Mahindra XUV700: బుకింగ్స్‌ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్‌ | Mahindra XUV700 Bookings To Open October 7 | Sakshi
Sakshi News home page

Mahindra XUV700: బుకింగ్స్‌ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్‌

Published Thu, Sep 30 2021 12:39 PM | Last Updated on Thu, Sep 30 2021 12:52 PM

Mahindra XUV700 Bookings To Open October 7 - Sakshi

అందుబాటు ధరలో మెరుగైన ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించి కీలక అప్‌డేట్‌ని మహీంద్రా సంస్థ వెల్లడించింది. అక్టోబరులో మార్కెట్‌లోకి వస్తున్న ఈ కారు బుకింగ్స్‌ తేదీని మహీంద్రా ప్రకటించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన బుకింగ్‌ ప్రక్రియ అక్టోబరు 7 నుంచి మొదలు కానుంది. వినియోగదారులకు ఉండే విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని డిఫెరెంట్‌ వేరియంట్స్‌, ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌, సీటింగ్‌ లేఅవుట్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ రోడ్లపై పరుగులు పెట్టేందుకు రెడీగా ఉంది. 

ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ పెట్రోల్‌ ఇంజన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 11.99 లక్షలుగా ఉంది. మొదటి 25.000 బుకింగ్‌లకే మాత్రమే ఈ ధరకు కారును అమ్ముతామంటూ మహీంద్రా చెబుతోంది. మిగిలిన వేరియంట్లకు సంబంధించి 

చిప్‌సెట్‌లతో పాటు కార్ల తయారీలో ఉపయోగించే కాంపోనెంట్ల ధరలు పెరగడంతో వరుసగా ఒక్కో ఆటోమోబైల్‌ సంస్థ ధరలు పెంచుకుంటూ పోతుంది. మహీంద్రా సైతం ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీకి సంబంధించి తొలి 25,000 మంది కస్టమర్లకు ముందుగా ప్రకటించిన ధరకే వాహనాలను అమ్మనుంది.

చదవండి : మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement