![Amazon Fab Phones Fest And Fab Tv Fest Sale Now - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/25/Amazon-Fab.jpg.webp?itok=0G4TfUDw)
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, యాక్సెసరీస్‌లపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అండ్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28వరకు జరగనున్న ఈసేల్‌లో శాంసంగ్, వన్ ప్లస్, ఐక్యూ, రియల్ మీ తోపాటు ఇతర బ్రాండ్‌లను తక్కువ ధరకే అందిస్తుంది. ఈ సేల్ సమయంలో అమెజాన్, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే రూ.1000వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రొడక్ట్‌లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అవకాశం కల్పిస్తుంది.
స్మార్ట్‌ఫోన్ డీల్స్
అమెజాన్ ఫ్యాబ్ఫోన్స్ ఫెస్ట్ అండ్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్సేల్ సందర్భంగా ఐక్యూ జెడ్5 ధర రూ.20,990 ఉండగా, ఐక్యూ జెడ్3 రూ.17,990కే అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌ల ధరలపై సుమారు రూ.3వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
రియల్ మీ నార్జో 50ఏ రూ.11,599 ఉండగా రూ.500 డిస్కౌంట్‌తో రూ.10,999కే పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం 12 ధర రూ.11,499 ఉండగా రూ.2000 డిస్కౌంట్‌తో రూ.9,499కే పొందవచ్చు.
ఒప్పో ఏ 15ఎస్ ధర రూ.13,9990 ఉండగా రూ.9,990కే సొంతం చేసుకోవచ్చు.
ఇవి కాకుండా, వన్ ప్లస్ 9 సిరీస్ కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి రూ.8,000 వరకు తగ్గింపు పొందవచ్చు. తాజా వన్ ప్లస్ 9ఆర్‌టీ పై రూ.4,000, వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ పోన్‌ను ఐసీఐసీ ఐ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1500 తగ్గింపుతో పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. సేల్ సమయంలో, అమెజాన్ పవర్ బ్యాంక్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇతర ప్రొడక్ట్‌లపై 60 శాతం వరకు తగ్గింపుకే అందిస్తుంది.
స్మార్ట్ టీవీలపై పెద్ద డిస్కౌంట్లు,ఈఎంఐ సదుపాయాల్ని కల్పిస్తుంది. శాంసంగ్ ఫ్రేమ్ క్యూఎల్ఈడీ టీవీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ.5 000 క్యాష్‌బ్యాక్‌తో, అమెజాన్ కూపన్‌లను ఉపయోగించి అదనంగా రూ. 1750 తగ్గింపుతో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment