
సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం.
►టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.
►రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి.
►అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.
► ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది.
► ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది.
Comments
Please login to add a commentAdd a comment