జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి! | check these hair care tips in summer season | Sakshi
Sakshi News home page

జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!

Published Thu, May 2 2024 11:06 AM | Last Updated on Thu, May 2 2024 11:06 AM

check these hair care tips in summer season

జుట్టు రాలకుండా జాగ్రత్త ఇలా...
జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. అయితే మనం మామూలుగా ఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రొటీన్ల లోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో నివారించవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే మార్గాలూ..

ప్రొటీన్‌ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం...  వారు తగినంతగా ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకోక΄ోవడమే. ఈ ప్రొటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు  రిపేర్లకూ దోహదపడతాయి. 

అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు  ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారంలో పుష్కలంగా  ప్రొటీన్లు ఉంటాయి.  శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్‌లు చాలా ఎక్కువ. 

శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలి΄ోయేలా చేస్తాయి. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండి΄ోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. 

నివారణ ఇది: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అవలంబించడం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement