Apple Airpods Max And AirPods Pro Get Massive Discount On Flipkart - Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ కొనాలంటే ఇప్పుడే కొనేయండి..రూ.20వేల డిస్కౌంట్‌!

Published Mon, Jul 3 2023 1:34 PM | Last Updated on Mon, Jul 3 2023 2:33 PM

Apple Airpods Max And Airpods Pro Get Massive Discount On Flipkart - Sakshi

ప్రముఖ ఈ- కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ లవర్స్‌కు శుభవార్త చెప్పింది. యాపిల్‌ ఫస్ట్‌ జనరేషన్‌ ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ను భారీ డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు తెలిపింది. యాపిల్‌ హెడ్‌ఫోన్స్‌ ధర ఎక్కువ ఇప్పుడా ప్రొడక్ట్‌లపై రూ.20,000 డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఎయిర్‌ పాడ్స్‌ ప్రో ధరని సైతం రూ.8,000 పైగా తగ్గిస్తుండగా.. వీటిపై బ్యాంక్‌ ఆఫర్లను అదనంగా పొందవచ్చు.  

యాపిల్‌ సంస్థ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ను రూ.59,900కే విక్రయిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ మాత్రం వాటి ధరను రూ.19,901 తగ్గించి రూ.39,999కే అమ్ముతుంది. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.1250 డిస్కౌంట్‌,ఈఎంఐ సదుపాయం ఉంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో వాటి ధర రూ.38,749కి తగ్గుతుంది.

అయితే, ఈ డీల్ పింక్ మోడల్‌ ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. గ్రీన్, సిల్వర్ కలర్ ధర రూ.44,999. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,000 తగ్గింపు పొందవచ్చు. అంటే బ్యాంక్ ఆఫర్‌తో రూ.41,999కే సొంతం చేసుకోవచ్చు. 

భారీ తగ్గింపు 
యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రోను ఫ్లిప్‌ కార్ట్‌ కేవలం రూ.16,990కే అమ్ముతుంది. వీటి మార్కెట్‌ ధర రూ. 24,900 గా ఉంది. యాపిల్‌ ఫస్ట్‌ జనరేషన్‌ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,910 డిస్కౌంట్‌ లభిస్తుండగా పైన పేర్కొన్న బ్యాంక్ ఆఫర్‌తో వాటి ధర రూ.15,740కి తగ్గుతుంది.

2వ తరం యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో  
రెండవ తరం ఎయిర్‌పాడ్స్‌ ప్రోని యాపిల్‌.ఇన్‌ వెబ్‌సైట్ ద్వారా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ధర రూ. 26,900 అందుబాటులో ఉన్నాయి. అయితే  వినియోగదారులు ఎటువంటి బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించకుండా ఫ్లిప్‌కార్ట్ ద్వారా తగ్గింపు ధరతో రూ. 24,990కే పొందవచ్చు.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement