మంచిది కాదు. తేలికగా జీర్ణమయ్యే మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. గవదబిళ్లలు... జాగ్రత్తలు గవదబిళ్లల వ్యాధిలో తీవ్రంగా గొంతునొప్పి ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంలో ద్రవాల శాతం తగ్గుతుంది. కాబట్టి ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం మంచిది. నాటువైద్యం ప్రమాదకరంచికెన్పాక్స్, గవద బిళ్లలు వచ్చిన వారి విషయంలో ప్రజలు అపోహలు, మూఢనమ్మకాలు పెట్టుకోకుండా వైద్యులను సంప్రదించాలి. చాలామంది మూఢనమ్మకాలతో వైద్య సహాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వైద్యుని సలహా తీసుకుని అవసరమైన మందులకు క్రమం తప్పకుండా వాడాలి. వ్యాధి ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గర్భిణులపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతుంది. నాటువైద్యాన్ని ఆశ్రయిస్తే ప్రమాదానికి దారి తీస్తుంది. వైద్యులను సంప్రదించాలి అటలమ్మ, గవద బిళ్లలు వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ప్రస్తుతం చిన్న పిల్లలు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు మందులు వాడాలి. – ఎన్.ప్రశాంతి, డివిజనల్ వైద్యాధికారి, రామచంద్రపురం -
బిందె నిండాలంటే.. జాగారం చేయాల్సిందే!
వేసవి వచ్చిందంటే.. మండించే ఎండలేకాదు. నీటి ఎద్దడి కూడా భయపెడుతుంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా తాగు నీరు కోసం ప్రజలు పడే బాధలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల మహిళల అవస్థలు వర్ణనాతీతం. బిందెడు నీళ్లకోసం వారు పడే ఆవేదనకు అద్దం పట్టే కథనం ఇది!ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో భూగర్భ జలాలు క్రమేణా అడుగంటిపోతున్నాయి. దీంతో నీటి సమస్య జఠిలమవుతోంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నప్పటికీ ఆ ట్యాంకు ఎప్పుడు నిండుతుందో తెలియక ప్రతియేటా గ్రామ శివారులోని చేదబావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అయితే ఎండల తీవ్రతతో ఆ బావి ఎండిపోవడంతో మిషన్ భగీరథే దిక్కైంది. అది కూడా మూడునాలుగు రోజులకు ఒకసారి ఆ ట్యాంకు నిండుతుంది. ఒక్కొక్కరికి రెండు బిందెలే వస్తుండటంతో వాటి కోసం గ్రామస్తులు వేకువజామునే బిందెలతో ట్యాంకు వద్దకు చేరుకుని జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీరే అందకపోగా మూగజీవాలకు, ఇతర అవసరాలకు నీరు లభించడం గగనమైంది. దీంతో గ్రామస్తులు పాలకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఆదిలాబాద్ చదవండి: అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్ కోర్టు తీర్పుపై దుమారం -
వేసవిలో పెరుగు పులిసిపోయిందా? బెస్ట్ టిప్స్ ఇవిగో!
పెరుగు లేనిదే అన్నం తిన్నట్టే ఉండదు చాలామందికి. అంతేకాదు పెరుగు కమ్మగా ఉండాలి. కొంచెం పులిసినా ఇక దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది గృహిణులకు పెద్ద టాస్కే. అందులోనూ వేసవి కాలంలో పెరుగు తొందరగా పులిసిపోతుంది. కానీ పెరుగు మిగిలినా, పుల్లగా అయినా పాడేయక్కర్లేదు. మిగిలిన పెరుగు,పుల్లటి పెరుగుతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు తెలుసా? దీంతోపాటు కొన్ని ఇంట్రిస్టింగ్ టిప్స్ మీకోసం..వేసవికాలంలో ఫ్రిజ్‌లో పెట్టినా కూడా టేస్ట్ మారిపోతుంది. మిగిలిపోయిన, లేదా పులిసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే మిగిలిన పెరుగును తాలింపు పెట్టుకుంటే, రుచిగానూ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ పెరుగులో కాస్త మైదా, వరిపిండి కలిపి అట్లు పోసుకొని తినవవచ్చు. బోండాల్లా వేసుకొని తినవచ్చు. పుల్లట్లుపెరుగుతో చేసుకునే అట్లు భలే రుచిగా ఉంటాయి. పెరుగులో ఒక కప్పు మైదా, రెండు కప్పుల బియ్యం పిండి కలిపి కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాలంటే కొద్దిగా బొంబాయి రవ్వ కూడా కలుపు కోవచ్చు. దోసెలు వేసుకునే ముందు సన్నగాతరిగిన ఉల్లి, పర్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఉప్పు వేసి దోశల పిండిలా జారుగా ఉండాలి. వేడి వేడి పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ దోసలను దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. అల్లం లేదా టమాటా చట్నీతో బ్రేక్‌ఫాస్ట్‌లా లేదంటే ఈవినింగ్ టిఫిన్లా తినవచ్చు.మజ్జిగ పులుసు పులిసిన పెరుగును కాస్త నీరు కలిపి మజ్జిగలా చేయండి. దాంట్లో రెండు టీ స్పూన్ల శెనగపిండి కలిపి పక్కనుంచుకోవాలి. కుక్కర్లో సొరకాయ, బెండకాయ ముక్కల్ని పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు, కాసిన్ని నీరు పోసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి. రెండు, మూడు కూతలు వచ్చేదాకా ఆగాలి. ఆ తరువాత మూత తీసి, కొత్తి మీర చల్లి, కొద్దిసేపు మరగనివ్వాలి. ఇపుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగ కలిపి మరో రెండు నిమిషాలు మరగనిస్తే చాలు. చివరిగా దీన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి తాలింపు పెట్టుకోండి. ముద్దపప్పు , మజ్జిగపులుసు కాంబినేషన్ అదుర్స్ . సింపుల్గాఎండుమిర్చి, మెంతులు, కరివేపాకుతో తాలింపు వేసి, పచ్చి ఉల్లిపాయ ముక్కులు, క్యారెట్ తురుము కలుపుకుని వేడి వేడి అన్నంతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. బోండాలుపెరుగులో మైదా, బియ్యం పిండి,కాస్త వంట సోడా కలిపి పెట్టుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే రెండు మూడు గంటలు నానిన తరువాత బాగా బీట్ చేసి బోండాల్లాగా వేసుకుంటే రుచిగా ఉంటాయి. (పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే బోండాలు పేలే అవకాశం ఉంది). కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయ, పర్చిమిర్చి, కొత్తిమీరలను ముక్కలుగా చేసి కలుపుకుని కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకోవడమే. అల్లం ,లేదా పల్లీ చట్నీతో తింటే ఆహా అనాల్సిందే.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?మరికొన్ని చిట్కాలు మిగిలిపోయిన పెరుగును తినడానికి ఇష్టపడని వారు.. దాన్ని పండ్ల రసాలు, స్మూతీస్ తయారీలోనూ వాడుకోవచ్చు. స్మూతీస్ చేసే క్రమంలోనే బ్లెండర్లో పండ్లు, తేనె, కొన్ని ఐస్‌ముక్కలతో ΄ాటు కొద్దిగా పెరుగు వేసి బ్లెండ్ చేస్తే దాని రుచి పెరుగుతుంది.మటన్, చికెన్ వండే ముందు చాలా మంది మ్యారినేట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో పెరుగును కూడా కలిపితే మాంసం ముక్కలు మరింత మృదువుగా మారి త్వరగా ఉడకటమే కాదు, కూర రుచి మరింత పెరుగుతుంది.సలాడ్ గార్నిష్/డ్రస్సింగ్ కోసం కొత్తమీర/పుదీనా వంటి ఆకులు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం, ఆలివ్ నూనె వంటివి వాడుతుంటారు. అయితే క్రీమీగా చిలికిన పెరుగును వాటి పైనుంచి సన్నటి తీగలాగా పోస్తే సలాడ్ నోరూరిస్తుంది. ఇంకా తింటుంటే మధ్యమధ్యలో పుల్లపుల్లగా నోటికి తగులి టేస్టీగా ఉంటుందని అంటున్నారు.చిప్స్, క్రాకర్స్, కాల్చిన కాయగూర ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రై స్ వంటి వాటిని వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన డిప్పింగ్ సాస్‌లో ముంచుకొని తింటుంటారు. అయితే ఈ డిప్స్ తయారీలో కొద్దిగా పెరుగును ఉపయోగిస్తే వాటి రుచి, చిక్కదనం పెరుగుతాయి. పెరుగుతో రుచికరమైన డిప్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పెరుగును ఒక క్లాత్‌లో వేసి అందులోని నీటిని తీసేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా చిలికితే క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కలుపుకోవాలి. ఇష్టం ఉంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్వీట్‌కార్న్ వంటివి జత చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్! -
మండుతున్న ఎండలు : సమతుల ఆహారంతోనే ఆరోగ్యం
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చిలోనే ఎండలు ముదురుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో మనం తీసుకునే ఆహారం అత్యంత కీలకంమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరం డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. చెమట అధికంగా ఉత్పన్నమవుతుంది. ఇలా ఉంటే శరీరంలోని లవణాలు తగ్గిపోయి వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు తప్పక పాటించాలని చెబుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల లోపు నిత్యం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల్లో 42 వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపత్యంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. వేసవిలో చర్మవ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటంది. ఇవన్నీ ఎదుర్కొవాలంటే రోగ నిరోధకశక్తి పెంచే విధంగా....ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆలోచన కలిగి ఉండాలి. ఎక్కువ నీరు తీసుకోవాలి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు 3–5 లీటర్ల వరకు నీరు తీసుకుంటూ ఉండాలి. శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. తాజా పండ్లు తీసుకోవాలి ప్రతి రోజూ నీరు, పోషకాల శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, జామ, అరటి, యాపిల్ పండ్లు తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల రసాలు శ్రేయేస్కరం. రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలు తీసుకోవడం కూడా మంచిది. ఇవి శక్తిని ఇవ్వడంతోపాటు ఎండల్లో నిస్సత్తువ రాకుండా చూస్తుంది. ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఎండలో ఎక్కువగా తిరిగే వారు ద్రవ పదర్థాలను తీసుకుంటూ రావాలి. మజ్జిగతో పాటు కొబ్బరినీరు, లస్సీ, చెరుకు రసం అధికంగా వినియోగించాలి. ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. ఉల్లిని నిత్యం ఆహారంలో తీసుకుంటే వడ దెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువ. మజ్జిగ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందులో ప్రో బయోటిక్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరినీరు ఈ కాలంలో తరుచుగా తీసుకుంటే ఖనిజ లవణాలు ఎక్కువ శక్తిని ఇచ్చి వడగాలులు, వేగి గాలుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పటిష్టమైన రోగ నిరోధక శక్తి వేసవిలో బలమైన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఖనిజ లవణాలు అధికంగా ఉండేలా చూడాలి. పాలు, గుడ్లు, టమోటా, నారింజ, పసుపు రంగు కూరగాయలు, చిలకడదుంప, చేపలు, బ్లాక్ బెర్రి, బ్లూ బెర్రి తినడం మంచిది. ఆహారంలో సొరకాయ, బీరకాయ, దోసకాయ, పొట్లకాయ తదితర కూరగాయలు వినియోగించడం శ్రేయస్కరం.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ ఎండలో అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండడం ఎంతో మంచిది. తలపై రక్షణకు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. చేనేత, కాటన్ దుస్తులు ధరించి మంచిది. ఎక్కువ నీరు తాగడంతోపాటు మనిషికి సరిపడేలా నిద్రపోవాలి. ప్రతిరోజు వ్యాయామం మరింత మంచిది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కాపీ, టీలు అలవాటున్న వారు వీలైనంత తగ్గించుకుంటే మంచిది. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, సూపరింటెండెంట్, వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, కడప -
పెరుగుతున్న ఎండల తీవ్రత
సాక్షి, అమరావతి: వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటోంది. నిన్నటి వరకు రెండు, మూడు చోట్ల మాత్రమే 40 డిగ్రీలు దాటిన ఎండ.. గురువారం చాలా మండలాల్లో 40 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవి సాధారణంకంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారానికల్లా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమ శాతం ఎక్కువగానే ఉండడం వల్ల ఉక్కపోత ఉండడంలేదు. అయితే ఎలినినో పరిస్థితుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మున్ముందు ఎండ, వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అప్పుడే భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి రెండో వారంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈసారి వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. వాస్తవానికి మార్చి మొదటి వారం నుంచి వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ క్రమంలో మార్చిలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. కానీ గత రెండ్రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్‌లో సగటు ఉష్ణోగ్రతకన్నా 4.4 డిగ్రీలు అధికంగా, నిజామాబాద్‌లో 3.2, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మంలో 3 డిగ్రీలు అధికంగా నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డు అయింది. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు వేగంగా పెరినట్లు ఐఎండీ తెలిపింది. రానున్న మూడు రోజులు ఇదేతరహాలో వాతావరణం ఉంటుందని వివరించింది. వడదెబ్బతో కూలి మృతి రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజా పేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి బొల్లారం నర్సమ్మ (55) వడదెబ్బతో మృతిచెందింది. నర్సమ్మ గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిoది. దాహం వేయడంతో నీళ్లు తాగింది. ఆ వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది. నర్సమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
సుర్రుమంటున్న సూర్యుడు.. డీహైడ్రేషన్ బారినపడకూడదంటే..!
ఎండాకాలం మొదలైంది. మార్చి రెండోవారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 47 నుంచి 49 డిగ్రీల సెల్సీయస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో మండే ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీంనగర్ జిల్లా వైద్య అధికారి(డీఎంహెచ్‌వో) వెంకటరమణ వివరించారు.వేసవిలో ఎలాంటి రక్షణ పొందాలి?డీఎంహెచ్‌వో: ఎండ ఎక్కువగా ఉండే 11 నుంచి 3 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించాలి. రేకులషెడ్లలో నివాసముండే వారు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. రేకులపై గడ్డి, గోనె సంచులను వేసుకొని నీళ్లు చల్లాలి.రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో నీటిశాతం లోపంవల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. శరీరంలో శక్తి తగ్గి అలసట కలుగుతుంది. ప్రతీ రోజు 8నుంచి 10గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. అది కూడా సురక్షితమైన నీటిని తీసుకోవాలి.ఆహారం విషయంలో జాగ్రత్తలు?డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో మిగిలిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ప్రతీరోజూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి? డీఎంహెచ్‌వో: శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు, బట్టలు తీసేసి చల్లటి నీటితో ముఖం, చేతులు, కాళ్లు తుడవాలి. గాలి ఆడే స్థలంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.ఆస్పత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు 2 లక్షల ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. అంగన్వాడీ కేంద్రాల్లో, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు.గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించాయా? డీఎంహెచ్‌వో: గతేడాది జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మరణించారు. వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరి ద్వారా వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ జరిగితే ప్రభుత్వం నుంచి కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్‌వో: గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. వీరు ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు. ముఖ్యంగా గర్భిణులు డెలివరీకి ముందే ప్లాన్ చేసుకొని ఆసుపత్రికి చేరుకోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారు ఎండలో తిరిగే సాహసం చేయవద్దు.డీహైడ్రేషన్ అయితే ఏం చేయాలి?డీఎంహెచ్‌వో: డీహైడ్రేషన్ అయితే రీహైడ్రేషన్‌తో చెక్ పెట్టాలి. ఎవరైనా డీహైడ్రేషన్‌కు గురైన వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఉప్పునిమ్మకాయ కలిపిన నీరు తాగించాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఆ చెఫ్ చేతులు అద్భుతం చేశాయి..! వావ్ బంగాళదుంపతో ఇలా కూడా..) -
సమ్మర్ జోష్..
వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపూ నగరంలోని వినోద వేదికలు, గేమింగ్ జోన్స్ తదితర ఎంటర్టైన్మెంట్ సెంటర్ల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు వేసవి సెలవులు ఉండటంతో కుటుంబ సమేతంగా వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు వినోద వేదికలు, అడ్వెంచర్ గేమ్ సెంటర్లు వినూత్న రీతిలో ఫన్ యాక్టివిటీస్ రూపకల్పన చేయడంతో పాటు అందంగా ఆధునీకరిస్తున్నారు. గేమ్స్, వినోద–విజ్ఞాన కార్యక్రమాలు, సాహస క్రీడలు, ముఖ్యంగా వేసవిలో ఇష్టపడే వాటర్ గేమ్స్ తదితర వేదికలు సమ్మర్ హంగామాకు సంసిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా నగరంతో పాటు నగర శివార్లలోని ఈ కోవకు చెందిన వివిధ హాట్ స్పాట్స్ గురించి తెలసుకుందాం. నగరవాసులను అలరించడానికి ఎన్ని ఎంటర్టైన్మెంట్ వేదికలొచ్చినా.. ఆల్ టైం ఫేవరెట్ మాత్రం ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని సందర్శనీయ ప్రాంతాలను తిలకించడానికి కుటుంబ సభ్యులతో పాటు యువత, చిన్నారులకు ప్రత్యేక గమ్యస్థానాలున్నాయి. అలా హుస్సేన్ సాగర్‌లో బోటింగ్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న థ్రిల్ సిటీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, బిర్లామందిర్, ప్రసాద్ ఐమాక్స్‌లు ఆకర్షిస్తుంటాయి. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వేసవి ఎండలను చల్లబరచడానికి సిద్ధంగా ఉంటుంది. విద్యార్థులకు, యువతకు, పరిశోధకులకు విజ్ఞానాన్ని అందించే ప్రతిష్టాత్మక బిర్లా ప్లానిటోరియం వెరీ స్పెషల్. వీటితో పాటు ఈ మధ్య నిర్మించిన సెక్రటేరియట్, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా, అమరవీరుల స్థూపం, సైక్లింగ్ స్పాట్లు ప్రత్యేకం.ఆనందాన్ని పంచే.. మంచు.. సమ్మర్లో మండే ఎండలకు కాసింత చల్లని వాతావరణం ఉంటే చాలు అనుకుంటాం. అలాంటిది ఏకంగా మంచు ఎడారే నగరంలో పలకరిస్తే ఎలా ఉంటుంది. ఈ అనుభూతిని అందంచడానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్నో సెంటర్లు ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్రాటు చేసిన పెద్ద హాల్స్‌లో మంచు దిబ్బలు, ఐస్ స్కేటింగ్ వంటి వినూత్న కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇలాంటి సెంటర్లు నగరంలోని శరత్ సిటీమాల్, ట్యాంక్‌బండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వీనుల విందు.. విడిది కేంద్రాలు.. నగరంలో ప్రస్తుతం ప్రధాన ఎంటర్టైన్మెంట్ జోన్స్ అంటే రిసార్టులే.. విందు, విడిది, వినోదం, కాలక్షేపం, నైట్ స్టే, వాటర్ గేమ్స్ వంటి సేవలతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ రిసార్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో.. నగరానికి నలుదిక్కులా.. ఇటు శామీర్ పేట్ నుంచి అటు శంషాబాద్ వరకూ.. కొండాపూర్–గచ్చి»ౌలి నుంచి ఎల్బీనగర్ శివారు వరకూ వందల సంఖ్యలో రిసార్టులు ఉన్నాయి. ఈ తరంలో అత్యధికంగా ఔటింగ్ అంటే రిసార్టులేనని నగరవాసులు చెబుతున్నారు.సాహస క్రీడలు, వాటర్ గేమ్స్.. అనుభవాలతో పాటు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ వేదికలైన అమ్యూజ్మెంట్ పార్కులు సైతం నగరంలో ఈ సారి వేసవికి సరికొత్త హంగులతో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఇంటర్స్టెల్లార్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు వర్చువల్ త్రీడీ స్క్రీనింగ్ హాల్స్ అలరించనున్నాయి. ఈ మధ్యనే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అధునాతన సాంకేతికతతో పనిచేసే రైడ్లను ఆవిష్కరించింది. దీంతో పాటు థ్రిల్ సిటీ వంటి సెంటర్లు సైతం అడ్వెంచర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.అరుదైన మొక్కలకు వేదికగా.. ప్రపంచంలోని అరుదైన మొక్కలు, ఇతర వింతలు, విశేషాలతో ఈ మధ్యనే నగరంలో ఆవిష్కృతమైన ఎక్స్పీరియం ఎకో పార్క్ ఈ వేసవికి విద్యార్థులకు మంచి సందర్శనీయ వేదికగా నిలువనుంది. వివిధ రకాల మొక్కలు, అరుదైన వృక్షాలు, పర్యావరణ సంరక్షణతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.గేమింగ్ జోన్స్..నగర మాల్స్.. ప్రస్తుత తరుణంలో నగరం ఎక్కడ చూసినా మాల్స్‌తో నిండిపోయింది. ఒకప్పుడు బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పెద్ద పెద్ద మాల్స్ ప్రస్తుతం అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. మాల్స్ అంటే షాపింగ్ మాత్రమే కాదు.. పిల్లలను పెద్దలను అలరించే ఎన్నో ఫన్ యాక్టివిటీస్, గేమింగ్ జోన్స్ ఇతర కాలక్షేప కేంద్రాలకు నిలయాలుగా మారాయి. ఈ వేసవికి నగరంలోని మాల్స్ సైతం హాట్ స్పాట్లుగా మారనున్నాయి. ఎంటర్టైన్మెంట్ కింగ్.. ట్రెక్కింగ్ వేసవి సెలవులను ఆస్వాదించడానికి ప్రకృతితోపాటు సాహసం తోడైతే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి చక్కని వేదిక ్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ ఎంజాయ్ చేయడానికి నగరవాసులు అనంతగిరి హిల్స్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. పలువురు ట్రెక్కింగ్ నిర్వాహకులు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ ట్రాక్‌తో పాటు పలు సాహస క్రీడలతో మధుర జ్ఞాపకాలను అందిస్తున్నారు. -
జర పైలం మరి.. నగరంలో మొదలైన వేసవి హడావుడి
చూస్తుండగానే వేసవికాలం వచ్చేసింది.. ఓ వైపు అప్పుడే మండుతున్న ఎండలు, మరో వైపు పరిశ్రమలు, వాహనాలు, ఏసీల నుంచి వెలువడే కాలుష్యం. వెరసి హైదరాబాద్ నగరంలో ఎప్పటిలానే సమ్మర్ ఎఫెక్ట్ కొనసాగనుంది. గతేడాది ఇదే మార్చ్ నెల్లో అత్యధికంగా 47.2 డీగ్రీ సెంటీగ్రేడ్ల ఎండలతో ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మండే ఎండల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు పర్యావరణ, ఆరోగ్య నిపుణులు. వేసవిలో ముఖ్యంగా ముసలివారు, చిన్నారులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతుండటం, ఎలాంటి వేసవి సంరక్షణా తీసుకోకుండా వివిధ కారణాలతో బయటకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సందర్భంగా వేసవి నుంచి సంరక్షణను అందించే ప్రాథమిక పద్ధతులు, విధానాల గురించి పలు జాగ్రత్తలు.. వేసవిలో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నియమం నీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా హైడ్రేట్ అవ్వాలని ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ ఫ్రీక్స్ సూచిస్తున్నారు. శరీరంలో తగినంత నీటి శాతం ఉన్నంత వరకూ వేసవిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. నగర జీవితంలో తప్పని సరిగా మూడు, మూగున్నర లీటర్ల నీటిని, ఇతర పానియాలను తీసుకోవాల్సిన అవసరముంది. బయటికెళుతున్న సమయంలో వాటర్‌బాటిల్ మర్చిపోవద్దు. వడదెబ్బకు దూరంగా.. వేసవిలో ప్రధాన సమస్య వడదెబ్బ. ప్రతి ఏడాదీ వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారు కోకొల్లలు. వీలైనంత వరకూ ఎండలకు దూరంగా ఉండటం, ముఖ్యమైన పనులను ఉదయం, సాయంత్రాల్లో చేసుకోవడం ఉత్తమం. తరచూ ఎండలో ఉండేవారు తగినంత విశ్రాంతి, ఫ్యాన్ లేదా ఏసీలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ దూరం వాహనాలపై ప్రయాణాలు చేసేవారు కళ్లద్దాలు, హెల్మెట్, టోపీలు తప్పనిసరిగా వినియోగించాలి. చిన్నారులైతే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సైక్లింగ్.. జర భద్రం.. ఈ మధ్య కాలంలో ఈజీ మొబిలిటీలో భాగంగా నగరంలో సైక్లిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేకాకుండా స్కూల్స్, గ్రౌండ్స్‌కు వెళ్లే వారు సైతం సైక్లిల్ వినియోగిస్తున్నారు. సమ్మర్లో సైక్లిస్టులు జాగ్రత్తగా ఉండాలి. మధ్య మధ్యలో విశ్రాంతి, పానియాలు తీసుకోవడం శ్రేయస్కరం. మధ్యాహ్న సమయాల్లో సైక్లింగ్ అంత మంచిది కాదని నగరానికి చెందిన సైక్లింగ్ రైడర్ రవి తెలిపారు. సన్ర్స్కీన్తో మేలు.. మండే ఎండలకు కళ్లద్దాలు, తలకు టోపీ, హ్యండ్‌బ్యాగ్‌లో కర్చీప్ లేదా న్యాప్కిన్స్ తప్పనిసరి. ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్స్, కూలింగ్ లోషన్స్ వాడటం కాస్త ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమ్మర్ ముగిసేంత వరకూ ఫ్యాషన్ వేర్లో ప్రత్యేక శైలిని ఎంపిక చేసుకోవాలి. సమ్మర్ కేర్ కోసం మార్కెట్లో అందుబాటులోకి వచి్చన గార్మెట్స్ ఎంచుకోవాలి. చెమటను గ్రహించే దుస్తులు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. వేడికి దూరంగా ఈవీ.. ఈ మధ్య కాలంలో నగరంలో ఎలక్ట్రిక్ వాహనల సంఖ్య భారీగా పెరిగింది. ఈ వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండలాని నిపుణులు చెబుతున్నారు. ఈవీ వాహనాలను ఎండలో పార్క్ చేయకుండా నీడలో ఉంచాలి. ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు బ్యాటరీ, ఇంజిన్ వేడి కాకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. లేదంటే అధిక వేడికి బ్యాటరీలు పేలిపోయే ప్రమాదముంది. టైర్లు అరిగిపోయిన వాహనాలు మరింత జాగ్రత్తగా నడపాలి. టైర్లు వ్యాకోచించడం, రోడ్డు పై డాంబర్ కరగడం వంటి కారణాలతో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. నో బ్లాక్..ఫ్యాషన్ పేరుతో ఎండాకాలంలో నల్లటి దుస్తులు ధరించడానికి స్వస్తి చెప్పాలి. నల్లటి దుస్తులు, వస్తువులు, వాహనాలు అధిక వేడిని గ్రహించి ఆరోగ్యానికి హాని చేస్తాయి. దీనికి పరిష్కారంగా తెల్లటి దుస్తులు లేదా లైట్ కలర్స్ వేసుకుంటే మేలు. ముఖ్యంగా కాటన్ దుస్తులు, మెత్తని స్వభావం కలవి ఉత్తమ ఎంపిక.కాసింత స్మార్ట్‌గా.. నగర జీవనంలో గ్యాడ్జెట్లు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో వాతావరణ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలియజేసే స్మార్ట్ వాచ్‌లు, ఇతర గ్యాడ్జెట్లు వాడటం మంచిది. శరీర ఉష్ణోగ్రత, గుండెపనితీరు, బ్లడ్ ప్రెజర్, న్యూట్రిషన్ తదితర అంశాలను తెలియజేసే గ్యాడ్జెట్లు, యాప్‌లు వినియోగించడం మేలని ఈ తరం మెడికల్ నిపుణులు సూచిస్తున్నారు.ఇంటి భోజనమే మేలు.. వేసవిలో కాసింతైనా ఆహార నియమాలను పాటించాలి. జంక్‌ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, అధిక మసాలాలతో తయారు చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నీటిని తాగడంతో పాటు వాటర్మెలన్, షర్బత్ విభిన్న రకాల పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో పాటు అవసరమైన ప్రోటీన్లను, మినరల్స్‌ను అందిస్తాయి. సాధ్యమైనంత వరకూ ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హజర్ తెలిపారు. ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటే కూలర్లు, ఏసీలను ఉపయోగించాలి. ఇంటీరియర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. -
అప్పుడే ముదిరిన ఎండలు..బయటకు వచ్చేందుకు భయపడుతున్న జనం (ఫొటోలు)
-
ఎవరికి వారే.. వేసవి వ్యూహాలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవేసవి వ్యూహం..వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్‌లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.ఏకమవుతున్న దళాలు.. బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్.. ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్లు సేఫ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జవాన్ల జోరు తగ్గిందా? ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్‌కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. కవ్వింపు చర్యలు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనందుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోమ్గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గోమ్గూడ క్యాంపు పరిధిలోని జాలేర్గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా? -
సమ్మర్లో స్లిమ్‌గా మారడం ఈజీ..! ఎలాగంటే..
వ్యాయామంతో బరువు తగ్గించుకునేందుకు ఇదే అనువైన సమయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వేసవిలో స్లిమ్‌గా మారొచ్చంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే వేసవి ప్రారంభమైంది. జిమ్ చేయడానికి సిద్ధమవుదాం. నడక ఎంతో ప్రయోజనం ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక రకాల పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. దీన్ని నడకతో అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరమే. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి. శీతల ప్రాణాయామం శీతల ప్రాణాయామం చేస్తే కొంత వరకూ ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందడంతోపాటు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కుద్వారా వదిలే ప్రక్రియే శీతల ప్రాణా యామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం మేలు పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. శీతల పానీయాలు, షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఇవి పాటిస్తే.. బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం ఎంతటి భోజన ప్రియులైన వేసవిలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని వివిధ రూపాల్గో తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. ఎండలో వాకింగ్ చేయడం మంచిది కాదు. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ ఫిజీషియన్ఆహార నియమాలు పాటించాలి వేసవిలో ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, నూనె ఎక్కువుగా ఉన్న వంటకాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి. నీరుశాతం ఎక్కువగా ఉంటే పుచ్చ, కర్బూజ, వంటి పళ్లు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే స్లిమ్‌గా మారొచ్చు. – గర్రే హరిత, ఆహార నిపుణులు -
సమ్మర్ కష్టాలకు స్మార్ట్‌గా చెక్పెట్టేద్దాం ఇలా..!
‘అయ్యో వచ్చే వేసవి.. తెచ్చే తిప్పలు’ అనే మాటలకు ఇకపై స్మార్ట్‌గా చెక్ పెట్టొచ్చు. మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి చల్లదనం కోసం, ప్రజలు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. ఆ చిట్కాల్లో ఈ గాడ్జెట్లనూ చేర్చి, సమ్మర్‌కు స్మార్ట్‌గా, కూల్‌గా మార్చేయచ్చు. ఇందుకోసం ఉపయోగపడే కొన్ని లేటెస్ట్ గాడ్జెట్ల వివరాలు మీకోసం...సన్‌స్క్రీన్ టెస్టర్ వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా. వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. క్యాప్ విత్ ఫ్యాన్వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్లు పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్ , పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. (చదవండి: 'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడు అడుగుపెట్టారో..) -
ఏసీలు కూడా పేలే అవకాశం : ఎలా గుర్తించాలి? ముఖ్యమైన జాగ్రత్తలు
ఎండలు ముదురుతున్నాయి. సూర్యుడి భగభగలను తట్టుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ఏసీలను వాడుతున్న పరిస్థితి. అయితే ఏసీల పని తీరుపై ప్రాథమిక అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలమంతా వాడకుండా పక్కన పెట్టి ఉంచుతాం కాబట్టి ఇపుడు వాడేటపుడు మెయింటెనైన్స్పై దృష్టి పెట్టాలి. ఏసీలోని భాగాలను శుభ్రం చేసుకోవాలి. అసలు ఎండాకాలంలో ఏసీల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలో తెలుసు కుందాం ఈ కథనంలో...కొన్ని చోట్ల ఏసీ పేలడం కారణంగా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.మెయింటెనెన్స్వేసవికాలంలో ఏసీలను వాడే ముందు శుభ్రంచేయడం, ప్రొఫెషనల్ టెక్నీషియల్ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. ఏసీ సరిగ్గా పనిచేస్తుందో? లేదో నిపుణులై టెక్నీషియన్ ద్వారా తనిఖీ చేయించాలి. లేదా సంబంధిత బ్రాండ్ సర్వీస్ సెంటర్ వారిని సంప్రదించాలి. దీని వల్ల ఏసీలో ఉన్న లోపాలను ముందుగనాఏ గుర్తించవచ్చు. అన్ని ఎలక్ట్రికల్ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవచ్చు. ఫిల్టర్లను శుభ్రపరచడం, రిఫ్రిజిరేంట్ లీక్ లాంటి ప్రధానం చెక్ చేసుకోవాలి.వైరింగ్ తనిఖీఏసీకి అనుబంధంగా ఉన్న వైరింగ్‌ను తనిఖీ చేయాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే బాగు చేయించుకోవాలి, లేదా వెంటనే మార్చుకోవాలి. వైరింగ్ సరిగ్గా లేకపోతే షాక్ వచ్చే అవకాశాలుంటాయి. రిమోట్లో కూల్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్ లేదా ఎనర్జీ-సేవింగ్ మోడ్ వంటి మోడ్లు పనిచేయక పోవడం, AC లోని సెన్సార్ పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. మోడ్లు ఏవీ సరిగ్గా పనిచేయకపోతే, వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.వెంటిలేషన్ ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో, మంచి వెంటిలేషన్ ఉంచితే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాలి సరిగ్గా రాదు. గాలి ప్రవాహం సరిగ్గా ఉటే ఏసీ యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి పడదు. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ వేడెక్కి అగ్ని ప్రమాద అవకాశాలను పెంచుతుంది.ఒక వేళ ఏసీ ఎలక్ట్రికల్ భాగాలు పాడైతే, వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన, కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి. అలాగే పవర్ సాకెట్లు, ప్లగ్గులు, షెడ్యూల్ బ్రేకర్లు నాణ్యతను ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఏసీ టెంపరేచర్ని రూమ్ టెంపరేచర్ కంటే తక్కువగా సెట్ చేసుకోవడం కూడా ముఖ్యంఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసన వస్తున్నా, లీకేజీ ఉన్నా కూడా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు గమనిస్తే పొరపాటున కూడా నీటిని చల్లకూడదు. నిపుణులు వచ్చి తనిఖీ చేసేదాకా ఏసీని ఆఫ్ చేయడం ఉత్తమం.ఏసీ నిరంతరం వాడుతున్నవారు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీ ని ఆఫ్ చేసి ఉంచాలి. దీని చాలాప్రమాదాలను నివారించవచ్చు. అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలు ఇంట్లో ఉంటే మంచిది. ఎలాంటి ప్రాణాపాయాలు కలగకుండా ఉంటాయి.ఎలాంటి ఏసీలను తీసుకోవాలి? నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలను వినియోగించే, నాణ్యమైన బ్రాండుకు సంబంధించిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి. నోట్ : ఏసీలు వాడుతున్నవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మెంటెయిన్ చేయాలి. దీని వల్ల చల్లదనాన్ని ఆస్వాదించడంలోపాటు, కరెంట్ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇదీ చదవండి : సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది! -
ముంచుకొస్తున్న ఎండలు.. ముందు జాగ్రత్తలివే..
ఈ ఏడాది దేశంలో మార్చి నుంచే ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ వస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో వేసవి కాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతుండాలి.రోజులో ఒకటి రెండుసార్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ని ఉపయోగించాలి. అలాగే నిమ్మరసం, మజ్జిగ /లస్సీ, పండ్ల రసాలతో పాటు ఇంట్లో తయారుచేసిన ఇతర పానీయాలలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.బయటకు వెళ్లేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్పప్పుడు కూడా వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. అలాగే తప్పనిసరై బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ నేరుగా శరీరానికి ఎండ తాకకుండా చూసుకోవాలి.ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలి.వేసవిలో ఉదయం వేళ కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి. సాయంత్రం సమయంలో చల్లని గాలి లోపలికి వచ్చేవిధంగా కిటికీలను తెరిచివుంచాలి.శిశువులు, పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసేవారు, మానసిక అనారోగ్యం కలిగినవారు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్నవారు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వేడి వాతావరణంలోనికి వెళ్లినప్పడు వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటివారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజ్లులో మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడాన్ని తగ్గించాలి. ముందుగానే వంటపనులు పూర్తిచేసుకోవాలి. అలాగే వంట చేసే ప్రదేశంలో గాలి ఆడేందుకు తలుపులు, కిటికీలు తెరిచివుంచాలి.పార్క్ చేసిన వాహనాలలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివెళ్లకూడదు. ఎందుకంటే వాహనం లోపల ఏర్పడే ఉష్ణోగ్రత వారి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుందనే సంగతిని గమనించాలి.ఎండల కారణంగా వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు -
ఠారెత్తిస్తున్న ఎండలు
వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పది దాటిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మిట్టమధ్యాహ్నం అనూహ్యంగా ఎండలు దంచి కొడుతుండటంతో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇళ్లలో ఉన్న జనాలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇక మూలన పడి ఉన్న కూలర్లకు, ఫ్యాన్లకు పని చెబుతున్నారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు చల్లటి మట్టికుండల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.మిరుదొడ్డి(దుబ్బాక): రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు, వాగులు వంకల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోరుబావులు సైతం వట్టి పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే భూ గర్భ జలాలు అడుగుంటిపోతుండటంతో ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలతో అనారోగ్య సమస్యలు ఎండలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగడం, పనులు చేయడం వల్ల చర్మం పొడిబారిపోయి పూర్తిగా డీ హైడ్రేషన్‌కు గురై కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. సకాలంలో వైద్యం చేయించకపోతే సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందనీ, తద్వారా చనిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తేలికపాటి దుస్తులు ధరించాలి ఎండాకాలంలో ఎక్కువ ముదురు రంగులు కాకుండా, తేలికపాటి లైట్ కలర్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. నలుపు రంగు దుస్తులు ఎక్కువ ఎండవేడిని గ్రహించి అసౌకర్యానికి గురి చేసే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తప్పని సరి వేసవిలో ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు ఎక్కువగా ఎండలో తిరగకుండా, ఆడకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలి. చిన్నపాటి ఎండలకు చిన్నారులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక వృద్ధులు ఇంట్లో నుంచి బయట రాకుండా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాళ్లు, కరీ్చఫ్లు, టోపీలు, గొడుగులు ధరించాలి. ద్రవపదార్థాలు తీసుకోవాలి ఎండాకాలంలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలనే ఎక్కువ తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. ఎండలో తిరిగివచ్చిన వారు షర్భత్, మజ్జిగ, కొబ్బరి నీళ్లను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. మార్కెట్లో విరివిగా లభించే, పుచ్చ, తర్బూజ, నిమ్మ, ద్రాక్ష ఫలాలతోపాటు, చల్లటి పండ్ల రసాలను తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించక పోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.బోరుబావిలో నీటి మట్టం తగ్గింది ఆరుతడి కింద సాగు చేస్తున్న పంటలకు నీరు అందించే బోరు బావిలో నీటి మట్టం తగ్గుతోంది. ఇదివరకు వచ్చిన నీటి ధారలు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. – ఎల్లయ్య, రైతు, అందెపనులు ఉదయం వేళే చేస్తున్నం మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతుండటంతో కూలీ పనులు చేసుకోలేక పోతున్నాం. ఉదయం పది అయ్యిందంటే చాలు మంట పుట్టిస్తున్నాయి. పొద్దున్నే ఉపాధి పనులకు పోయి 10 గంటల వరకు పనులు ముగించుకుంటున్నాం. – లక్ష్మి, ఉపాధి కూలీ, లక్ష్మీనగర్జాగ్రత్తలు పాటించాలి ఎండల పట్ల జాగ్రత్తలు పాటించాలి. రైతులు, వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే పనులు చేసుకోవాలి. ఎండలో ఎక్కువగా పని చేయడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ సమీనా సుల్తానా, పీహెచ్సీ, మిరుదొడ్డిచెట్లు మోడుబారె.. అడవి ఎడారె!|దట్టమైన మల్లన్నసాగర్ అడవి ఎడారిని తలపిస్తోంది. అడవిలో ఉన్న పెద్దపెద్ద చెట్లన్నీ ఆకురాల్చడంతో ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు.. మరోవైపు చెట్లు ఆకురాల్చడంతో అడవిలో కొలువైన రేకులకుంట మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు నీడ లేక ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టమైన మల్లన్నగుట్టల అడవి బోసిపోయి కనిపిస్తున్న దృశ్యాలను సాక్షి క్లిక్ మనిపించింది. – దుబ్బాక -
మార్చి నుంచే సూరీడు... సుర్రు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి నుంచే ఎండలు మండుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... వేసవి కాలం ఫిబ్రవరి నెలలోనే వచ్చేసిందా అనేలా కొన్ని చోట్ల పరిస్థితులు కనిపించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో 38.6 సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో సూర్యుడు మార్చి నెల నుంచే సుర్రుమనిపిస్తున్నాడని, ఏప్రిల్, మే నెలల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఆయన మీడియాకు ఓప్రకటన విడుదల చేశారు. » మార్చి నుంచి మే వరకు చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాలులు వీయవచ్చు.» మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావంఎక్కువగా ఉంటుంది.» విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు చేస్తుంది. » జిల్లా యంత్రాంగాలకు రెండు రోజుల ముందుగానే వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనుంది.» ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలి.» ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెట్ల కింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
అక్కడ ఉత్పత్తి ఆపొద్దు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఏర్పడుతున్న విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (ఇంపోర్టెడ్ కోల్) మీద ఆధారపడి నడుస్తున్న థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆపొద్దని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా దిగుమతి చేసుకున్న బొగ్గు టన్ను ధర రూ.15,535 వరకు పలుకుతోంది. విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి యూనిట్‌కు దాదాపు రూ.10 ఖర్చు అవుతుంది. విద్యుత్ ఉత్పత్తిదారులు ఈ వ్యయాన్ని వినియోగదారుల నుంచి రాబట్టుకునేందుకు కూడా కేంద్రం అనుమతించింది. దేశంలో 17.. మన రాష్ట్రంలో ఒకటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా సొంత బొగ్గు గనులున్న థర్మల్ కేంద్రాలు 18 మాత్రమే. దేశీయ బొగ్గుపై ఆధారపడి నడిచేవి 155 ఉన్నాయి. ఈ మొత్తం 173 ప్లాంట్లు ఉత్పత్తి సామర్థ్యం 2,03,347 మెగావాట్లు. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే ప్లాంట్లు 17 ఉండగా, వాటి పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 17,225 మెగావాట్లు. వీటిలో మన రాష్ట్రంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (ఎస్డీఎస్టీపీఎస్–కృష్ణపట్నం) ఒకటి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవిలో రోజుకు 270 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. మన రాష్టంలో 260 మిలియన్ యూనిట్లకు డిమాండ్ చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 237 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లు 110 మిలియన్ యూనిట్లు సమకూరుస్తున్నాయి. అందులో 40శాతం కృష్ణపట్నంలోని ఎస్డీఎస్టీపీఎస్లో ఉన్న 2,400 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్ల నుంచి వస్తోంది. మూడు రోజులకే బొగ్గు నిల్వలు ప్రస్తుతం కృష్ణపట్నం ఎస్డీఎస్టీపీఎస్లో 79,450 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ ఒక రోజు విద్యుత్ ఉత్పత్తికి 29 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుత నిల్వలు దాదాపు మూడు రోజులు మాత్రమే వస్తాయి. విద్యుత్ చట్టం సెక్షన్–11 ప్రకారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు (ఇంపోర్టెడ్ కోల్)తో నడిచే విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తిని కేంద్రం తప్పనిసరి చేసింది. నిబంధనల ప్రకారం ఒక ప్లాంటులో 24 రోజులకు సరిపడా బొగ్గు ఉండాలి. ఎస్డీఎస్టీపీఎస్లో మాత్రం మూడు రోజులకు మించి బొగ్గు నిల్వలు ఉండటం లేదు. -
ఈసారి ఎండలు.. మంటలే
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాది రాష్ట్రాలు ఈసారి ఎండలతో మండిపోతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.ఎస్.పై తెలిపారు. మార్చి నుంచి మే నెల వరకు సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెబెక్స్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. మే నెలలో వడగాలుల తీవ్రత చిత్తూరు, నెల్లూరు జిల్లాలు మినహా అన్నిచోట్లా భారీగా ఉంటుందని తెలిపారు. మే నెలలో వడగాలులు వీచే రోజుల సంఖ్య కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. నైరుతి రుతుపవనాల రాక సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే సూచనలున్నాయని, అందువల్ల రుతుపవనాలు బలహీనపడతాయని చెప్పారు. దీనివల్ల ఈ వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులుంటాయని, రుతుపవనాల ప్రభావం కొంత తగ్గేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం, రవాణా తదితర రంగాలపై ఎండల తీవ్రత ప్రభావం చూపిస్తుందని డాక్టర్ డి.ఎస్.పై పేర్కొన్నారు. -
బాసట్.. చెరకు రసానికి బాసట!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వేసవి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో, శివారు ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన అనేకచోట్ల చెరకు రసం (కేన్ జ్యూస్) బండ్లు కనిపిస్తుంటాయి. చెరకు రసాన్ని ఇష్టంగా తాగేవారు చాలామందే ఉంటారు. చెరకు నుంచి చక్కెర, బెల్లం తయారు చేస్తారనేది అందరికీ తెలిసిందే. అయితే రసం కోసం ఓ ప్రత్యేకమైన చెరకు పంట ఉంది. అదే ‘బాసట్’. చెరకును సాగు చేసే సంగారెడ్డి జిల్లా రైతులు.. స్థానికంగా ‘బాసట్’ పేరుతో 62175 చెరకు రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ చెరకు తెల్ల రంగులో ఉండటంతో పాటు, ఇందులోంచి రసం (జ్యాస్) ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ చెరకుకు పూత ఉండదు. దీంతో జ్యూస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. సాధారణంగా చక్కెర కర్మాగారాలకు తరలించే చెరుకులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కానీ ఈ రకంలో జ్యూస్ ఎక్కువగా వస్తుంది.సుమారు రెండు వేల ఎకరాల్లో..ఈ ప్రత్యేక వెరైటీ చెరకును సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ డివిజన్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఈ ప్రత్యేక రకం సాగ వుతోంది. జహీరాబాద్ మండలంతో పాటు, ఝరా సంఘం, మొగుడంపల్లి, కొహీర్ మండలాల పరిధి లో ఈ బాసట్ రకం ఎక్కువగా సాగవుతోంది. ఏటా ఫిబ్రవరి నుంచే వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతుల వద్ద చెరకును కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు.ఎండలు ముదిరితే డిమాండ్ఎండల తీవ్రత ఎక్కువైతే ఈ చెరకుకు డిమాండ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఎక్కువమంది చెరుకు రసం తాగుతుంటారు. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో టన్ను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలుకుతుంది. ఒకవేళ మే లోనే వర్షాలు ప్రారంభమైతే ధరను తగ్గిస్తుంటారు. సాధారణంగా టన్ను రూ.3 వేల వరకు ఉంటుంది.రెండేళ్లుగా సాగు చేస్తున్నా..గత రెండు సంవత్సరాలుగా ఈ బాసట్ చెరకు పండిస్తున్నా. పది నెలల్లో పంట చేతికందుతుంది. ఇటీవలే పంట నరికి రెండురోజుల క్రితం హైదరాబాద్‌కు సరఫరా చేశా. టన్నుకు రూ.3 వేల చొప్పున రేటు వచ్చింది. ఎండాకాలం వస్తే చెరకు రసానికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో బాసట్ చెరకును ఎక్కువగా తీసుకెళుతుంటారు. ఫ్యాక్టరీ చెరకు సాగు కంటే ఇది కొంత మేలే. – తెనుగు శేఖర్, చెరకు రైతు, ఈదుల్పల్లి, సంగారెడ్డి జిల్లారసం వస్తుందనే వ్యాపారులు కొంటారు..రెండు ఎకరాల్లో బాసట్ రకం వేశా. హైదరాబాద్ నుంచి వ్యాపారులు వచ్చి ఈ చెరకును కొనుగోలు చేస్తుంటారు. ఎండాకాలం వస్తే డిమాండ్ పెరుగుతుంది. రసం బాగా వస్తుందనే ఈ రకాన్ని ఎక్కువగా తీసుకెళుతుంటారు. – మొగులప్ప, చెరకు రైతు,రాయికోడ్, సంగారెడ్డి జిల్లా -
వేసవి వచ్చేస్తోంది.. ఇంటి సీలింగ్ ఎలా ఉండాలంటే..
వేసవి కాలం వచ్చేస్తోంది.. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాద వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.– సాక్షి, సిటీబ్యూరో» ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. » గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. » మిగతా గదులతో పోల్చుకుంటే పడక గది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. » తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. » గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. జాగ్రత్తలివే.. » ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. » ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. » ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. » ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. » దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
వేసవిలో వేధించేది ఇదే : జాగ్రత్తలు పాటించండి, లేదంటే:
వేసవి కాలంలో వచ్చే సమస్యలో ప్రధానమైంది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు (UTIs). ఈ సమస్య ఉన్నవారికి తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో కొందరికి నొప్పి, మంట కూడా ఉంటాయి. అయితే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు సహజమే అనే నిర్లక్ష్యం పనికిరాదు. అప్రమత్తంగా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మూత్రాశ్రయ ఇన్ఫెక్షన్లను ఎలా గుర్తించాలి? వేసవిలోఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?అసలేఈ ఏడాది సూర్యుడి భగభగలు మరింత మండించనున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిలి. అధిక ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్ ప్రమాదాన్ని, వడదెబ్బ లాంటివి యూటీఐ ప్రమాదాన్ని పెంచుతాయి. వేసవిలో తగ్గినన్ని నీళ్లు తాగడంపోవడం, డీహైడ్రేషన్ మూత్ర సమస్యలను పెంచుతుంది. యూటీఐని సాధారణంగా మూత్ర విసర్జనలో మంట లేదా నొప్పి, తరచుగా మూత్ర విసర్జన , మూత్ర విసర్జన అత్యవసరం, మూత్రంలో రక్తం (హెమటూరియా) ద్వారా గుర్తించవచ్చు. ఇదీ చదవండి: ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్? ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే?!మూత్రం విసర్జనలో నొప్పి సహజమే అనుకోవడం అపోహ. ఒక్కోసారి అనేక ఇతర వ్యాధుల ముప్పు ఈ ఇన్ఫెక్షన్ల లక్షణాలతో మొదలవుతుంది. అందుకే దీన్ని నిర్ధారించు కోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. యూరిన్ కల్చర్ అవసరం యూరినాలిసిస్ లేదా డిప్‌స్టిక్ పరీక్ష సరిపోదు. క్రాన్బెర్రీ జ్యూస్ తో చికిత్స చేయవచ్చు అనేది మరో అపోహ అంటున్నారు వైద్యులు. ఒక రోగికి సంవత్సరంలో మూడు కంటే ఎక్కువ UTIలు నిర్ధారణ అయితే, యూరాలజిస్ట్‌ని సంప్రదించి కారణాలను విశ్లేషించుకోవాలి.వేసవిలో మూత్రాశయ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, బాక్టీరియా సోకడం వల్ల సాధారణంగా మూత్రాశయ సమస్యలొస్తాయి.ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల ద్రవం తాగాలి. తద్వారా శరీరానని బాగా హైడ్రేట్ గా ఉంచుకోవాలి. తరచుగా మూత్ర విసర్జన చేయాలి. కనీసం ప్రతి మూడు గంటలకు ఒకసారి యూరిన్ పాస్ చేస్తున్నామా లేదా అని పరిశీలించుకోవాలి. మల విసర్జన తరువాత శుభ్రం చేసుకొనే విధానం.. ముందు నుంచి వెనుకకు ఉండాలి. అంతేకానీ, వెనుక నుంచి ముందుకు ఉండకూడదు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయాలి. విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లుతీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా పుచ్చ, పైనాపిల్, తర్బూజ కీవీ,నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవారికి క్రాన్ బెర్రీ పండ్ల రసం కొంతమేరకు ఉపయోగపడుతుంది. క్రాన్బెర్రీ సప్లిమెంట్లు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించగలవు కానీ, పూర్తిగా కాదు అంటున్నారు. బాడీ వాష్, బబుల్ బాత్ , కొన్ని రకాల సబ్బులు UTI కి కారణమవుతాయి. సున్నితమైన సబ్బులు వాడాలి.వేసవి కాలంలో మెన్స్ట్రువల్ కప్పులు, టాంపాన్లు, ప్యాడ్లను క్రమం తప్పకుండా మార్చుకోవాలి. టైట్ దుస్తులు వేసుకోకూడదు.ప్రమాద సంకేతాలు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రం రంగుమారడంతో పాటు, దుర్వాసన,, పొత్తి కడుపు తీవ్రమైన నొప్ప, లేదా వెన్నునొప్పి, తిమ్మిరి లేదా అసౌకర్యంగా అనిపిస్తే అప్రమత్తం కావాలి.అలాగే చలి జ్వరం, వికారం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి లాంటి లక్షణాలుకనిపిస్తే వెంటనే సంప్రదించి సరియైన చికిత్స తీసుకోవాలి. -
పాతాళానికి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఎండాకాలం ఇంకా మొదలవక ముందే బోర్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. యాసంగిలో బోరుబావుల కింద సాగుచేస్తున్న పంటలకు నీటి కోసం కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబర్లో 6.7 మీటర్ల లోతుగా ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం జనవరిలో 7.46 మీటర్ల లోతుకు తగ్గిపోయింది. అంటే నెల రోజుల్లోనే సుమారు 0.74 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోవడం ఆందోళన రేపుతోంది. వ్యవసాయం, ఇతర అవసరాలకుతోడు తాగునీటి కోసం వేసవిలో వినియోగం మరింత పెరగనుండటంతో.. రానున్న రోజుల్లో భూగర్భ జలమట్టాలు మరింతగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలోనే ఈ అంశాలు వెల్లడయ్యాయి. భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది. 8 జిల్లాల్లో 10 మీటర్ల కంటే లోతున... రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 12.29 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా భూగర్భ జలశాఖ వర్గీకరించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 6 జిల్లాల్లో మాత్రమే 5 మీటర్లలోపు భూగర్భ జలమట్టం ఉన్నట్టు గుర్తించారు. భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నది కేవలం ఈ జిల్లాల్లో మాత్రమే. మరో 9 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్య, మిగతా 8 జిల్లాల్లో 10 మీటర్లకుపైగా లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇలా 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 18 జిల్లాల్లో భారీ క్షీణత గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో భారీ క్షీణత నమోదైంది. గత ఏడాది జనవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 7.72 మీటర్లుకాగా.. ఈ ఏడాది 7.46 మీటర్లకు తగ్గింది. రాష్ట్ర సగటు కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా... కొన్ని జిల్లాల్లో బాగా పడిపోయాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 7.29 మీటర్ల నుంచి 10 మీటర్లలోతుకు అంటే.. 2.71 మీటర్ల మేర పడిపోవడం గమనార్హం. ఈ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో.. రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మధ్య, కొన్నిచోట్ల 20 మీటర్లకన్నా లోతుకు వెళ్లిపోయినట్టు తేల్చారు. రాష్ట్ర భూభాగం ఈ ప్రాంతాల వాటా 4 శాతమని అధికారులు చెబుతున్నారు. మరో 18 శాతం భూభాగంలో 10–15 మీటర్ల లోతున.. ఇంకో 54 శాతం ప్రాంతాల్లో 5–10 మీటర్లు లోతున, 25శాతం ప్రాంతాల్లో పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువ లోతున భూగర్భ జలమట్టాలు ఉన్నట్టు గుర్తించారు. 156 మండలాల్లో దశాబ్ద సగటుకన్నా తగ్గి.. గత దశాబ్ద కాల (2015–2024) సగటుతో పోల్చినప్పుడు.. రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలకుగాను 456 మండలాల్లో భూగర్భ జల మట్టాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. మిగతా 156 మండలాల్లో క్షీణించాయి. 53 మండలాల్లో 0.5 మీటర్ల మేర, 33 మండలాల్లో 1–2 మీటర్ల మేర, 37 మండలాల్లో 2 మీటర్లకుపైగా పడిపోయాయి. -
ఎండ ముదిరి.. చేను ఎండి
సాక్షి,యాదాద్రి: వేసవి రాకముందే ఎండలు ముదిరిపోయా యి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాన్‌ఆయకట్టు ప్రాంతంలో ఎక్కువ శాతం బోర్లు, బావుల కింద వరి సాగు చేశారు. దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. సరిగ్గా నీరందక వరి చేలు ఎండుముఖం పడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పైరు ఎండిపోతుండగా రైతులు పశువులను మేపుతున్నారు. ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట ఎండిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే...వేలాది ఎకరాలకు పంటనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. జనవరి నాటికి జిల్లాలో భూగర్భ జలాలు రెండున్నర మీటర్ల లోతుకు పడిపోయాయి. యాసంగి ఆశలపై దెబ్బ వానాకాలం సీజన్లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లాయి. జలకళ సంతరించుకోగా, రైతులు యాసంగి వరిసాగుపై ఆశలు పెంచుకున్నారు. ఫిబ్రవరి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, వలిగొండ మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో నీటిగండం వచ్చిపడింది. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు బోరు బావుల్లో పూడికతీత పనులు చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు ఎకరాల వరి బీటలు వారింది నాకున్న ఐదెకరాల్లో వరిసాగు చేశాను. బావి నీటిమట్టం తగ్గడంతో రెండు ఎకరాల వరిపొలం బీటలు వారింది. ఉన్న మూడు ఎకరాలకు రెండు రోజులకో తడి ఇస్తున్నాను. దానిపై కూడా ఆశ లేదు. – వడకాల రాజు, వరి రైతు, మోత్కూర్.నీరు లేక పంట ఎండిపోయింది 3 ఎకరాల్లో వరి వేశా. నాట్ల సమయంలో బావి లో నీరు బాగానే ఉంది. వరి పొట్టకు వచ్చే దశలో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. వారం క్రితం రెండు బోర్లు వేశాను. రెండూ ఫెయిల్ అయ్యాయి. నీరులేక పంట ఎండిపోయింది –చౌడబోయిన కనకయ్య, శ్రీనివాసపురం గ్రామం -
ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త
నిన్నామొన్నటి వరకు గజ గజ వణింకించిన చలించింది. ఇపుడిక ఎండలు దంచికొడుతున్నాయి. జనవరి మాసం అలా వెళ్లిందో లేదో ఫిబ్రవరి మాసం ఆరంభంనుంచి క్రమంగా వాతావరణ వేడెక్కడం మందలైంది. ఇపుడిక ఎండలు మండిస్తున్నాయి. ఎండ ప్రభావం, ఉక్కపోత మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా శివరాత్రితో శివ..శివా అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కానీ శివరాత్రి కంటే ముందే ఎండల ప్రభావం కనిపిస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవిలో ఎండల బాధలు, తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదు. ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. ముదురుతున్న ఎండలు- జాగ్రత్తలుఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి.అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్ఫ్‌లు ధరించాలి.మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. కొబ్బరి నీళ్లు, నీళ్ల కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగ్గిపోతాయి. ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు. -
ముంబైలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, ముంబై: ముంబై నగరంలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జనవరిలో కొన్ని రోజులపాటు వర్షపాతం నమోదైనప్పటికీ, ఇప్పుడు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీని వల్ల ముంబై వాసులు విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నారు. జనవరిలో ముంబైలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 34 డిగ్రీల సెల్సియస్‌ను దాటి వెళ్లింది. ముంబై శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం శాంటా క్రూజ్ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీలుగా నమోదైంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పగటి వేళ వేడి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల కారణంగా ముంబై ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేడి తీవ్రత పెరగడంతో బయటికి వెళ్లే ప్రజలు సౌకర్యవంతంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని తేమగా ఉంచుకునేందుకు పుష్కలమైన నీరు తాగాలని, పొడి వాతావరణం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎండ వేడికి అధికంగా గురికాకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవడం, గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం, ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. -
వేసవి కాలం కంపెనీలకు లాభం!
వేసవి కాలం సమీపిస్తుండటంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించి అమ్మకాలను పెంచుకునేందుకు కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు మెగా మార్కెటింగ్‌కు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఐపీఎల్ వంటి ప్రధాన ఈవెంట్లు, వేసవి సెలవులు ప్రారంభంకానుండడంతో అధిక డిమాండ్ నెలకొంటుందని సంస్థలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వివిధ విభాగాలకు చెందిన కంపెనీలు కొత్త బ్రాండ్ల ఆవిష్కరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.ప్రధాన ఈవెంట్లు..వేసవిలో వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి ముఖ్యమైన ఈవెంట్లను సద్వినియోగం చేసుకోవడం కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల కీలక వ్యూహాల్లో ఒకటి. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి, ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు ఐపీఎల్ భారీ వేదిక కానుంది. కోకాకోలా, హావ్మోర్ ఐస్‌క్రీమ్, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్.. వంటి సంస్థలు ప్రమోషన్ క్యాంపెయిన్స్ సిద్ధం చేస్తూ ఐపీఎల్ సీజన్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. చాలా కంపెనీలు తమ బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీములు, రిఫ్రెషింగ్ స్నాక్స్ వంటి ప్రత్యేకమైన ఉత్పత్తులపై దృష్టి పెడుతున్నాయి. ఉదాహరణకు, హావ్మోర్ ఐస్ క్రీమ్ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం ప్యాక్‌లను ప్రవేశపెడుతోంది. వేసవి సీజన్‌ను అదనుగా తీసుకొని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన స్పోర్ట్స్ డ్రింక్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఐపీఎల్ జట్లలో రైట్స్ దక్కించుకుంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్కు రూ.6,000 కోట్లు.. కేబినెట్ ఆమోదంపెరిగిన ప్రకటన వ్యయాలువేసవి నెలల్లో ఎఫ్ఎంసీజీ కంపెనీ ఉత్పత్తుల వినియోగం అధికమవడంతోపాటు అందుకు అనుగుణంగా ప్రకటన వ్యయాలు సైతం గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. తమ ఉత్పత్తులు పెద్దమొత్తంలో ప్రేక్షకులను చేరుకోవడానికి టెలివిజన్, డిజిటల్ ప్రకటనలు రెండింటిలోనూ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ సీజన్లో ఐపీఎల్ కోసం టెలివిజన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి మొత్తం యాడ్ రెవెన్యూ రూ.4,500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇది గతేడాది కంటే 8-10 శాతం అధికం. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారాలు ప్రత్యేకంగా, సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నాయి. ఉదాహరణకు, కోకాకోలా అమ్మకాలను పెంచడానికి డొమినోస్ స్టోర్లలో క్రాస్ ప్రమోషన్ చేస్తోంది. -
తాపం తీర్చే అమృతభాండం
సాక్షి, అమలాపురం: మండు వేసవిలో దాహం తీర్చాలన్నా, వేడెక్కిన శరీరాన్ని చల్లబరచాలన్నా, అనారోగ్యం బారిన పడితే త్వరగా కోలుకోవాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది కొబ్బరి బొండాం. కొనుగోలుచేసేవారికే కాదు.. ఉత్పత్తి చేసే రైతులకు కూడా ఇది అమృత బాండమే. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా ధరలు నిలకడగా ఉండటం, కాయ సేకరణ భారం లేకపోవడంతో కొబ్బరి రైతులు (Coconut Farmers) ఇదే తమకు మేలని భావిస్తుంటారు. వేసవి సమీపిస్తుండటంతో బొండాల ధరలపైన, ఎగుమతులపైన రైతులు భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ఒక కొబ్బరి బొండాం (Coconut) ఒక సెలైన్‌తో సమానం. బొండాంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. శరీరానికి రోజుకు సరిపడా సోడియంను ఇది అందిస్తుంది. దీనిలో పొటాషియం, కాల్షియం, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది తక్షణం శక్తిని ఇస్తుంది. ఇటీవలి కాలంలో బొండాం తాగేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు పెరిగాయి.మన రాష్ట్రంతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి కొబ్బరి బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. కొబ్బరి బొండాలకు ఒకప్పుడు వేసవి (Summer) మాత్రమే సీజన్‌గా ఉండేది. ఇప్పుడు ఏడాది పొడవునా ఎగుమతులు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాలో దెందులూరు, చింతలపూడి, జంగారెడ్డి గూడెం, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో చాగల్లు, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, తుని పరిసర ప్రాంతాల నుంచి బొండాల ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం రోజుకు 50 లారీలకు పైగా ఎగుమతి అవుతుండగా, వేసవి సీజన్లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి బొండాల ఎగుమతి జరుగుతుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్కో కొబ్బరి బొండాం ధర రూ. 12 పలుకుతోంది. కొబ్బరి కాయ ధర రూ. 14 నుంచి రూ. 15 పలుకుతోంది. దీని వల్ల బొండాం అమ్మకాలకన్నా రైతులు కాయపై దృష్టి పెట్టారు. సాధారణంగా కొబ్బరి కాయ కన్నా బొండాం ధర రూ.4 నుంచి రూ. 5 ఎక్కువ ఉంటుంది. చదవండి: పల్లె పిల్లలూ ‘స్మార్టే’! » మార్చి నుంచి కొబ్బరి బొండాలకు వేసవి సీజన్ మొదలవుతుంది. కొబ్బరి కాయకు ఇప్పుడున్న ధర మరికొద్దిరోజులు ఉంటే బొండాం ధర రూ.18 నుంచి రూ.20 వరకు చేరుతుంది. కాని దిగుబడి అధికంగా ఉండటం వల్ల బొండానికి ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. » కాయతో పోల్చుకుంటే బొండాం అమ్మకాలే రైతులకు లాభసాటిగా ఉంటాయి. బొండాం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే కొబ్బరికాయ పక్వానికి రావడానికి సుమారు 12 నెలలు పడుతుంది. కాయతో పోల్చితే బొండాల వల్ల రైతులు త్వరితగతిన ఉత్పత్తి అందుకుంటారు. » కొబ్బరి కాయ రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రెండు రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే బొండాలను వ్యాపారులే సొంత ఖర్చులు పెట్టుకుని దింపించుకుంటారు. దీంతో రైతులకు సేకరణ ఖర్చు తగ్గుతుంది. -
ప్రకృతి పంట.. ఆదాయం ఇంట
గూడూరు: రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో లభించే తునికాకును ప్రకృతి సంపద (పంట)గా భావిస్తారు. ప్రతీ వేసవిలో రెండు నెలల పాటు తునికాకే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరు. ఏటా ఆదివాసీలు ఏప్రిల్‌లో తునికాకు సేకరణ ప్రారంభిస్తారు. అయితే ఎక్కువగా మే నెలలో సేకరించడం పూర్తి చేస్తారు. తద్వారా రెండు నెలల పాటు ఆదాయం సమకూరుతుంది. విరివిగా లభ్యం.. మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజన కుటుంబాలు ఎండాకాలం రాగానే తునికాకు సేకరణలో నిమగ్నమవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మహబూబాబాద్, గూడూరు అటవీశాఖ డివిజన్‌తో పాటు ములుగు, ఏటూరునాగారం, భద్రాద్రి కొత్తగూడెం, గుండాల, బయ్యారం మండలాల్లో ఏప్రిల్, మేలలో తునికాకు సేకరణ జోరందుకుంటుంది. ఒక్కో సంవత్సరం తునికాకు సేకరణ ఎక్కువగా జరిగి ప్రభుత్వ సూచన ప్రకారం ఫారెస్టు అధికారులు ప్రతీ డివిజన్లో టార్గెట్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వేసవిలో తునికాకు సేకరణను ఉపాధి మార్గంగా ఎంచుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏటా కూలీల ద్వారా ఆకు సేకరించి కట్టలను కొనుగోలు చేస్తోంది. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చెల్లించారు. ఈ సంవత్సరం కట్ట ధర పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలి కోడి కూతతో అడవికి పయనం.. తునికాకు సేకరణకు గిరిజనులు తొలికోడి కూతతో మేల్కొని వంటలు చేసుకుంటారు. అంబలి, గంజి తీసుకొని అడవులకు పయనమవుతారు. అడవిలో చెట్టు చెట్టుకు తిరిగి తునికాకు కోసి బస్తాల్లో నింపుకుని ఎత్తుకొస్తారు. కొందరు బస్తాల్లో తీసుకొచ్చిన ఆకులను ఇంటి వద్ద కట్టలు కట్టగా, మరికొందరు అడవిలోనే చెట్ల కింద కూర్చొని 50 ఆకుల చొప్పున కట్ట కడతారు. సాయంత్రం ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన కల్లాల వద్ద వాటిని విక్రయిస్తారు. ప్రతీరోజు ఒక్కో కూలీ రూ.450 నుంచి రూ.500 వరకు సంపాదిస్తారు. గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో.. మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మట్టెవాడ, కొంగరగిద్ద, గోపాలపురం గ్రామాలతో పాటు మరికొన్ని చోట్ల దాదాపు 10 కల్లాలను ఏర్పాటు చేస్తారు. గతేడాది గూడూరు రేంజ్ పరిధిలో 2 వేల స్టాండర్ట్ బ్యాగులు (20 లక్షల) తునికాకు కట్టల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్లైన్లో చెల్లింపులు.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తునికాకు సేకరణపై నిఘా పెడతాం. ఆకుల కట్టలు విక్రయించిన కూలీలకు ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లిస్తాం. ఆకులు సేకరించే వారి నుంచి ఆధార్ కార్డు, ఫొటో, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లను సేకరిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో ఆకు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – బత్తుల విశాల్, డీఎఫ్ఓ, మహబూబాబాద్ రెండు నెలలు ఉపాధి వేసవిలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మాకు తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రెండు నెలల పాటు పని దొరుకుతుంది. ప్రతీరోజు తెల్లవారు జామునే అడవికి వెళ్తాం. బస్తాల నిండా ఆకు సేకరించి, ఎండ ముదరకముందే ఇంటికి చేరుకుంటాం. మధ్యాహ్నం కుటుంబం అంతా కలిసి కూర్చొని 50 ఆకులతో కట్టలు కడుతాం. సాయంత్రం కల్లం వద్దకు తీసుకెళ్లి విక్రయిస్తాం. – మేడ సమ్మయ్య, మట్టెవాడ, గూడూరు తునికాకు ఉపాధి కల్పిపస్తుంది మండుటెండా కాలంలో కూలీ పనులు దొరకవు. దీంతో ప్రతీ సంవత్సరం తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రోజు పొద్దున్నే అడవికి వెళ్లి ఆకు కోసుకొస్తాం. మధ్యాహ్నం కట్టలు కట్టి కల్లంలో అమ్ముతాం. రోజు రూ.450 నుంచి రూ.500 వరకు డబ్బులు వస్తాయి. – ప్రవళిక, మర్రిమిట్ట, గూడూరు వృద్ధులకు సైతం ఆదాయం తునికాకు సేకరణతో విద్యార్థులు, వృద్ధులకు డబ్బులు వస్తాయి. విద్యార్థులు బడులు మొదలయ్యే ముందు కొత్త దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు కొనేందుకు వాడుకుంటారు. వృద్ధులు తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. – రమ్య, మర్రిమిట్ట, గూడూరు -
వాటర్.. బెటర్!
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ‘అడ్వాన్స్ సమ్మర్ స్పెషల్ యాక్షన్ ప్లాన్– 2025’ కు జలమండలి సిద్ధమైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సూక్ష్మస్థాయిలో తాగునీటి సమస్యపై పర్యవేక్షణ కోసం ఫిబ్రవరి 15 నుంచి జూన్ 15 వరకు ‘120 డేస్ మైక్రో వాటర్ మానిటరింగ్ డ్రెవ్’ నిర్వహించాలని నిర్ణయించింది. అంతకు ముందు క్షేత్రస్థాయి పరిస్థితిపై సమగ్ర పరిశీలన కోసం ఈ నెల 5 నుంచి 20 రోజుల పాటు ‘ప్రీ సమ్మర్ వాటర్ సర్వే’కు శ్రీకారం చుట్టనుంది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏ మేరకు ఉంటుంది? ఏయే ప్రాంతాల్లో సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ముందస్తుగానే గుర్తించనుంది. సెక్షన్ మేనేజర్ పరిధిలో పరిస్థితులపై సమగ్రంగా పరిశీలించి వేసవిలో నీటి ఎద్దడిపై అంచనాపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఈ నెల మొదటి వారంలో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించి ప్రీ సమ్మర్ వాటర్ సర్వేపై దశాదిశ నిర్దేశించనుంది. అవసరాలు పెరిగినా.. గత పదేళ్లలో దేశం నలు మూలల నుంచి వలసలు పెరగడంతో హైదరాబాద్ నగరంలో 30 శాతం జనాభా పెరిగింది. మరోవైపు జలమండలి పరిధి విస్తరించింది. నల్లా కనెక్షన్లు అదే స్థాయిలో పెరిగాయి. ప్రధాన జలాశయాల్లో తాగునీటి కేటాయింపు మాత్రం పెరగలేదు. ప్రస్తుతం పదేళ్ల నాటి కేటాయింపుల నీటి సరఫరా జరుగుతోంది. వేసవిలో అవసరమైతే ఎప్పటి మాదిరిగానే అదనంగా పది ఎంజీడీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరాలు పెరిగినా.. కేటాయింపులు పెరగక పోవడంతో ఉన్న నీటిని సర్దుబాటు చేసుకునేందుకు జలమండలి వృథా నీటిపై దృష్టి సారించింది. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైనా.. భూగర్భ జలాలు పలు ప్రాంతాల్లో ఆశాజనకంగా పెరగలేదు. ఈ నేపథ్యంలో నీటికి భారీగా డిమాండ్ ఎదురయ్యే అవకాశం ఉంటుందని జలమండలి అంచనా వేసింది. గత వేసవిలో ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ తప్పలేదు. ఈసారి అలాంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. ట్యాంకర్ల బుకింగ్ సర్దుబాటు వేసవిలో డిమాండ్‌కు తగ్గ ట్యాంకర్లలను సకాలంలో సరఫరా చేసేలా జలమండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక ఫిల్లింగ్ స్టేషన్లో డిమాండ్ అధికంగా ఉండి.. దగ్గరలోని మరో ఫిల్లింగ్ స్టేషన్లో డిమాండ్ తక్కువగా ఉంటే అక్కడికి క్యాన్ నంబర్ ట్రాన్స్ఫర్తో సర్దుబాటు చేసేలా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తోంది. మరోవైపు ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ ట్రిప్ కూడా అక్రమంగా బయటకు వెళ్లకుండా కట్టడి చేసేందుకు బాధ్యులైన ఆపరేటర్‌పై భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ పనితీరుపై పర్యవేక్షణ æకోసం డీజీఎం స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించనుంది. ప్రతి ట్యాంకర్ బుకింగ్ ఎంసీసీ ద్వారానే జరిగే విధంగా చర్యలు చేపట్టనుంది. రాత్రి పూట ప్రత్యేక షిఫ్ట్ రాతి వేళల్లో కమర్షియల్, బల్క్ వినియోగదారుల కోసం ట్యాంకర్లను సరఫరా చేసేలా ప్రత్యేకంగా షిఫ్ట్ నడిపించాలని జలమండలి నిర్ణయించింది. పగటి వేళల్లో గృహావసరాలకు మాత్రమే ట్యాంకర్లు సరఫరా చేసి రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు ఇతరత్రా వాణిజ్య అవసరాలకు సంబంధించి ట్యాంకర్లను సరఫరా చేసేలా చర్యలు చేపట్టనుంది. కాగా.. ఇప్పటికే ఐటీ సంస్కరణలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయి పనితీరు పర్యవేక్షిస్తున్న జలమండలి తాజాగా వేసవిలో తాగు నీటి సరఫరాపై కూడా డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షణకు సిద్ధమైంది. తాగునీటి సరఫరాపై సూక్ష్మ స్థాయి పర్యవేక్షణ వేసవిలో సమర్థంగా తాగునీరు సరఫరా చేసేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు సూక్ష్మ స్థాయి ప్రణాళికకు సిద్ధమయ్యాం. తాగు నీటిసమస్య ఉత్పన్నమయ్యే ప్రాంతాలు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. సూక్ష్మ స్థాయి పర్యవేక్షణతో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – అశోక్ రెడ్టి, జలమండలి ఎండీ -
అమ్మో.. ఇవేం ఎండలు
బనశంకరి: రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా 2024 ఎండాకాలంలో వేడిమి నమోదైంది. ఏప్రిల్, మే మాసాల్లో రాష్ట్రంలో సరాసరి ఉష్ణోగ్రత కంటే 3–4 సెల్సియస్ డిగ్రీలు పెరిగి ప్రజలు అల్లాడిపోయారు. గత ఐదేళ్లలో ఉష్ణోగ్రతలను గమనిస్తే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే మాసాలలో, అలాగే అక్టోబరులో ఎండలు ఎక్కువని తేలింది. కళ్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక ప్రాంతాల్లో కనబడుతున్న అధిక ఎండలతో అక్కడి ప్రజలు హైరానా పడుతున్నారు. బెళగావి, బాగల్‌కోటే, ధారవాడ, హావేరి, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో సరాసరి ఉష్ణోగ్రత 3– 4 డిగ్రీలు సెల్సియస్ పెరిగింది. దీంతో రాబోయే వేసవిని తలచుకుని భయపడాల్సి వస్తోంది.ఈ జిల్లాల్లో హడల్బాగల్కోటే, బెళగావి, బీదర్, ధారవాడ, గదగ, కొప్పళ, హావేరి, హాసన్, కలబుర్గి, ఉత్తర కన్నడ, కొడగు, మంగళూరు, రాయచూరు, విజయపుర జిల్లాల్లో గత అక్టోబరులో 30 డిగ్రీలు సెల్సియస్ కంటే ఎక్కువ తాపమానం ఏర్పడింది. బెంగళూరులో 29 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. వర్షంతో పాటు వేడి కూడా పెరిగింది. అక్టోబరులో ఇంత వేడి రావడం వాతావరణ నిపుణులను కూడా విస్మయపరచింది. ఇక బెంగళూరులో వేసవిలో అనేక ప్రాంతాల్లో చుక్క నీటికి కటకటలాడారు.అక్టోబరులో ఎందుకలా?సెప్టెంబరులో వర్షం పడకపోతే నేలలో తేమ తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బెంగళూరు కేంద్ర వాతావరణశాఖ డైరెక్టర్ సీఎస్ పాటిల్ తెలిపారు. ఎల్‌నినో, లానినో ప్రభావాల వల్ల అధిక ఎండలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నట్లు చెప్పారు. వాతావరణానికి అనుగుణంగా ఈ ఏడాది వానలు కురవలేదని, అనూహ్యంగా అక్టోబరులో ఉష్ణోగ్రతలు పెరిగాయని ధార్వాడ అగ్రి యూనివర్శిటీ వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రవిపాటిల్ తెలిపారు. -
హీట్ వేవ్స్.. హాట్ సేల్స్
అల్పపీడన ద్రోణి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం ‘చల్ల’దనం కోసం పరుగులు తీస్తున్నారు. ఇందుకోసం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: సాధారణంగా వేసవి తరువాత ఏసీల అమ్మకాల్లో తగ్గుదల సహజం. కానీ సెప్టెంబర్ వస్తున్నా రికార్డు స్థాయిలో ఏసీల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో తయారీ కంపెనీలు భారీ లాభాల బాట పడుతున్నాయి. ఈ వేసవిలో ఏసీ అమ్మకాల్లో 60 నుంచి 70 శాతం వృద్ధి నమోదు కాగా జూలై నుంచి జరుగుతున్న అమ్మకాల్లో కూడా 30 నుంచి 40 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) నెలల్లో పలు ఏసీ కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో లాభాలు రెండు రెట్లు పెరిగాయంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలకు భారీ లాభాలు అత్యధిక వాటా కలిగిన వోల్టాస్ లాభం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.355 కోట్లకు చేరింది. ఈ మూడు నెలల కాలంలో వోల్టాస్ రికార్డు స్థాయిలో 10 లక్షల యూనిట్లు విక్రయించింది. బ్లూస్టార్ లాభం కూడా రెండు రెట్లు పెరిగి రూ.169 కోట్లకు చేరింది. గతేడాది రూ.62 కోట్ల నష్టాలను ప్రకటించిన హావెల్స్ ఈ ఏడాది రూ.67 కోట్ల లాభాలను ప్రకటించడం గమనార్హం. 2023లో దేశవ్యాప్తంగా 1.1 కోట్ల ఏసీల అమ్మకాలు జరిగితే 2024లో 1.5 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లియన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీమా) ప్రెసిడెంట్ సునిల్ వచాని తెలిపారు.ఆన్లైన్ రిటైల్ సంస్థల పోటీ ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వంటి ఆన్లైన్ రిటైల్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోతున్నామంటూ కొన్ని కంపెనీలు వాపోతున్నాయి. 2037 నాటికి ప్రతి 15 సెకన్లకు ఒక ఏసీ 2011 తర్వాత ఈ స్థాయిలో ఏసీల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారని, 2037 నాటికి ప్రతీ 15 సెకన్లకు ఒక ఏసీ విక్రయించే స్థాయికి ఇండియా ఎదుగుతుందని ప్రపంచబ్యాంకు అంచనా వేస్తోంది. 95 శాతం తొలిసారి కొంటున్నవారే దేశవ్యాప్తంగా వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో వినియోగదారులు ఏసీలు, రిఫ్రిజరేటర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ఇప్పుడు ఏసీ అన్నది లగ్జరీ సాధనంగా కాకుండా బతకడానికి తప్పనిసరి వస్తువుగా మారిపోయిందని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో సొంత ఏసీ వినియోగం చాలా తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల్లో కేవలం 8 శాతం మందికి మాత్రమే సొంత ఏసీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున చల్లదనం కోసం ప్రతీ వ్యక్తి 272 కేడబ్ల్యూహెచ్ విద్యుత్‌ను వినియోగిస్తుంటే, మన దేశంలో అది కేవలం 69 కేడబ్ల్యూహెచ్‌గా ఉంది. ఈ ఏడాది తమ సంస్థ అమ్మిన ఏసీల్లో 95 శాతం మంది తొలిసారిగా కొన్నవారే ఉన్నారని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇందులో 65 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉన్నారు. -
లండన్‌లో ఒక వేసవి సాయంత్రం
వసంతంలో ఇంగ్లండ్‌లో ఉండాలన్నాడు కవి. నిజానికి వేసవి మంచి సమయం. బ్రిటన్‌లో ఒక మంచి వేసవి అరుదుగా ఉంటుంది. ఎండలు మండి పోయే వేసవి రోజున ఏ దేశం కూడా బ్రిటన్ను తలదన్నలేదు. పచ్చిక మైదానాలలో గొర్రెపిల్లలు ఉల్లాసంగా సంచరిస్తున్నట్లు స్థానికులు ఉద్యానాలకు చేరుకుంటారు. అక్కడ వారు ఆడతారు, సూర్యరశ్మి కింద హుషారుగా గెంతులేస్తారు. మీగడ, పంచదార అద్దిన స్ట్రాబెరీ పండ్లు బ్రిటిష్ వారి వేసవి ఆనందాల హరివిల్లులు. వారు ఎండలో ఆనందిస్తారు. అది మండించే ఎండైనా సరే. కానీ మనం దాని నుంచి దాక్కుంటాము. తాజా వేసవి గాలులకు బదులుగా ఎయిర్ కండిషనర్లకు మొగ్గు చూపుతాము. బ్రిటిషర్లకూ, మనకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అది సూక్ష్మంగా తెలియపరుస్తుంది.ఎండలు మండిపోయే ఒక వేసవి రోజున ఏ దేశం కూడా బ్రిటన్ను తలదన్నలేదు. వాతావరణం మాత్రమే కాదు, ఆ ప్రాంతం కూడా దానికై అదే రూపాంతరం చెందుతుంది. నిజానికది రమణీయత. ఎలాగంటే, పచ్చిక మైదానాలలో గొర్రెపిల్లలు ఉల్లాసంగా సంచరిస్తున్నట్లు స్థానికులు ఉద్యానాలకు చేరుకుంటారు. అక్కడ వారు ఆడతారు, సూర్యరశ్మి కింద హుషారుగా గెంతులేస్తారు. మగవాళ్లు సాధారణంగా షార్ట్స్‌లో – తరచూ నడుము పైభాగాన ఒంటిపై బట్టలేమీ లేకుండా – ఉంటారు. ఆడవాళ్లు అంతకంటే తక్కువ దుస్తులతో కనిపించవచ్చు. ఆడా మగా ఇద్దరూ కూడా తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్టనట్లుగా మైమరచి ఉంటారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం తర్వాత గత శుక్రవారం అచ్చు ఆ విధంగానే ఉంది. గూగుల్ చెబుతున్న దానిని బట్టి ఆ రోజు ఢిల్లీ కన్నా లండనే ఎక్కువగా వేడిగా ఉంది. సాయంత్రం 5 గంటలకు సెయింట్ జేమ్స్ పార్క్‌లో 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, అదే సమయంలో సఫ్దర్జంగ్లో ఉన్న వేడి 29 డిగ్రీలు మాత్రమే. ఎప్పుడూ మూతి బిగించుకుని ఉండే అనేకమంది బ్రిటిషర్ల ముఖాలపైకి ఉత్సాహభరితమైన చిరునవ్వును తీసుకురాగల విషయం అది. వాస్తవ వైరుద్ధ్యం ఏమిటంటే లండన్‌లోనే వేడి చాలా ఎక్కువగా ఉన్నట్లు మీకనిపిస్తుంది. అందువల్లే నింగిలోని మబ్బులు, తెరిపివ్వని జల్లులు, తడిసిన కాలిబాటలు... అన్నీ జ్ఞాపకాల్లా నిమిషాల్లో మాయమైపోతుంటాయి. మీరు కనుక రీజెంట్ స్ట్రీట్ లేదా బాండ్ స్ట్రీట్‌లో షాపింగ్ చేస్తుంటే సూర్యుడి భగభగలు మండించేస్తాయి. రోడ్ల నుంచి, భారీ భవనాల నుంచి వెలువడే వేడి మిమ్మల్ని తన జ్వలించే ఆలింగనంతో చుట్టుముట్టేస్తుంది. ఇళ్లు ఉబ్బరిస్తూ ఉంటాయి. మీరెన్ని కిటికీలైనా తెరచి ఉంచండి. లోనికి వచ్చే గాలి మీకు చల్లగా అనిపించదు. ఒంటిపై మీరెంత తక్కువగానైనా దుస్తులు ధరించండి, అయినప్పటికీ ఒంటి నిండా దుస్తులు ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా, లేశమైనా మేఘఛాయ లేని ఆకాశం స్పష్టమైన నీలివర్ణంలో ప్రకాశిస్తూ (జాన్) కాన్స్టేబుల్ లేదా (జె.ఎం.డబ్లు్య.) టర్నర్ (18వ శతాబ్దపు ప్రసిద్ధ బ్రిటన్ చిత్రకారులు) గీసిన చిత్రం సజీవంగా కళ్లముందుకు వచ్చినట్లుగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఇంట్లోనే ఉండిపోవాలనుకుంటారు? నేను బస చేసిన చోటు నుండి ఒక రాయి విసురుకు మరికాస్త దూరంలో ఉన్న హాలెండ్ పార్క్‌లో ఐస్‌క్రీమ్ వ్యాన్ చుట్టూ ఒక పెద్ద గుంపు మూగి ఉంది. బాదరబందీ లేని దంపతులు ఆ మైదానంలో నీడ పడుతున్న చోట్లలో విహారయాత్ర చేస్తున్నట్లుగా ఉన్నారు. ప్రతి చోటా పిల్లలు పరుగులు పెడుతూ, కేరింతలు కొడుతూ ఉంటే వారి నవ్వుల ఆనందం ఆ పచ్చిక బయలులో ప్రతిధ్వనిస్తూ ఉంది. బ్రిటిష్ గ్రామీణ ప్రాంతాలలో అద్భుతమైన పుష్పించే ముళ్ల పొదలతో కనుచూపు మేరన ఇరువైపులా సస్యశ్యామలమైన పొలాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకాస్త దగ్గరగా చూస్తే కనుక స్ట్రాబెర్రీలను తెంపుతున్న యువజనులను మీరు గుర్తించవచ్చు. ఆ పండ్ల బుట్టలు ప్రతిచోటా అమ్మకానికి ఉంటాయి. మీగడ, పంచదార అద్దిన స్ట్రాబెరీ పండ్లు బ్రిటిష్ వారి వేసవి ఆనందాల హరివిల్లులు. గ్రామీణ ప్రాంతాల్లోని మరొక ఆహ్లాదం – అక్కడొక విలేజ్ పబ్ ను సందర్శించటం! ఒక అర లీటరు బిట్టర్స్ని (ఒక రకం బీరు) – బ్రిటిషర్లు పెద్దగా తాగే మనుషులు కారు – కొన్ని ఆలూ చిప్స్‌తో సేవిస్తూ చల్లటి గాలి మీ ముంగురులను కదిలిస్తుండగా ఆ ప్రాంగణంలో కూర్చొని ఉండటం ఒక మరపురాని అనుభూతి. ఇక ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలనీ, అదెప్పటికీ ముగియకూడదనీ మీకు అనిపించే అవకాశం ఉంది. ‘‘ఓహ్ టు బి ఇన్ ఇంగ్లండ్ నౌ దట్ స్ప్రింగ్ ఈజ్ హియర్’’ (ఓ! వసంతం వచ్చింది కాబట్టి ఇంగ్లండ్‌లో ఉండాలి) అని మొదట అన్నదెవరూ... కోల్రిడ్జా, లేక బ్రౌనింగా? గూగుల్‌ని అడిగితే వాళ్లిద్దరిలో ఎవరైనా కావొచ్చు అని సూచిస్తోంది. నిజానికి వేసవి కాలం మంచి సమయం. కానీ రెండిటినీ (వేసవిని, వసంతాన్ని) కలిపినందుకు బ్రిటిషర్లను మీరు క్షమించవచ్చు. బ్రిటన్‌లో ఒక మంచి వేసవి అరుదుగా ఉంటుంది. గత శుక్రవారం వరకు కూడా ఈ ఏడాది అలాంటి వేసవే లేనట్లుగా ఉండింది.ఆ సాయంత్రం తాముంటున్న ఎన్నిస్మోర్ గార్డెన్స్ పచ్చికల్లో నాకు ఆతిథ్యం ఇచ్చినవారు తమ అతిథులను కాస్త షాంపేన్‌ను సేవించమని కోరారు. పగలు చల్లబడుతున్న కొద్దీ ఆ పసిడి వర్ణ సాయంకాలపు వెలుగులో ఆ తోటలో ఉండటం అన్నది స్వర్గంలా అనిపించింది. కానీ, పాపం అటువంటి ఆనందాలలో ఇమడలేని మాలోని కొందరు దేశీలు లోపలే ఉండిపోటానికి ఇష్టపడ్డారు. అది బ్రిటిషర్లకూ, మనకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నాకు సూక్ష్మంగా తెలియపరిచింది. వారు ఎండలో ఆనందిస్తారు. తామెంత పొందగలరో అంతా వారు కోరుకుంటారు. అది మండించే ఎండైనా సరే. కానీ మనం దాని నుంచి దాక్కుంటాము. తాజా వేసవి గాలులకు బదులుగా మనం ఎయిర్ కండిషనర్లకు మొగ్గు చూపుతాము. మర్నాడు ఉదయానికి వేసవి ముగిసిపోయింది. మేఘాలు తిరిగి వచ్చాయి. వర్షం మొదలైంది. షార్ట్స్ స్థానంలోకి జెర్సీలు వచ్చేశాయి. రివర్స్ బేస్‌బాల్ క్యాప్‌లను గొడుగులు ఆక్రమించాయి. సందేహం లేదు, మరొక వెచ్చటి ఎండ రోజును బ్రిటన్ తిరిగి కొద్ది వారాల తర్వాత చూడవచ్చు. ఆలోపు శరదృతువు... కప్పి ఉంచని మెడలను తన చలి విస్ఫోటాల శ్వాసలతో చుట్టేయవచ్చు. అందుకే వేసవిలో ఒక రోజు నేనక్కడ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
పండ్లలో రారాజు మామిడి.. కాదు కాదు అరటి
మనదేశంలో మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్లో పలు రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. అయితే ఇకపై దేశంలో మామిడికి బదులు ‘అరటి’ పండ్లలో రారాజుగా మారబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.2022-23లో ఉత్పత్తి పరంగా అరటి.. మామిడిని అధిగమించింది. అరటి వాటా 10.9 శాతం కాగా మామిడి 10 శాతంగా ఉంది. దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అవుతుంది. మన దేశానికి చెందిన మామిడి, అరటిపండ్లకు విదేశాలలో అత్యధిక డిమాండ్ ఉంది. మన మార్కెట్లలో కనిపించని అనేక రకాల మామిడిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.మామిడి పండించే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటా భారత్‌దే. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం మామిడి ఉత్పత్తిలో 23.64 శాతం యూపీలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో మామిడి మొత్తం ఉత్పత్తి 21 మిలియన్ టన్నులు. దేశంలో 1,500కుపైగా మామిడి రకాలు ఉన్నాయి.మనదేశంలో అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి పండు అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుంది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు సమిష్టిగా 67 శాతం అరటిపండ్ల వాటాను అందించాయి. అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉన్నప్పటికీ మనదేశ ఎగుమతుల వాటా ప్రపంచం మొత్తం మీద ఒకశాతం మాత్రమే. -
గతేడాదిని మించి వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: గతేడాదిని మించి ఈ ఏడాది వడగాడ్పులు హడలెత్తించాయి. గతేడాది వేసవిలో 17 రోజులు వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచినట్టు నమోదైంది. అయితే ఈసారి వడగాడ్పుల సంఖ్య 18కి పెరిగింది. అంతేకాకుండా గతేడాది ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీల వరకు నమోదు కాగా ఈ ఏడాది 48 డిగ్రీల వరకు చేరుకున్నాయి. గతేడాది వేసవి దడ పుట్టించిందనుకుంటే ఈసారి అంతకు మించి హడలెత్తించింది. సాధారణం కంటే దాదాపు మూడు రెట్ల వడగాడ్పులతో జనాన్ని బెంబేలెత్తించింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ ఆరంభం నుంచే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆ నెలలోనే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకున్నాయి. మే నెల రెండో వారం, మూడో వారంలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ ఉష్ణతాపాన్ని కాస్త తగ్గించాయి. ఫలితంగా వడగాడ్పుల తీవ్రత ఒకింత తగ్గినట్టు కనిపించింది. సాధారణంగా ఏప్రిల్, జూన్కంటే మే నెలలోనే వేసవి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా మే నెలలో వర్షాలు కురవడం వల్ల ఏప్రిల్‌కంటే తక్కువ వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను చూసి మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కానీ మే నెల మధ్య మధ్యలో ఆవర్తనాలు, ద్రోణులు, తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకే పరిమితమయ్యాయి. ఇలా ఈ వేసవి మూడు నెలలూ 18 రోజుల పాటు వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఇందులో ఏప్రిల్‌లో ఎనిమిది రోజులు (5, 6, 7, 8, 24, 28, 29, 30 తేదీలు), మే నెలలో ఏడు రోజులు (1, 2, 3, 4, 5, 28, 31 తేదీలు), జూన్‌లో మూడు రోజులు (1, 17, 18 తేదీలు) వడగాడ్పులు ప్రభావం చూపాయి. స్తబ్దుగా నైరుతి రుతుపవనాలునైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ముందుగా అటు కేరళలోకి, ఇటు రాష్ట్రంలోకి ప్రవేశించినా అవి ఉత్తర కోస్తాలోకి విస్తరించాక దాదాపు పది రోజుల పాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో జూన్ మూడో వారం వర్షాలు కురవాల్సిన సమయంలో రెండు రోజుల (17, 18 తేదీల్లో) పాటు వడగాడ్పులు మళ్లీ చెలరేగాయి. ఈ దఫా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పులు దడ పుట్టించాయి. ప్రధానంగా నంద్యాల, కర్నూలు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఎక్కువగా వడగాడ్పులను ఎదుర్కొన్నాయి. -
మండుటెండల మహోపద్రవం
గత దశాబ్దిన్నరగా ఎన్నడెరుగని పరిస్థితి. మే నెలలో మండే ఎండలు తెలిసినవే అయినా, ఏప్రిల్ మొదలు జూన్ సగం దాటినా మాడు పగిలేలా దీర్ఘకాలిక ఉష్ణపవనాల దెబ్బ ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులతో ఢిల్లీ సహా ఉత్తరాది అంతా ఇప్పుడు అగ్నిగుండమైంది. మొన్న మంగళవారం 1969 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో 35.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఢిల్లీ మలమల మాడిపోయింది. ఒక్క జూన్‌లోనే ఇప్పటిదాకా ఏడు రోజులు తీవ్ర ఉష్ణపవనాలతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి కాగా, పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ గణనీయంగా పెరిగిపోవడంతో అవస్థలు హెచ్చాయి. మే 12 తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయినా 40 డిగ్రీల కన్నా తగ్గనే లేదు. నిరాశ్రయులు 192 మంది ఈ జూన్ నెల 11 నుంచి 19 మధ్య కాలంలో వడదెబ్బ తగిలి మరణించారట. మునుపెన్నడూ చూడని ఇన్ని మరణాల సంఖ్య పరిస్థితి తీవ్రతకు మచ్చుతునక. నగరంలో నీటి కొరత మరో పెద్ద కథ. అధిక జనాభాతో దేశరాజధాని చాలాకాలంగా తల్లడిల్లుతోంది. సమీప ప్రాంతాల నుంచి వందలాది మంది వలస రావడంతో గత పాతికేళ్ళలో ఢిల్లీలో డజన్లకొద్దీ శిబిరాలు చట్టవిరుద్ధంగా వెలిశాయి. అసలే శిథిలమైన నగర జలవ్యవస్థ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు, మరీ ముఖ్యంగా ఈ మురికివాడలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి. దానికి తోడు యమునా నదీజలాలు తగ్గిపోయి, నీటి కోసం అల్లాడే ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకర్లతో నీటి పంపిణీ పెద్ద వ్యాపారమైంది. ఇదే అదనుగా జలవనరుల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియా బయలుదేరింది. పెరిగిన ఎండలతో ఉత్తరాదిన రోజువారీ విద్యుత్ వినియోగం 89 గిగా వాట్ల పతాకస్థాయికి చేరి, ఢిల్లీ విమానాశ్రయం అరగంట సేపు కరెంట్ కోతలో మగ్గాల్సి వచ్చింది. మిగతా దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తరాదికి 25 నుంచి 30 శాతం విద్యుత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎండల్లో ఇన్ని సమస్యల ముప్పేటదాడితో రాజధాని ప్రజలకు కష్టాలు వర్ణనాతీతం. సందట్లో సడేమియాగా వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. పొరుగున హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, యమునలోని నీళ్ళొదలడం లేదన్నది ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపణ. మాకే తగినంత లేవన్నది హర్యానా జవాబు. నీళ్ళైనా అందించలేకపోవడం ఆప్ వైఫల్యమేనంటూ ఢిల్లీ బీజేపీ నేతలు రోడ్డు పైకొచ్చి నిరసనలకు దిగడం ఒక ఎత్తయితే... ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోవడం, ఢిల్లీ నీటి సరఫరా పైపులకు సైతం దుష్టశక్తులు చిల్లులు పెడుతున్నాయంటూ ఆప్ సర్కార్ ఆ పైపులకు పోలీసు రక్షణ కోరడం పరాకాష్ఠ. దేశ రాజధానిలో నీటి కొరతపై ప్రధాని మోదీ స్పందించకపోతే శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటూ ఢిల్లీ మంత్రి ఆతిశి ప్రకటించడంతో మహానగరం మరింత వేడెక్కింది. నిజానికి, ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకి, ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. తీరా జూన్ 12 నుంచి మధ్యభారతంలో అవి స్తంభించేసరికి, దేశమంతా ఇటు వర్షాలు లేవు. అటు ఎండలు, ఉక్కపోత. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర, పశ్చిమ భారతావనిలో మరీ దుర్భరం. ఇలాంటి దీర్ఘకాలిక వేసవిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటున్నది అందుకే!నిజానికి ఇదంతా ఎక్కడో ఢిల్లీలో వ్యవహారమనీ, అది అక్కడికే పరిమితమనీ అనుకోవడానికి వీల్లేదు. వాతావరణ మార్పులు, మన స్వయంకృతాపరాధాల కారణంగా భవిష్యత్తులో దేశంలోని నగరాలన్నిటికీ ఇదే దుఃస్థితి దాపురించడం ఖాయం. ఆ మధ్య బెంగుళూరులో ఇలాంటివే చూశాం. దేశానికి అభివృద్ధిఇంజన్లయిన బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లోనూ రేపు ఇవే పరిస్థితులు వస్తే, పరిస్థితి ఏమిటి? దేశ ఆర్థికపురోగతికి వెన్నెముక అయిన వీటిని నివాసయోగ్యం కాకుండా చేస్తే, జనం ఉద్యోగ, ఉపాధుల మాటేమిటి? పొంచివున్న నీటికొరత నివారణకు పాలకులు ఏం ప్రణాళిక వేస్తున్నారు? హైదరాబాద్ సహా అనేక నగరాల్లో వందల కొద్దీ చెరువులు, కుంటలు కబ్జాకు గురై, పర్యావరణానికీ, పెరుగుతున్న జనాభా అవసరాలకూ తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి, దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు రాకపోతే కష్టం. మానవాళికి శాపంగా మారిన ఈ అధిక ఉష్ణోగ్రతల వెనక వాయుకాలుష్యం, శరవేగంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత... ఇలా చాలా కారణాలున్నాయి. విపరీతంగా నిర్మాణాలు పెరిగి, పట్టణాలన్నీ కాంక్రీట్ జనారణ్యాలుగా మారేసరికి, పచ్చని చెట్లు, ఖాళీ ప్రదేశాలున్న ప్రాంతాలతో పోలిస్తే కొద్ది కి.మీ.ల దూరంలోనే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా, దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడడం కూడా పాతికేళ్ళ క్రితంతో పోలిస్తే బాగా నిదానించిందట. ‘పట్టణ ఉష్ణద్వీప’ ప్రభావంగా పేర్కొనే ఈ పరిస్థితిని నివారించడం అత్యవసరం. అలాగే, నిలువ నీడ లేని వారితో సహా సమాజంలోని దుర్బల వర్గాలను ఈ వేడిమి బాధ నుంచి కాపాడే చర్యలు చేపట్టాలి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోనివ్వకుండా ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి వసతి కల్పించాలి. శీతల కేంద్రాలు, ఎండబారిన పడకుండా తగినంత నీడ ఏర్పాటు చేయాలి. గత ఏడాది, ఈసారి ఎన్జీఓ ‘స్వయం ఉపాధి మహిళా సంఘం’ (సేవ) అమలు చేసిన ‘ఎండల నుంచి బీమా సౌకర్యం’ లాంటి వినూత్న ఆలోచనలు అసంఘటిత కార్మికుల జీవనోపాధిని కాపాడతాయి. ఇప్పటికే ఈ 2024 మానవచరిత్రలోనే మండుటెండల వత్సరంగా రికార్డు కెక్కింది. వచ్చే ఏడాది ఈ రికార్డును తిరగరాయక ముందే ఈ మహోపద్రవం పట్ల కళ్ళు తెరవడం మంచిది. -
అగ్నిగుండంలా ఢిల్లీ.. వారం రోజుల్లో 192 నిరాశ్రయుల మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. 50కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. దీనికి తోడు వడగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలకు తోడు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక హస్తీనా వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని ఆసుపత్రులన్నీ హీట్ స్ట్రోక్ బాధితులతో నిండిపోతున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో రోగులు అడ్మిట్ అవుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది. 72 గంటల్లోనే ఢిల్లీ, నోయిడాలో 15 మంది వడదెబ్బతో ప్రాణాలు వదిలారు. ఢిల్లీలో అయిదుగురు, నోయిడాలో 10 మంది మృత్యువాత పడ్డారుఅయితే తీవ్ర ఉక్కపోత, వడదెబ్బ కారణంగా ఢిల్లీలో జూన్ 11 నుంచి 19 మధ్య 196 మంది నిరాశ్రయులు (ఇళ్లు లేని వారు) మరణించినట్లు ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొంది. ఈ కాలంలో నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇదేనని వెల్లడించింది.NGO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ అలెడియా మాట్లాడుతూ.. జూన్ 11 నుండి 19 వరకు తీవ్ర వేడి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో 192 మంది నిరాశ్రయుల మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. అంతేగాక మరణించిన వారిలో 80 శాతం మంది మృతదేహాలు ఎవరివో కూడా తెలియవని అన్నారు. ఈ ఆందోళనకరమైన మరణాల సంఖ్య.. సమాజాన్ని రక్షించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని తెలిపారు.వాయు కాలుష్యం, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అటవీ నిర్మూలన వంటి కారణాల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, నిరాశ్రయులైన వారి పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన పేర్కొన్నారు. నివాసాలు లేని వారికి అవసరమైన తాగునీరు అందించడం ముఖ్యమైన సవాలుగా మారిందన్నారు. దీని వల్ల డీహైడ్రేషన్, సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందన్నారు.దీన్ దయాళ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (NULM-SUH) ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిరాశ్రయులు ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అయితే వారికి ప్రాథమికంగా గుర్తింపు పత్రాలు లేకపోవడం, శాశ్వత చిరునామా లేకపోవడం సమస్యగా మారిందన్నారు.అదే విధంగా శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, తగిన షెల్టర్ సామర్థ్యాన్ని నిర్ధారించడం, నీటిని పంపిణీ చేయడం. సహాయక గృహాలు, సేవల ఏర్పాటు ద్వారా నిరాశ్రయులైన సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు. -
‘స్కూటర్ షవర్’.. మండుడెండల్లో మంచులాంటి ఐడియా!
మనిషి కష్టం వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాన్ని కనుగొంటాడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన పరిష్కార మార్గాలు కనిపిస్తుంటాయి. ఇదే కోవలో వేసవి నుంచి తప్పించుకునేందుకు ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఉత్తరాదిన భానుడు భగభగ మండుతున్నాడు. జనం కూలర్లు, ఏసీలను అశ్రయిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగును తీసుకు వెళుతున్నారు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఒక యువకుడు మండుతున్న ఎండల నుంచి ఉపశమనానికి ‘స్కూటర్ షవర్’ తయారు చేసి, ఎండల్లో చల్లగా తిరుగుతున్నాడు. స్కూటర్‌కి షవర్‌ను అమర్చడం వల్ల ఎక్కడికెళ్లినా కూల్‌గా ఉంటున్నదని ఆ యువకుడు కనిపించిన అందరికీ చెబుతున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఈ క్లిప్‌ను ఇన్స్టాగ్రామ్ పేజీ ‘ఫన్ విత్ సింగ్’లో షేర్ చేశారు. ఈ స్కూటర్ షవర్ తయారు చేసిన వ్యక్తి తన స్కూటర్ లెగ్ స్పేస్‌లో వాటర్ కంటైనర్‌ను ఉంచాడు. దానిని నీటితో నింపాడు. దానికి ఒక గొట్టం అమర్చి ట్యాప్ ఫిట్ చేశాడు. చిన్నపాటి మోటారు అమర్చి పైన షవర్ నుంచి నీటి జల్లులు కురిసేలా ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి స్కూటర్‌పై వెళుతున్నప్పుడు షవర్ నుంచి చిరు జల్లులు అతనిపై పడటాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. India is not for beginners 😅#heatwave #Garmi pic.twitter.com/FiXHhOkhQ3— Sneha Mordani (@snehamordani) June 17, 2024 -
కరెంట్ ‘కాలి’పోతోంది
సాక్షి, అమరావతి: వేసవి ఉష్ణోగ్రత విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా మండిపోతున్న ఎండలు, వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు వంటి విపత్తుల కారణంగా కరెంటును పంపిణీ చేసే ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సబ్ స్టేషన్లు అగ్ని గుండంలా మారుతున్నాయి. సాధారణంగానే వాటి వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఆ పరిధిని మించి వేడి తరంగాలు చుట్టుముడుతున్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేసేలా చర్యలు ఎండలకు భయపడి జనం బయటకు రావడం తగ్గించారు. పాఠశాలలకు సెలవులు. అవుట్డోర్ వర్క్స్ లేవు. ఇంట్లో ఉండి అన్ని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎసీల వినియోగం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఊహించని భారం పడుతున్నది. ఒక ఇంటిలో ఒక ఏసీ వాడితే వచ్చే లోడ్ అకస్మాత్తుగా 500 వాట్స్ నుంచి 2 వేల వాట్స్‌గా మారుతోంది. ఇది రాత్రి సమయంలో సాధారణ హౌస్ డ్రాల్ కంటే 3 రెట్లు ఎక్కువ. దీనివల్ల ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువకు విద్యుత్ డిమాండ్‌కు చేరుకుంది. ఇంతలా కరెంట్ వాడకం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండడం విశేషం. ఈ పరిస్థితిని ముందే ఊహించి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే దీనికి కారణం. అయితే సాధారణ లోడ్ ఉన్పప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్ చమురు ఉష్ణోగ్రత 35 నుంచి 40 డిగ్రీలు ఉంటుంది. కానీ అసాధారణ లోడ్, వేడి వల్ల ట్రాన్స్ఫార్మర్ చుట్టూ 70 నుంచి 80 డిగ్రీల వేడి ఉంటోంది. విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తూ, ట్రాన్స్ఫార్మర్లæ నిర్వహణను చూస్తున్న అధికారులు, సిబ్బంది ఇంత వేడిలో అక్కడ పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాలో ఆటంకం కలుగకూడదని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తూ, పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేసేలా చేస్తున్నారు. అన్నిటా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్రంలో అన్ని చోట్లా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే పెట్టాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. అంటే అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు, పరిశ్రమల వద్ద పెట్టినట్లు గృహ, వ్యవసాయ అవసరాలకు కూడా సిమెంటు దిమ్మలపై ట్రాన్స్ఫార్మర్లను పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల విద్యుత్ స్థంభాల మీద ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అవి గాలి, వానకు పడిపోతున్నాయి. స్థంభం కూలిపోతే, దానిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మార్చడానికి సమయం పడుతోంది. ఈ లోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అలాంటి ట్రాన్స్ఫార్మర్లు తీసేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల 30 నుంచి 40 ఏళ్ల పాత కండక్టర్లు ఉన్నాయి. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. దీంతో కొద్దిపాటి గాలివాన, ఎండకే అవి తెగిపోతున్నాయి. వాటిని పూర్తిగా మార్చేసి, కొత్త లైన్లు వేసే పనిలో విద్యుత్ శాఖ ఉంది. -
వేడికి ‘కోడి’ విలవిల!
సాక్షి, భీమవరం: మండుతున్న ఎండలు పౌల్ట్రీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లి పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కోస్తాలోని ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుడ్లు పెట్టే లేయర్ కోళ్లు నాలుగు కోట్ల వరకు ఉండగా, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోటి వరకూ ఉన్నాయి. గుడ్లు పెట్టే దశకు చేరువలోని బ్రోయర్, చిక్స్ మూడు కోట్ల వరకు ఉంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో సాధారణంగా రోజుకు 60 నుంచి 80 కోళ్లు వరకు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య 450 నుంచి 500 వరకు చేరింది. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ తట్టుకుంటాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది కోళ్ల మరణాలు పెరిగాయి. కోస్తా ప్రాంతంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకు నష్టం వాటిల్లుతుంది.. ఈ మేరకు గత మూడు రోజుల్లో రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కోళ్లు చనిపోగా పరిశ్రమకు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పడిపోయిన గుడ్ల ఉత్పత్తి ఎండల తీవ్రత వల్ల గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు 4.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాలుల తీవ్రతకు ఆ ఉత్పత్తి 3.49 కోట్లకు తగ్గిపోయింది. డ్రాపింగ్ కారణంగా రోజుకు 61.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.4.85 ఉండగా.. రోజుకు రూ.2.98 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.8.95 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లకు ఉపశమన చర్యలతో ఖర్చులు పెరిగిపోయాయి.వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులివ్వడం, ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు.. పెరిగిన మేత ధరలు, కూలి రేట్లతో నిర్వహణ భారం మారిందని కోళ్ల రైతులంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా లేక స్థానిక వినియోగం తగ్గి గుడ్డుకు రైతు ధర పతనమవుతోందని చెబుతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎండల తీవ్రతకు కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు ప్రభుత్వం అందజేయాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
రోహిణి భగభగలు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిత్రమైన వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. పగలంతా ఎండలు మండిపోతుండగా, రాత్రికి మాత్రం కాస్త చల్లని వాతావరణం నెలకొంటోంది. సాధారణంగా రోహిణి కార్తెలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోత చిరాకు కలిగిస్తుంటుంది. అయితే ప్రస్తుతం రోహిణి కార్తె ప్రవేశించి 5 రోజులు కావస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదవుతున్నాయి. రోహిణి కార్తెలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ అధికంగా..అంటే 43 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. కానీ ఈసారి కాస్త తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రెండు మూడు చోట్ల 43కు అటుఇటుగానే నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. హనుమకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. రోహిణి కార్తెలో సాధారణంగా 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో తక్కువగా 25, 26, 27 డిగ్రీల మేరకే నమోదు అవుతున్నాయి. బుధవారం కనిష్టంగా నల్లగొండలో 25.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతోనే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలావుండగా రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 46.4 డిగ్రీ సెల్సీయస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, బెల్లంపల్లిలో 45.8, ఆసిఫాబాద్‌లో 45.2 డిగ్రీ సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కేరళను తాకనున్న నైరుతి బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు గురువారం కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. కేరళను తాకిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించి ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది. -
మండుతున్న ఎండలు.. తట్టుకోలేక సొమ్మసిల్లిన విద్యార్థులు
పాట్నా: ఉత్తర భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూ లేనంతంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటేసింది. తీవ్ర ఎండ, వాడగాలులతో జనం అల్లాడుతున్నారు. అయితే మండే ఎండల్లోనూ కొన్ని చోట్ల స్కూళ్లు తెరుచుకున్నాయి. తాజాగా బిహార్‌లో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు.బిహార్‌లో వేసవిసెలవులు ముగియడంతో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం బిహార్‌లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు ఉంది. ఇంత ఎండలోనూ విద్యార్ధులు స్కూళ్లకు వచ్చారు. అయితే ఎండ వేడిని తట్టుకోలేక.. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. షేక్‌పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేశారు. సమయానికి ఆంబులెన్స్‌లు రాకపోవడంతో.. ఆటోలు, బైక్‌లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలందరూ డీ హైడ్రేట్ అయ్యారని.. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.ఇదొక పాఠశాలలోనే కాదు బెగుసరాయ్, జాముయి జిల్లాల్లో పదుల సంఖ్యలో విద్యార్ధులు స్పృహతప్పి పడిపోయారు. వారిని అసుపత్రికి తరలించారు.కాగా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బీహార్‌లో స్కూళ్లను తెరువడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు స్కూళ్లకు వెళ్లి టీచర్లతో ఘర్షణపడ్డారు. అలాగే రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ స్కూళ్లను తెరువడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.మరోవైపు బీహార్‌లో ప్రభుత్వం, ప్రజాస్వామ్యం లేదని, బ్యూరోక్రసీ మాత్రమే ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా ఉన్నాయని, అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
సాక్షి, నెట్వర్క్: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి. దీంతో అనేకచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన హడలెత్తించింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మరోవైపు తగ్గేదేలే అన్నట్టు పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. 45 డిగ్రీ సెల్సీయస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం నాగర్‌కర్నూల్ జిల్లాలో అకాల వర్షాలు పెను విషాదం నింపాయి. ఆదివారం సాయంత్రం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. తాడూరుకు చెందిన రైతు బెల్లె మల్లేష్ (38) గ్రామ శివారులోని తన సొంత పొలంలో రేకుల షెడ్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మల్లేష్, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ (45), రాములు (53) షెడ్‌పై పని చేస్తుండగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి షెడ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. దీంతో ఈ ముగ్గురు, అదే సమయంలో తండ్రి వద్దకు వచి్చన మల్లేష్ కూతురు అనూష (12) అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే పనిచేస్తున్న మరో నలుగురు.. చిన్న నాగులు, పార్వతమ్మ, బి.రాజు, రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే పార్వతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మరోవైపు నాగర్‌కర్నూల్ మండలంలోని మంతటి గేట్ వద్ద ఈదురు గాలుల ప్రభావంతో రేకుల షెడ్‌పై ఉన్న రాయి వచ్చి వికారాబాద్ జిల్లా బషీర్‌బాగ్ మండలం నలవెల్లి గ్రామానికి చెందిన క్రూజర్ వాహన డ్రైవర్ వేణుగోపాల్ (38)కు తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వేణుగోపాల్ కిరాయికి శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే జిల్లాలోని తెలకపల్లికి చెందిన దండు లక్ష్మణ్ (12), మారేపల్లికి చెందిన వెంకటయ్య (52) పొలంలో పిడుగుపాట్లకు గురై మరణించారు. ఇలావుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఎడ్ల బండిపై పిడుగు పడింది. ఈ ఘటనలో రెండు దుక్కిటెడ్లు మృతిచెందగా రైతు ఎల్కరి సత్తన్నకు గాయాలయ్యాయి. ఇద్దరు మిత్రుల విషాదాంతం మేడ్చల్ జిల్లా కీసరలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి మోటార్ సైకిల్‌పై పడటంతో దానిపై ఉన్న యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (60), అదే మండలంలోని దన్రెడ్డిగూడెంలో ఉంటున్న ఏపీలోని తూర్పు గోదావరిజిల్లాకు చెందిన ధనుంజయ్ (46) అనే ఇద్దరు స్నేహితులు మరణించారు. శామీర్‌పేటలో ఉన్న తమకు తెలిసిన వారికి మామిడికాయలు ఇచ్చేందుకు వెళ్తుండగా..కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గోడలు కూలి బాలుడు, వ్యాపారి మృతి హైదరాబాద్‌లోని మియాపూర్, ఓల్డ్ హాఫిజ్‌పేట సాయినగర్‌లో ఆదివారం గాలివానకు గోడ కూలి పడటంతో అబ్దుల్ సమద్ (3) మృతి చెందాడు. డ్రై క్లీనింగ్ చేయడంతో పాటు రోడ్ల ప్రక్కన దుస్తులను అమ్ముకుంటూ జీవించే యూపీకి చెందిన నసీముద్దీన్ కనోదియా, షబానా దంపతుల కుమారుడు సమద్ ఆదివారం సాయంత్రం రేకుల గదిలో నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న రఫీయుద్దీన్ బిల్డింగ్‌పై నుండి ఇటుక గోడకూలి రేకులపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరో ఘటనలో ఓ భవనం పై నుండి ఇటుక గోడకూలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యాపారి రషీద్ (45)పై పడటంతో తీవ్రంగా గాయపడిన అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొదుతూ మరణించాడు. ఈ దుర్ఘటన కూడా ఆదివారం మియాపూర్ ఓల్డ్ హాఫిజ్పేటలోని సాయినగర్ కాలనీలోనే చోటు చేసుకుంది. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్ ఆర్టీసీ డిపోలో పెద్ద వృక్షం కూలిపడటంతో బస్సు ధ్వంసమైంది. కోళ్లఫారం గోడ కూలి ఇద్దరు మృతి సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కోళ్ల ఫారం గోడకూలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్ మండలం ఘన్‌పూర్‌కు చెందిన గంగ గౌరిశంకర్ (30), గంగ మాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, చంద్రిక, చంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(40) క్షీరసాగర్ గ్రామంలోని శ్రీనివాస్ ఇంటికి చుట్టం చూపుగా వచ్చారు. అంతా కలిసి సరదాగా పొలంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం కురవడంతో తల దాచుకునేందుకు దారిలో ఉన్న ఓ కోళ్ల ఫారం వద్దకు వెళ్లారు. గాలుల ధాటికి ఫారం గోడ కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో గంగ గౌరిశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు మాధవి, శ్వేత, ఇంద్రజ, చంద్రిక తీవ్రంగా గాయపడ్డారు.అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రుద్రూర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రుద్రూర్లో కారుపై, అంబం శివారులో ఆటో, రెండు బైకులపై చెట్లు విరిగిపడ్డాయి. బాన్సువాడలోని కల్కి చెరువు కట్టపై ఉన్న హైమాస్ట్ విద్యుత్ స్తంభంతో పాటు పలు కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హస్నాపూర్ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో 3 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ఇళ్లు, కోళ్ల ఫారాల రేకులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ధర్మారెడ్డి పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో కాంటా చేసిన వెయ్యి బస్తాల ధాన్యం పాక్షికంగా తడిసింది. కొండమల్లేపల్లి మండ లం గుమ్మడవెల్లిలో పిడుగుపాటుకు 2 గడ్డివాములు దగ్ధమ య్యాయి. వికారాబాద్ జిల్లాలో గాలివానకు పలు ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లపై చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పరిగి మండల పరిధి రూప్సింగ్ తండాలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. -
వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!
సమ్మర్ అంటే సూర్యుడి భగభగలు మాములుగా ఉండవు. పట్టపలే చుక్కలు చూపిస్తున్నట్లుగా ఎండ దంచి కొడుతుంది. మిట్ట మధ్యాహ్నాం బయటకు వెళ్లాలంటేనే హడలిపోతారు. ఈ ఉష్ణోగ్రతలుకు ఎంతో మంది వృద్ధులు పిట్టలు రాలినట్లుగా చనిపోతారు. అందుకే ఈ వడదెబ్బకు గురికాకుండా ఉండేలా ద్రవపదార్థాలు ఎక్కువగా తాగమని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ ఎండకాలంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండకూదంటే ఏం చేయాలి? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన బాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ షారుక్ ఖాన్ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అదీగాక భారత వాతావరణ శాఖ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో సహా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు వడదెబ్బలకు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వడదెబ్బ బారిన ఎలా పడతాం? దీని బారిన పడినట్లు ఎలా గుర్తించాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. వడదెబ్బకు గురైన సంకేతాలు..వేడి, పొడి చర్మం: బాగా చెమటలు పట్టిన బాడీ చల్లబడకపోవడం. చర్మం వేడిగా, పొడిబారిన పడినట్లు అయిపోతేహృదయ స్పందన రేటు పెరిగినా..: శరీరం తనను తాను చల్లబరుచుకోవటానికి ప్రయత్నించినపుడు హృదయస్పందన రేటు పెరుగుతుంది.శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది: శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి కష్టపడటం, తద్వారా వేగంగా శ్వాస తీసుకోవడానికి దారితీస్తుంది. తలనొప్పి: పెరిగిన శరీర ఉష్ణోగ్రత, నిర్జలీకరణం ఫలితంగా తీవ్రమైన తలనొప్పి ఏర్పడవచ్చు.వికారం, వాంతులు: వికారం వాంతులు కారణంగా నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీయడం.స్ప్రుహ కోల్పోవడం: తీవ్రమైన సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత మెదడుపై ప్రభావం చూపి స్ప్రుహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లిపోవడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి మూర్చ వంటివి రావడం జరుగుతుంది.నివారణ చర్యలు..హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం. దాహం అనిపించకపోయినా తరుచుగా నీళ్లు తాగడం, ఆల్కహాల్, కెఫిన్ వంటి పానీయాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలి. వేడి నుంచి తప్పించుకునేలా ఎయిర్ కండిషన్డ్ పరిసరాల్లో ఉండటానికి ప్రయత్నించండి. గాలి వచ్చేలా ఉండే ఫ్యాన్లు వంటివి ఉపయోగించటం వంటివి చేయాలి. ఈ వేడికి తగ్గట్టు కాటన్ లేదా నార వంటి మెత్తని తేలికైన బట్టలను ఎంచుకోండి. సూర్మరశ్మని గ్రహించకుండా ఉండేలా రంగులను ఎంచుకుని మరీ దుస్తులను ధరించండి. అలాగే ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో కాకుండా చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. చర్మాన్ని సంరక్షించుకునేలా ఎస్పీఎఫ్ సన్‌స్క్రీన్, సన్‌బర్న్ వంటివి ఉపయోగించండి. శరీరం ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా చలువ చేసే పదార్థాలను తినడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి భోజనం తినాలిహైడ్రేటింగ్గా ఉండేలా చేసే పండ్లు, కూరగాయలను తినండి. (చదవండి: బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!) -
పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
సాక్షి, అమరావతి: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. వేసవి విడిదికి అనుకూలమైన దేశంలోని 50 ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించింది. ఇన్ క్రెడిబుల్ ఇండియాలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ‘కూల్ సమ్మర్స్ ఆఫ్ ఇండియా’ అంటూ విస్తృత ప్రచారం చేపట్టింది. మండు వేసవిలో శీతల భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6న దుబాయ్‌లో అరేబియన్ ట్రావెల్ మార్ట్‌లో కూడా ప్రచార చిత్రాన్ని ప్రదర్శించనుంది. చల్లని వాతావరణం ఉండే ప్రాంతాలు.. కేంద్ర పర్యాటక శాఖ 50కిపైగా వేసవి విడిది ప్రదేశాలతో జాబితాను రూపొందించింది. ఇందులో జమ్మూ, కశ్మీర్‌లోని గుల్మార్గ్, పట్నిటాప్, గ్రెజ్–మనస్బాల్, పితోర్‌ఘర్, ఔలి–చోప్తా, కిన్నౌర్, తీర్థన్, కేరళలోని వాయనాడ్–వాగమోన్, మిజోరంలోని ఐజ్వాల్, థెన్‌జాల్, సిక్కింలో లాచుంగ్–యుమ్తాంగ్, అస్సాంలోని హఫ్లాంగ్, పశ్చిమ బెంగాల్‌లోని కుర్సియోంగ్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు వేసవి అనుకూల గమ్యస్థానాలుగా ఉంటాయని ఆ శాఖ అభిప్రాయం. -
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
వేసవి కాలం వచ్చిందంటే విధ రకాల స్వీట్లు/రుచికరమైన చిరుతిళ్లు, ఐస్ క్రీమ్స్, కుల్ఫీలకు డిమాండ్ ఉంది. పిల్లలు కూడా మార్కెట్లో దొరకేవిధంగా కావాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో పరి శుభ్రంగా లేకుండా, ప్రతీదీ కల్తీ మయం అయి పోతున్న తరుణంలో బయట దొరికే కుల్ఫీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చాలా సులభంగా థండయ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలా చూద్దాం.అయితే కుల్ఫీ అనేది స్వచ్ఛమైన వెన్నతీయని పాలు, చక్కెర, ఏలకులు లేదా కుంకుమపువ్వు వంటి సువాసన పదార్ధంతో తయారు చేసే ఫ్రీజ్డ్ డెజర్ట్. మలై కుల్ఫీ, డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, కేసరి కుల్ఫీ అబ్బో ఇందులో చాలా రకాలున్నాయి. థండయ్ కుల్ఫీ కావలసినవివెన్న తీయని పాలు- 2 కప్పులు కోవా-100 గ్రాములు ; కండెన్స్డ్ మిల్క్-కప్పు; పాల పొడి- పావు కప్పు ; బాదం - 10 ; గసగసాలు- టేబుల్ స్పూన్ ; మిరియాలు-5 ; యాలకులు- 2 ; సోంఫు - టీ స్పూన్.తయారీ: ∙బాదం పప్పులను నానబెట్టి తొక్క వలిచి పలుకుగా గ్రైండ్ చేయాలి ∙గసగసాలను పది నిమిషాల సేపు నీటిలో నానబెట్టి గ్రైండ్ చేయాలి. అవి ఒక మోస్తరుగా మెదిగిన తర్వాత అందులోనే మిరియాలు, యాలకులు, సోంఫు వేసి అవి కూడా మెత్తగా మెదిగే వరకు గ్రైండ్ చేయాలి ∙పాలను ఒక వెడల్పాటి పాత్రలో ΄ోసి మరిగించాలి. కాగిన పాలలో కోవా, కండెన్స్డ్ మిల్క్, పాలపొడి వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలి. ఇవి మరిగినంత సేపూ అడుగుపట్టకుండా గరిటెతో అడుగు వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని, బాదం పలుకులను వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగనిచ్చి దించేయాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఎనిమిదిగంటలు వెయిట్ చేసిన తరువాత , హ్యాపీగా లాగించేయడమే. -
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
మనం తినాలనిపించినప్పుడో లేదా ఘుమఘుమలాడే వేడివేడి పప్పులో నెయ్యి వేసుకుంటే ఆ రుచే వేరు. ఏడాది పొడవునా కొందరూ నెయ్యి వేసుకుని తింటుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేసవిలో కచ్చితంగా ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. అసలు ఈ వేసవిలో దాహం దాహం అంటుంది వాతావరణం. అలాంటి ఈ టైంలో నెయ్యి వేసుకంటే అమ్మో దాహమే దాహంగా ఉంటుంది కదా మరీ ఇలా ఎలా చెబుతున్నారు? రీజన్ ఏంటీ తదితరల గురించి సవివరంగా చూద్దాం. ఆయుర్వేద ప్రకారం నెయ్యి ఆహారానికి మంచి శక్తిని ఇచ్చే రుచికరమైన పదార్థం. నెయ్యి తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. శీతాకాలం లేదా వేసవికాలంలో నెయ్యిని తరుచుగా తీసుకుంటాం గానీ వేసవిలోనే దీన్ని ఎక్కువగా తీసకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..?నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, సీలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి కణజాలాలకు పోషణనిస్తాయి. పైగా అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది. శరీరం వేడిని తగ్గించడంలో నెయ్యికి మించిది మరోకటి లేదు. శరీరీంలో ఆరోగ్యకరమైన కొవ్వులు కోసం నెయ్యిని రోజువారి అల్పాహారంలో తీసుకోవడం మంచిది. ఈ ఆరోగ్యకరమై కొవ్వులు శరీరంలో పోషకాలను గ్రహించడానికి ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. నెయ్యిలో మాయిశ్చరైజింగ్ గుణాలు శరీరాన్ని హైడ్రేటింగ్ ఉంచడంలో సహాయపడతాయి. నెయ్యి తీసుకోవడంలో శరీరం మృదువుగా ఉంలేలా లోపలి నుంచి పోషణ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరం సులభంగా డీహైడ్రేట్ అయినప్పుడు నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనల్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. అంతేగాదు దీనిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్, స్వల్పకాలిక కొవ్వు ఆమ్లం, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ముఖ్యంగా ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పైగా పిత్త దోషాన్ని నియంత్రిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంది. అలాగే అనారోగ్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, శరీరం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, పోషకాలను గ్రహించడంలో సహాయపడటానికి నెయ్యి ఉత్తమమైన ఆహారాలలో ఒకటిగా చెప్పవచ్చు.నెయ్యి తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచడమే గాక మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే..? నెయ్యి మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శాంతపరిచే ప్రభావాన్ని అందిస్తుంది. నెయ్యి రుచిలో తీపి, చల్లని స్వభావం కలిగి ఉంటుంది. ఇది హాట్‌గా ఉండే వేసవి కాలంతో శరీరాన్ని చల్లగా ఉంచడంలో నెయ్యి ది బెస్ట్ అని చెప్పొచ్చు.(చదవండి: సీవీడ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!) -
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు ప్రకృతి సహజం. అందుకే సీజన్‌కు తగ్గట్టుగా మన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చెమట రూపంలో నీరు ఎక్కువ నష్టపోతాం కాబట్టి, నీరు ఎక్కువగా లభించే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఈ క్రమంలో సమ్మర్లో కీరదోసకాయను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. నిజానికి కీరదోస ఏ సీజన్లో తీసుకున్నా మంచిదే. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. వేసవిలో అయితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయలు కేలరీలు తక్కువ. విటమిన్లు , ఖనిజాలు ఎక్కువ. కరిగే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.కీరదోసతో లాభాలుహైడ్రేషన్ & డిటాక్సిఫికేషన్ కోసం మంచిదిరక్తపోటును నియంత్రిస్తుందిజీర్ణక్రియకు మంచిదిబ్లడ్ షుగర్ తగ్గిస్తుందిబరువు తగ్గడంలో ఉపయోగపడుతుందిమెరుగైన చర్మం కోసంకళ్లకు సాంత్వన చేకూరుస్తుందికేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందివడదెబ్బతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో 95 శాతం నీటితోపాటు, పొటాషియం,మెగ్నీషియం లభిస్తాయి. సోడియం లోపం ఉన్నవారు ఆహారంలో ఈ కీర దోసకాయని తీసుకుంటే మంచిది. పొట్టుతో కీర దోసకాయ తినడం వల్ల గరిష్టంగా పోషకాలు అందుతాయి.ఫ్లేవనాయిడ్లు ,టానిన్లతో సహా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి ,దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కీర దోసకాయలోని పెక్టిన్ పేగు కదలికలను బాగు పరుస్తుంది. తద్వారా మలబద్దకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. -
హైదరాబాద్ లో బీర్లు కరువు
హైదరాబాద్: బీర్ల కొరత తీవ్రంగా ఉంది. వైన్ షాపులలో కొన్ని బ్రాండ్లకు చెందిన బీర్లు లభించడం లేదు. వేసవి కారణంగా చోటుచేసుకున్న నీటి ఎద్దడి , గత ప్రభుత్వం హయాంలో పేరుకొనిపోయిన పెండింగ్ బకాయిల కారణంగా బీర్ల తయారీని నిలిపివేసినట్లు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో చాలా వైన్‌షాపుల వద్ద ‘నో బీర్స్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. -
వేసవి అభ్యాసం
‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః -
సికింద్రాబాద్ బొల్లారంలో వేసవి శిబిరం
సికింద్రాబాద్ బొల్లారంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వర్. విద్యార్థులందరికీ వేసవికాలం సెలవులు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే.. వచ్చే విద్ఆయ సంవత్సరం వారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.వేసవి శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పిల్లలకు భరతనాట్యం, కర్ణాటక సంగీతం, సంస్కృత శ్లోకాలు, జానపద నృత్యకళల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులను, గురువులను నియమించుకున్నారు.ఇవ్వాళ్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రియాంకను ఆహ్వనించగా.. వేసవి శిబిరాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనే విద్యార్థులను ఉద్దేశించి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వరు మాట్లాడారు. క్రీడలు, వ్యాయామం, యోగను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. సమ్మర్ క్యాంపులో నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా శ్రద్ధ పెట్టాలన్నారు. -
Pragya Jaiswal: కలర్‌ఫుల్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లుక్స్.. ఫోటోలు
-
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
ఉసిరి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయో తెలిసిందే. అయితే దీన్ని వేసవిలో తీసుకోవచ్చా. తింటే మంచిదేనా..? అని చాలామందికి ఎదురయ్యే సందేహం. ఆయుర్వేదం పరంగా ఔషధంగా ఉపయోగించే ఈ ఉసిరిని వేసవిలో తీసుకోవచ్చా అంటే..నిపుణులు బేషుగ్గా తీసుకోవచ్చని చెబుతున్నారు. సమ్మర్ హీట్‌కి సరైన ఫ్రూట్ అని చెబుతున్నారు. వేసవిలో ఉసిరి తీసుకోవడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందామా..!వేసవిలో అందరూ ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్. దీని కారణంగా జీర్ణ సమస్యలు, అలర్జీలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి పలు సమస్యలు ఎదుర్కొంటారు. వాటికి చెక్‌పెట్టడంలో ఉసిరి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సమ్మర్ హీట్‌ని తట్టుకునేలా రోగనిరోధక శక్తినిపెంచి, పొట్టలో వచ్చే మంటను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక విటమిన్ సీ కంటెంట్ ఫ్రీ రాడికల్స్‌గా పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టాన్ని అరికడుతుంది. అలాగే శరీర కణాలు, కణాజాలా ఆరోగ్యకరమైన పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఉసిరి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి ఉష్ణ సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. శరీరానికి చలువ చేస్తోంది. ఇది హైడ్రేట్‌గా ఉంచడంతో అంతర్గత ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా చాలా నీరు చెమట రూపంలో వెళ్లినా.. శరీరాన్ని హైడ్రేటడ్గా ఉంచడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. అందువల్ల జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రించి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు దగ్గు, జలుబు, జ్వరం, అలెర్జీలు వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకునేలా చేస్తుంది. కొలస్ట్రాల్‌కి చెక్‌పెడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఎల్డీఎల్ లేదా చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఇది ఆకలిని తగ్గించి, బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ రేడియేషన్, పర్యావరణ కారకాల నుంచి రక్షిస్తుంది. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉండేలా చేసి ముఖంపై పడే ముడతలను నివారిస్తుంది. అందువల్ల సమ్మర్లో ఎండ వేడిని తట్టుకోవడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుందని, తప్పక తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ కూతురు!) Breadcrumb -
సమ్మర్లో కంఫర్టబుల్‌గా... కలర్ఫుల్గా! (ఫోటోలు)
-
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
ఉదయం ఎనిమిది గంటలకే వేడి గాలులు వణుకు పుటిస్తున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావాలంటేనే పెద్ద వాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితి. ఇక పిల్లల్ని బడికి పంపించాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కనౌజ్‌లోని ఒక స్కూలు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. దీంతో స్విమ్మింగ్ పూల్ పిల్లలు సంబరపడిపోతున్న వీడియో వైరల్ గా మారింది.Vaibhav Kumar, Principal says, " As the weather department informed about the heat wave, we were asking students to drink water and cool drinks...we also told them that people in cities bathe in swimming pools. Students asked us what swimming pools look like and when will they… pic.twitter.com/oyFqbpTI5V— ANI (@ANI) May 1, 2024 రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య పిల్లల్ని బడికి రప్పించేందుకు, వారి సౌకర్యార్థం ఒక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎండలు, వడగాల్పుల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రిన్సిపాల్ వైభవ్ కుమార్.క్లాస్ రూంలో, స్మిమ్మింగ ప్రస్తుతం గోధమ పంటపనులు నడుస్తున్నాయి కనుక చాలా కుటుంబాలు విద్యార్థులను పాఠశాలకు పంపడం లేదు. వారిని తిరిగి పిలవడానికి వెళ్ళాము, కానీ సరైన స్పందన లభించలేదు అందుకే ఈ వినూత్న ఆలోచనతో చేశాం. దీంతో హాజరు శాతం పెరిగింది. .. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.#WATCH | Uttar Pradesh: A govt school in Kannauj makes a swimming pool inside the classroom, amid rising temperature. pic.twitter.com/rsXkjDFa7a— ANI (@ANI) May 1, 2024 ఎండలనుంచి ఉపశమనం పొందేలా నీళ్లు, చల్లని పానీయాలకు తాగమని విద్యార్థులకు చెప్పాం. అయితే నగరాల్లో మాదిరిగా తమకు స్విమ్మింగ్ పూల్ కావాలని పిల్లలు అడిగారు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తసీఉకొని క్లాస్రూమ్ లోపల ఈత కొలను ఏర్పాటు చేశమన్నారు అసిస్టెంట్ టీచర్ ఓం తివారీ. -
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
జుట్టు రాలకుండా జాగ్రత్త ఇలా...జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. అయితే మనం మామూలుగా ఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రొటీన్ల లోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో నివారించవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే మార్గాలూ..ప్రొటీన్ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం... వారు తగినంతగా ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకోక΄ోవడమే. ఈ ప్రొటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు రిపేర్లకూ దోహదపడతాయి. అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారంలో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు చాలా ఎక్కువ. శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలి΄ోయేలా చేస్తాయి. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండి΄ోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. నివారణ ఇది: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి. -
నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండ మంటలు చల్లారడం లేదు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యంలో 8, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. పల్నాడు జిల్లాలో 21, ప్రకాశం 18, ఏలూరు 18, తూర్పుగోదావరి 17, నెల్లూరు 16, గుంటూరు 16, అనకాపల్లి 15, శ్రీకాకుళం 15, కాకినాడ 13, తిరుపతి 12, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, బాపట్ల 11, విజయనగరం 10, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, పార్వతీపురం మన్యం 7, వైఎస్సార్ 5, విశాఖపట్నం 1, అనంతపురం 1, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 121 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. నిప్పులుగక్కిన ఎండ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కూడా ఎండ నిప్పులుగక్కింది. పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగానెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు. 21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. -
నిప్పుల కొలిమి!
పదేళ్లలో ఇవే అత్యధికంగత పదేళ్ల వేసవి సీజన్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్నవే అత్యధికమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మే ప్రారంభంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఎప్పుడూ కూడా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అటుఇటుగా నమోదయ్యేవని.. ఇప్పుడు మాత్రం 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది.. దంచికొడుతున్న ఎండలతో కుతకుత లాడుతోంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్కుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలు కూడా దాటిపోయాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండ జిల్లా గుడాపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 46.5, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, నల్లగొండ జిల్లా చండూరులో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొనసాగుతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఏకంగా 5 డిగ్రీ లు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నట్టు తెలిపింది.11 జిల్లాలకు రెడ్ అలర్ట్..ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజా మాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యా పేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని.. వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీయవచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తక్షణ సహాయక చర్యలు తీసు కునేలా సమాయత్తం కావాలని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. -
మరి ఆ రోజుల్లో... అలా.. మేడమీద చదువులు
రాత్రి భోజనాల తరువాత మా చదువు మొదలయ్యేది. అప్పుడప్పుడూ ఆదివారాలు మధ్యాహ్నాలు కూడా. మధ్యాహ్నాలు పర్లేదు వెలుతురయ్య ఎల్లడై ఉన్న సమయం అది. రాత్రి సమయపు లెక్కలు వేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో అనవసరమైనది, అవసరానికి మించినదీ ఏది ఉండేది కాదు. రాత్రి చదువుకు వెలుతురు కావాలి అంటే దానికి బల్బు కావాలి, కరెంటు లాగడానికి వైర్ కావాలి, బల్బ్‌కు హోల్డర్ కావాలి, వైరుకు ప్లగ్గు కావాలి, ఒక స్విచ్చు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి. ఉన్న నలుగురైదుగురం తలా ఇంత అని వేసుకుని అవన్నీ కొనుక్కుని తెచ్చుకుని బిగించుకుని చదువుకు సిద్దం అయ్యేవాళ్ళం. పుల్లయ్యగాడు వాడి వాటాకు డబ్బులు కాక ఇంటినుండి కరెంటు గుంజి తెచ్చేవాడు. బల్బు వెలిగేదిఆ విధంగా కాంచిపురముననొకడు కాంచనగుప్తుడను వైశ్యుడి దగ్గరి నుండి, వాటర్లూ యుద్దాలు, చిరపుంజిలో వర్షపాతము, గర్జించే నలభైలు, తళ్ళికోట చరిత్ర, గణిత సూత్రాలు, బీజీయ సమాసాలు, ఐ లే ఇన్ సారో డీప్ డిస్ట్రెస్స్డ్, మై గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హర్డ్, హిజ్ లుక్స్ వర్ కోల్డ్, హి గేవ్ మీ గోల్డ్… అనే శబ్ద పాండిత్యాన్ని బట్టీప్రవాహంలా ఒకళ్ళమీదికి ఒకళ్ళము ప్రవహింపజేసుకునేవాళ్ళము.ఉదయం ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీదకి చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు. మాకు అప్పటికి అంతగా తెలియని పరకాయ ప్రవేశవిద్య ఒకటి వారు సాధన చేస్తూ ఉండేవారు. దానివలన చదువు భంగం అయ్యేది. విశ్వామిత్రుడికీ దూర్వాసుడికీ కూడా ఎదురవ్వని అనుభవాలు మావిఅన్వర్, సాక్షి -
వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. వేసవిలో శునకాలు రెచ్చిపోతుండటాన్ని మనం చూస్తుంటాం. అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.మనుషులకు మాదిరిగానే చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం మొదలైనవి కుక్కల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం కుక్కలు చల్లని వాతావరణంలో ఉదాశీనంగా ఉంటాయి. అయితే వేసవికాలం రాగానే అవి హైపర్ యాక్టివ్‌గా మారిపోతాయి. వేసవిలో కుక్కలు మరింత దూకుడుగా మారుతాయని ఒక పరిశోధనలో వెల్లడయ్యింది.అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోస్ ఆర్చ్ తెలిపిన వివరాల ప్రకారం వేసవి కాలంలో శునకాలు మరింత వేడి అనుభూతికి లోనవుతాయి. వేసవికాలం మనుషులకు మించి శునకాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అధిక వేడి లేదా ఉష్ణోగ్రత శునకాలలోని థర్మోగ్రూలేషన్ను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కుక్కలు వేడిని తట్టుకోలేవు. ఇటువంటి పరిస్థితిలో కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి.వేసవి కాలంలో కుక్కలలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుతుందని పెన్ స్టేట్ యూనివర్శిటీ ఒక పరిశోధనలో కనుగొంది. దీని కారణంగా అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని గుర్తించారు. ఈ సమయంలో కుక్కలు ఆకస్మికంగా మొరగడం, మనుషులను చుట్టుముట్టడం, కరవడం, పరిగెత్తడం లాంటి చర్యలను చేస్తాయి.వేసవిలో పెంపుడు శునకాలు లేదా వీధి కుక్కలు ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవి ఎప్పుడూ నీరసంగా పడుకున్నట్లు కనిపిస్తే, అవి వడ దెబ్బకు గురయ్యాయని గుర్తించాలి. అటువంటి స్థితిలో వాటికి వైద్య సహాయం అందించాలి. -
రెండ్రోజులు మండే ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ శాతం పెరగడం, పొడి వాతావరణంతో వడగాడ్పుల తీవ్రత కూడా అధికమవుతోంది. మాడుతున్న నల్లగొండ..: సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోకెల్లా నిజామాబాద్‌లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలం, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో 2–3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మతూర్లో 45.5 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 45.2 డిగ్రీలు, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్‌లో 45.1 డిగ్రీలు, అదే జిల్లాలోని మాడుగులపల్లిలో 45.0 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలుచోట్ల తీవ్రంగా వడగాడ్పులు రానున్న రెండ్రోజులు పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 30 నుంచి మే 2వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. తక్షణ చర్యలు చేపట్టేలా ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
ఏప్రిల్‌లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రామానుజ్‌గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్‌లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్‌గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్‌గంజ్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మండ్రూప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ 07234) ఈ నెల 28నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో రాత్రి 11.40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, కుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, బద్రాక్, ఖరగ్‌పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచి చేరుతుందన్నారు. ఈ ట్రైన్ (నంబర్ 07235) తిరిగి ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. విజయవాడకు బుధవారం ఉదయం 8.45కు వస్తుంది. 18 బోగీలతో నడిచే ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఉండదన్నారు. స్టేషన్లలో బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చునని తెలిపారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. -
సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!
వేసవి అంటే పిల్లలకు ఆటవిడుపు కాలం. పరీక్షలు పూర్తయ్యిన తరువాత ఆనందంగా ఆడుకునే కాలం. ఎండా, కొండా లెక్క చేయకుండా హాయిగా తోటి స్నేహితులతో కలిసి చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహంగా గడిపే కాలం. మరి ఇలాంటి సమయంలో వారికి మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. ఇంట్లోనే రుచికరంగా తయారు చేసి పెట్టాలి. తాజా ఆకుకూరల్ని, కూరగాయల్ని, పండ్లను డైట్లో ఉంచాలి. మంచి పోషకాహారమే వారికి అసలైన దివ్యౌషధం. మొలకలొచ్చిన గింజ ధాన్యాలు శనగలు, పెసలతోపాటు మొలకలు వచ్చిన గింజలతో క్యారట్ లాంటి కూరగాయ ముక్కల్ని కలిపి సలాడ్‌లా పెడితే కాల్షియం, ఇతర ప్రొటీన్లు లభిస్తాయి. దీంతో వారి ఎముకలు, కండరాలు దృఢంగా పెరుగుతాయి. ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఉడికించిన శనగలు ఉడికించిన శనగలు రెగ్యులర్‌గా తీసుకుంటే రక్త హీనతకు చెక్ చెప్పవచ్చు. ఇందులోని ఐరన్ కంటెంట్ శరీరానికి అంది రక్త వృద్ధి జరుగుతుంది.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. మెదడు చురుగ్గా, వేగంగా పని చేస్తుంది.అలసట, నీరసం వంటి సమస్యలుండవు. పిస్తా, బాదం, జీడిపప్పుతో పాటు పల్లీలు, కుసుమలు. లాంటి గింజలను ఆహారంలో చేరిస్తే చిన్నారుల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బల వర్ధకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించటం వల్ల పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. ప్రతిరోజూ కాల్షియం కోసం పాలు, పౌష్టికాహారం కోసం కోడిగుడ్లు లాంటివి సరైన సమయంలో వారికందేలా చేస్తే తొందరగా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బలవర్ధకమైన సలాడ్ ఉడికించిన శనగలు, ఉడికించిన బొబ్బర్లు, ఉడికించిన పెసలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, యోగర్ట్, కొద్దిగా కొత్తిమీర, తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగానేఉడికించి పెట్టుకున్నగింజలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి బాగాకలపాలి. దీనికి తాజా యోగర్ట్, కొద్దిగా ఉప్పు, మిరియాలు వేసి కలపాలి. దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తమీద చల్లి, చల్లచల్లగా అందిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల ఇష్టాఇష్టాలను బట్టి, ఇందులో కొబ్బరి, వేయించిన పల్లీలు, స్వీట్‌కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బలవర్ధక ఆహారం కూడా. -
నిప్పుల కొలిమి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వక తిప్పలు పడుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 45 డిగ్రీలు, మాడుగులపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజులు ఇలానే.. రాష్ట్రంలో మరో మూడు రోజులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇదే తరహా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యా హ్నం పూట బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్ర ఎండలతో జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలు,వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారో గ్య విభాగం సూచించింది. ఈ మేరకు శుక్రవార ం ప్రకటన జారీ చేసింది. వాతావరణ శాఖ కూ డా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. అవేమంటే.. ► దాహం వేయకపోయినా కూడా అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. బాగా గాలి వచ్చే, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► ఎండకు వెళ్లాల్సి వస్తే.. సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించాలి. తలపై టోపీ, గొడుగు వంటివి కప్పుకోవాలి. ► మధ్యాహ్న సమయంలో ఆరు బయట తీవ్ర శారీరక శ్రమ చేయవద్దు. ► ఎవరైనా వడదెబ్బకు లోనైట్టు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం అందించాలి. -
క్రికెట్లో కృత్రిమ మేధ.. ఐస్ కూల్‌గా ఐపీఎల్ (ఫోటోలు)
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం రావడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ, మోటర్ల వినయోగంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువవుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వినియోగం జరిగింది. గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లు కాగా గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. అయితే విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ అధికారులు ఏలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖ, సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు. -
సమ్మర్ ఎఫెక్ట్: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: సిటీలో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండల తీవ్రతతో హైదరాబాద్ నగర పరిధిలో బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ తగ్గించనుంది. మధ్యాహ్నం 12 గంటల 4 గంటల వరకు గతం కంటే తక్కువ బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు వెల్లడించారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీలో బస్సులను యధావిధిగా నడపనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి సిటీలో మధ్యాహ్నం వేళల్లో బస్సులు తగ్గనున్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ఇదీ చదవండి.. తెలంగాణకు వర్ష సూచన.. 10 రోజుల పాటు -
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
అగ్గి రాజుకుంటోంది
సాక్షి, హైదరాబాద్ : అడవుల్లో ‘అగ్గి’ రాజుకుంటోంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అడవుల్లో అగ్నిప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 1,500లకు పైగా అగ్నిప్రమాదాలు రిపోర్ట్ కాగా నల్లమల, ములుగు, ఇతర ప్రాంతాల్లోని 6 వేల హెక్లార్లలో అటవీభూమికి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మూడోవంతు దాకా అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు /ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో (ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియా) మూడో వంతు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అగ్ని ప్రమాదా లకు సంబంధించి పదిహేను ఏళ్లుగా సేకరించిన సమాచారం, డేటా ఆధారంగా చేసిన విశ్లేషణల్లో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. ♦ తెలంగాణవ్యాప్తంగా మూడువేలకు పైగా ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. ప్రతీ ఫారెస్ట్ బీట్‌లో ఫైర్బ్లోయర్లు, రేక్స్, పారలు, ఫైర్ బీటర్స్, సిబ్బందికి అగ్నినిరోధక దుస్తులు, బూట్లు, హెల్మెట్లు వంటివి అందుబాటులో ఉండాలి. అయితే ప్రస్తుతం 550 ఫైర్బ్లోయర్లు ఉండగా వాటిలో పదిశాతం వరకు మరమ్మతులు చేయాల్సి ఉందని సమచారం. ♦ వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశమున్న రోజులలో (పీక్ సీజన్లో) కేవలం 95 ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నట్టుగా వెల్లడైంది. దీనిని బట్టి అడవుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు సంబంధించి అధికా రులు పూర్తిస్థాయిలో సన్నద్ధమై లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను అటవీశాఖ అధికారులు ఏకీభవించడం లేదు. ♦ ములుగు, అమ్రాబాద్, ఇతర అటవీ ప్రాంతాల్లో కావాలనే అగ్ని ప్రమాదాలకు పాల్పడుతున్న వారిని గురించి వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టామని, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వాటికి పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు అత్యధికంగా మానవ తప్పిదాలతోనే ఈ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అయితే ఇవి చిన్న చిన్నవే కావడంతో ఎక్కువ నష్టం జరగకుండా ఆర్పేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ ‘ఫారెస్ట్ఫైర్స్’ చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోందని, ఈ మంటల అదుపునకు వెంటనే చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 21,739 కి.మీ పరిధిలో ఫైర్‌లైన్స్ వేయడంతో పాటు, అడవులకు ఆనుకుని 11వేల కి.మీలలో ‘పెరిఫెరల్ ట్రెంచెస్’ తవ్వి మంటల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అరణ్యభవన్‌లో రాష్ట్రస్థాయిలో ఫైర్ మానిటరింగ్, కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షిస్తూ ,ఫైర్ అలర్ట్స్ కోసం టోల్‌ఫ్రీ నంబరు, వాట్సాప్నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అగ్గి ప్రమాదాలకు అవకాశం ఇలా.. ♦ రాష్ట్రంలో మొత్తం 53 అటవీ డివజన్లు ఉండగా, వాటిలో 23 దాకా హై–ఫైర్ ప్రోన్‌గా గుర్తించారు ♦ 1,208 ఫారెస్ట్ రేంజ్‌లకు గాను 45 రేంజ్‌లలో హై–ప్రోన్ రేంజేస్గా ఉన్నాయి ♦ పదివేల ఫారెస్ట్ కంపార్ట్ మెంట్లు (ఒక్కోటి 250 నుంచి 500 హెక్టార్లు కవర్ చేస్తుంది) ఉన్నాయి ♦ వీటిలో 1,120 కంపార్ట్మెంట్ల (హై–ఫైర్ ప్రోన్) దాకా పెద్ద అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 1,700లదాకా మధ్యంతరంగా (మీడియం–ఫైర్ప్రోన్) అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 4,260 దాకా అటవీ సమీప గ్రామాల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం ♦ వీటిలో 1,250లకుపైగానివాస ప్రాంతాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరిగే చాన్స్. -
చల్లచల్లని కూల్ కూల్
ఈ వేసవిలో ఆకాశానికి ఏసీ బిగిస్తే? మనం నడుస్తూ ఉంటే గాలి గొడుగు పడితే? కూర్చున్న చోటు చల్లని మందిరంగా మారితే? అసలు వేసవి మొత్తం కూల్ కూల్‌గా అనిపిస్తే? నిజంగా ఎలాగూ జరగదు. ఘోరమైన ఎండల్లో మాడక తప్పదు. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగి ఇలాంటి ఊహలు చేసి ఆనందిస్తున్నారు జనం. మార్తాండుడి ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే ఎండాకాలంలో. వట్టివేర్లు కిటికీలకు కట్టుకునేవారు, కూల్ పెయింట్ చేయించుకునేవారు, గోతాం పట్టాలు కట్టుకుని నీళ్లు చల్లుకునేవారు, ఏసీలు కొనుక్కునేవారు, కూలర్లు రిపేర్లు చేయించుకునేవారు, కొబ్బరి మట్టలతో పందిరి వేసుకునేవారు... చల్లదనం కోసం ఎన్నో మార్గాలు. అయితే మన నెత్తి మీదే ఎప్పుడూ ఫ్యాన్ ఉండాలని, మనం ఎక్కడ కూచున్నా జిల్లుమనాలని అత్యాశ కూడా ఉండొచ్చు. ‘ఇలాంటి ఆశలు మాకున్నాయి. అవి తీరినట్టుగా ఫొటోలు చేసి చూపించు’ అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగితే అది తయారు చేసిన ఫొటోలు నెట్లో వైరల్ అయ్యాయి. నెత్తి మీద ఐసు గడ్డల హెల్మెట్ ఉన్న అవ్వ, ఐసు బల్ల మీద కూచుని టూరిస్ట్‌లు, ఐసు స్కూటర్ మీద రివ్వున దూసుకెళ్లే అమ్మాయి, ఒళ్లంతా ఫ్యాన్లు మొలిచిన గరీబు... ఇవన్నీ ఏ.ఐ చూపించి ఐసు వాటర్ తాగిన ఫీలింగ్ కలిగించింది. -
వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే ఎక్కువ నీళ్లు తాగాలి. వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని పానీయాలను తీసుకోవాలి. ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం! ► అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. ► పల్చటి మజ్జిగలో నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణసమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. సౌందర్య పోషణలో ►చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ►మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్‌లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి. ► కాల్షియం, విటమిన్స్ , ఇతరపోషక విలువల కారణంగా మజ్జిక కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది. -
తెలంగాణకు 8.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో.. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్‌ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్‌కుమార్, ఈఈ విజయ్‌భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు. -
వేసవికి ప్రత్యేక రైళ్లు..
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను నడప నున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ ఓ ప్రకటలో తెలిపారు. హైదరాబాద్–టక్ ప్రత్యేక రైలు(07165) ఈ నెల 16, 23, 30 తేదీల్లో అంటే ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి కటక్ వరకు, తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07166) ఈ నెల 17, 24, మే 1 తేదీల్లో అంటే ప్రతి బుధవారం కటక్ నుంచి హైదరాబాద్ మధ్య నడవనున్నాయి. సికింద్రాబాద్–సత్రగచ్చి ప్రత్యేక రైలు(07223) ఈ నెల 19 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సత్రగచ్చి మధ్య, సత్రగచ్చి–సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు(07224) ఈ నెల 20 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం, సికింద్రాబాద్–షాలిమార్ మధ్య నడిచే రైలు(07225) ఈ నెల 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, షాలిమార్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు(07226) ఈ నెల 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం నడవనున్నాయి. సికింద్రాబాద్–కొల్లం(07193) ఈ నెల 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో ప్రతి బుధవారం సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 11.25 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07194) ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అంటే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
సమ్మర్లో డీహైడ్రేషన్‌కు చెక్‌పెట్టేవి ఇవే..!
సమ్మర్ ఇలా ప్రారంభమయ్యిందో లేదో అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఓ పక్క జనాలు వడదెబ్బకు తాళ్లలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ కాలంలో మండే ఎండలను తట్టుకోవాలంటే అధికంగా నీరు తాగడమే కాక శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండేలా చూసుకోవాలి. కేవలం నీరు, మజ్జిగ రూపంలో ద్రవ పదార్థాలు తీసుకోవడమే కాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండు తీసుకోవడం మరింత మేలు. అందుకోసం తీసుకోవాల్సిన పండ్లు ఏంటో సవివరంగా తెలుసుకుందామా..! పుచ్చకాయ అధిక వాటర్ కంటెంట్‌కి ప్రసిద్ధ. వేసవిలో దీన్ని తీసుకుంటే దాహం కట్టడుతుంది. వడదెబ్బ నుంచి సులభంగా బయటపడగలుగుతాం. వేసవి తాపం నుంచి మంచి ఉపశమనం కలిగించే ఫ్రూట్ పుచ్చకాయ అని చెప్పొచ్చు. దోసకాయలు.. ఇది ఏకంగా 96% నీటిని కలిగి ఉంటుంది. నీటితో ప్యాక్ చేసిన మంచి ఫ్రూట్‌గా పేర్కొనవచ్చు. కేలరీలు తక్కువగా ఉండటమే గాకుండా కావల్సినన్నీ విటమిన్లు, ఫైబర్లు ఉంటాయి. ఈ దోసకాయని సలాడ్‌రూపంలో లేదా అల్పాహారంగానూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొబ్బరి నీరు ఇది ద్రవాల తోపాటు కోల్పోయిన నీటిని ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. ఇందులో ఉండే సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు కీలకమైన శారీరక విధులకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డీహైడ్రేషన్ నుంచి కాపాడటంలో సమర్థవంతంగా ఉంటుంది. టమోటాలు.. వీటిలో కూడా 94% నీటి కంటెంట్ ఉంటుంది. ఫైబర్, కేలరీలు సమృద్దిగా ఉంటాయి. ఇందులో ఉండే లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని అందించి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. చర్మ ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. బూడిద గుమ్మడికాయ ఇందులో 96% నీటి కంటెంట్ ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆమ్లత్వంతో కూడిన ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెద్దప్రేగుని నిర్వహించడంలోను జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ సమర్థవంతంగా ఉంటుంది. బెల్ పెప్పర్స్ క్యాప్సికంనే బెల్ పెప్పర్స్ అని కూడా అంటారు. ఇది వంటకాలకు మంచి రుచిని, వాసనను అందిస్తాయి. విటమిన్ సీ, విటమిన్ బీ6, బీటా కెరోటిన్, థయామిన్, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు ఉంటాయి. స్ట్రాబెర్రీలు స్ట్రాబెర్రీల్లో దాదాపు 91% నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్‌తో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది కడుపులో మంటను తగ్గించడంలోనూ వివిధ వ్యాధుల నుంచి రక్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. నారింజలు.. ఇందులో కూడా మంచి నీరు కంటెంట్ ఉంటుంది. విటమిన్ సీ, పొటాషియం, వంటి యాంటి యాక్సిడెట్లు సమృద్దిగా ఉంటాయి. గుండె ఆరోగ్యం, వాపు తగ్గింపుకు తోడ్పడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయ పడుతుంది. ఇందులో సిట్రిక్యాసిడ్ కంటెంట్, ఆర్ధ్రీకరణను ప్రోత్సహించే లక్షణాలు కారణంగా డీహైడ్రేన్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. (చదవండి: ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!) -
నిడమనూరు@44.5 రాష్ట్రం నిప్పుల కొలిమి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేగంగా వీస్తున్న వడగాడ్పులు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం లేదా చివరి వారంలో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మొదటి వారం నుంచే వేడి గాలులు వీయడం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. సోమవారం సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఏప్రిల్ 8న రాష్ట్రంలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కాగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణ సగటు కంటే 32 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 42 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో కుతకుతలాడాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదైంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత అధికంగా ఉంది. తప్పనిసరైతేనే బయటకెళ్లాలి రానున్న రెండ్రోజులు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సీయస్ నుంచి 44 డిగ్రీ సెల్సీయస్ మధ్యన నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధ వారాల్లో ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్నిచోట్ల వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. -
జర జాగ్రత్త.. అవి ఓఆర్ఎస్లు కాదు.. ప్యాకేజ్డ్ జ్యూస్‌లే!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. అయితే దీని చికిత్సకు తక్షణ పరిష్కారంగా బాధితులు మెడికల్ షాపుల నుంచి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్)ను పోలిన వాటిని వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్న ఉదంతాలు హైదరాబాద్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోంది. దీనికి కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్ఎస్లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులు వినియోగిస్తున్న వాటిలో అనేకం నిజానికి ఓఆర్ఎస్లు కావని... అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేమితో వాటిని వినియోగించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయమే.. ఆకస్మిక అనారోగ్యం తద్వారా నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరం నుంచి లవణాలు,నీరు అధికంగా కోల్పోవడాన్నే డీహైడ్రేషన్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల శరీరంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. అది అనంతరం ఫిట్స్ రావడానికి లేదా కిడ్నీ ఫెయిల్ కావడం వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయొచ్చు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి బాధితులకు వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్ ద్వారా మనం కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసేదే ఓఆర్ఎస్. అలవాటులో పొరపాటుగా... కానీ భాగ్యనగరంలో అనేక మంది డీహైడ్రేషన్‌కు గురవగానే ఓఆర్ఎస్లుగా భావించి వాటిని పోలిన పేర్లతో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కనిపించే వాటిని ఓఆర్ఎస్ఎల్ అని, రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ మొదలైన పేర్లతో కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిని ఓఆర్ఎస్గా వాడకూడదని చిన్న అక్షరాల్లో ఓ మూలకు రాస్తుండటంతో చాలా మంది వాటిని గమనించక ఓఆర్ఎస్గా భావించి వాడుతున్నారు. రివర్స్ రిజల్ట్... పండ్ల రసాలను ఓఆర్ఎస్గా భ్రమింపజేసేలా లేబుల్ అతికించి విక్రయించడంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి అధిక చక్కెరను కలిగి ఉంటాయని, అతిసారాన్ని తగ్గించే బదులు మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర శాతం అధికంగా ఉండే జ్యూస్‌ల వాడకం వల్ల మనం ఏ ప్రయోజనం ఆశించి వాటిని తీసుకుంటున్నామో వాటికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంటే విరేచనాలు, వాంతులు మరింతగా పెరుగుతాయని వివరిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా కీలకం... కేవలం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్‌ఎస్‌లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాíÙయం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని... కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే నిర్జలీకరణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కల్పించాలి.. ఈ సమస్యపై కొన్నేళ్లుగా రకరకాల వేదికలపై పోరాడుతున్నా. అసలైన ఓఆర్ఎస్ను పోలిన లేబుల్స్‌తో ఉన్న ప్యాకేజ్డ్ జ్యూస్‌లను వాడటం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలు -
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాడ్పులూ వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8, 9 గంటల ప్రాంతంలోనే ఇంటినుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల కారణంగా.. మార్చి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారినపడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స చేయాలి. దుస్తులు వదులు చేసి చన్నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేయాలి. 72 ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. వడదెబ్బ నివారణకు, అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే వైద్య శాఖ మార్గదర్శకాలిచి్చంది. పీహెచ్సీ వైద్యులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేసింది. గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై, వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదైన 72 ఆస్పత్రులను వైద్య శాఖ గుర్తించింది. వీటిల్లో క్లైమేట్ రెసిలియంట్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించడానికి వీలుగా ఈ వార్డుల్లో ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మండిన సన్డే సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా అలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక చోట్ల 40–44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా (342) మండలాల్లో వడగాడ్పులు వీచాయన్నమాట. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అయితే సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. సోమవారం కేవలం రెండు మండలాల్లో (అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో) తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. మరో 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 8, అల్లూరి 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్టీఆర్ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పు గోదావరి జిల్లాలో 15 మండలాల్లోను వడగాడ్పులకు ఆస్కారం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం అంతర్గత ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరఠ్వాడా, అంతర్గత కర్నాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోను ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమలోను అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాడ్పుల నుంచి ఉపశమనం కలగనుంది. కూల్‌డ్రింక్స్ తాగొద్దు ఇంట్లో ఉన్నా, బయట పనిలో ఉన్నా తప్పనిసరిగా గంట గంటకూ ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరైనా తాగాలి. ఎండలో పనిచేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలి. గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలి. బాటిల్లో తాగు నీటిని వెంటబెట్టుకోవాలి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ నాగా చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ -
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడ గాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
చికెన్ స్కిన్ గురించి విన్నారా? వేసవికాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధి..!
చికెన్‌ఫాక్స్ లాంటి ఆటలమ్మ, పొంగు, తట్టు తరహా చర్మ వ్యాధులను చూశాం. గ్రామాల్లో మాత్రం ఈ వ్యాధిని అమ్మవారు చూపింది అంటారు. ఓ వారం రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దీనికి మందులు వాడరు ప్రజలు. వేపాకు, పసుపుతో తగ్గించుకుంటారు. అయితే దీనికి కూడా టీకాలు వంటివి వచ్చేశాయి ఇప్పుడు. కానీ కొత్తగా ఇదేంటీ..? చికెన్ స్కిన్ .. అంటే.. ఇది కూడా ఒక విధమైన చర్మ వ్యాధే. గానీ తీవ్రత ఎక్కువ. వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. శోభి తర్వాత భయానకమైన చర్మవ్యాధి ఇదే. ముఖ్యంగా వేసవికాలంలో పలువురిని వేధించే సమస్య ఇది. అయితే కొందరికి నయం అయినా, మరికొందరికి మాత్రం జీవితాంతం వేధిస్తుంది. అసలేంటి వ్యాధి? ఎలా వస్తుంది ? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..! వైద్య పరిభాషలో చికెన్ స్కిన్‌ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చిన రోగి చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. రాను రాను గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా మారతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పైగా నలుగురిలో తిరగలేక నానాఅవస్థలు పడతారు. దీనికి ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే..? ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి బయటపడాలంటే .. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ వంటి మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు చర్మంపై వచ్చిన ఆ గడ్డలను గిచ్చడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. అంతేగాదు బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఈ వ్యాధి బారనే పడ్డట్టు ఇన్స్టాగ్రాం వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఏంటో ఎలా బయటపడాలి అనే దాని గురించి కుణ్ణంగా తెలుసుకునే పనిలో ఉన్నాని కన్నీటిపర్యంతమయ్యింది. అందువల్ల సమస్య ఆదిలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి సత్వరమే సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దీని గురించి మరింత క్షుణ్ణంగా వ్యక్తిగత వైద్యులను, నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
రాష్ట్రం నిప్పుల కుంపటి!
సాక్షి, విశాఖపట్నం: వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. మే మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డవుతున్నాయి. అనేక చోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఫలితంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వడగాడ్పులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీలకు మించిపోగా, పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లా ఆలమూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. లద్దగిరి (కర్నూలు) 44.2, మద్దూరు (వైఎస్సార్), గురజాల (పల్నాడు)ల్లో 44.1, తిప్పాయపాలెం (ప్రకాశం) 44, జి.సిగడాం (శ్రీకాకుళం) 43.8, మాడుగుల (అనకాపల్లి) 43.7, నిండ్ర (చిత్తూరు) 43.6, గుర్ల (విజయనగరం) 43.5, పెదమాండ్యం (అన్నమయ్య) 43.4, ఎం.నెల్లూరు (తిరుపతి), తలుపుల (సత్యసాయి)ల్లో 43, రెంటచింతల (పల్నాడు) 42.6 డిగ్రీలు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు మరింత తీవ్రం రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 159 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఈ సంస్థ అంచనా ప్రకారం.. శనివారం 179 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 208 మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 193 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 26, విజయనగరం 25, పార్వతీపురం మన్యం 15, అనకాపల్లి 16, అల్లూరి సీతారామరాజు 9, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పు గోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 17, బాపట్ల 1, తిరుపతి 1, ప్రకాశం జిల్లాలోని 2 మండలాల్లోను తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఫలితంగా ఆ రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి ఉష్ణతాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించనుంది. -
Summer Care : నింగి నుంచి నిప్పులు!
భానుడు భగభగా మండుతున్నాడు. నిప్పులు కక్కుతూ.. ప్రతాపం చూపిస్తున్నాడు. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వడగాలులు వీస్తున్నాయి. ఎండలు మండుతుండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈనెల 9 వరకు ఇదేపరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఉదయం 10 గంటలకే కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. ఎండలకు వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లాలోనే నమోదైంది. 18 మండలాల్లోని 20 గ్రామాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటిపోయింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. 50 డిగ్రీలకు పెరిగే ప్రమాదం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు తీవ్రమైన వేడిగాలులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలకు తీసుకోవాల్సిన అవసరం వెల్లడించారు. అప్రమత్తమైన యంత్రాంగం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా అవగాహన కల్పించాలని పలు చోట్ల కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో వచ్చే సంబంధిత వ్యాధులపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో టాస్క్‌పోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించే పనిలో పడ్డారు. సంక్షేమ హాస్టళ్లు ,పాఠశాల, కళాశాల విద్యార్థులలో వడదెబ్బ పై అవగాహన కల్పించాలని, పని ప్రదేశాల్లో కూలీలకు తాగు నీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉపాధి కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేసే వారి కోసం తాగునీరు నీడ ఏర్పాటు చేయాలని, మూగ జీవాల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. వడదెబ్బ లక్షణాలు డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింత, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితికి వెళ్లడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకితే చేపట్టాల్సిన చర్యలు వడదెబ్బ తాకిన వారిని వెంటనే నీడ కలిగిన చల్లని ప్రదేశానికి తరలించాలి. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణం తాగించాలి. వాంతులు, విరేచనాలు వంటివి సంభవించినా వైద్యులను సంప్రదించాలి. వడదెబ్బతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రోగికి నీరు తాగించవద్దు. వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. ఉదయం సాయంత్రం సమయాల్లోనే బయటకు వెళ్లాలి. బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఎండ వేడిమి తగలకుండా పలుచనైన, వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలి. రోజుకు కనీసం 15 గ్లాసుల నీటిని తాగాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరి నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. భోజనం మితంగా తీసుకోవాలి. మాంసాహారం తీసుకోవద్దు. ఇంటిని వీలైనంత మేర వీలైనన్ని మార్గాల్లో చల్లగా ఉంచుకోవాలి. చల్లని రంగు పానీయాలను తాగొద్దు రోడ్లపై ఉండే ఆహారం పడకపోవచ్చు మద్యం సేవించవద్దు -
భగ్గుమంటున్న భానుడు
సాక్షి, విశాఖపట్నం: అదుపు తప్పుతున్న ఉష్ణోగ్రతలతో భానుడు భగ్గుమంటున్నాడు. రానున్న రెండు రోజులు మరింతగా ఉగ్రరూపం దాల్చనున్నాడు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇన్నాళ్లూ రాయలసీమలోనే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డయ్యాయి. శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాలో అంతకు మించి నమోదు కానున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం శుక్ర, శనివారాల్లో రాయలసీమలోని వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీలు, దక్షిణ కోస్తాలోని పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 41నుంచి 44, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 41నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని 109 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 206 మండలాల్లో వడగాడ్పులు, శనివారం 115 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. చాగలమర్రిలో 44.1 డిగ్రీలు కాగా, గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నచెప్పల్లి (వైఎస్సార్)లో 43.9, లద్దగిరి (కర్నూలు)లో 43.8, దరిమడుగు (ప్రకాశం)లో 43.6, తెరన్నపల్లి (అనంతపురం)లో 43.5, మనుబోలు (నెల్లూరు), చియ్యవరం (తిరుపతి)లలో 43.2, కుటగుల్ల (శ్రీసత్యసాయి)లో 43.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 97 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న మూడు రోజులు వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. -
సమ్మర్ సలసల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల తొలివా రం నుంచి క్రమంగా పెరగాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ఇక నడి వేసవి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన అందరిలో కలుగుతోంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పు లతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితిలో తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతేడాది కంటే 2.5 డిగ్రీలు అధికంగా... నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గురువారం రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఈ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతతో పోలిస్తే ప్రస్తుతం సగటున 1 డిగ్రీల సెల్సీయస్ నుంచి 2.5 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదవగా హైదరాబాద్‌లో 2.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
గొంతెండిపోతోంది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్‌భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్లోనూ ఇదే సమస్య ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం పని మానేస్తున్నాం గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా బోరు నీళ్లే తాగుతున్నాం భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది. –రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా -
నిప్పుల కొలిమి
ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి. వాస్తవానికి పదేళ్లుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగింది. పాత రికార్డులు బద్దలవుతున్నాయి. నిరుడు మార్చి ఎండ తీవ్రత 1901 నాటి రికార్డును అధిగమించిందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత వరసగా ఏప్రిల్, మే, జూన్ నెలలు వేటికవే అత్యధిక ఉష్ణోగ్రతల్లో కొత్త పోకడలను నమోదు చేశాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్న జోస్యాలు భయపెడుతున్నాయి. దీనికి తోడు ఈసారి వానలు సైతం అంతంతమాత్రం కావటంతో జలాశయాలు నిండుకున్నాయి. భూగర్భ జలాలు లోలోతులకు పోతున్నాయి. నిరుడు ఎల్‌నినో ప్రభావం కారణంగా దక్షి ణాసియా ప్రాంత దేశాలన్నీ తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. రివాజుగా జూన్ నెల మొదట్లో కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఏడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్ వరకూ మెరుగ్గానే వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడటంతో వరదలు కూడా ముంచు కొచ్చాయి. మొత్తానికి దాదాపు 94 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అక్టోబర్ మొదలుకొని మార్చి వరకూ వర్షాల మాట అటుంచి కనీసం మబ్బుల జాడైనా కనబడలేదు. ఇది చాలదన్నట్టు ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరగటంతో జలాశయాల్లో నీరు అంతంతమాత్రంగానే వుంది. ఈ మూడు నెలలూ సాధారణంగా అయితే నాలుగు నుంచి ఎనిమిది రోజులు మాత్రమే వడగాడ్పులు తీవ్రంగా వీచాలి. కానీ ఇది పది నుంచి 20 రోజుల వరకూ ఉండొచ్చని ఐఎండీ చెబుతోంది. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఉష్ణోగ్రతలూ, వడగాడ్పుల తీవ్రత అధికంగా వుండొచ్చని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. మండే ఎండలు, తీవ్ర వడగాడ్పులు, కుండపోత వర్షాలు, ముంచెత్తే వరదలు ఎవరూ ఆపగలిగేవి కాదు. కానీ ప్రపంచ దేశాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుని, సమర్థంగా అమలు చేయగలిగే కార్యాచరణను రూపొందిస్తే వీటి తీవ్రతను తగ్గించటానికి ఆస్కారం వుంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థలు(డబ్ల్యూఎంఓ) మొన్న మార్చి 19న విడుదల చేసిన ప్రపంచ వాతావరణ నివేదిక ఏమంత ఆశాజనకంగా లేదు. నిరుటికన్నా 2024 మరింత ప్రమాదకరంగా వుండగలదని హెచ్చరించింది. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు వంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో పరిమితులకు మించి పెరిగి పోవటం వల్ల ఉష్ణోగ్రతలు అధికమై సముద్ర ఉపరితల జలాలను వేడెక్కిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఆఖరికి అంటార్కిటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో భారీ మంచు పలకలు కరగటం నిరుడు బాగా ఎక్కువైందని వివరించింది. ఆర్థికవృద్ధి పేరుతో ప్రభుత్వాలు పర్యావరణానికి నష్టం చేకూర్చే విధానాలు అవలంబించటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. భారత, బంగ్లాదేశ్‌లలో పర్యావరణ విధ్వంసం వల్ల నిరుడు ఏప్రిల్ నెలలో వడగాడ్పుల తీవ్రత 30 రెట్లు పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు లెక్కేశారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల వల్ల సహజంగానే రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువకావొచ్చు. ఎన్నికల సీజన్ కావటంతో ఈ సమస్యపై వాగ్యుద్ధాల మోత కూడా ఎక్కువేవుంటున్నది. కారణం మీరంటే మీరని తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాలు మాటలు విసురుకుంటున్నాయి. ఆ మాటెలావున్నా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి వడ గాడ్పు లపై, ఎండల తీవ్రతపై ప్రజలను హెచ్చరించటం అవసరం. లేనట్టయితే వడదెబ్బ మరణాలు పెరిగే అవకాశం వుంది. మన దేశంలో వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించటం లేదు. చెప్పాలంటే వేటిని వడదెబ్బ మరణాలుగా లెక్కేయాలన్న అంశంలో ఎలాంటి కొలమానమూ లేదు. నిరుడు డిసెంబర్లో లోక్‌సభలో వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా లెక్కేసి, బాధిత ప్రజల సహాయపునరావాసాల కోసం నిధులందించాలని డిమాండ్ వచ్చింది. కానీ కేంద్రం నుంచి పెద్దగా స్పందన లేదు. పర్యవసానంగా బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందటం లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. ఎన్డీఎంఏ 2016 నుంచి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. అక్కడితో దాని పాత్ర ముగుస్తోంది. ఎండ తీవ్రత ఉన్నపుడు ఆరుబయట కార్మికులతో పనిచేయించకుండా చూడటం, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించటం, ప్రజారోగ్య సిబ్బందిని సంసిద్ధంగా ఉంచటం, అవసరమైన ప్రాంతాలకు సహాయబృందాలను తరలించటం కీలకం. ఇలాంటి జాగ్రత్తలతో వడగాడ్పు మరణాల నివారణ సాధ్యమే. అలాగే ఇరుకిరుకు ఇళ్లలో మగ్గి పోయే మురికివాడల ప్రజలనూ, మరీ ముఖ్యంగా వృద్ధులనూ, గర్భిణులనూ, బాలింతలనూ వడగాడ్పుల నుంచి సంరక్షించటానికి ఏం చేయగలమో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ కృషిలో స్థానిక సంస్థల పాత్ర పెంచటం, అందుకు అవసరమైన నిధులు అందించటం ప్రభుత్వాల బాధ్యత. అన్నిటికీ మించి వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి, ఆ విషయంలో పౌరులను అప్రమత్తం చేసేందుకూ, వారిని కాపాడేందుకూ అనుసరించాల్సిన విధానాలను రూపొందించటం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి.ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి.తాజా కూరలు, పళ్లుకూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్‌లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది.ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు.వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి.ఇతర జాగ్రత్తలుమరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి. తాజా కూరలు, పళ్లు కూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్‌లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు. వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి. ఇతర జాగ్రత్తలు మరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!
వేసవి ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎండల్ని తట్టుకునేలా మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మన శరీరానికి చల్లదనాన్ని, పోషకాలు అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఫర్మెంటెడ్ రైస్, లేదా పులియ బెట్టిన పెరుగున్నం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఒకసారి చూద్దాం.! పులియబెట్టినపెరుగన్నంతో ప్రయోజనాలు వేసవిలో పెరుగు అన్నం లేదా రాత్రంతా పెరుగులో పులియబెట్టిన అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో విటమిన్ సితో పాటు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి పెరుగు అన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. కడుపులో చికాకు, అజీర్ణం లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులో కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది. కాల్షియం, బీ12 విటమిన్ డీ, ప్రోటీన్‌తో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు ,దంతాలకు కాల్షియం చాలా అవసరం. పిల్లలు ఇది అలవాటు చేస్తే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఈ పెరుగు అన్నం ఎలా చేసుకోవాలి ప్రోబయాటిక్ పెరుగు అన్నం చేయడం చాలా సులభం. వండిన అన్నాన్ని కొంచెం వేడిగా ఉండగానే ఒక గిన్నె (మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది) లోకి తీసుకోవాలి. ఇందులో పాలు పోసి తోడు పెట్టాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఇందులో ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది. దీన్ని తాలింపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినవచ్చు. టిప్: పచ్చిమిర్చి వేయకుండా నల్లద్రాక్ష, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు లాంటివి వేసి చక్కగా గార్నిష్ చేసి ఇస్లే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు బోలెడన్ని పోషకాలు కూడా లభిస్తాయి. -
భోపాల్‌లో హైదరాబాద్ షర్బత్.. క్యూ కడుతున్న జనం!
వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి చల్లని ఐస్ క్రీం లేదా ఏదైనా పానీయాన్ని తాగాలని ఎవరైనా అనుకుంటారు. హైదరాబాద్‌లో ఆదరణ పొందిన తహురా పానీయం ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోకి ప్రవేశించింది. ముగ్గురు స్నేహితులు ఈ శీతల పానీయ విక్రయాలను భోపాల్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌లో రంజాన్ సందర్భంగా ఈ పానీయానికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వేసవి ఉపశమనానికి ఈ షర్బత్ మ్యాజిక్‌లా పనిచేస్తుందని పలువురు అంటుంటారు. డ్రై ఫ్రూట్స్, పాలతో తయారు చేసే ఈ షర్బత్‌ను భోపాల్ ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ శీతలపానీయాల దుకాణం ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే ఈ షర్బత్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. భోపాల్‌లోని మోతీ మసీదు కూడలిలో తహురా పేరుతో ఒక దుకాణాన్ని ఈ ప్రాంతానికి చెందిన ఫరూక్ షేక్, జునైద్ అలీ షేక్, జైన్ ఖాన్ ప్రారంభించారు. మహారాష్ట్రంలోని పూణేలో వీరు ఈ షర్బత్‌ను రుచి చూశాక భోపాల్‌లో ఈ పానీయాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ షర్బత్‌ను ఫరూఖ్, అతని స్నేహితులు స్వయంగా తయారు చేస్తారు. వీరి దుకాణం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. బాదం, పిస్తా, పాలతో తయారు చేసే ఈ పానీయంలో చక్కెరను అస్సలు ఉపయోగించరు. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని చాలామంది చెబుతుంటారు. ఈ పానీయాన్ని తాగేందుకు జనం ‘తహురా’ దుకాణం ముందు క్యూ కడుతుంటారు. -
వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!
వేసవిలో బాడీని చల్లగా చేసే గోండ్ కటీరా గురించి విన్నారా? ఇది ఎడిబుల్ గమ్. దీని వలన ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శక్తిని పెంచుతుంది. గోండ్ కటీరా మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..! గోండ్ కటీరా అనేది తినగలిగే గమ్. ఇది కిరాణా షాపుల్లో, ఆన్లైన్లో కూడా దొరుకు తుంది. వేసవిలో చల్లదనం కోసం దీన్ని తాగితే, చాలా లాభాలున్నాయి. గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో ప్రసిద్ధి. దీన్ని ఆస్ట్రాగాలస్ ప్రొపింకస్ అనే నాచు రకం మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. ఇది పౌడర్ లేదా క్యాండీ రూపంలో లభిస్తుంది. గోండ్ కటీరా జ్యూస్ ముందుగా ఈ గమ్‌ను కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. దీంతో ఇది ఒక జెల్లాగా తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్లో తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా తరగిన పుదీనా వేసుకోండి. ఇక చివరగా కాస్తంత నిమ్మరసం కలుపుకొని, గ్లాసు నిండా నీళ్లు పోసుకొని చక్కగా తాగెయ్యడమే. కావాలంటే ఒకటి రెండు ఐస్‌క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని పౌడర్‌ను పాలలో కలుపుకొని తాగటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. గోండ్ కటీరా ఆరోగ్య ప్రయోజనాలు: ఆయుర్వేద వైద్యంలో దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జిగురు లాంటి పదార్ధమైన గోండ్ కటిరా రుచికరమైంది ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. అందుకే పంజాబ్‌లో రుచికరమైన గోండ్కే లడ్డూ, పిన్నియాన్ బాగా పాపులర్. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువ. అందుకే ప్రేగు కదలికలను సులభంచేసి మలబద్ధకానికి మంచి ఉపశమనంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో ప్రయోజనకరమైన సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. తల్లి, పిండం ఇద్దరికీ ఆరోగ్యకర మైన ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాలు అధికం కాబట్టి బాలింతల్లో పాలను వృద్ధి చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మిశ్రమమైన ఇది శక్తిని పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది. పురుషులలో కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళల్లో పీరియడ్ సమస్యలకూ మంచింది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులోని కరిగే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. -
సమ్మర్లో వేడి నీళ్ల స్నానమా? ఈ సర్ప్రైజింగ్ విషయాలు తెలుసా?
ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా స్నానం చేయడం దాదాపు అందరికీ అలవాటు. కొందరు వేడి నీటితో, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడి నీటి ( మరీ వేడి నీళ్లు కాదు) స్నానంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి సీజన్ ఏదైనా వామ్ వాటర్‌తో స్నానంతో శరీరం, మనస్సు సేద తీరుతాయి. మరి వేడి నీటి స్నానంతో ఇంకా ఎలాంటి ప్రయో జనాలున్నాయో చెక్ చేద్దామా? చలికాలంలో వేడి స్నానం చేయడం కామన్. కానీ వేసవిలో కూడా వేడి నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అన్ని సీజన్లలో వేడి స్నానం చేయడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుండెజబ్బులు, అధిక బీపీ ఉన్న వారు కొంచెం అప్రతమత్తంగా ఉండాలి. కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది రోజంతా పనిచేసి అలిసిపోయిన శరీరానికి, కండరాలకు వేడి నీటి స్నానం హాయినిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు. కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించడంలోసహాయపడుతుంది ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి చాలా కామన్ అయిపోయింది. అందువల్ల, మనస్సు ప్రశాంతంగా, పూర్తిగా రిలాక్స్‌గా ఉండాలంటే వేడి స్నానం ఉత్తమం. ఇందులో ఎప్సమ్ లవణాలు, మంచి సువాసన గల నూనెలు కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల వల్ల చర్మ రంధ్రాలు తెరుచు కుంటాయి .పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అందరికీ ఆరోగ్యకరమైన చర్మాన్నే కోరుకుంటారు. ఇందుకోసం కొంతమంది సౌందర్య సాధనాలు ఆశ్రయిస్తారు. కానీ, రోజువారీ వేడి స్నానంలో రహస్యాన్ని మర్చిపోకూడదు. వేడినీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి, చర్మ కణాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా మృదువైన స్కిన్ సొంతమవుతుంది. ఏర్పడుతుంది. రక్త ప్రసరణకు: శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్ని శరీర భాగాల సరైన పనితీరు సరైన రక్తప్రసరణచాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది కీలకం. మంచి నిద్రకు: వేడి నిటి షవర్ కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. దీని ఫలితంగా ప్రశాంతమైన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు: జుట్టుకు చాలా ప్రయోజనకరం. స్కాల్ప్ లోని సూక్ష్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి, తేమ లోపలికి వెళ్లేలా చేస్తుంది. స్కాల్ప్‌ను శుభ్రనడుతుంది. బాగా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకే కాదు, చుండ్రు లాంటి నిరోధానికి కూడా కీలకం. ఇక శీతాకాలంలో అయితే జలుబు , ఫ్లూ బారిన పడటం చాలా సాధారణం. అందుకే వేడి షవర్ తలనొప్పి, ముక్కు దిబ్బడ, జలుబుకి మంచి ఉపశమనం. టిప్: ఎప్సమ్ లవణాలు, 10 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్,అర కప్పు బేకింగ్ సోడా కలుపుకొని వారానికి ఒకసారి 20 నిమిషాలు, హాట్ బాత్ టబ్‌లో కూర్చోండి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. ఒత్తిడి సంబంధిత హార్మోన్లను తగ్గిస్తుంది, శరీర pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. -
రికార్డు స్థాయిలో కరెంట్ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగంతో ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి వినియోగం 166.97 కంటే 43.01 శాతం ఎక్కువ. రోజులో పీక్ డిమాండ్ 12,802 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 7,997 మెగావాట్లు మాత్రమే ఉంది. అంటే 60.09 శాతం పెరిగింది. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా.. గత సంవత్సరం వేసవిలో మన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అంచనా. దీనికి తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఇబ్రహింపట్నంలోని ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్–8లోనూ ఉత్పత్తి ముందుగానే ప్రారంభించారు. అలాగే వీటీపీఎస్‌లో రోజుకి 32,186 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 16,443 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 23,632 మెట్రిక్ టన్నులు, హిందూజాలో 14,277 మెట్రిక్ టన్నులు చొప్పున బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 91.081 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.920 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.269 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 35.925 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 32.213 మి.యూ, సోలార్ నుంచి 20.647 మి.యూ, విండ్ నుంచి 12.359 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి రోజుకు యూనిట్ సగటు రేటు రూ. 8.764 చొప్పున రూ. 35.253 కోట్లతో 40.224 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జార్ఖండ్, ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మన దగ్గర కంటే తక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ కొరత ఏర్పడింది. -
బొగ్గు దిగుమతి ఆపొద్దు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ భారీగా పెరగనున్నందున విదేశీ బొగ్గు దిగుమతులను ఆపొద్దని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ వరకూ విదేశీ బొగ్గు దిగుమతులను కొనసాగించాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వచ్చే మే నెలలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 250 గిగావాట్లు ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. ఇంత భారీ డిమాండ్‌ను తట్టుకోవాలంటే విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. నిజానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను దశల వారీగా మూసేయాలని కేంద్రం కొంతకాలం క్రితం సూచించింది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత మంచి నిర్ణయం కాదని కేంద్రం భావిస్తోంది. థర్మల్ కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడపాలంటే బొగ్గు చాలా అవసరం. దీంతో అన్ని థర్మల్ కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని గతేడాది అక్టోబర్‌లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. దిగుమతి చేసుకున్న బొగ్గులో స్వదేశీ బొగ్గును కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. ఏపీకి ఇబ్బంది లేదు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడి అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం, ఇంధన శాఖ ముందస్తు వ్యూహాల కారణంగా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో వీటీపీఎస్‌కి రోజుకు 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,34,563 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. ఆర్టీపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా..90,003 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంట్‌కు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా..1,14,858 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో రోజుకు 19,200 మెట్రిక్ టన్నులు వాడుతుండగా, 1,17,375 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు రెండు రోజుల నుంచి ఆరు రోజులకు సరిపోతాయి. నిల్వలు తరిగిపోయి థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది తలెత్తకుండా సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు సరఫరా సకాలంలో జరిగేలా చర్యలు చేపట్టాయి. -
వేసవిలో ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మేలు!
సమ్మర్లో ఏదీ పడేతే అది తినకూడదు. సూర్యుడి భగ భగలకి దాహం దాహం అన్నట్లు ఉంటుంది. ఎక్కువ ఆహారం తినలేం. చల్లటి పానీయాలే తీసుకోవాలని పిస్తుంది. అలా అని కూల్‌డ్రింక్స్ వంటివి తాగితే ఇక అంతే సంగతులు. చేజేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవ్వుతారు. ఇలాంటి హాట్ సమ్మర్లో ఎలాంటి పదార్థాలు తింటే మంచిది, వేటికి దూరంగా ఉంటే బెటర్ తెలుసుకుందామా!. వేసవి అనగానే వాతావరణం ఉక్కపోతలతో చిరాకు తెప్పిస్తుంటుంది. దీంతో చాలా మంది చల్లదనం కోసం తహతహలాడుతుంటారు. ఈ సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే కొందరు కారం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తాయి. కుడుపు ఉబ్బరంగా ఉండి అలసట ఏర్పడుతుంది. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగా స్పైస్ ఫుడ్‌ను అవైడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు అవితీసుకోకుండా ఉండటమే మంచిది. వేసవి కాలంలో శరీరం ఎక్కువగా డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం చేసే ద్రవపదార్థాలు తీసుకోవాలి. అంటే టీ, కాఫీలు తగ్గించాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం తేమ కోల్పోయిన నిర్జీవంగా తయారై అనారోగ్యం ఏర్పడవచ్చు. మాంసాహారం అనగానే చాలా మంది లొట్టలేసుకొని తింటారు. వేసవిలో ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవి జీర్ణక్రియను మందగించడమే కాకుండా ఒక్కోసారి కడుపులో సమస్యలు వచ్చి విరేచనాలు రావొచ్చు. అలాగే వేపుళ్లు, పచ్చళ్లను సైతం ఈ కాలంలో అవైడ్ చేయాలి. వీటికి బదులు పెరుగన్నం, తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. లేకపోతే అనేక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో ఫ్రైడ్‌ఫుడ్స్, జంక్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. అసలే ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుందంటే.. ఇక వీటిని తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. చాలామంది ఎండలోంచి ఇంటికి రాగానే.. లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఎండ వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్.. వంటివి తీసుకుంటుంటారు. అయితే ఇవి వేసవి వేడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంలో అత్యధికంగా వేడి ఉత్పత్తయ్యేలా చేస్తాయి. (చదవండి: ఏసీ నీటిని ఉపయోగించొచ్చా! ఆరోగ్యానికి మంచిదేనా?) -
గొంతెండుతోంది!
వేసవికాలం మొదలైంది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావులు కూడా బోసిపోతుయి. దీనితో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా మంచినీటి సరఫరా తగ్గిపోయింది. ఊర్లలో నీటి ట్యాంకర్ల హడావుడి మొదలైంది. గ్రామాల్లో పంచాయతీలు, వార్డుల వారీగా ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. పట్టణాల్లో అయితే ప్రైవేటు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని వాడుకోవాల్సిన దుస్థితి మొదలైంది. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి వాగుల వద్దకు వెళ్లి చెలిమల నుంచి నీటిని మోసుకురావాల్సి వస్తోంది. మైదాన ప్రాంత గ్రామాల్లోనూ పలుచోట్ల నీటికి ఎద్దడి ఏర్పడటంతో శివార్లలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు నెలల పాటు ఎలా వెళ్లదీయాల్సి వస్తుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి నెట్వర్క్ మా‘నీరు’ తగ్గుతోంది కరీంనగర్‌తోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాంతాలకు ఆధారమైన లోయర్ మానే ర్ డ్యామ్‌లో నీటి నిల్వల పరిస్థితి ఇది. ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలైతే.. ప్రస్తుతం 7.4 టీఎంసీలే ఉన్నాయి. ఎండలు మండుతుండటంతో ఈ నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాహం కోసం.. దారి పట్టారు గిరిజన గ్రామాల్లో తడారిపోతున్న గొంతులకు గుక్కెడు నీళ్లు దొరకాలంటే దూరాలకు వెళ్లక తప్పని దుస్థితిని చూపే చిత్రమిది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సోలంగూడకు చెందిన గిరిజనులు ఇలా వ్యవసాయ పొలాల నుంచి డబ్బాలలో నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు. ట్యాంకర్ వస్తేనే దాహం తీరేది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం తాటిపర్తిలో గ్రామపంచాయతీ ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు. దాదాపు నెల రోజులుగా నల్లా నీటి సరఫరా నిలిచిపోయిందని, ట్యాంకర్ నీళ్లే దిక్కు అవుతున్నాయని వారు వాపోతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడిస్తేనే గొంతు తడిచేది నిర్మల్ జిల్లా పెంబి మండలం ధూమ్‌ధరి గ్రామపంచాయతీ పరిధిలోని చికమున్ వాగులో చెలిమ తోడుకుని నీళ్లు నింపుకొంటున్న గిరిజనులు వీరు. దీనికి ఇరువైపులా ఉన్న వస్పల్లి కొత్తగూడెం, గిరిజనగూడెం రెండు గ్రామాలవారికి ఈ వాగు చెలిమలలోని నీరే దిక్కు. బిందెల్లో నీళ్లు నింపుకొని కిలోమీటర్ల కొద్దీ మోసుకుంటూ వెళ్తేనే.. ఇంటిల్లిపాదీ గుక్కెడు నీళ్లు తాగే పరిస్థితి. ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల గుంపులో చెలిమ నీటిని తోడుకుంటున్న ఆదివాసీలు వీరు. జనవరిలోనే వాగులు ఎండిపోవడంతో చెలిమలో నీటి ఊట కూడా తక్కువగా ఉంటోందని, ఈసారి నీటి కష్టాలు ఎలా ఉంటాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త!
మొన్నమొన్నటి దాకా చల్లగా సాగిన ప్రయాణం ఇప్పుడు వేసవి కొలిమికి సిద్ధమైంది. సమ్మర్ వార్తలు కొంతకాలంగా డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. ఓ వైపు వాతావరణంలో మొదలైన మార్పులు, మరోవైపు నిపుణుల హెచ్చరికలు తెలియకుండానే గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక నుంచి ఏం తిన్నా, ఏం తాగినా ఆపసోపాలే! ఎటు వెళ్లినా, ఎక్కడాగినా నీరసాలు, నిట్టూర్పులే! మరి ఈ ఎండాకాలాన్ని ఎలా దాటెయ్యాలి? ఈ వేసవి తాపానికి డీహైడ్రేషన్, వడదెబ్బ, కళ్లు తిరగడం, నీరసం, వాంతులు, జీర్ణసమస్యలు ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇతర కాలాల్లో అనారోగ్యం వస్తే.. ఏదో ఒకటి తిని, ఓ టాబ్లెట్ వేసుకుంటే.. ప్రశాంతంగా నిద్రైనాపోవచ్చు. కానీ ఈ ఎండాకాలంలో నిద్ర కూడా పట్టదు. పరచుకున్న పరుపులోంచి, మూసి ఉన్న తలుపుల్లోంచి వేడి తన్నుకొచ్చి.. కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటి వడగాల్పులను తట్టుకోవాలంటే.. చలువ చేసే ఆహారాలు, చల్లబరచే పానీయాలను పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తినేవాటిలో ఆయిల్ లెస్, తాగేవాటిలో సుగర్ లెస్ తప్పదంటున్నారు. జంక్ ఫుడ్‌కి, సాఫ్ట్ డ్రింక్స్‌కి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు. నిజానికి వేసవిలో ఎక్కువగా తినాలనిపించదు. ఆరారగా పానీయాలు తాగాలనిపిస్తుంది. అసలు తినడానికైనా, తాగడానికైనా ఏవేవి మంచివో చూద్దాం. ఎండాకాలం ఆహారాలు దోసకాయ, పుచ్చకాయ, మామిడిపండు, అరటిపండు, బొప్పాయి, అనాసకాయ ఇలా ప్రతి పండూ వేసవిలో ఆస్వాదించతగ్గదే! వాటిలోని వాటర్ కంటెంట్ బాడీలోని ఉష్ణోగ్రతల స్థాయిని తగ్గిస్తాయి. అలాగే అరుగుదల సజావుగా చేసి.. జీర్ణకోశాన్ని తేలికపరుస్తాయి. ఆయా పండ్లతో చిక్కగా జ్యూసులు చేసుకుని తాగొచ్చు. భోజనం విషయానికి వస్తే ఆకుకూరలు, కూరగాయలకే పోపు పెట్టడం మంచిది. సమ్మర్లో మాంసం, చేపలు వంటివి తినడం వల్ల అరుగుదల ఆలస్యం అవుతుంది. కడుపు బరువుగా మారుతుంది. నాన్‌వెజ్ వంటకాల్లో నూనె, మసాలా వంటివి ఎక్కువగా వాడాల్సి రావడంతో అవన్నీ వేసవి కాలంలో జీర్ణక్రియ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తినేటప్పుడు తేలికగా అరిగేవి ఎంచుకోవాలి. వేపుళ్లు తినడం వల్ల వడదెబ్బను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి, ఆ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా నీరు, జావలు, జ్యూసులు, ద్రవాహారాలను తీసుకోవాలి. డబ్ల్యూఎంఓ హెచ్చరిక ఈ వేసవి మూడునెలలు మండుతున్న కుంపటే అని మన వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్నే ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) కూడా వెల్లడించింది. ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. గత ఏడాది జూన్‌లో ‘ఎల్ నినో’ ఏర్పడిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉండబోతున్నాయని వెల్లడించింది. ఇవి అస్సలు తినొద్దు... కెఫీన్, ఆల్కహాల్: ఈ రెండూ బాడీని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. అందుకే వేసవిలో కాఫీ, టీలతో పాటు మద్యానికీ దూరంగా ఉండటం ఉత్తమం. స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ చెమటలు పుట్టిస్తాయి. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఉక్కబోతల వాతావరణంలో మరింత వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు బాడీని ఎక్కువగా డీహైడ్రేషన్‌కి గురిచేస్తాయి. ఇలాంటివి తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తుంది. కొవ్వు పదార్థాలు: కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాని వల్ల నీరసంగా, అలసటగా ఉంటుంది. అరుగుదల లోపంతో తెలియకుండానే ఆపసోపాలు మొదలవుతాయి. వేసవి పానీయాలు సాధారణంగా ఎండాకాలంలో నీళ్లు ఎక్కువ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే ‘ఉత్త నీళ్లు ఎన్నని తాగుతాం‘ అనుకునేవారు ’ఇలా చిటికెలో అయ్యే చలవ పానీయాలను తయారుచేసుకుని తాగండి’ అంటున్నారు నిపుణులు. అయితే పంచదారకు బదులుగా తేనె వాడుకోవడం మంచిది. తేనె లేని సమయంలో తక్కువ మోతాదులో బెల్లం పాకం వాడుకోవచ్చు. సబ్జా నీళ్లు.. ఈ సమ్మర్ సీజన్ లో సబ్జా నీళ్లు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే పెక్టిన్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ సీజన్లో సబ్జా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి సమస్యలు దరిచేరవు. అందుకే నీళ్లలో సబ్జా వేసుకుని తాగడం మంచిది. తేనె– నిమ్మరసం నీళ్లు ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మచెక్కను పిండుకుని, ఒకటిన్నర లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి తాగొచ్చు. ఇది తక్షణశక్తిని అందిస్తుంది. ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపున తాగితే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, తలనొప్పి వస్తున్నప్పుడు ఈ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. సోంపు నీళ్లు సోంపులో ఈస్ట్రాగోల్, అనెథాల్, ఫెంకోన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచి, జీర్ణ సమస్యలను దూరం చేసి పొట్టను తేలికగా ఉంచుతాయి. వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తేనె లేదా బెల్లం పాకం కలిపి తీసుకుంటే మంచిది. కొబ్బరి బోండం.. కొబ్బరి నీళ్లు ఎల్లప్పుడూ బాడీని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉండే ఈ సహజపానీయం వేసవిలో వేడిని తట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే వీలైనప్పుడల్లా కొబ్బరి నీళ్లు సేవించడం మంచిది. జీలకర్ర నీళ్లు.. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు, పోషకాలు చాలానే ఉంటాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ వాటర్ వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. సమ్మర్లో రాత్రిపూట జీలకర్రను నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఏలకుల నీళ్లు ఏలకుల్లోని ఔషధ గుణాలు.. బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. కడుపులో వేడి, మంట, వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. ఒక గ్లాసుడు వేడి నీళ్లల్లో ఏలకుల్ని దంచి వేసుకుని, బాగా కలుపుకుని, వడకట్టి తాగాలి. అభిరుచిని బట్టి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ నీళ్లు శరీరంలో వేడిని వేగంగా తగ్గిస్తాయి. మెంతుల నీళ్లు మెంతుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్ , పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని మెంతుల్ని గ్లాసు నీళ్లల్లో నానబెట్టి, వడకట్టుకుని తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి, చల్లబడుతుంది. దనియాల నీళ్లు ఒక టీస్పూన్ దనియాలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి, వడగట్టుకుని పది నిమిషాల పాటు మరిగించి, చల్లార్చుకుని తాగితే మంచిది. దనియాల్లోని పైబర్ జీర్ణక్రియను సరిచేస్తుంది. అలాగే ఈ వాటర్.. బాడీలోని టాక్సిన్స్‌ను తొలగించి.. చల్లదనాన్ని అందిస్తుంది. మజ్జిగ.. వేసవికి అసలు సిసలు చల్లదనం మజ్జిగతోనే వస్తుంది. కొద్దిగా పెరుగు తీసుకుని నిమ్మరసం, చిటికెడు ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని, గిలక్కొట్టి అందులో ఓ గ్లాసుడు నీళ్లు కలిపితే చాలు, మజ్జిగ రెడీ. కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే కడుపులో చల్లగా ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో బాడీలోకి నీటిని పంపితే వేసవి తాపం నుంచి ఇట్టే బయట పడొచ్చు. అలాగే ఫ్రిజ్‌లో వాటర్ కంటే మట్టికుండను ఇంట్లో పెట్టుకోవడం మంచిది. చర్మసంరక్షణ అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం సహజత్వాన్ని కోల్పోయి దెబ్బతింటుంది. మొటిమలు రావడం, ముఖం కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం, సాయంత్రం తప్పకుండా చల్లటి నీళ్లతో స్నానం చెయ్యాలి. ముఖాన్ని నీళ్లతో కొట్టినట్లుగా కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు అయినా నేచురల్ స్క్రబ్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మృతకణాలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. చెమట కారణంగా వచ్చే దుర్వాసన తగ్గుతుంది. క్రీమ్స్ అండ్ లోషన్స్ సాధారణంగా మాయిశ్చరైజర్ శీతాకాలంలో మాత్రమే అవసరం అనుకుంటాం. కానీ వేసవిలో వేడిని తట్టుకోవడానికి కూడా మాయిశ్చరైజర్ అవసరం అంటారు నిపుణులు. చర్మసంరక్షణలో భాగంగా సమ్మర్ క్రీమ్స్ వాడితే మంచిది. బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరచిపోవద్దు. అది సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మంలోని తేమను కాపాడుతుంది. హెయిర్ కేర్ ఎవరికైనా కురులే ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి. కానీ వేసవి వచ్చేసరికి చెమటకు, ఉక్కపోతలకు ఆ కురులే విసుగుపుట్టిస్తుంటాయి. అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వేసవిలోనూ జుట్టు ఆరోగాన్ని కాపాడుకోవచ్చు. పొడవాటి జుట్టున్నవారు పైకి ముడిపెట్టుకునేటప్పుడు జాగ్రత్తపడాలి. చిక్కులు పడకుండా అనువైన క్లిప్స్ వాడుకోవాలి. స్విమ్మింగ్ పూల్‌లో కాని, బీచ్‌లో కాని తల తడిసినప్పుడు ఇంటికి వచ్చి మంచి నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేదంటే వెంట్రుకలు పొడిబారిపోయి బలహీనంగా,పెళుసుగా మారతాయి. కెమికల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలు వాడటం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. తల స్నానం చేసేటప్పుడు, చేసిన తర్వాత కురులను బలంగా రుద్దకూడదు. బాగా ఆరిన తర్వాతే జుట్టుని అల్లుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు జుట్టుకి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. తల స్నానం తర్వాత వెంట్రుకలకు కండిషనర్ వాడటం మంచిది. గొడుగైనా.. హ్యాట్ అయినా.. ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోవడంతో బయటకి వెళ్లేప్పుడు తగుజాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయితే వేసవికి మరిన్ని జాగ్రత్తలు అసవరం అంటున్నారు నిపుణులు. వేసవిలో ప్రయాణాలు అంత మంచివి కావు. తప్పనిసరి అయితే మాత్రం వెంట తీసుకుని వెళ్లాల్సిన లిస్ట్ ఇదే. ఒక వాటర్ బాటిల్, ఒక గొడుగు లేదా హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్కార్ఫ్ లేదా హెడ్ బ్యాండ్ మాస్క్.. ఇవన్నీ వెంట తీసుకుని వెళ్లాల్సినవే. మొత్తానికీ ఈ వేసవి చల్లగా ఉండాలంటే ‘లైట్ ఫుడ్, లాట్ ఆఫ్ లిక్విడ్స్’ అనే పాలసీని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఉంటే కుండలో నీళ్లనే తాగాలి. బయటికి వెళ్తే కూలింగ్ గ్లాసెస్ పెట్టాలి. మన సంగతి సరే! పాపం మనతో పాటు జీవించే జంతువులు, పక్షులకూ ఈ వేసవి ప్రాణసంకటమే! కాస్త వాటి దాహాన్నీ తీర్చే ప్రయత్నం చేయాలి. ఇంటి ముందు చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెడదాం. నాలుగు ధాన్యపు గింజలు ప్లేటులో వేసి, గోడ మీద పెడదాం. ఇవి చదవండి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు! -
భానుడి భగ భగ: ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
మార్చి మాసం ముగియుకుండానే భానుడి భగ భగలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మండే ఎండలు, వేడిగాలులు తట్టుకొని నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే వేసవిలో వడ దెబ్బ ప్రమాదం పెరుగుతుంది. మరి వడదెబ్బ, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో పిల్లా పెద్దా అంతా అప్రతమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా, నీరు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి. వీటితోపాటు రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెరుగు, మజ్జిగ, సీజనల్ పండ్లు, ద్రాక్ష, బొప్పాయి వంటివి ఈ సీజన్లో తీసుకోవడం మేలు చేస్తుంది. అతిగా ఆహారం తీసుకోవడం హానికరం. నీటిని ఎక్కువగా వాడాలి.దాహంగా ఉంది కదా అని రసాయన సహిత కూల్ డ్రింక్స్, శుభ్రమైన ఐస్ వాడని డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండలోకి వెళ్లకుండా చూడాలి. తప్పదు అనుకుంటే, ఎండను తట్టుకునేలా తలపై టోపీ లేదా గొడుగు వాడాలి. బార్లీని నీటిలో నాన బెట్టి మరిగించి తయారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. ఉల్లి పాయ రసం తాగితే వడదెబ్బ తగలకుడా చేస్తుంది. దీనితో పాటు, ఉల్లిపాయ రసాన్ని అరికాళ్ళపై పూయడం కూడా మంచిదే. చెమటలు పట్టేటప్పుడు చల్లటి నీరు ఎక్కువగా తాగడం ప్రమాదకరం. అలాగే ఎండలోంచి లోపలికి వచ్చిన వెంటనే గట గటా చల్లని నీళ్లు తాగకూడదు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా అనిపించినా, వాంతులు, కళ్లు తిరగడం, తలనొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. తక్షణమే చికిత్స తీసుకోవాలి. -
వేసవిలో తాపం తగ్గేలా సగ్గుబియ్యంతో హల్వా చేద్దాం ఇలా!
చలికాలం... సగ్గుబియ్యం హల్వా తింటే జలుబు చేస్తోందా! అయితే... ఇదే మంచి సమయం. ఎండల్లో వండుకుందాం. సగ్గుబియ్యం చలవ చేస్తుంది... ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. దహీ... కేసర్... కోవాతోపాటు పొటాటోతోనూ కలిసిపోతుంది. ఈవెనింగ్ స్నాక్ అవుతుంది...లంచ్‌లో మెయిన్ కోర్స్ అవుతుంది. భోజనం తర్వాత డెజర్ట్ గానూ సర్దుకుపోతుంది. అలాంటి సగ్గుబియ్యంతో సాబుదానా హల్వా చేద్దామిలా!. తయారీకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం– కప్పు చక్కెర – కప్పు నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ఫుడ్ కలర్– చిటికెడు ఏలకుల పొడి– అర టీ స్పూన్ జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్ – టేబుల్ స్పూన్ పాల కోవా– 2 టేబుల్ స్పూన్లు లేదా చిక్కటి పాలు కప్పు; నీరు – 2 కప్పులు. తయారీ విధానం: సగ్గుబియ్యాన్ని కడిగి నీరు పోసి ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్లను వేయించాలి. వేగిన జీడిపప్పు, కిస్మిస్ను తీసి పక్కన పెట్టి అదే బాణలిలో ఉడికిన సగ్గుబియ్యం, చక్కెర, ఫుడ్ కలర్ వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు పాల కోవా వేసి కలపాలి. కోవా లేకపోతే పాలు పోసి, ఏలకుల పొడి వేసి దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలిపితే సాబుదానా హల్వా రెడీ. (చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి! టేస్ట్ అదిరిపోతుంది) -
Sobhita Dhulipala Photos: సమ్మర్లో మరింత హీటెక్కిస్తున్న శోభిత ధూళిపాళ అందాలు (ఫోటోలు)
-
సమ్మర్లో చల్లటి బాదం పాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
అప్పుడే వేసవికాలం వచ్చేసిందా అన్నంతగా మార్చి నుంచి ఎండ దంచి కొడుతోంది. బయట సూర్యుడి భగ భగలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఎండకు చెమటలు పట్టేసి అలిసి సొమ్మసిల్లిపోతుంటా. ఈ కాలంలో ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలే తాగేందుకు ఇష్టపడతాం. అలా అని కూల్‌డ్రింక్‌లు తాగితే అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా వాటిలో అధికంగా చక్కెర పరిమాణం ఉంటుంది. అందువల్లో ఇంట్లోనే హెల్తీగా ఉండే బాదం పాలు చలచల్లగా చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ సమ్మర్లో మంచి దాహార్తిని తీర్చే బలవర్థకమైన పానీయం కూడా.రీ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలంటే.. కావలసిన పదార్థాలు: బాదం పప్పులు- ఒక కప్పు (ఎక్కువ పరిమాణంలో కావాలి అంటే.. ఎక్కువ తీసుకోవచ్చు) జీడిపప్పు- ఒక కప్పు చక్కర – 100 గ్రాములు.. ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాలకుల పొడి -ఒక స్పూన్.. రుచి మరింతగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పాలు – అర లీటర్..(ఒకవేళ ఎక్కువ పాలు కావాలనుకుంటే మరిన్ని ఎక్కువ తీసుకోవచ్చు) తయారీ విధానం.. బాదంపప్పులను, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న తీయని పాలను వేడి చేసుకోవాలి. అలా వేడిగా ఉన్న పాలలో యాలకుల పొడి, చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పోటీ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని అందులో కలపాలి. అనంతరం చిన్న మంట మీద పది నుంచి 15 నిమిషాలు ఆ పాలను మరగనివ్వాలి. ఆ తర్వాత పాలను దింపి చల్లారపెట్టాలి. అనంతరం ఆ పాలను గ్లాసుల్లో పోసుకొని.. పైన సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ మొక్కలు వేసి కొద్దిసేపు అలా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక అర్థగంట లేద గంట తర్వాత బయటకు తీస్తే చల్ల చల్లని బాదంపాలు సిద్ధంగా ఉంటాయి. అల వాటిని ఆస్వాదించుకుంటూ తాగొచ్చు. ఇలా పాలను రోజు పిల్లలకు తాగిస్తే ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. బయట తాగే బాదం పాలకంటే.. ఇంట్లో తయారు చేసుకునే బాదంపాలే ఆరోగ్యానికి మంచిది కూడా. బాదం పాలలో మంచి ఫైబర్ ఉంటుంది. జీడిపప్పులో కావాల్సినన్ని మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులు తగ్గిస్తాయి. బరువులు తగ్గించడంలో సహకరిస్తాయి. బాదంపప్పులను రోజు ఉదయం లేవగానే తింటే మెదడు పనితీరు బాగుంటుంది. బాదంలోని క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. పిల్లలు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ బాదంపాలు తాగేందుకు టేస్టీగా ఉండటంతో పిల్లలు కూడా భలే ఇష్టంగా తాగుతుంటారు. (చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!) -
TS: మార్చిలోనే మండుతున్న ఎండలు
సాక్షి,హైదరాబాద్: మార్చినెల సగం గడవక ముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.గత ఏడాదితో పోల్చితే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ప్రస్తుతం రోజువారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రెండుమూడు రోజులుగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో మంగళవారం 40.5 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటివరకు.. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 40.3 డిగ్రీల సంగారెడ్డి జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదీ చదవండి.. ఇక టీఎస్ బదులు టీజీ -
అడవిలో అమృతధార
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు. పాపికొండల్లో 60 నీటికుంటలు పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్‌డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
ఈ నెస్ట్ ట్యూబ్స్‌తో వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా..
వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా.. ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటాం. అందుకు ఇంట్లో ప్లేస్‌ని బట్టి కొన్ని ఇండోర్ ప్లాంట్స్‌ను ప్లాన్ చేసుకుంటాం. అయితే ఆ ప్లాన్‌లో కుండీల కన్నా ఈ నెస్ట్ ట్యూబ్స్‌ని ప్లేస్ చేసుకోండి. పచ్చదనం.. చల్లదనంతోపాటు వాల్ డెకర్‌గా ఇంటికి కొత్త కళనూ తీసుకొస్తాయి. ఇంట్లో మొక్కలు ఉంటే దోమలు వస్తాయనుకునేవారు హెర్బల్ ప్లాంట్స్‌ని పెంచుకోవచ్చు ఈ నెస్ట్ ట్యూబ్స్‌లో. వాటిని ఇదిగో ఇలా వుడెన్ స్టాండ్స్‌లో సెట్ చేస్తే మీ ఇంటికి కూల్ లుక్ వచ్చేస్తుంది. నెస్ట్ ట్యూబ్స్ నెస్ట్ ట్యూబ్స్‌తో ఉన్న రెడీమేడ్ వుడెన్ వాల్ స్టాండ్స్.. హ్యాంగింగ్స్.. వెరైటీ డిజైన్స్‌తో ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ మార్కెట్స్‌లో లభ్యమవుతున్నాయి. ఆసక్తి ఉంటే ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. గ్లాస్ ట్యూబ్స్, వుడెన్ స్టాండ్స్, గ్లూ లేదా స్టికర్స్.. ఉంటే చాలు. గ్లాస్ ట్యూబ్స్ లేకపోతే చిన్న చిన్న వాటర్ బాటిల్స్‌ను ఉపయోగించవచ్చు. అయితే, అన్నీ ఒకే సైజ్‌లో ఉండేలా చూసుకోవాలి. ఈ ఎండాకాలంలో ట్రై చేసి చూడండి.. మీ ఇంటి అందం రెట్టింపు అవడం గ్యారంటీ! ఇవి చదవండి: నీ సంబడం సంతకెళ్లి పోను -
హాట్.. హాట్ సమ్మర్
సాక్షి, విశాఖపట్నం:ఈ ఏడాది వేసవి దడ పుట్టించనుంది. అసాధారణ ఉష్ణోగ్రతలతో అల్లాడించనుంది. ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తూ హాట్‌హాట్‌గా ఉండనుంది. రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా అదే అంచనాకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లోకెల్లా మే నెలలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 5–8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇవి ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. అందువల్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లో వేసవికాలంలో సగటున 5–6 రోజులు వడగాడ్పులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ నాలుగో వారం వరకు సుదీర్ఘంగా వేసవి తీవ్రత కొనసాగింది. దీంతో 17 రోజులు వడగాడ్పులు వీచాయి. ఈ వేసవిలో 2019 నాటి ఉష్ణోగ్రతలు పునరావృతం కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండాకాలంలో ఉష్ణతీవ్రత కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త కరుణాసాగర్ ‘సాక్షి’కి చెప్పారు. వేసవిలో రెండు రోజులకు మించి సాధారణం కంటే 4–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే హీట్ వేవ్స్ గాను, 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వడగాడ్పుల (హీట్ వేవ్స్)కు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం.. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైతే వాతావరణం కాస్త చల్లబడి ఉపశమనం కలిగిస్తుంది. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. దీంతో పగలు (గరిష్ట), రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఎక్కువ ఉష్ణతాపం అనుభూతి కలగనుంది. ఇటీవల ముగిసిన శీతాకాలం సీజన్ కూడా అంతగా చల్లదనం లేదు. సీజన్ మొత్తమ్మీద ఒక్క రోజు కూడా కోల్డ్ వేవ్స్ (అతి శీతల పవనాలు) వీయలేదు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలకు మించి తక్కువగా నమోదు కాకపోవడంతో శీతల ప్రభావం చూపలేదు. దీని ప్రభావం కూడా ఈ వేసవిపై పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఎల్‌నినో పరిస్థితులు కూడా జూన్ ఆరంభం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధిక ఉష్ణతాపం, వడగాడ్పులు కొనసాగనున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎల్‌నినో ఉంటుంది. ఆ తర్వాత లానినా పరిస్థితులతో సముద్ర ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారనున్నాయి. అనంతపురంతో ఆరంభం రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల అప్పుడే మొదలైంది. వేసవి సీజన్ ఆరంభంలోనే అనంతపురంలో శనివారం 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం. కర్నూలు, నంద్యాల, నందిగామ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
నిమ్మ రసం తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి!
#LemonWater Side Effects వేసవి కాలం వచ్చిందంటే నిమ్మకాయలకు గిరాకీ పెరుగుతుంది. సమ్మర్ సీజన్లో నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేసవిలో శరీరానికి కావల్సిన నీరు అందించడంతోపాటు, జీర్ణ సమస్యలను తొలగించడం, బరువు నియంత్రణలో కూడా సాయం చేస్తుంది. కానీ నిమ్మ నీరు ఎక్కువగా తాగితే దుష్ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? నిజానికి నిమ్మలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం వంటి ఖనిజాలు , ఫోలేట్ వంటి పోషకాలతో తోపాటు సీ విటమిన్ అధికంగా లభిస్తుంది. నీటికి రుచిని ఇవ్వడంతో పాటు, నిమ్మ రసం చర్మానికి మెరుపు నిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మోతాదు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మరసం- సైడ్ ఎఫెక్ట్స్ ♦ గుండెల్లో మంట వస్తుంది. మోతాదు మించితే పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. అలాగే సిట్రస్ పండ్లు తరచుగా తీసుకొంటే మైగ్రేన్, తలనొప్పి పెరుగుతాయి. ♦ డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఎక్కువే. ఎందుకంటే లెమన్ వాటరతో మూత్రం అధికమై, శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. అతిగా సేవిస్తే పొటాషియం లోపం ఏర్పడుతుంది. ♦ విటమిన్ సీ మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సిట్రిక్ యాసిడ్, ఆక్సలేట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం. ♦ఎసిడిటీ వస్తుంది. ♦ ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ♦ టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని, ఇది గొంతునొప్పి దారితీస్తుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది ♦ నిమ్మలోని సిట్రస్ వల్ల పళ్ల ఎనామిల్‌కు నష్టం. దంత సమస్యలు కూడా వస్తాయి -
తాగునీటి తంటాలు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వేసవి దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణకు దిగింది. నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో డెడ్‌స్టోరేజీ వరకు నీటిని పంపింగ్ చేసేందుకు అత్యవసర మోటార్లు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వేసవిలో తాగునీటి డిమాండ్ పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం సరఫరా చేస్తున్న 565 మిలియన్ గ్యాలన్స్ పర్ డే (ఎంజీడీ)లకు తోడు అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లకు సిద్ధమైంది. మహానగరానికి మంచి నీరు అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 516 అడుగులకు చేరింది. నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తుగా మోటార్లను బిగించి అత్యవసర పంపింగ్‌కోసం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ జలాశయంలో మినహా అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని జలమండలి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సగం వాటా కృష్ణా జలాలదే.. మహానగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అవుతున్న తాగునీటిలో సగం వాటా కృష్ణా జలాలదే. నాగార్జున సాగర్ నుంచి నిత్యం 270 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్ సమీపంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి పంప్ హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్‌లోకి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే పరిస్థితి ఉండదు. దీంతో సాగర్ నుంచి కష్ణాజలాల అత్యవసర పంపింగ్ తప్పనిసరి. గత ఐదేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించారు. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహా నగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 565 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103, ఉస్మా¯న్ సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. డెడ్ స్టోరేజీగా హిమాయత్‌సాగర్‌ను ఉంచినప్పటికీ వేసవిలో అవసరాల మేరకు ఈ రిజర్వాయర్ నుంచి పాతనగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి నుంచి తరలిస్తున్న 172 ఎంజీడీలో 40 ఎంజీడీలు మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారు. దానిని సైతం నగరానికి తరలించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు.. వేసవిని దృష్ట్యా డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధమైంది. నగరంలో ఇప్పటికే 72 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిమాండ్‌ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం జలమండలి చర్యలు చేపట్టింది. -
భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వేసవి తీవ్రత అప్పుడే పెరుగుతుండడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. బోరుబావుల కింద వేసిన యాసంగి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి నెలలో తొలిసారిగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 15వేల మెగావాట్లను దాటింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది సరిగ్గా ఇదే రోజు 14,526 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ మాత్రమే నమోదైంది. గతేడాది మార్చి 30న రాష్ట్రంలో అత్యధికంగా 15497 మెగావాట్ల గరిష్ట విదుŠయ్త్ నమోదు కాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి 16,500 మెగావాట్లకు మించనుందని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్‌కు ఏర్పాట్లు 1,600మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 800 మెగావాట్ల నుంచి ఇప్పటికే వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కాగా, 800 మెగావాట్ల రెండో ప్లాంట్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సర్వంసిద్ధం చేశారు. పొరుగు రాష్ట్రాలతో 1200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్‌కు సైతం ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చి మన రాష్ట్రంలో లోటు ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో 6.9 శాతం, ఫిబ్రవరి నెలలో 4.6 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజువారీ విద్యుత్ వినియోగం 242.95 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 256.74 మిలియన్ యూనిట్లకు చేరింది. సాగునీరు లేక పెరగనున్న విద్యుత్ అవసరాలు కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో కాల్వల కింద ఆయకట్టు సాగుకు నీళ్లు లేవు. మరమ్మతుల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో బోరుబావుల కింద విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. గరిష్ట విద్యుత్ డిమాండ్ మార్చి చివరిలోగా 16500–17000 మెగావాట్ల మధ్య నమోదు కావచ్చని భావిస్తున్నారు. దక్షిణ డిస్కంల పరిధిలోనూ పెరిగిన వినియోగం దక్షిణ తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 6.67 శాతం, ఫిబ్రవరిలో 6.24 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. సంస్థ పరిధిలో ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 9043 మెగావాట్లు నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 9253 మెగావాట్లకు పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 158.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఈ ఏడాది ఇదే కాలంలో 169.36 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గ్రేటర్లో డిమాండ్ పైపైకి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 9.47 శాతం, ఫిబ్రవరిలో 12.27శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,930 మెగావాట్లుగా నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 3,174 మెగావాట్లుగా నమోదయ్యింది. నగరంలో గతేడాది జనవరి, ఫిబ్రవరిలో సగటు విద్యుత్ వినియోగం 51.69 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది జనవరిలో 57.34 మిలియన్ యూనిట్లు, ఫిబ్రవరిలో 65 మిలియన్ యూనిట్లకు పెరిగింది. -
తాగునీటికి తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి తాగునీరు అందేలా చూడాలని సూచించారు. ఇందుకోసం సాగునీటి, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు కలసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వర్షాభావంతో రాష్ట్రంలోని కీలక జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి తాగునీటి అంశంపై సమీక్షించారు. బోర్లు, మోటార్లకు మరమ్మతులు కొత్త నీటి పథకాలను తెచ్చినప్పుడల్లా అంతకుముందున్న అనేక నీటి వనరులను వదిలేశారని.. అలాంటి వాటిని ప్రస్తుతం వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సమీక్షలో సీఎం సూచించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని.. కానీ మిషన్ భగీరథ వచ్చాక దానిని వదిలేశారని చెప్పారు. ఇలాంటివి రాష్ట్రంలో ఎక్కడున్నా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి బోర్లు, బావులు, మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఇందుకోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధుల నుంచి కోటి రూపాయలు, అవసరమైతే అంతకన్నా ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. కృష్ణానీటిపై దృష్టి పెట్టండి ఏపీ సర్కారు తాగునీటి కోసమంటూ నాగార్జునసాగర్ నుంచి తొమ్మిది టీఎంసీలకుపైగా నీటిని తీసుకుపోతోందని సమీక్షలో అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన రేవంత్.. అంత పెద్దమొత్తంలో తాగునీటిని ఎక్కడ వినియోగిస్తున్నారో సరైన గణాంకాలు తీసుకోవాలని.. ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని సూచించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటిని తీసుకోవాలంటే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ ఎంబీ)కి లేఖ రాయాల్సి ఉంటుందని చెప్పగా.. ఎంత నీరు అవసరమో వెంటనే సమీక్షించి లేఖ రాయాలని ఆదేశించారు. నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను కోరవచ్చని అధికారులు చెప్పగా.. పరిస్థితిని బట్టి దీనిని చివరి అవకాశంగా తీసుకోవాలని సీఎం సూచించారు. తప్పుడు నివేదికలతో అందని నిధులు ఇటీవల తాను ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక గ్రామాల్లో తాగునీటి సరఫరా లేదని గుర్తించినట్టు సీఎం చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా 99శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చినందునే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ నిధులు రావడం లేదన్నారు. గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తంగా జూలై చివరిదాకా ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ తాగునీటికి సమస్య లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే హైదరాబాద్‌కు పెద్దగా ఇబ్బందులు లేవని.. అవసరమైతే ఎల్లంపల్లి, నాగార్జునసాగర్‌ల నుంచి తెప్పించుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇక వేసవి పూర్తయ్యే వరకు హైదరాబాద్ నగరంలో తాగునీటి ట్యాంకర్ల రాకపోకలకు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడా లని సీఎం ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బందికి వేతనాలకోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. -
ఎండలు పెరిగాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు చిటపటమంటున్నాయి. వేసవి సీజన్ రాకముందే ఎండల తీవ్రత వేగంగా పెరిగింది. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావడంగమనార్హం. పగటి ఉష్ణోగ్రతలకు తోడుగా రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉషోగ్రత భద్రాచలంలో 36.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 18.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదు కాగా... హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 3 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. మిగతా కేంద్రాల్లో 2 డిగ్రీల్లోపు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో పగటి పూట ఉక్కపోత పెరిగింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రత మరింత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
ఐస్ వాటర్ తెగ తాగేస్తున్నారా? ఆగండాగండి! ఈ ఎఫెక్ట్స్ తెలుసా?
ఇంకా మార్చి నెల రాకుండానే వేడి సెగ తగులుతోంది. రాత్రి పూట ఫ్యాన్లు, ఏసీలు లేనిదే నిద్రపోలేని పరిస్థితి వచ్చేసింది. ఇక ఎండాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చేది చల్ల.. చల్లని నీళ్లు. వేడినుంచి ఉపశమనం పొందేందుకు ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం అందరికీ అలవాటు. చల్లటి నీళ్లు, లేదా ఇతర పానీయాలు కడుపులో పడగానే హాయిగా అనిపిస్తుంది. కానీ అలా ఐస్ వాటర్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి చేటు అని మీకు తెలుసా? వేసవిలో చల్లని నీరు త్రాగడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు గురించి తెలియాలంటే.. ఈ కథనాన్ని చూడండి. జీర్ణక్రియ సమస్యలు చల్లటి నీరు కడుపుని సంకోచింప చేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత ఆహారాన్ని జీర్ణం కాదు కష్టమవుతుంది. మనం చల్లటి నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. అవును, చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి మనం చల్లటి నీరు తాగినప్పుడు, అది శరీర ఉష్ణోగ్రతతో సరిపోలక కడుపులో ఉన్న ఆహారం జీర్ణం కష్టమవుతుంది. హార్ట్ రేట్ తగ్గిపోతుంది కొన్ని అధ్యయనాలు ప్రకారం చల్లని నీరు తాగడం గుండె స్పందన రేటు కూడా తగ్గిపోతుంది. మెడ మీద ఉండే గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్ చేసే వాగస్ నాడి మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ నాడి శరీరం స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. అందుకే చల్లగా తిన్నా, తాగినా హార్ట్ రేట్ ప్రభావిత మవుతుంది. నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. సైనస్ , తలనొప్పి అతి చల్లగా తాగడం వల్ల కూడా 'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్రీం అధికంగా తీసుకుంటే, వెన్నెముకకు సంబంధించిన సున్నితమైన నరాలు కూడా చల్లగా అయిపోతాయి. ఫలితంగా తలనొప్పి , సైనస్ సమస్యలొస్తాయి. మలబద్ధకం చల్లటి నీరు తాగడం వల్ల పేగుల్లో ఆహారం గడ్డకడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్ బుల్ లాంటివి కూడా వస్తాయి కొవ్వును పెంచుతుంది చల్లటి నీరు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును మరింత గట్టిగా తయారు చేస్తుంది. ఒక పట్టాన కరగదు కూడా. సో.. బరువు తగ్గాలనుకున్న వారు చల్లని నీటికి దూరంగా ఉండాలి. గొంతు నొప్పి చల్లని నీరు, పానీయాల వల్ల ముఖ్యంగా భోజనం తర్వాత, అదనపు శ్లేష్మం (శ్వాసకోశ శ్లేష్మం) ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గొంతు నొప్పి, ముక్కు దిబ్బడం సమస్య వస్తుంది. ఇది ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇది ముదిరితే జ్వరం కూడా వస్తుంది. అంతేకాదు చల్లటి నీరు తాగడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి. అందుకే కుండలోని నీళ్లు అయినా, ఫ్రిజ్ వాటర్ అయినా మరీ చల్లని నీళ్లు కాకుండా, ఒక మాదిరివి తాగి, వేడినుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే సమస్యలు తప్పవు. -
ముందే వచ్చిన వేసవి!
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది వేసవి ఆరంభానికి ముందే ఉష్ణతాపం భయపెడుతోంది. శీతాకాలం సీజను ముగియక ముందే సూర్య ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలోనే ఏప్రిల్ నాటి ఎండలు చుర్రుమనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైనే రికార్డవుతున్నాయి. ఇవి రానున్న వేసవి తీవ్రతను ఇప్పట్నుంచే తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. కానీ అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడపల్లో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా కొన్ని ప్రాంతాల్లో మినహా పలు చోట్ల క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. పెరగనున్న వేసవి తీవ్రత రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని చెబుతున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్‌నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండట, కాలుష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అ«దికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే సాధారణంగా ఫిబ్రవరిలో చిరుజల్లులు కురుస్తూ ఉష్ణతాపాన్ని అదుపు చేస్తాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. గత సంవత్సరానికంటే ఈ వేసవి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పారు. జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడి, లానినా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున మే ఆఖరు వరకు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు -
వేసవిలో మ్యాచ్‌ను ప్లాన్ చేసుకున్న నయనతార
‘ది టెస్ట్’ను పూర్తి చేశారు నయనతార. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సింగర్ శక్తి శ్రీగోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు, ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాను గత ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
నియోజకవర్గానికి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా సర్పంచ్‌లకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే సర్పంచ్ల పదవీకాలం నెలాఖరుతో ముగుస్తున్నందున అధికారులు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలసి సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలోంచి రూ. కోటి చొప్పున తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్త రిజర్వాయర్లన్నింటినీ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని.. తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరా సులభమవుతుందని సీఎం తెలిపారు. గ్రామాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్‌ను సర్పంచులకే అప్పగించాలన్నారు. నీరురాని గ్రామాల సర్వే.. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని ఆవాసాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకొనేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు... స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్‌లను కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. రహదారులు లేని గ్రామాలకు తారురోడ్లు... రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించగా వాటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయా లని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్ర నిధులు రాలేదు.. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచి్చనట్లు గత ప్రభుత్వం చెప్పుకోవడంతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రకటనలతో కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. ఇకపై వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. -
నగరానికి నీటి ముప్పు
సాక్షి, హైదరాబాద్: వేసవికి ముందే నగరానికి నీటిముప్పు పొంచి ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటినిల్వలు తగ్గుముఖం పట్టి తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 520 అడుగులకు చేరింది. సాగర్ నీటిమట్టం మరింత తగ్గి పుట్టంగడి పంపింగ్ కేంద్రానికి నీరు అందకపోతే అత్యవసర పంపింగ్ తప్పనిసరి అవుతుంది. జలాశయంలో 510 అడుగుల నీటిమట్టం వరకు ఎలాంటి పంపింగ్ లేకుండా నగరానికి తాగునీటిని తరలించవచ్చు. వేసవినాటికి జలాశయంలో నీటిమట్టం మరింత అడుగుకు చేరే అవకాశం కనిపిస్తోంది. అత్యవసర పంపింగ్ చేపట్టినా డెడ్‌స్టోరేజీ వరకు మాత్రమే నీటిని పంపింగ్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం కృష్ణాజలాల తర లింపుపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నెలకొన్న దృష్ట్యా ఈ సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. సగంనీరు సాగర్ నుంచే... మహానగరవాసుల దాహార్తి తీర్చేందుకు సరఫరా చేస్తున్న తాగునీటిలో సగానికి పైగా నాగార్జునసాగర్ జలాశయం నుంచి తరలిస్తున్నారు. నగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు ప రిధిలోని అత్యధిక ప్రాంతాలకు కృష్ణా జలాలే ఆధారం. సాగర్ నుంచి నిత్యం 290 ఎంజీడీ నీటిని నగరానికి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్టు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని పుట్టంగండి పంప్‌హౌస్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటిమట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే పరిస్థితి ఉండదు. దీంతో కృష్ణాజలా ల పంపింగ్ నిలిచిపోతుంది. గతంలో నీటి మట్టం కిందకు పడిపోతుండగానే అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు జరిగేవి. గత ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితి తిరిగి పునరావృత్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి ఎగువన ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్ వట్టిపోతోంది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం గతేడాది ఇదే రోజు నాటికి 571.900 అడుగులు ఉండగా, ఈసారి మాత్రం 520 అడుగులకు పడిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామ ర్థ్యం పరిశీలిస్తే గతేడాది 261.300 టీఎంసీలు ఉంటే, ఈ సారి మాత్రం 149.820 టీఎంసీలకు చేరింది. వాస్తవంగా నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీటిని అందించడానికి ఎత్తిపోతల సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే అక్కడ పంపులను నడపడం సాధ్యం కాదు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలకుగాను 505 అడు గుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం కూడా జరగడంతో అత్యవసర పంపింగ్‌తో కూడా నగరానికి నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం కనిస్తోంది. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహానగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 560 నుంచి 590 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) నీటిని తరలిస్తున్నారు. కృష్ణా నుంచి 290 ఎంజీడీలు, గోదావరి నుంచి 160 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. హిమాయత్‌సాగర్ నుంచి వచ్చే వేసవిలో అవసరాల మేరకు పాతనగరానికి నీటిని అందించి, కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్క కృష్ణా జలాలు తప్ప అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. -
'గేమ్ ఛేంజర్' వాయిదా.. అదే అసలు కారణం?
‘‘ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ, ఈగల్, హనుమాన్’ తదితర సినిమాలు విడుదల కానున్నాయి. ఐదుగురు నిర్మాతలనూ పిలిచి మాట్లాడాం. రెండు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలని సూచించాం. సంక్రాంతి పోటీలో ఉండకూడదని నా సినిమా ‘గేమ్ ఛేంజర్’ను వేసవికి వాయిదా వేశాం. ఎవరైనా రిలీజ్ వాయిదా వేసుకుంటే.. సోలో రిలీజ్ చేసేలా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున చర్యలు తీసుకుంటాం’’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జనవరి 21న ‘లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ’ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ప్రెస్మీట్లో పాల్గొన్న ‘దిల్’ రాజు సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ గురు రామాచారి మాట్లాడుతూ– ‘‘దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ఆశీస్సులతో 1999లోప్రారంభమైన ఈ అకాడమీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవానికి సారథ్యం వహించాలని డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత ‘దిల్’ రాజుగార్లను కోరగానే ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘దిల్’ నుంచి రామాచారిగారితో పరిచయం ఉంది. ఆ టైమ్‌లో ‘లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ’ గురించి చెప్పారాయన. ఈ అకాడమీలో ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నారు. అద్దె భవనంలో ఉన్న అకాడమీకి ప్రభుత్వం తరఫున సాయం వచ్చేలా చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు. -
వేసవికి ఏపీ సన్నద్దం
-
వేసవిలో ‘ఉపాధి’కి కసరత్తు
సాక్షి, అమరావతి: పేదలకు వచ్చే వేసవిలో కూడా సొంత ఊళ్లలోనే పెద్ద ఎత్తున పనులు కల్పి0చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. 2024–25 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌పై అన్ని గ్రామాల్లో కసరత్తు మొదలైంది. గత మూడేళ్లుగా గ్రామాల వారీగా ఉపాధి పథకం పనులకు వచ్చిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని.. వచ్చే ఆరి్థక సంవత్సరంలో ఎంత మందికి ఈ పథకం ద్వారా పనులు కల్పి0చాలన్న అంచనాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి ఇప్పటికే కలెక్టర్లతో పాటు డ్వామా పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో అక్టోబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. గతంలో చేపట్టి ఇప్పటికీ పూర్తి కాని పనులను 20వ తేదీకల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది సందర్శించి సమీక్షిస్తారు. నవంబర్ 10కల్లా గ్రామాల్లో అదనంగా చేపట్టే కొత్త పనులను గుర్తిస్తారు. నవంబర్ 15కల్లా ఆయా గ్రామాల్లో ఎంత మందికి ఎన్ని పనిదినాలు కల్పించాలన్న వివరాలతో లేబర్ బడ్జెట్‌ను రూపొందించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య.. కొత్తగా గుర్తించిన పనులకు సంబంధించి గ్రామ సభలో చర్చించి అనుమతి తీసుకుంటారు. అవసరమైతే మండల, జిల్లా స్థాయిలో కూడా అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపడతారు. 2024–25 ఆరి్థక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి పనులు కల్పి0చాలనే వివరాలను గుర్తించి.. అందుకు అవసరమయ్యే పనులకు కలెక్టర్ల ద్వారా అనుమతి తీసుకునే ప్రక్రియను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తారు. గ్రామాల వారీగా తయారు చేసిన ఈ అంచనాలతో రాష్ట్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌ను రూపొందించి.. దానిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతికి పంపిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కొత్త పనుల గుర్తింపులో కనీసం 60 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రామాల వారీగా కమిటీలు.. 2024–25 ఆరి్థక ఏడాదికి సంబంధించిన లేబర్ బడ్జెట్ అంచనాల తయారీ, కొత్త పనుల గుర్తింపు కోసం గ్రామాల స్థాయిలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్లు, వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు, పొదుపు సంఘాల గ్రామ స్థాయి లీడర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. మండల స్థాయి అధికారులు ఈ గ్రామ కమిటీలకు తగిన సహకారం అందజేస్తారు. -
ఈ ఏడాది వేసవి.. వాతావరణ పాఠాలు చాలానే నేర్పింది!
ప్రపంచ ప్రజలకు ఈ ఏడాది వేసవి నేర్పిన పాఠాలు వాతావరణంలో మార్పులు, భూతాపం, ఎల్ నినోతో భూగోళంపై జనం అవస్థలు ఈ ఏడాది వేసవిలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తించాయి. మానవుల అనాలోచిత కార్యకలాపాల వల్ల వచ్చిన వాతావరణ మార్పులు, భూతాపం, ఎల్ నినో ఆరంభ దశ–ఇవన్నీ భూగోళంలో ఉత్తత ప్రాంతంలోని అమెరికా, ఐరోపా దేశాలనే గాక ఇండియా వంటి దక్షిణ ప్రాంత దేశాలను మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ఇబ్బందులు పెట్టాయి. భారతదేశంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ దాటిపోయే రోజులు 2023 వేసవిలో బాగా పెరిగాయి. ఫలితంగా వడగాడ్పులు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. చివరికి ఎండాకాలం తర్వాత వర్షపాతం కూడా తగ్గిపోయింది. వాతావరణ మార్పుల ఫలితంగా వచ్చిన తీవ్ర వడగాడ్పుల వల్ల ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయింది. అమెరికాలో ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో నూరు డిగ్రీల ఫారన్ హైట్ కు అటూ ఇటూగా ఉన్నాయంటే ఈ ఏడాది వేసవి ప్రతాపం ఎంతటిదో అర్ధమౌతోంది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని ప్రధాన నగరం ఫీనిక్స్ లో పగటి ఉష్ణోగ్రతలు వరుసగా నెల రోజులు 125 డిగ్రీల ఫారన్ హైట్ దాటి ఉన్నాయాంటే అక్కడి జనం ఎన్ని కష్టాలు పడ్డారో స్పష్టమవుతోంది. ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడల్లా వాయు కాలుష్యం కూడా జనం తట్టుకోలేనంత స్థాయికి చేరుతుందని ప్రపంచ వాతావరణ పరిశోధనా సంస్థ (డబ్ల్యూఎంఓ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘‘వాతావరణ మార్పును, గాలి నాణ్యతను రెండు వేర్వేరు అంశాలుగా చూడకూడదు. వాతావరణంలో వచ్చే తీవ్ర మార్పులను బట్టే గాలి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ సమస్యపై అందరూ దృష్టిపెట్టాలి. ఈ రెండు సమస్యలతో ముడిపడిన విషవలయాన్ని మనం ఛేదించాలి,’’ అని డబ్ల్యూఎంఓ సెక్రెటరీ జనరల్ పెత్తెరి తాలస్ ఒక మీడియా ప్రకటనలో కోరారు. వాయు కాలుష్యం ఎక్కువైతే అడవుల్లో మంటలు చెలరేగి లక్షలాది చెట్లు బూడితయ్యేలా చేసే కార్చిచ్చు నిరంతర సమస్యగా మారుతుందని కూడా ప్రపంచ వాతావరణ పరిశోధనా సంస్థ బుధవారం హెచ్చరించింది. ఈ కార్చిచ్చు లేదా దావానలం వల్ల అడవుల నుంచి వేడిగాలులు వాతావరణంలో చొరబడతాయి. పొగ వల్ల ఆరోగ్య సమస్యలు కార్చిచ్చు వ్యాపించే ప్రదేశాల దగ్గర మాత్రమేగాక వేలాది మైళ్ల దూరంలోని ప్రాంతాల్లో కూడా తలెత్తుతాయి. దేశంలో ఓ పక్క ఎండలు మండుతుంటే హిమాలయ రాష్ట్రాల్లో వరదలు! ఈ వేసవి జూన్, జులై నెలల్లో ఉష్ణోగ్రతలు భారత ప్రజలు భరించలేనంత తీవ్రంగా ఉన్నాయి. మరో పక్క హిమాలయాలను ఆనుకుని ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 4న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.1 సెంటిగ్రేడ్ గా నమోదయింది. అంటే 1938లో మాత్రమే రాజధానిలో సెప్టెంబర్ మాసం ఉష్ణోగ్రత ఈ స్థాయికి చేరింది. ‘‘మేం గమనించేది పాత రికార్డులు బద్దలుగొట్టే అధిక ఉష్ణోగ్రతలను మాత్రమే కాదు. ఈ భూమి మీద, నివసించే ప్రజల మీద వాటి ప్రభావాలను కూడా పరిశీలిస్తున్నాం. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి,’ అని ఐరోపా వాతావరణ పరిశోధనా సంస్థ (ఈసీఎండబ్ల్యూఎఫ్)కు చెందిన కొపర్నికస్ వాతావరణ మార్పు సేవల సంస్థ డైరెక్టర్ కార్లో బ్యూన్ టెంపో వ్యాఖ్యానించారు. మానవులకు ఆందోళన కలిగించే మరో విషయం మహాసముద్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం. భూమి ఉపరితలం మీద 70% స్థలం ఆక్రమించుకుని ఉన్న మహాసముద్రాలు గతంలో ఎన్నడూ లేనంత వేడిని అనుభవిస్తున్నాయి. ఆగస్ట్ 31న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత 25.18 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పెరిగి కొత్త రికార్డు నమోదు చేసుకుంది. పారిశ్రామిక యుగం మొదలైనప్పటి నుంచీ మానవ కార్యకలాపాల వల్ల ఉత్పత్తి అయిన 90 శాతం మితిమీరిన వేడిని మహాసముద్రాలు తమలోకి ఇముడ్చుకున్నాయి. మానవుల కార్యకలాపాలు ప్రస్తుత రీతిలో కొనసాగితే–19వ శతాబ్దం మధ్య కాలంతో పోల్చితే వచ్చే ఐదేళ్లలో ఏడాది సగటు ఉష్ణోగ్రతలు 1.5 సెంటిగ్రేడ్ డిగ్రీల చొప్పున పెరుగుతాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ పరిశోధనా సంస్థ ఇది వరకే హెచ్చరించింద. ఈ నేపథ్యంలో నిరంతరం వాతావరణంలో తీవ్ర మార్పులు రాకుండా, ఉష్ణోగ్రతలు అవాంఛనీయ స్థాయిలకు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాశ్చాత్య దేశాలు సహా అన్ని ప్రాంతాల ప్రజలపై ఉందని చెప్పాల్సిన పని లేదు. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు -
అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ..
నైరుతి అమెరికాలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. ఇది 110 మిలియన్లకు మించిన ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలోని 38 నగరాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని సమాచారం. లాస్ వెగాస్‌లో వేడిగాలులతో కూడిన ఉష్ణోగ్రత రికార్డు గరిష్ట స్థాయి 117F (47.2C)కు చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దక్షిణ ఐరోపాను కూడా తాకాయి. కెనడా చరిత్రలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు అడవుల్లో కార్చిచ్చుకు కారణంగా నిలుస్తున్నాయి. మానవ కార్యకలాపాలతో ముడిపడిన వాతావరణ మార్పులు ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. రంగంలోకి అగ్నిమాపకదళ సిబ్బంది నైరుతి యుఎస్‌లోని పలు ప్రాంతాలలో, లాస్ ఏంజిల్స్ శివార్లలో వందలాది మంది అగ్నిమాపకదళ సిబ్బంది ఉష్ణోగ్రతలను చల్లబరిచేందుకు తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్డబ్లుఎస్) తెలిపిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు ఆదివారం 128F (53.9C)కి చేరుకున్నాయి. ఇది భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా లాస్ వెగాస్‌లోని రద్దీగా ఉండే వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హోటళ్ల ఫౌంటైన్లలోకి ప్రజలు ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు పర్యవేక్షిస్తున్నారు. వీధులలో చెమటతో తడిసిపోతూ.. స్ట్రిప్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన హోటళ్లు, కాసినోలకు వెళుతున్న యువకులు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం అని తెలిపారు. లాస్ వెగాస్‌లో ఏకాస్త భవనం నీడ కనిపించినా, చిన్న చెట్టు నీడ వచ్చినా జనం అక్కడ సేద తీరుతున్నారు. కాసినోల లోపల ఎయిర్ కండిషనింగ్ అధికంగా ఉంచారు. వీధులలో చెమటతో తడిసిపోతున్న వ్యక్తులు కనిపిస్తూ ఇంతటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఎల్ పాసో, టెక్సాస్‌లో 100.4F (38C) అంతకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫీనిక్స్, అరిజోనాలో ఉష్ణోగ్రతలు 17 రోజులుగా 109.4F (43C) కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం నాడు దట్టమైన మేఘాల కారణంగా ప్రజలకు స్వల్పంగా ఉపశమనం లభించింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 114F (45.5C) గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! ‘శీతలీకరణ కేంద్రాలు’గా పబ్లిక్ భవనాలు రాబోయే రోజుల్లోనూ ఇదేస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పిల్లలు, గర్భిణులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారు ఎండలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కాలిఫోర్నియా, నెవాడాలోని కొన్ని ప్రాంతాల్లోని పబ్లిక్ భవనాలు ‘శీతలీకరణ కేంద్రాలు’గా మార్చారు. జనం ఇక్కడ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే వేసవి తీవ్రతలను చూడాలని కోరుకునే పర్యాటకులను ఈ వాతావరణం ఆకర్షిస్తోందని కొందరు అధికారులు తెలిపారు. వారు దీనిని హ్యాపీ డెత్ డే అని పిలుస్తున్నారన్నారు. హీట్ డోమ్ కారణంగా.. ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినపుడు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటే, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్ డోమ్ అని అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇటువంటి హీట్ డోమ్ ఏర్పడుతుంది. వచ్చే వారం మధ్య నాటికి హీట్ డోమ్ దక్షిణ అమెరికా అంతటా విస్తరించనున్నదని వాతావరణ ఛానెల్ తెలిపింది. కెనడాలో కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రపంచంలో ఇప్పటికే 1.1C మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఉద్గారాలకు కోత విధించకపోతే ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. -
రాష్ట్రంలోకి ఇంకా ప్రవేశించని రుతుపవనాలు
రాష్ట్రంలోకి ఇంకా ప్రవేశించని రుతుపవనాలు -
స్టన్నింగ్ డ్రెస్‌తో మెస్మరైజ్ చేసిందిగా: ధరెంతో తెలిస్తే ఔరా అంటారు!
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాదు అప్ టూ మార్క్‌గా తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంటుంది. బ్లాక్ కలర్స్ అండ్ ప్రింట్స్ ఇష్టపడే కరీనా ఇటీవలి ఔటింగ్‌లో సమ్మర్‌కు తగ్గినట్టు ప్రింటెడ్ ఓవర్సైజ్డ్ జిమ్మెర్మాన్ కో-ఆర్డ్ సెట్‌తో మెరిసింది. ఇలా స్పెషల్ లుక్‌లో అలరించిన కరీనా వేసుకున్న డ్రెస్ ఎంత అని ఇంటర్నెట్లో వెదికిన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే అక్షరాలు 75వేల రూపాయలు. ప్రింటెడ్ సిల్క్ షర్ట్ , ప్యాచ్‌వర్క్‌తో కూడిన వైబ్రెంట్ కలర్స్ వైలెట్, పింక్, గ్రీన్ పీచ్ రంగులలో పలాజోను ధరించింది కరీనా.దీనికి మ్యాచింగ్‌గా ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్ జిమ్మెర్మాన్ చెందిన సిల్క్ కో-ఆర్డ్ సెట్లో ఫ్లవర్ పైస్లీ ప్రింట్ టాప్, ఏవియేటర్-శైలి సన్ గ్లాసెస్ ఆమె లుక్ మరింత ఎలివేట్ చేసింది. కరీనా కపూర్ ఖాన్ స్టైలిష్ ఔటింగ్స్ గత ఏడాది సెప్టెంబరులో తన 42వ పుట్టినరోజు సందర్భంగా, కరీనా కపూర్ సెక్సీ జిమ్మెర్మాన్ ర్యాప్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. రూ. 59,999 విలువైన ఈ ర్యాప్ డ్రెస్‌కు తోడు మినీ బ్లాక్ బకెట్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
రోజూ 35 లక్షల మందికి ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: వ్యవసాయపనులు ఉండని ఈ వేసవి రోజుల్లోను గ్రామీణ ప్రాంతాల్లో పేదలు పనుల కోసం పట్టణాలకో, నగరాలకో వలస పోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా సొంత ఊళ్లలోనే పనులు కల్పిస్తోంది. ఇప్పుడు రోజూ 30 లక్షల నుంచి 35 లక్షల మంది ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి జూన్ పదోతేదీ వరకు గత 70 రోజుల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 37.59 లక్షల పేద కుటుంబాలు ఈ పనులు చేసుకుని రూ.2,952.66 కోట్ల మేర లబ్ధిపొందినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అదికారులు వెల్లడించారు. శనివారం (ఈ నెల పదోతేదీ) కూడా 35.70 లక్షల మంది సొంత ఊళ్లలోనే ఈ పనులు చేసుకుని లబ్ది పొందారు. మరోవైపు ఈ పనులకు హాజరయ్యేవారికి ఒక్కొక్కరికి రోజుకు సరాసరిన రూ.245 చొప్పున గిట్టుబాటు అవుతోందని, పనులకు హాజరయ్యేవారిలో 60 శాతం వరకు మహిళలే ఉంటున్నారని అధికారులు తెలిపారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉపాధి పనులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య విరామం కల్పించింది. ఎండతీవ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈ పనులు చేయిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల డ్వామాల పీడీలతో ప్రతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ వేసవిలో పేదలకు పనుల కల్పన కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నారు. 11.62 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి ఈ వేసవిలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 37.59 లక్షల గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఉపాధిహామీ పథకం పనులు చేసుకుని లబ్ది పొందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 8,36,826 ఎస్సీ కుటుంబాలు, 3,25,204 ఎస్టీ కుటుంబాలు (మొత్తం 11,62,030 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు) ప్రయోజనం పొందినట్లు చెప్పారు. 12.06 కోట్ల పనిదినాలు గత నాలుగు సంవత్సరాల మాదిరే.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండని వేసవి కాలంలోను ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనుల కల్పనలో ఈ ఏడాది కూడ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఈ వేసవిలో ఇప్పటివరకు 73.52 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించారు. అందులో ఆరోవంతు (16 శాతానికి పైగా) మేర 12.06 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించిన మన రాష్ట్రం ఈ పథకం కింద పనుల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండోస్థానంలో ఉన్న తమిళనాడు 8.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించింది. -
ఎదురుచూపులు
ధర్మం నాలుగుపాదాలా నడిచే రాజ్యంలో క్రమం తప్పకుండా వానలు కురుస్తాయని ప్రతీతి. ఇప్పుడు ధర్మం ఎన్ని పాదాలతో నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధర్మం ఎంత కుంటి నడక నడుస్తున్నా, ఈ భూమ్మీద చెట్టూ చేమా, పిట్టా పిచుకా, పశువులూ మనుషులూ మనుగడ సాగించాలంటే తప్పకుండా వానలు కురవాల్సిందే! ఈసారి వేసవి తన తీవ్రతను తారస్థాయిలో చూపుతోంది. ఎండలు మండి పడుతున్నాయి. సూర్యుడింకా నడినెత్తికి రాకముందే నడివీథుల్లో నిప్పులు చెరుగుతున్నాయి. రుతు పవనాలు ఇప్పటికే కేరళ తీరానికి చేరుకున్నాయి. నేడో రేపో ఇక్కడకూ చేరుకుంటాయి. వానలు కురిపిస్తాయి. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం జనాలు చాతకాల్లా వానల కోసం ఎదురు చూస్తున్నారు. ఉక్కపోతలతో అల్లాడిన జనాలకు నాలుగు చినుకులే ఊరట! వాన చినుకుల కోసం నెర్రెలువారిన నేల ఆవురావురుమని ఎదురుచూస్తుంది. మన ప్రాచీన సాహిత్యంలో చాతక పక్షులు ఎదురుచూపులకు ప్రతీకలు. చాతక పక్షులు వాన చినుకుల నీటిని మాత్రమే తాగుతాయని, అందుకే అవి వానల కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటాయని పురాణ సాహిత్యం చెప్పేమాట! శాస్త్రీయ వాస్తవాలు మరోలా ఉన్నా, మన కవులు చాతకపక్షులను ఎదురుచూపులకు ప్రతీకగానే ఎంచుకున్నారు. ‘హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః/ కోకః కోకనదప్రియ ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా/ చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో/ గౌరీనాథ భవత్పదాబ్జ యుగళం కైవల్య సౌఖ్యప్రదం’ అన్నారు ఆదిశంకరులు. తామరతూళ్లనే ఆహారంగా తినే హంసలు తామరలతో నిండిన సరోవరాల కోసం ఎదురుచూస్తాయి. వాన చినుకులను మాత్రమే తాగే చాతకాలు వానలు కురిపించే కారుమబ్బుల కోసం ఎదురుచూస్తాయి. వెన్నెలనే ఆహారంగా తీసుకునే చాతకాలు చంద్రోదయం కోసం ఎదురుచూస్తాయి. అలాగే అసలైన భక్తుడు పరమేశ్వరుడి సాన్నిధ్యం కోసం ఎదురుచూస్తాడట! శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణావతారం దాల్చి భూలోకంలో పుట్టాడు. అప్పుడు వైకుంఠవాసులు శ్రీమహావిష్ణువు రాక కోసం లిప్త ఒక యుగంగా నిరీక్షించినట్లు దివాకర్ల వెంకటావధాని తన ‘కలి పరాజయము’లో వర్ణించారు. నిజానికి మనుషుల బతుకులే ఎదురుచూపుల మయం. బడికి వెళ్లే వయసులో సెలవుల కోసం ఎదురుచూపులు. కాలేజీ కుర్రకారుకు ప్రేమికుల కోసం ఎదురుచూపులు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూపులు. ఉద్యోగులకు నెలకోసారి వచ్చే జీతాల కోసం ఎదురుచూపులు. జబ్బుచేసి ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యుడి దర్శనం కోసం ఎదురుచూపులు. జీవితంలో సింహభాగం ఇలా ఎదురుచూపులతోనే గడిచిపోతుంది. ‘ఒకవేళ ఏవైనా ఎదురుచూపులు నెరవేరకపోతే ఆశ్చర్యపోవద్దు. దాన్నే మనం జీవితమంటాం’ అని ఆస్ట్రియన్ సంతతికి చెందిన బ్రిటిష్ మానసిక విశ్లేషకురాలు అనా ఫ్రాయిడ్ వ్యాఖ్యానించింది. జీవితంలో చాలా ఎదురుచూపులు ఉంటాయి. సాధారణంగా వాటిలో నెరవేరనివే ఎక్కువ! ఎదురుచూపులు నెరవేరినప్పుడు సంతోషాన్నిస్తాయి. నెరవేరని ఎదురుచూపులు నిరాశలో ముంచేస్తాయి. ‘ఈ లోకంలో మనుషులు భ్రమల్లో బతుకుతూ ఎల్లప్పుడూ ఏదో ఒకదాని కోసం ఎదురుచూస్తూనే ఉంటారు– ఒక్క ముక్కలో చెప్పాలంటే, కోరికలతో సతమతమవుతుంటారు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో ఎవరి ఎదురుచూపులు వారికి ఉండనే ఉంటాయి. అయితే, సాహిత్యంలో ప్రేయసీ ప్రియుల ఎదురుచూపులకే అమిత ప్రాధాన్యమిచ్చారు మన కవులు. భావకవిత్వం సాహితీలోకాన్ని కమ్మేసిన కాలంలో మన కవులు ఊహాసుందరుల కోసం ఎదురుచూపులు చూస్తూ, వీసెల కొద్ది విరహగీతాలు రాశారు. ‘ప్రబల కష్ట పరంపరల్ ప్రతిఘటించి/ నిల్చిపోయితి నీకయి నేటివఱకు!/ ఈ నిరీక్షణ పరిణామ మేమి యగునొ?’ అని చివరకు శ్రీశ్రీ కూడా తన గీతపద్యాలలో ఎదురుచూపుల వగపును వడబోశారు. ‘చిన్ని చిన్ని చిన్ని చెట్ల/ వన్నె వన్నె వన్నె పూల/ ఏరి ఇంద్రచాప మట్లు/ కట్టినాను నీకు మాల/ కాని, ఇచటికి ప్రియురాల!/ నీవింకను రావదేల?’ అంటూ పఠాభి తన ‘నిరీక్షణ’లోని నిట్టూర్పులతో సెగలు రేపారు. అష్టవిధ నాయికలలో విరహోత్కంఠిత తన నాయకుని కోసం అనుక్షణం ఎదురుచూస్తూ, విరహతాపాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ‘భర్త ఆఫీసునన్ బందిౖయె పోయినన్/ ఎదురు తెన్నులు జూచు నింతి యిపుడు/... కాంతుడు రాకున్న క్షణము లుత్కంఠమ్మె/ భారాన క్షణములు కదలునెపుడు/... వేగిపోవును తన భర్త జాగుజేయ/నామె యందమైన కనులె యలసిపోవు’ అంటూ ఆధునిక విరహోత్కంఠితల ఎదురుచూపుల విరహతాపాన్ని కొనకళ్ల ఫణీంద్రరావు చమత్కారంగా రాశారు. ఆముష్మికుల ఎదురుచూపులు భగవత్ సాన్నిధ్యం కోసం కావచ్చు, విరహిణుల ఎదురుచూపులు తమ నాయకుల కోసం కావచ్చు, భావకవుల ఎదురుచూపులు ఊహాసుందరీమణుల కోసం కావచ్చు గాని, సామాన్యులు మాత్రం ఎప్పుడొస్తాయో తెలియని మంచిరోజుల కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. నడివేసవిలో వానల కోసం ఎదురుచూస్తే, కొద్దిరోజులకైనా నాలుగు చినుకులు కురుస్తాయేమో గాని, సామాన్యులు మంచిరోజుల కోసం ఎన్నాళ్లు ఎదురుచూపులు చూడాలో ఎవరూ చెప్పలేరు. అయినా, జనాలు ఎంతో ఆశతో మంచిరోజుల కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. మనసులో ఆశల దీపాలు వెలుగుతున్నంత సేపూ ఎదురుచూపులు బాధించవు. ఎదురుచూపులు చూసే శక్తి కోసమైనా ఆశలను అడుగంటిపోకుండా కాపాడుకోవాలి. -
మండే ఎండల్లోనూ నిండుగా నీళ్లు
కేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం ఉదయం ఒక క్రస్టు గేటును పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. జూన్ మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారని చెపుతున్నారు. గత ఏడాది జూన్ 27న గేట్లు ఎత్తారు. గత నెల రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాలలో కురిసిన అకాల వర్షాలతో ఈ ప్రాజెక్టు వేసవిలోనే నిండుకుండలా మారింది. నెల రోజుల నుంచి మూసీ, బిక్కేరు వాగుల ద్వారా నిరంతరాయంగా నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా సోమవారం ఉదయానికి నీటిమట్టం 644.60 అడుగులకు (4.36 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టులోకి 240 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలోకి రావటంతో డ్యామ్ అధికారులు మూడో నంబర్ క్రస్ట్ గేటును అర అడుగు మేర పైకి ఎత్తి 330 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. 644.5 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఏపీలో హై అలర్ట్.. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందే..!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం మండలాలు, కాకినాడ జిల్లా కోటనందూరు, తుని మండలాలు, విజయనగరం జిల్లా జామి, కొత్తవలస మండలాలు, విశాఖలోని పద్మనాభం మండలంలో వడగాడ్పుల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వడగాడ్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చదవండి: ప్రమాదాన్ని ముందే పసిగట్టిన గజరాజు.. గోవిందరాజు స్వామి ఆలయంలో ఏం జరిగింది? -
మరో రెండ్రోజులు ఉక్కపోతే..
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య, గ్రేటర్ హైదరాబాద్ సమీప జిల్లాల్లో మాత్రం 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు సూచించింది. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే...గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 42.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉపరితలద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఏర్పడిందని ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సూచించింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ప్రాంతం జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత నిడమనూరు నల్లగొండ 46.1 దామెరచర్ల నల్లగొండ 45.6 బయ్యారం మహబుబాబాద్ 45.5 తంగుల కరీంనగర్ 45.5 కేతెపల్లి నల్లగొండ 45.3 రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లో) కేంద్రం గరిష్టం కనిష్టం ఖమ్మం 42.4 30.0 భద్రాచలం 42.2 28.0 నల్లగొండ 42.2 24.8 ఆదిలాబాద్ 41.5 26.2 రామగుండం 41.4 25.0 హనుమకొండ 41.0 25.0 నిజామాబాద్ 40.9 29.5 మెదక్ 40.6 24.0 మహబూబ్‌నగర్ 40.5 28.5 హైదరాబాద్ 39.4 26.6 దుండిగల్ 38.5 24.9 హకీంపేట్ 37.5 23.9 -
ఉప్పు తప్పించును వేసవి ముప్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వేసవి మండిపోతుండటంతో జంతువుల ఆరోగ్య పరిరక్షణపై అటవీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. మనుషుల్లాగే వన్యప్రాణులు కూడా శరీరంలో ఖనిజాల (మినరల్స్) శాతం తగ్గిపోతే అనారోగ్యం బారిన పడతాయి. రోజువారీ ఆహారంలో భాగంగా ఖనిజాలు.. కూడా సరిగా అందితేనే జీవ క్రియలు సజావు గా సాగుతాయి. అయితే అడవుల్లో బతికే జంతువులు సహజ సిద్ధంగా తినే మేత ద్వారా ఉప్పు (సోడియం)ను తీసుకుంటాయి. బండలు, కర్రల్ని, నీటి మడుగుల వద్ద మట్టిని నాకుతూ శరీర సమతాస్థితిని కాపాడుకుంటాయి. అయితే గతంలో కంటే ప్రస్తుతం సహజసిద్ధ ఉప్పు లభ్యత తగ్గిపోయింది. మరోవైపు వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా మరింత ఎక్కువగా మినరల్స్ అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో తగినంత ఉప్పు అందకపోతే వన్యప్రాణులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీని ని దృష్టిలో ఉంచుకుని వాటి ఆవాసాల్లోనే నీటి కుంటల వద్ద అధికారులు ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో ఈ పద్ధతిలో జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మట్టి, ఉప్పును కలిపి.. సహజమైన ఉప్పు, చెరువు మట్టి రెండింటినీ కలిపి (70 శాతం ఉప్పు, 30 శాతం చెరువు పూడిక మట్టి) కుప్పలా తయారు చేస్తారు. ఒక అడుగు లేదా అడున్నర ఎత్తులో నీటి కుంటలకు సమీపంలో జంతువులకు కనిపించేలా ఉంచుతారు. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులు కాళ్లు, కొమ్ములతో కుప్పల్ని గీరుతూ, మట్టిలో ఉన్న ఉప్పును నాలుకతో చప్పరిస్తుంటాయి. ఒక దాన్ని చూసి మరొకటి అలా నాకుతూ ఉంటాయి. ఒక్కోసారి గుంపులుగా కూడా వస్తుంటాయి. అలా పదే పదే నాకడం వల్ల వాటికి అవసరమైనంత ఉప్పు లభిస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలకు ప్రత్యేకంగా ఉప్పును నాకిస్తుంటారు. ఈ విధానాన్నే అధికారులు అడవిలో ఉపయోగిస్తున్నారు. మొదట మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఉప్పు గడ్డలను వాడేవారు. అయితే వాటి గడువు తేదీ, ప్రాసెస్ కారణంగా జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అటవీ సిబ్బందే సాధారణ ఉప్పును మట్టితో కలిపి జంతువులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఖనిజ లోపం ఏర్పడకుండా.. వన్యప్రాణుల్లో ఖనిజ లోపం రాకుండా నీటికుంటల వద్ద ఉప్పు గడ్డలను ఏర్పాటు చేస్తున్నాం. దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మట్టిలో ఉన్న ఉప్పును అవి చప్పరిస్తున్నాయి. ఇది వాటి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. – ఎస్.మాధవరావు ఎఫ్‌డీవో, జన్నారం, మంచిర్యాల జిల్లా -
ఎండలు.. మండే మంటలు
సాక్షి, హైదరాబాద్: వేసవి సీజన్ చివరి దశలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
ఏపీలో జూన్ మొదటి వారం వరకూ ఎండల తీవ్రత
-
ఎండలు బాబోయ్ ఎండలు... చుండ్రు తగ్గేదెలా..?
వేసవిలో తలకి ఎక్కువ చెమట పట్టడం, దానికితోడు వాతావరణ కాలుష్యం వల్ల తల తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ►వేసవిలో చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. తలలో అమితంగా పొట్టు చేరడం, తలంతా దురద.. ఈ సమస్యలు ఎండాకాలంలో కాస్త ఎక్కువుంటాయి. అలాంటపుడు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. అవేమిటో చూద్దాం... ►వేప నూనె లేదా వేప ఆకులను గుజ్జుగా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్యే కాదు, దురద కూడా తగ్గుతుంది. ►నాలుగు స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనెలో అరచెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని తలకు పట్టించి గంట తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ►పెరుగు కూడా బాగానే పని చేస్తుంది. కప్పు పెరుగును తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా చాలు. ►కలబంద గుజ్జును తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్ ను కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►పావు కప్పు యాపిల్ సిడార్ వెనిగర్‌ను పావు కప్పు నీళ్లలో కల΄ాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు తడిగా ఉన్నపుడు మాడుకు పట్టించాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు. చుండ్రు ఎందుకు వస్తుంది? ►చుండ్రుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, నిద్రలేమి. అయితే ఎండాకాలంలో చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ►షాంపూను ఎక్కువగా వాడటం వల్ల మాడు పొడుబారుతుంది. దీనివల్ల చుండ్రు సమస్య వస్తుంది. ►కొందరికి జడను గట్టిగా బిగించి కట్టుకోవడం అలవాటు. అయితే అలా జుట్టును బిగుతుగా అల్లుకోవడం వల్ల గాలి తగలక సమస్య తీవ్రమవుతుంది. ►ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల జుట్టు పొడిబారుతుంది. అందువల్ల తల మీద ఎండపడకుండా తలను కవర్ చేసేందుకు ఏమైనా వాడాలి. ►చెమట వల్ల చికాకుగా ఉండి ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటాం. దీనివల్ల కూడా చర్మం పొడిబారి చుండ్రు సమస్య వస్తుంది. ఇవి పాటించాలి ►వారానికి మూడుసార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మాడునుంచి నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, దీనివల్ల దుమ్ము, దూళి చేరి చుండ్రు ఎక్కువవుతుంది. ►తరచూ తల ముట్టుకోకూడదు. అంటే తలలో చేతులు పెట్టి గోక్కోకూడదు. చుండ్రు వల్ల దురద వస్తుంది. దాంతో తరచూ తలలో చేయి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది. సమస్య ఇంకాస్త పెరుగుతుంది. ►ఎండాకాలంలో హెయిర్ స్టైలింగ్ కోసమని క్రీములు, స్ప్రేలు ఎక్కువగా వాడితే అవి మాడును పొడిబారేలా చేసి చుండ్రును పెంచుతాయి. ►వారానికి ఒకసారైనా ఏదైనా ఆయిల్‌తో కుదుళ్లకు బాగా మర్దనా చేసుకోవాలి. దీనివల్ల మంచి రక్త సరఫరా జరుగుతుంది. మాడులో ఉండే చర్మ కణాల పనితీరు మెరుగుపడి చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది.