
సాక్షి, అమరావతి: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. వేసవి విడిదికి అనుకూలమైన దేశంలోని 50 ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించింది. ఇన్ క్రెడిబుల్ ఇండియాలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ‘కూల్ సమ్మర్స్ ఆఫ్ ఇండియా’ అంటూ విస్తృత ప్రచారం చేపట్టింది. మండు వేసవిలో శీతల భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6న దుబాయ్‌లో అరేబియన్ ట్రావెల్ మార్ట్‌లో కూడా ప్రచార చిత్రాన్ని ప్రదర్శించనుంది.
చల్లని వాతావరణం ఉండే ప్రాంతాలు..
కేంద్ర పర్యాటక శాఖ 50కిపైగా వేసవి విడిది ప్రదేశాలతో జాబితాను రూపొందించింది. ఇందులో జమ్మూ, కశ్మీర్‌లోని గుల్మార్గ్, పట్నిటాప్, గ్రెజ్–మనస్బాల్, పితోర్‌ఘర్, ఔలి–చోప్తా, కిన్నౌర్, తీర్థన్, కేరళలోని వాయనాడ్–వాగమోన్, మిజోరంలోని ఐజ్వాల్, థెన్జాల్, సిక్కింలో లాచుంగ్–యుమ్తాంగ్, అస్సాంలోని హఫ్లాంగ్, పశ్చిమ బెంగాల్‌లోని కుర్సియోంగ్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు వేసవి అనుకూల గమ్యస్థానాలుగా ఉంటాయని ఆ శాఖ అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment