
టెక్నాలజీ పెరుగుతోంది. మనం రోజూ చూస్తున్న వస్తువుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్, కేబుల్ ఫ్యాన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
షాండ్లియర్ అందించే చల్లగాలి
ఇంటి సీలింగ్‌కు షాండ్లియర్‌తో అలంకరిస్తే చూడటానికి భలే బాగుంటుంది. కాని, షాండ్లియర్‌ను తగిలిస్తే, ఆ చుట్టు పక్కల ఫ్యాన్ అమర్చుకోలేం. ఇప్పుడు ఈ సమస్యను దూరం చేస్తోంది ఈ ‘ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్’. ఇది ఒకవైపు వెలుగులు వెదజల్లుతూనే, మరోవైపు నిశ్శబ్దంగా చల్లని గాలిని కూడా వీస్తుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా లైట్, ఫ్యాన్ స్పీడ్‌ను కంట్రోల్ చేయొచ్చు. ధర 299 డాలర్లు (రూ. 25,664).
ఇదీ చదవండి: ఒక ఫ్యాన్స్ మూడు లాభాలు
కేబుల్ ఫ్యాన్
ఇది అచ్చం డేటా కేబుల్‌లాంటి ఫ్యాన్. ఎక్కడికైనా సరే తీసుకెళ్లడానికి చాలా అనువుగా ఉంటుంది. యూఎస్‌బీ పోర్ట్ సాయంతో మొబైల్, అడాప్టర్, కంప్యూటర్ కేస్, ల్యాప్‌టాప్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్యాన్ తిరిగేటప్పుడు చల్లటి గాలితో పాటు, సమయం, ఉష్ణోగ్రతలను తెలిపే డిజిటల్ క్లాక్‌ను కూడా ఇది డిస్‌ప్లే చేస్తుంది. ధర కంపెనీ, క్వాలిటీ లపై ఆధారపడి ఉంటుంది. వివిధ కంపెనీల పేర్లతో ఆన్‌లైన్‌లో లభిస్తోంది.