సమ్మర్ ఇలా ప్రారంభమయ్యిందో లేదో అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఓ పక్క జనాలు వడదెబ్బకు తాళ్లలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ కాలంలో మండే ఎండలను తట్టుకోవాలంటే అధికంగా నీరు తాగడమే కాక శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండేలా చూసుకోవాలి. కేవలం నీరు, మజ్జిగ రూపంలో ద్రవ పదార్థాలు తీసుకోవడమే కాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండు తీసుకోవడం మరింత మేలు. అందుకోసం తీసుకోవాల్సిన పండ్లు ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!
పుచ్చకాయ
అధిక వాటర్ కంటెంట్‌కి ప్రసిద్ధ. వేసవిలో దీన్ని తీసుకుంటే దాహం కట్టడుతుంది. వడదెబ్బ నుంచి సులభంగా బయటపడగలుగుతాం. వేసవి తాపం నుంచి మంచి ఉపశమనం కలిగించే ఫ్రూట్ పుచ్చకాయ అని చెప్పొచ్చు.
దోసకాయలు..
ఇది ఏకంగా 96% నీటిని కలిగి ఉంటుంది. నీటితో ప్యాక్ చేసిన మంచి ఫ్రూట్‌గా పేర్కొనవచ్చు. కేలరీలు తక్కువగా ఉండటమే గాకుండా కావల్సినన్నీ విటమిన్లు, ఫైబర్లు ఉంటాయి. ఈ దోసకాయని సలాడ్‌రూపంలో లేదా అల్పాహారంగానూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
కొబ్బరి నీరు
ఇది ద్రవాల తోపాటు కోల్పోయిన నీటిని ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపుతుంది. ఇందులో ఉండే సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు కీలకమైన శారీరక విధులకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డీహైడ్రేషన్ నుంచి కాపాడటంలో సమర్థవంతంగా ఉంటుంది.
టమోటాలు..
వీటిలో కూడా 94% నీటి కంటెంట్ ఉంటుంది. ఫైబర్, కేలరీలు సమృద్దిగా ఉంటాయి. ఇందులో ఉండే లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని అందించి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. చర్మ ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
బూడిద గుమ్మడికాయ
ఇందులో 96% నీటి కంటెంట్ ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆమ్లత్వంతో కూడిన ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెద్దప్రేగుని నిర్వహించడంలోను జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ సమర్థవంతంగా ఉంటుంది.
బెల్ పెప్పర్స్
క్యాప్సికంనే బెల్ పెప్పర్స్ అని కూడా అంటారు. ఇది వంటకాలకు మంచి రుచిని, వాసనను అందిస్తాయి. విటమిన్ సీ, విటమిన్ బీ6, బీటా కెరోటిన్, థయామిన్, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు ఉంటాయి.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీల్లో దాదాపు 91% నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్‌తో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది కడుపులో మంటను తగ్గించడంలోనూ వివిధ వ్యాధుల నుంచి రక్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.
నారింజలు..
ఇందులో కూడా మంచి నీరు కంటెంట్ ఉంటుంది. విటమిన్ సీ, పొటాషియం, వంటి యాంటి యాక్సిడెట్లు సమృద్దిగా ఉంటాయి. గుండె ఆరోగ్యం, వాపు తగ్గింపుకు తోడ్పడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయ పడుతుంది. ఇందులో సిట్రిక్‌యాసిడ్ కంటెంట్, ఆర్ధ్రీకరణను ప్రోత్సహించే లక్షణాలు కారణంగా డీహైడ్రేన్‌ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
(చదవండి: ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment