Amazon Prime Day 2023 Sale Announced For India: Check Offers, Discounts On Smartphones, Laptops - Sakshi
Sakshi News home page

Amazon: షాపింగ్‌ లవర్స్‌కు బంపరాఫర్‌.. కేవలం రెండు రోజులే!

Published Wed, Jun 28 2023 5:16 PM | Last Updated on Wed, Jun 28 2023 10:07 PM

Amazon Prime Day Sale Dates Announced For India - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రత్యేక సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. కేవలం రెండ్రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో కొనుగోలు దారులు వారికి కావాల్సిన వస్తువుల్ని డిస్కౌంట్‌ ధరలో పొందవచ్చని అమెజాన్‌ తెలిపింది. ఎక్స్‌క్లూజివ్‌గా స్మార్ట్‌ఫోన్స్‌,ల్యాప్‌ట్యాప్స్‌,ఎలక్ట్రానిక్స్‌,హోమ్‌అప్లయెన్సెస్‌పై అందిస్తుంది

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ తేదీ వివరాలు
భారత్‌లో అమెజాన్‌ రెండు రోజుల పాటు ఈ సేల్‌ను నిర్వహించనుంది. జులై 12ఏమ్‌ నుంచి ప్రారంభమై..జులై 16 వరకు కొనసాగుతుంది.ప్రత్యేక అమ్మకాల్లో కొనుగోలు దారులు డిస్కౌంట్స్‌, సేవింగ్స్‌, కొత్తగా మార్కెట్‌లో విడుదలైన ప్రొడక్ట్‌లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌లో బ్యాంక్‌ ఆఫర్లు 
అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌/ డెబిట్‌ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. అదే కార్డ్‌లపై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అదనంగా, అమెజాన్‌ పే ఐసీఐసీఐ కార్డ్‌పై 5 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. మీకు ప్రయాణాలంటే ఇష‍్టమైతే..ట్రావెల్స్‌ బుకింగ్స్‌లో ఈ కార్డ్‌ వినియోగంతో అన్‌లిమిటెడ్‌ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు బిల్లు చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. 

వీటిపై 50 శాతం డిస్కౌంట్‌
వన్‌ప్లస్‌, ఐక్యూ, రియల్‌మీ నార్జో, శాంసంగ్‌, మోటరోలా,బోట్‌,సోనీ ఇలా 400 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులపై తగ్గింపును అందిస్తుంది. విక్రయ సమయంలో కొనుగోలుదారులు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు మొదలైన వాటిపై తగ్గింపును పొందుతారు. అదనంగా, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, ఫైర్ టీవీ ఉత్పత్తులపై 55శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది.

చదవండి👉 ఎలాన్‌ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement