Mahindra car prices
-
వచ్చేస్తోంది, మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ విడుదల ఎప్పుడంటే?
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 9న థార్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ కారును మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే తొలిసారి మహీంద్రా సంస్థ థార్ వేరియంట్ కారును 2010లో వాహనదారులకు పరిచయం చేసింది. 13 ఏళ్ల నుంచి మార్కెట్లోకి ఆ సంస్థ నుంచి లేదంటే ఇతర సంస్థల నుంచి లగ్జరీ కార్లు విడుదలైన థార్ వేరియంట్ కార్లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మహీంద్రా వరుసగా థార్ వేరియంట్ కార్లపై డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు అదే వెహికల్‌ను మార్పులు, చేర్పులు చేసి విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలైన థార్ కార్స్ కొనుగోలు దారుల్ని విపరీంగా ఆకట్టుకోగా.. రేపు (జవనరి 9న) విడుదల కానున్న ఈ లేటెస్ట్ థార్ వేరియంట్ ఎలా ఉంటుందోనని అందరి ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో కారు ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే? పలు ఆటోమొబైల్ బ్లాగ్స్ కథనాల మేరకు.. థార్ ఆర్డబ్ల్యూడీలో 4వీల్ డ్రైవ్ వెర్షన్‌కి సమానంగా 2 వీల్ డ్రైవ్ వెర్షన్ ఉండనుంది. ప్రత్యేకంగా 4*4 బ్యాడ్జ్ మీద కార్ రేర్ ఫెండర్స్ (వెహికల్ టైర్లపై ఉండే షేప్) తో బ్లేజింగ్ బ్రోంజే కలర్స్‌తో పరిచయం కానుంది. ఇప్పటికే ఈ తరహా వేరియంట్ కలర్స్ ఎక్స్‌యూవీ 300 టర్బోస్పోర్ట్లో కార్లలో సైతం లభ్యం అవుతున్నాయి. 4*2 వెర్షన్లో మాత్రం కార్ బాడీ కంప్లీట్‌గా ఎవరెస్ట్ వైట్ కలర్స్‌తో కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటు కారు లోపల రేర్ వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వెర్షన్ సెంటర్ కన్సోల్‌లో 4x4 సెలెక్టర్ లివర్(గేర్)కు బదులుగా క్యూబీ హోల్‌తో డిజైన్ చేశారు. తద్వారా ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్‌తో పాటు డ్రైవర్ సీటు కుడి మోకాలి దగ్గర ఉన్న కంట్రోల్ ప్యానెల్ ద్వారా యాక్సెస్ చేసే సౌకర్యం ఉంది. మహీంద్రా థార్ ఆర్డబ్ల్యూడీ ఇంకా, థార్ ఆర్డబ్ల్యూడీ కొత్త పవర్‌ట్రెయిన్‌తో 1.5 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్, సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో 118.5హెచ్‌పీ నుంచి 300ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. మరోవైపు 4డబ్ల్యూడీ థార్ 132హెచ్‌పీ, 300ఎన్ఎం 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతుంది. అలాగే, 2డబ్ల్యూడీ వెర్షన్ 152హెచ్, 300ఎన్ఎం (ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 320ఎన్ఎం) ఉత్పత్తి చేసే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేస్తుంది. మహీంద్రా థార్ ఏఎక్స్ రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పాటు, థార్ 1.5 డీజిల్, 2.0 పెట్రోల్ పవర్ట్రెయిన్ల కోసం తక్కువ-స్పెక్ ఏఎక్స్ ఆప్షనల్ ట్రిమ్‌ను అందిస్తుంది. ఈ ట్రిమ్ ఇంతకుముందు థార్‌తో అందుబాటులో లేదని, కానీ ఇప్పుడు థార్ విడుదల చేస్తున్న వేరియంట్ కార్లలో డిజైన్ చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఏఎక్స్ (O) 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు బదులుగా 16-అంగుళాల స్టీల్ వీల్స్, ట్యూబ్యులర్ స్టీల్ సైడ్ స్టెప్, వినైల్ అప్హోల్స్టరీ, మాన్యువల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, మోనోక్రోమ్ ఎంఐడీ డిస్ప్లేను డిజైన్ చేశారు. ఏఎక్స్ (O)7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఇన్-బిల్ట్ స్పీకర్లు, టీపీఎంసం, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌తో వస్తుంది. ఇంకా, రోల్-ఓవర్ మిటిగేషన్‌తో పాటు హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్‌తో ఈఎస్పీ 1.5 డీజిల్ ఏక్స్ వేరియంట్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ ధర.. విడుదలకు సిద్ధంగా ఉన్న మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ ప్రారంభ ధర రూ. 11లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉండొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. -
న్యూఇయర్‌కి ముందే.. ఈ కార్ల కొనుగోలుపై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థలు మెరుగుపడి కార్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ నాలుగేళ్లుగా పేరుకున్న డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. దీనికి సంవత్సరాంతం కూడా తోడు కావడంతో కొన్ని విభాగాల్లో అమ్మకాలు పెంచుకునేందుకు కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. చాలా మటుకు సంస్థలు డిసెంబర్లో 4.5 శాతం నుంచి 5 శాతం వరకూ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ప్రకటించిన 2 – 2.5 శాతంతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. డీలర్లు రూ. 25,000 నుంచి రూ. 1,00,000 దాకా విలువ చేసే ప్రయోజనాలు అందిస్తామంటూ కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా ఎంట్రీ–లెవెల్ కార్ల సెగ్మెంట్లోనూ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు సంబంధించి పెట్రోల్ సెగ్మెంట్లోనూ ఇలాంటి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నగదు డిస్కౌంట్లు, ఎక్సే్చంజ్ బోనస్ ప్రయోజనాలు, బీమా కంపెనీలు ఓన్ డ్యామేజీ ప్రీమియంను తగ్గించడం, డీలర్లు నిర్వహించే స్కీములు మొదలైన వాటి రూపాల్లో ఇవి ఉంటున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా 2018–19 స్థాయిలోనే రూ. 17,000 – రూ. 18,000 వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎన్జీకి, సాంప్రదాయ ఇంధనాల రేట్లకు మధ్య వ్యత్యాసం తగ్గిపోతుండటంతో సీఎన్జీ మోడల్స్ వైపు కొనుగోలుదారులు దృష్టి పెట్టడం తగ్గుతోంది. దీంతో సీఎన్జీ మోడల్స్‌ను విక్రయించేందుకు కంపెనీలు అత్యధికంగా రూ. 60,000 వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. డిసెంబర్లో రిటైల్ విక్రయాలు పటిష్టంగా ఉన్నాయని, నవంబర్‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువగా విక్రయాలు ఉండొచ్చని భావిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న నిల్వలతో ఒత్తిడి.. డీలర్ల దగ్గర నిల్వలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరినట్లు ఎస్అండ్పీ మొబిలిటీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 45–50 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నాయి. దీంతో డిస్కౌంట్లు ఇచ్చి అయినా వాహనాలను అమ్మేసేందుకు డీలర్లు మొగ్గుచూపుతున్నారని తెలిపాయి. వడ్డీ రేట్లు పెరుగుతుండటం కూడా సమస్యాత్మకంగా మారుతోంది. అటు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. టాటా మోటార్ ఈ–నెక్సాన్‌కి ఇటీవలి వరకూ కొద్ది నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. కానీ ప్రస్తుతం డీలర్‌షిప్‌లో బుక్ చేసుకుని అప్పటికప్పుడే కారుతో బైటికి వచ్చే పరిస్థితి ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌పై ఆచి తూచి.. ప్రస్తుతం దాదాపు 4,17,000 వాహనాల ఆర్డర్లతో కార్ల కంపెనీల ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. దీంతో కొంత ఎక్కువగా డిస్కౌంట్లు ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడటం లేదు. అయితే, భవిష్యత్‌లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, మార్కెట్ సెంటిమెంట్ మొదలైన వాటిని బట్టి డిమాండ్ పరిస్థితి ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా వర్గాలు తెలిపాయి. 2018–19కి భిన్నంగా ప్రస్తుతం సంవత్సరాంతపు డిస్కౌంట్లు కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే పరిమితంగా ఉంటున్నాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
ఈ కార్లను కొనేవారు అదృష్టవంతులే..ఎందుకో ఇక్కడ చూడండి!
మహీంద్రా థార్! ఈ వెహికల్ బుకింగ్స్,సేల్స్ విషయంలో దేశీయ వాహనాల్లో మోస్ట్ పాపులర్ రోడ్ లైఫ్ స్టైల్ వెహికల్‌గా పేరు సంపాదించింది. క్రికెటర్ల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు కల్ట్ వెహికల్‌గా పేరొందిన థార్ వెహికల్‌పై ఆటోమొబైల్ మార్కెట్లో యమ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ దృష్ట్యా మహీంద్రా సంస్థ ట్రెండ్‌కు తగ్గట్లు లేటెస్ట్ టెక్నాలజీతో సొబుగులద్ది నయా లుక్‌తో కొనుగోలు దారులకు పరిచయం చేస్తోంది. అయితే డిసెంబర్లో ఆ కారు కొనేవారు అదృష్టవంతులేనని మహీంద్రా ప్రతినిధులు చెబుతున్నారు. ఎందుకంటే? మహీంద్రా థార్‌తో పాటు ఎక్స్‌యూవీ300 ఎస్యూవీ, స్కార్పియో క్లాసిక్, స్కార్పియో - ఎన్, ఎక్స్‌యూవీ 700 వెహికల్స్‌ను భారీ డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు తెలిపారు. మహీంద్రా థార్ థార్ లాంచ్ చేసిన ఆగస్ట్ 2020 నాటి నుంచి ఆ వెహికల్స్ సేల్స్ భారీ మొత్తం జరుగుతున్నట్లు మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు అదే వెహికల్ డీజిల్, పెట్రోల్ వేరియంట్ పై రూ.20వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. 5డోర్లు థార్ ఎస్‌యూవీలో 2.2లీటర్ల mHawk డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ల mStallion పెట్రోల్ ఇంజిన్లతో మైలేజ్ అవుట్‌పుట్ బాగుటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మిడ్ పెట్రోల్ వేరియంట్ (w8) విభాగంలో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారుపై రూ.లక్ష డిస్కౌంట్, అదే మిడ్ పెట్రోల్ వేరియంట్ డబ్ల్యూ6 పై రూ.80వేలు, డబ్ల్యూ8 వేరియంట్లపై రూ.90వేలు, డబ్ల్యూ 4 వేరియంట్‌పై రూ.53వేల వరకు డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 టర్బో స్పోర్ట్ అక్టోబర్ మహీంద్రా లాంచ్ చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 300 టర్బో స్పోర్ట్ వెహికల్ ప్రారంభం ధర రూ.10.35లక్షలు ఉండగా..ఇప్పుడు అదే వెహికల్‌పై రూ.60వేల వరకు డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు మహీంద్రా యాజమాన్యం తెలిపింది. -
ప్రత్యర్థులకు ధీటుగా మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం!
దేశంలోని ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీ కార్లకు ఓ క్రేజ్ ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 రికార్డు బుకింగ్స్ కావడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ లుక్‌ని విడుదల చేసింది. అయితే మహీంద్రా ఈ కారు విడుదలకు ముందే, టీజర్లతో కారుపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400తో కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది. అయితే ఈ ఈవీ(EV) గురించి కంపెనీ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. సమాచారం ప్రకారం.. కొత్త మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV ధర సుమారు రూ. 14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. లుక్స్ పరంగా చూస్తే.. మహీంద్రా ఎక్స్‌యూవీ 400.. ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్లు, క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో కూడిన కొత్త హెడ్లైట్లతో పూర్తిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సింగిల్ ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారుతో 150హార్స్ పవర్, రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఒక సారి ఛార్జింగ్‌పై 400కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చ . 4.2 మీటర్లు పొడవు, XUV 300తో పోలిస్తే స్పేస్ పెద్దదని తెలుస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు. వాటర్ ప్రూప్ బ్యాటరీ ప్యాక్, ప్రతీ చక్రానికి డిస్క్ బ్రేకులు, రియర్ వ్యూ కెమరా ఇతర ఫీచర్లు ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కి.మీ కాగా 8.3 సెకన్లకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, స్టైలిష్ లుక్ అదిరిందయ్యా! -
'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి అడుగుపెట్టింది.2024-2026 నాటికి మొత్తం ఐదు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. 2024 చివరి నాటికి ఈవీ సెగ్మెంట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు భారీ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రాకు, ఎలాన్ మస్క్‌లను పోల్చుతూ మీమ్స్ చేస్తున్నారు. 😄 https://t.co/CH3E8hdlXQ — anand mahindra (@anandmahindra) August 15, 2022 ఓ ట్విట్టర్ యూజర్..ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆనంద్ మహీంద్రాను..భారత్‌లో టెస్లా కార్ల అమ్మకాలు, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాట్లను విరమించుకున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్‌ను ఉద్దేశిస్తూ ఓ మీమ్ చేశారు. అదే మీమ్‌పై ఆనంద్ మహీంద్రా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ యూజర్ అలేఖ్ షిర్కే 'టెస్లా నాట్ కమింగ్ టూ ఇండియా' అనే ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు అమెజాన్ ప్రైమ్ 'మీర్జాపూర్' సిరీస్'లోని పంకజ్ త్రిపాఠీ "Chinta mat kariye. Hum prabandh karte hain (చింతించకు నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను)." అనే ఫేమస్ డైలాగ్‌ను యాడ్ చేశాడు.అంతే ఇప్పుడా ఆ మీమ్ ఆనంద్ మహీంద్రా అభిమానుల్ని నవ్వులు పూయిస్తుంది. అంతకాదండోయ్. ఆ మీమ్ నచ్చిన ఆనంద్ మహీంద్రా సైతం స్మైలీ ఎమోజీనీ యాడ్ చేసి రీ ట్వీట్ చేశారు. చదవండి👉 సార్ మీరు ‘ఎన్నారై’యేనా!.. ఆనంద్ మహీంద్రా రిప్లై అదిరింది! -
ఈ కార్ని ఇప్పుడు బుక్ చేసుకుంటే..డెలివరీ అయ్యేది రెండేళ్ల తర్వాతే!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవీ 700 అమ్మకాల్లో దుమ్ము లేపుతోంది. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన బుకింగ్స్‌లో కొనుగోలు దారులు కేవలం రెండు రోజుల్లో 70వేల వెహిక్సల్ను బుక్ చేసుకోగా.. ఇప్పుడా వెహికల్ బుక్ చేసుకుంటే డెలివరీ అయ్యేందుకు మరో రెండేళ్ల వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఎస్. మీరు చదివేది నిజమే. మహీంద్రా ఎక్స్‌యూవీ 700ను ఈరోజు బుక్ చేసుకుంటే డెలివరీ 2024కి అవుతుంది. నివేదిక ప్రకారం..ఏఎక్స్7ఎల్ వేరియంట్ వెహికల్ వేటింగ్ పిరియడ్ రెండేళ్లు. ►ఏఎక్స్ 7 ట్రిమ్ వెహికల్ బుక్ చేసుకుంటే 20నెలల తర్వాత డెలివరీ అవుతుంది. ►ఏక్స్5 వేరియంట్ పెట్రోల్ వెహికల్ డెలివరీ అయ్యేందుకు 5నెలల సమయం పట్టనుంది. అదే డీజిల్ వెహికల్ అయితే 11నెలల సమయం పట్టనుంది. ►ఏఎక్స్3 ట్రిమ్‌తో పాటు ఏఎక్స్ 5 వేరియంట్ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఒకేసారి డెలివరీ కానున్నాయి. ►చిప్షార్టేజ్, సప్లయ్ చైన్ క్రైసిస్, ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కోవిడ్, మార్కెట్లో ఈకారుకున్న డిమాండ్ వంటి ఇతర కారణాల ఎక్స్‌యూవీ 700ను డెలివరీ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్, హోందాయ్ క్రెటా కోసం ఎదురు చూడాల్సి ఉంది. చదవండి👉 నా భార్య కోసం ఆర్డర్ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్ మహీంద్రా -
శుభవార్త..పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన మహీంద్రా...!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏప్రిల్ నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను మహీంద్రా విడుదల చేసింది. ఎంపిక చేసిన కార్లపై ఈ నెలలో కస్టమర్లు గరిష్టంగా రూ. 81,500 వరకు ఆదా చేసుకోవచ్చును. అయితే ఆఫ్ రోడ్ కార్ థార్, బొలెరో నియో, ఎక్స్‌యూవీ700 వంటి కార్లపై ఎలాంటి తగ్గింపు లేదు. కాగా ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. పలు కార్లపై మహీంద్రా అందిస్తోన్న తగ్గింపులు ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు మొత్తంగా రూ. 61, 055 వరకు కొనుగోలుదారులు ఆదా చేసుకోవచ్చును. దీని ధర రూ.6.15 లక్షల నుంచి రూ.7.81 లక్షల వరకు ఉంది మహీంద్రా బొలెరో మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు ఎక్సేఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్ బోనస్ రూ. 3000, అదనంగా మరో రూ. 6 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. దీని ధరను రూ.8.99 లక్షల నుండి రూ.9.99 లక్షల వరకు ఉండనుంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు ఎక్సేఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్ బోనస్ రూ. 4000, అదనంగా మరో రూ. 15 వేల వరకు, ఇలా మొత్తంగా రూ. 34 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. మహీంద్రా స్కార్పియోను రూ. 13.18 లక్షల నుంచి రూ. 18.14 లక్షల వరకు విక్రయిస్తోంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,003 వరకు నగదు తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపుతో పాటు అదనంగా రూ. 10 వేల వరకు నగదు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 8.16 లక్షల నుంచి రూ. 13.67 లక్షల వరకు ఉంది. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై కంపెనీ ఏకంగా రూ. 81,500 భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైనఅదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. మహీంద్రా తన పూర్తి-పరిమాణ SUVని రూ. 28.84 లక్షల నుంచి రూ. 31.84 లక్షల వరకు విక్రయిస్తోంది. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్‌పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా ఈ ఎమ్‌పివి ధరను రూ. 12.8 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు నిర్ణయించింది. చదవండి: గుడ్‌న్యూస్...పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్...! -
మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు!!
మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల కొనుగోలు దారులకు భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన పలు మోడళ్లపై రూ.80000 వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా తగ్గించే కార్లలో అత్యంత ఖరీదైన కారుగా ఆల్ట్రాస్ జీ4 ఎస్యూవీ నిలించింది. ఈ కారుపై రూ.81,500వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. కాగా ఆల్ట్రాస్ జీ4 ఎస్యూవీ దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్ కార్లకు ప్రత్యర్ధిగా నిలిచిన విషయం తెలిసిందే. మహీంద్రా ఆల్టురాస్ జీ4 రూ.50,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు అదనంగా రూ.31,500 వరకు పొందవచ్చు. మహీంద్రా సబ్కాం పాక్ట్ ఎస్యూవీ ఎక్స్‌యూవీ 300 కారుపై మహీంద్రా రూ.69,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కారు రూ.30వేల తగ్గింపుతో పాటు మహీంద్రా ఎక్స్‌యూవీ 300ని ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.25,000, కార్పొరేట్ తగ్గింపు రూ.4,000, రూ.10,000 విలువైన ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. మహీంద్రా మనదేశంలో ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీని 16 వేరియంట్లలో అందిస్తోంది. బేస్ 1.2-లీటర్ పెట్రోల్ డ్ల్యూ4 వేరియంట్ ధర రూ.8.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఎస్యూవీ కేయూవీ 100నెక్ట్స్ రూ.60,000 కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఎస్‌యూవీకి ఇతర ప్రయోజనాలతో పాటు రూ38,000 విలువైన నగదు తగ్గింపును అందిస్తోంది. మొత్తం రూ.61,000వరకు ఉంటుంది. ఈ మూడు ఎస్‌యూవీలతో పాటు, మహీంద్రా ఈ నెలలో స్కార్పియోకు రూ.34,000, బొలెరో ఎస్‌యూవీలకు రూ.24,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
ప్రముఖ దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారీ షాకిచ్చింది. ఎంపిక చేసిన మహీంద్రా కార్ల ధరల్ని భారీగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది అక్టోబర్‌లో ఎక్స్ యూవీ 700ని మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైన రెండు రోజుల్లో 50వేల బుకింగ్స్‌తో మహీంద్రా ఆటోమొబైల్ సంస్థ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే పెరిగిపోతున్న బుకింగ్‌ల నేపథ్యంలో కస్టమర్లకు ఈ కార్లను అందించేందుకు సమయం ఉంది.అదే సమయంలో మహీంద్రాతో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. తయారీ (ముడి పదార్థాలు మొదలైనవి),రవాణా ఖర్చులు పెరగడంతో మహీంద్రా అండ్ మహీంద్రాతో పాటు ఇతర కార్ల సంస్థలు కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్ యూవీ 700 వెహికల్ ధరని రూ.80వేల వరకు పెంచింది. ఎక్స్ యూవీ 700 వెహికల్స్ ఫీచర్లు మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్‌యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిన్న ఆకారుగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి చదవండి: ఇదెక్కడి విచిత్రం..! అలవోకగా కారును నడిపేస్తోన్న చేప..! -
రూ.15 లక్షలలో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే.. సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. నిన్న, మొన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే.. అమ్మో అనే ప్రజలు నేడు వాటి కొనుగోళ్లవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, కాలం కలిసి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహన ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెట్టాయి. అందుకే, త్వరలో రూ.15 లక్షల లోపు రాబోయే కార్ల గురుంచి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం.. 1. టాటా టియాగో ఈవీ భారతదేశంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ పోర్ట్ ఫోలియోను విస్తరిస్తుంది. అందులో భాగంగానే భవిష్యత్‌లో లాంచ్ చేయబోయే ఎలక్ట్రిక్ కార్లలో టియాగో హ్యాచ్ బ్యాక్ కారు ఒకటి అని సమాచారం. టాటా టియాగో గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మార్పులతో మినహా అదేవిధంగా టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తుంది. దీని ధర ₹6.5 లక్షలకు సమీపంలో ఉంటుందని అంచనా.(చదవండి: పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!) 2. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది చివరలో తీసుకొనిరావాలి చూస్తున్నట్లు సమాచారం. అయితే, రాబోయే ఈవి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనా, టాటా ఆల్ట్రోజ్ ఈవి కూడా కంపెనీ జిప్ట్రాన్ పవర్ ట్రైన్ టెక్నాలజీతో రావచ్చు అని చెప్పవచ్చు. ఈ రాబోయే ఈవి బ్యాటరీ 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ గతంలో తెలిపింది. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధర ₹10.5 లక్షల నుంచి ₹12.5 లక్షల వరకు ఉంటుందని అంచనా.(చదవండి: బిగ్ ‘సి’ దసరా పండుగ ఆఫర్లు) 3. మహీంద్రా ఈకెయువి100 ఆటో ఎక్స్ పో 2020 గుర్తుందా? ఈ ఎక్స్ పోలో మహీంద్రా ఈకెయువి100 ధరను వెల్లడించింది. ఆ సమయంలో మహీంద్రా & మహీంద్రా ఈకెయువి100 ధర ₹8.25 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. త్వరలో రాబోయే మహీంద్రా ఈకెయువి100 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 54 బిహెచ్పి, 120 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. మహీంద్రా ఈకెయువి100 సింగిల్ ఛార్జ్ పై 147 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. దీనిని ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.(చదవండి: ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!) 4. మహీంద్రా ఈఎక్స్ యువి300 వచ్చే సంవత్సరంలోగా మనం చూడబోయే మరో మహీంద్రా ఈవీ కారు మహీంద్రా ఈఎక్స్‌యువి300. దీనిని కూడా ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శించారు. ఈఎక్స్‌యువి300 ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. చిన్న బ్యాటరీ మోడల్ ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల డ్రైవింగ్ వెళ్లనుంది. అలాగే, మహీంద్రా ఈఎక్స్ యువి300 లాంగ్ రేంజ్ మోడల్ ఛార్జ్ చేసిన ప్రతిసారీ సుమారు 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. భారతదేశంలో మహీంద్రా ఈఎక్స్ యువి300 కారు ధరలు సుమారు ₹12.5 లక్షల వద్ద ప్రారంభమవుతాయని అంచనా. -
Mahindra XUV700: బుకింగ్స్ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్
అందుబాటు ధరలో మెరుగైన ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించి కీలక అప్డేట్ని మహీంద్రా సంస్థ వెల్లడించింది. అక్టోబరులో మార్కెట్లోకి వస్తున్న ఈ కారు బుకింగ్స్ తేదీని మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన బుకింగ్ ప్రక్రియ అక్టోబరు 7 నుంచి మొదలు కానుంది. వినియోగదారులకు ఉండే విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని డిఫెరెంట్ వేరియంట్స్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, సీటింగ్ లేఅవుట్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ రోడ్లపై పరుగులు పెట్టేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ పెట్రోల్ ఇంజన్ బేస్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలుగా ఉంది. మొదటి 25.000 బుకింగ్‌లకే మాత్రమే ఈ ధరకు కారును అమ్ముతామంటూ మహీంద్రా చెబుతోంది. మిగిలిన వేరియంట్లకు సంబంధించి చిప్సెట్లతో పాటు కార్ల తయారీలో ఉపయోగించే కాంపోనెంట్ల ధరలు పెరగడంతో వరుసగా ఒక్కో ఆటోమోబైల్ సంస్థ ధరలు పెంచుకుంటూ పోతుంది. మహీంద్రా సైతం ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీకి సంబంధించి తొలి 25,000 మంది కస్టమర్లకు ముందుగా ప్రకటించిన ధరకే వాహనాలను అమ్మనుంది. చదవండి : మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్ -
మీరు పాత కారు కొనాలనుకుంటున్నారా ?!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కార్ల విక్రయంలో ఉన్న మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ దేశవ్యాప్తంగా శుక్రవారం 75 ఫ్రాంచైజీ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో సంస్థ స్టోర్ల సంఖ్య 1,100 దాటింది. ఈ ఔట్లెట్లలో సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల అమ్మకం, రుణ సౌకర్యం వంటి సేవలు పొందవచ్చు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ పాత కార్లకు డిమాండ్ భారీగా ఉందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశుతోశ్ పాండే తెలిపారు -
MAHINDRA XUV700: అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే ఇంటిలిజెన్స్..
Mahindra XUV 700 Car Unvieled Highlights: విదేశీ కార్లు అందించే ప్రీమియం ఫీచర్లతో దేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి రీలీజ్ చేయనుంది. ఎంతో కాలంగా ఆటోమోబైల్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన ఫీచర్లను మహీంద్రా వెల్లడించింది. కొత్త లోగోతో మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్‌యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. సాటిలేని ఫీచర్లు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిస్తు్న ఆకారుగా మహీందద్రా ఎక్స్‌యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోంటైన్మెంట్లో ఇంటీరియర్‌లో అడ్రినాక్స్ఎక్స్ ఓఎస్ ఇంటిలిజెన్స్ ఆధారిత 10.25 ఇంచ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో మాత్రమే ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పానోరోమిక్ సన్‌రూఫ్, , స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ , డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, సోనీ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, 12 స్పీకర్లు, వాయిస్-ఎనేబుల్డ్ కమాండ్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇతర కీ ఫీచర్లు - జిప్, జాప్, జూమ్, కస్టమ్ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. - డ్రైవర్‌తో పాటు పక్కన ఉండే ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. - 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్‌లను ఫిల్టర్ ఔట్ చేయగల వ్యవస్థను అమర్చారు. - ఎక్స్‌యూవీ 700లో 7 సీట్, 5 సీట్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయి. - హై ఎండ్ మోడల్లో 360 డిగ్రి కెమెరా, సోని 3డీ సౌండ్ సిస్టమ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ ఫీచర్లు ఉన్నాయి. You've heard about it You've talked about it, You've seen it in disguise. It’s the most awaited SUV It is the XUV700 driven by AdrenoX. Watch its debut using this link https://t.co/2yS6hOBboX on 14th August at 4 pm and experience a rush like never before. pic.twitter.com/9bcB8nHJIm — MahindraXUV700 (@MahindraXUV700) August 13, 2021 -
మహీంద్రా బంపర్, ఈ వాహనంపై రూ.2.2లక్షల క్యాష్ ఆఫర్
మహమ్మారి కారణంగా రవాణా రంగం పూర్తిగా స్తంభించి పోయింది. అయితే కరోనా వైరస్ తగ్గి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆన్ లాక్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కార్ల కంపెనీలు భారీ ఆఫర్లను, డిస్కౌంట్ లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ కార్ల సంస్థ మహీంద్రా పలు వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చదవండి : Mahindra : మహీంద్ర బంపర్ ఆఫర్ మహీంద్రా బొలేరో క్యాష్ ఆఫర్: రూ3,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ.10,000 వరకు కార్పొరేట్ ఆఫర్: రూ. 3,000 వరకు మహీంద్రా స్కార్పియో ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్: రూ. 4,500 వరకు విలువైన ఉచిత ఎక్విప్ మెంట్రూ.17,042 వరకు మహీంద్రా మరాజో క్యాష్ ఆఫర్: రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్:రూ. 15,000 వరకు కార్పొరేట్ ఆఫర్:రూ. 5,200 వరకు మహీంద్రా ఎక్స్‌యూవీ 300 క్యాష్ ఆఫర్: రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ. 25,000 వరకు కార్పొరేట్ ఆఫర్:రూ.4,000 వరకు విలువైన ఉచిత ఉపకరణాలు: రూ.10,000 వరకు మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి క్యాష్ ఆఫర్: రూ. 38,055 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్:రూ. 20,000 వరకు కార్పొరేట్ ఆఫర్: రూ. 3,000 వరకు మహీంద్రా ఎక్స్‌యూవీ 500 క్యాష్ ఆఫర్:రూ. 51,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్: ₹ 50,000 వరకు కార్పొరేట్ ఆఫర్: రూ.6,500 వరకు విలువైన ఉచిత ఉపకరణాలు: ₹ 15,000 వరకు మహీంద్రా అల్టురాస్ జి 4 క్యాష్ ఆఫర్: రూ.2.2 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ. 50,000 వరకు కార్పొరేట్ ఆఫర్:రూ.11,500 వరకు ఫ్రీ ఎక్విప్ మెంట్ : రూ. 20,000 వరకు. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే లభిస్తాయి. ప్రాంతాల్ని బట్టి ఆఫర్లు మారతాయని మహీంద్రా ప్రతినిధులు తెలిపారు. -
మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా కంపెనీ ఫిబ్రవరి నెలలో తన బిఎస్6 ఎస్యూవీలపైన డిస్కౌంట్ ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ ప్రకారం.. బోలెరో కారుపై రూ.24వేల నుంచి మొదలు పెడితే అల్టురాస్ జీ4పై రూ.3.06లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఫిబ్రవరి 28, 2021 వరకు ఉంటాయి. ఈ ఆఫర్లు మీ ప్రాంతాలలో డీలర్షిప్ బట్టి వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.(చదవండి: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారు ఇదే!) మహీంద్రా తన ప్రీమియం అల్టురాస్ ఎస్యూవీ జీ4పై ఏకంగా రూ.3.06లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. దీనిపై రూ.2.2 లక్షల వరకు క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.50వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.16 వేల నుంచి రూ.20వేల వరకు అందిస్తున్నారు. తర్వాత మహీంద్రా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ.44వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఎస్‌యూవీపై క్యాష్ ఆఫర్ కింద రూ.10,000 డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.25,000 డిస్కౌంట్, రూ.5వేల కార్పొరేట్ డిస్కౌంట్ తో పాటు ఇతర ప్రయోజనాలు అందనున్నాయి. మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్ టిపై క్యాష్ ఆఫర్ కింద రూ.38వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.20వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. కెయువి100 ఎన్ఎక్స్ టిని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు రూ.62,055 వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే మహీంద్రా స్కార్పియో మీద రూ.39,502 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.10వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.15వేలు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ.4,500 కార్పొరేట్ ఆఫర్, రూ.10,000 వరకు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.(చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త!) ప్రసిద్ధ మహీంద్రా ఎక్స్యువి500 మీద గరిష్టంగా రూ.80,800వరకు డిస్కౌంట్ లభించనుంది. ఇందులో రూ.36,800 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్ తో పాటు రూ.15,000వరకు అదనపు ఆఫర్లు ఉన్నాయి. ఇక మహీంద్రా మరాజోపై గరిష్టంగా రూ.36వేలు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇందులో క్యాష్ ఆఫర్ కింద రూ.15వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.15వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.6,000 వరకు అందిస్తున్నారు. చివరగా, మహీంద్రా బొలెరోపై రూ.24,050 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనిపై రూ.3,500వరకు క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.10వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4,000 వరకు ఆఫర్ లభిస్తుంది. -
మహీంద్రా ధరలూ పెరిగాయ్
న్యూఢిల్లీ: రూపాయి క్షీణతతో ధరల భారాన్ని వాహన కంపెనీలు వినియోగదారుని నెత్తిన వేయాలని నిర్ణయించాయి. రూపాయి పతనానికి తోడు ముడిసరుకుల ధరలు కూడా పెరిగి ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, పలు వాహన కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, ధరలను పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామని బజాజ్ ఆటో పేర్కొంది. మహీంద్రా కంపెనీ ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను రూ.6,000 నుంచి రూ.20,000 వరకూ పెంచుతోంది. ఈ పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఈ కంపెనీ స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, బొలెరో, వెరిటోతో పాటు పలు రకాల వాహనాలను తయారు చేస్తోంది. త్వరలోనే పెంపు: రూపాయి విలువ క్షీణించడంతో ఉత్పత్తి వ్యయం పెరగిందని... ధరలు పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. ఇప్పటికే మారుతీ, హ్యుందాయ్, జీఎం, టయోటా, మెర్సిడెస్ బెంజ్, ఆడి తదితర కంపెనీలు ధరలను పెంచగా, ధరల పెంపు విషయమై తీవ్రం గానే పరిశీలిస్తున్నామని టాటా మోటార్స్ పేర్కొంది.