హెయిర్ కేర్ జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే పెరుగు మంచి ఫలితాన్నిస్తుంది. ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. జుట్టును చిక్కులేకుండా దువ్వి పెరుగును ఒక్కొక్క స్పూన్ తల మీద వేస్త వేళ్లతో మర్దన చేయాలి. తలంతా ప్రతి వెంట్రుక కుదురుక పెరుగు పట్టాలన్నమాట. ఓ అరగంట తర్వాత వేడినీటితో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే జుట్టు చిట్లిపోకుండా మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
వేళ్లతో తలంతా మర్దన చేసుకోవడం సాధ్యం కాకపోతే జుట్టు కుదుళ్లకు పెరుగును పట్టింన తర్వాత గుండ్రటి పళ్లున్న దువ్వెనతో పది నిమిషాల సేపు దువ్వితే సరిపోతుంది. జుట్టు రాలుతుంటే బంగాళదుంప రసం బాగా పని చేస్తుంది. బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. అరకప్పు రసంలో రెండు టేబుల్ స్పూన్‌ల కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించాలి. జుట్టుకు పైన రాసి సరిపుచ్చకడదు. కేశాల మొదళ్లకు పట్టేలా రాసి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. రెండు గంటల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే జుట్టురాలడం తగ్గిపోతుంది.
(చదవండి: నికోటిన్ పౌచ్‌లు తెలుసా!..దీంతో స్మోకింగ్ ఈజీగా మానేయగలరా?)
Comments
Please login to add a commentAdd a comment