
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 23నుంచి ఫ్రిబ్రవరి 28వరకు ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ లో కొనుగోలు దారులు ఎలక్ట్రానిక్ అండ్ యాక్ససరీస్‌పై 80శాతం భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
6 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్‌లో కొనుగోలు దారులు ఎలక్ట్రానిక్ అండ్ యాక్ససరీస్‌పై 80శాతంతో పాటు ఎస్ బ్యాంక్,స్లైస్ వీసా, ఐడీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వినియోగంతో 10శాతం డిస్కౌంట్‌ను అదనంగా పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు తెలిపారు.
ఇక ఈ సేల్‌లో ప్రత్యేకంగా ల్యాప్ టాప్ కొనుగోళ్లపై రూ.30వేలు విలువ చేసే కొనుగోలు దారులకు ప్రముఖ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు అందించే ఐటీ కోర్స్ లను ఉచితంగా పొందవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ల్యాప్ ట్యాప్, డెస్క్‌ట్యాప్, స్మార్ట్ ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్, స్మార్ట్ వాచెస్, కెమెరా యాక్ససరీస్‌తో పాటు ఇతర ప్రొడక్ట్‌లపై భారీ ఎత్తున డిస్కౌంట్ లను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో పేర్కొంది.