Flipkart Big Saving Days Sale: Starting Date, Special Offers And Discounts - Sakshi
Sakshi News home page

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌ కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్లు, వాటిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్లు!!

Published Wed, Mar 9 2022 1:27 PM | Last Updated on Wed, Mar 9 2022 2:47 PM

Flipkart Big Saving Days Sale Begins on March 12 - Sakshi

మార్చి 18న జరగాల్సిన హోలీ వారం రోజుల ముందే వచ్చేసింది. ఉక్రెయిన్‌ -రష్యా దేశాల యుద్ధం కారణంగా దేశీయంగా మండి పోతున్న ధరల నుంచి ఉపశమనం పొందేలా వినియోగదారులకు ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్లు ప్రకటించింది. హోలీ ఫెస్టివల్‌ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ మార్చి12 నుంచి మార్చి 16వరకు బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్స్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై భారీ ఎత్తున అంటే 80శాతం డిస్కౌంట్‌లు  అందిస్తున్నట్లు తెలిపింది. 

బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్స్‌
ఈ సేల్స్‌లో దిగ్గజ కంపెనీల స్మార్ట్‌ ఫోన్‌లు యాపిల్‌, రియల్‌ మీ,ఒప్పో,శాంసంగ్‌ 60శాతం వరకు డిస్కౌంట్‌కే అందించనున్నట్లు తెలుస్తోంది. 

ల్యాప్‌ టాప్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్స్‌లో స్మార్ట్‌ వాచెస్‌ పై 60శాతం, ట్రిమ్మర్స్‌ అండ్‌ షేవింగ్‌ కిట్లపై 70శాతం,ల్యాప్‌టాప్స్‌ పై 40శాతం, వన్‌ ప్లస్‌,బోట్‌,జేబీఎల్‌, రియల్‌ మీకి చెందిన ఫోర్టబుల్‌ స్పీకర్స్‌, హెడ్‌ ఫోన్స్‌పై 80 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 

మిగిలిన ఉత్పత్తులపై 
హోలీ సందర్భంగా చేసే షాపింగ్‌లో దుస్తులపై 80శాతం డిస్కౌంట్‌ అందిస్తుండగా, హోమ్‌, కిచెన్‌ ఎషెన్షియ‌ల్, ఫర్నీచర్‌, జిమ్‌, న్యూట్రిషియన్‌, గ్రాసరీస్‌ను డిస్కౌంట్లలో కొనుగోలు చేయోచ్చు. 

ఆఫర్‌లో ఇంకా 
మార్చి 12 శనివారం తెల్లవారు జామున 2గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డే సేల్స్‌ ప్రారంభం కానుంది. ఈ సేల్‌ ప్రారంభం నుంచి ప్రతి రోజు తెల్లవారు జాము 12ఏమ్‌, 8ఏమ్‌, 4పీఎం కొత్త డీల్స్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. రష్‌ అవర్‌లో ఎర్లీ బర్డ్స్‌ సేల్స్‌లో మరిన్ని డిస్కౌంట్‌లను అందిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు.

చదవండి: యాపిల్‌ ఈవెంట్‌: టెక్‌ లవర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్‌లు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement