
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను నడప నున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌వో నుస్రత్ మండ్రుప్కర్ ఓ ప్రకటలో తెలిపారు. హైదరాబాద్–టక్ ప్రత్యేక రైలు(07165) ఈ నెల 16, 23, 30 తేదీల్లో అంటే ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి కటక్ వరకు, తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07166) ఈ నెల 17, 24, మే 1 తేదీల్లో అంటే ప్రతి బుధవారం కటక్ నుంచి హైదరాబాద్ మధ్య నడవనున్నాయి.
సికింద్రాబాద్–సత్రగచ్చి ప్రత్యేక రైలు(07223) ఈ నెల 19 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సత్రగచ్చి మధ్య, సత్రగచ్చి–సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు(07224) ఈ నెల 20 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం, సికింద్రాబాద్–షాలిమార్ మధ్య నడిచే రైలు(07225) ఈ నెల 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, షాలిమార్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు(07226) ఈ నెల 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం నడవనున్నాయి.
సికింద్రాబాద్–కొల్లం(07193) ఈ నెల 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో ప్రతి బుధవారం సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 11.25 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07194) ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అంటే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.