
కొనుగోలు దారులకు బంపరాఫర్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీ పడి వినియోగదారులకు డిస్కౌంట్‌లు ప్రకటించాయి. దీంతో పాటు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నాయి.
అమెజాన్ ఆగస్ట్ 6న నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈసేల్‌లో శాంసంగ్, రియల్‌మీ, షావోమీతో పాటు ఇతర సంస్థలకు చెందిన టీవీలపై టెలివిజన్, హోం అప్లయన్సెస్‌పై 75శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పింది.
కండీషనర్ల(షాంపూలు)పై 55శాతం వరకు డిస్కౌంట్, మైక్రోవేవ్‌లపై 55శాతం, ఎయిర్ కండీషనర్లపై 55శాతం, వేరబుల్స్ అంటే స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ గ్లాస్‌లపై 10శాతం నుంచి 70శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట‍్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదే సమయంలో యాపిల్, వివో,ఒప్పో, మోటరోలాతో పాటు ఇతర బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చని అన్నారు.
క్రేజీ డీల్స్
బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 'క్రేజీ డీల్స్' పేరుతో 12ఏఎం, 8ఏఎం, 4పీఎంలలో ప్రత్యేకంగా అమ్మకాలు నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 'రష్ అవర్స్' 2ఏఎంలో కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment