విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు | Extension of several special trains through Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Published Fri, Jan 26 2024 5:24 AM | Last Updated on Fri, Jan 26 2024 5:24 AM

Extension of several special trains through Vijayawada - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫిబ్రవరి 5 నుంచి మార్చి 25 వరకు పూర్ణా–తిరుపతి (07609), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–పూర్ణా (07610), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు హైదరాబాద్‌–నర్సాపూర్‌ (07631), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07632), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–సికింద్రాబాద్‌ (07481), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్‌ 1 వరకు సికింద్రాబాద్‌–తిరుపతి (07482), ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29 వరకు కాకినాడ టౌన్‌–లింగంపల్లి (07445), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు లింగంపల్లి–కాకినాడ టౌన్‌ (07446) రైళ్లును పొడిగించి నడపనున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement