
మనిషి కష్టం వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాన్ని కనుగొంటాడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన పరిష్కార మార్గాలు కనిపిస్తుంటాయి. ఇదే కోవలో వేసవి నుంచి తప్పించుకునేందుకు ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరాదిన భానుడు భగభగ మండుతున్నాడు. జనం కూలర్లు, ఏసీలను అశ్రయిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగును తీసుకు వెళుతున్నారు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఒక యువకుడు మండుతున్న ఎండల నుంచి ఉపశమనానికి ‘స్కూటర్ షవర్’ తయారు చేసి, ఎండల్లో చల్లగా తిరుగుతున్నాడు.
స్కూటర్‌కి షవర్‌ను అమర్చడం వల్ల ఎక్కడికెళ్లినా కూల్‌గా ఉంటున్నదని ఆ యువకుడు కనిపించిన అందరికీ చెబుతున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘ఫన్ విత్ సింగ్’లో షేర్ చేశారు.
ఈ స్కూటర్ షవర్ తయారు చేసిన వ్యక్తి తన స్కూటర్ లెగ్ స్పేస్‌లో వాటర్ కంటైనర్‌ను ఉంచాడు. దానిని నీటితో నింపాడు. దానికి ఒక గొట్టం అమర్చి ట్యాప్ ఫిట్ చేశాడు. చిన్నపాటి మోటారు అమర్చి పైన షవర్ నుంచి నీటి జల్లులు కురిసేలా ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి స్కూటర్‌పై వెళుతున్నప్పుడు షవర్ నుంచి చిరు జల్లులు అతనిపై పడటాన్ని వీడియోలో మనం గమనించవచ్చు.
India is not for beginners 😅#heatwave #Garmi pic.twitter.com/FiXHhOkhQ3
— Sneha Mordani (@snehamordani) June 17, 2024