మనం తినాలనిపించినప్పుడో లేదా ఘుమఘుమలాడే వేడివేడి పప్పులో నెయ్యి వేసుకుంటే ఆ రుచే వేరు. ఏడాది పొడవునా కొందరూ నెయ్యి వేసుకుని తింటుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేసవిలో కచ్చితంగా ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. అసలు ఈ వేసవిలో దాహం దాహం అంటుంది వాతావరణం. అలాంటి ఈ టైంలో నెయ్యి వేసుకంటే అమ్మో దాహమే దాహంగా ఉంటుంది కదా మరీ ఇలా ఎలా చెబుతున్నారు? రీజన్ ఏంటీ తదితరల గురించి సవివరంగా చూద్దాం.
ఆయుర్వేద ప్రకారం నెయ్యి ఆహారానికి మంచి శక్తిని ఇచ్చే రుచికరమైన పదార్థం. నెయ్యి తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. శీతాకాలం లేదా వేసవికాలంలో నెయ్యిని తరుచుగా తీసుకుంటాం గానీ వేసవిలోనే దీన్ని ఎక్కువగా తీసకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే..?
నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, సీలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి కణజాలాలకు పోషణనిస్తాయి. పైగా అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది. శరీరం వేడిని తగ్గించడంలో నెయ్యికి మించిది మరోకటి లేదు.
శరీరీంలో ఆరోగ్యకరమైన కొవ్వులు కోసం నెయ్యిని రోజువారి అల్పాహారంలో తీసుకోవడం మంచిది. ఈ ఆరోగ్యకరమై కొవ్వులు శరీరంలో పోషకాలను గ్రహించడానికి ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేస్తాయి.
నెయ్యిలో మాయిశ్చరైజింగ్ గుణాలు శరీరాన్ని హైడ్రేటింగ్ ఉంచడంలో సహాయపడతాయి. నెయ్యి తీసుకోవడంలో శరీరం మృదువుగా ఉంలేలా లోపలి నుంచి పోషణ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరం సులభంగా డీహైడ్రేట్ అయినప్పుడు నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది.
మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనల్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. అంతేగాదు దీనిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్, స్వల్పకాలిక కొవ్వు ఆమ్లం, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ముఖ్యంగా ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పైగా పిత్త దోషాన్ని నియంత్రిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంది. అలాగే అనారోగ్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, శరీరం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, పోషకాలను గ్రహించడంలో సహాయపడటానికి నెయ్యి ఉత్తమమైన ఆహారాలలో ఒకటిగా చెప్పవచ్చు.
నెయ్యి తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచడమే గాక మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే..? నెయ్యి మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శాంతపరిచే ప్రభావాన్ని అందిస్తుంది. నెయ్యి రుచిలో తీపి, చల్లని స్వభావం కలిగి ఉంటుంది. ఇది హాట్‌గా ఉండే వేసవి కాలంతో శరీరాన్ని చల్లగా ఉంచడంలో నెయ్యి ది బెస్ట్ అని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment