
మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల కొనుగోలు దారులకు భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన పలు మోడళ్లపై రూ.80000 వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది.
మహీంద్రా అండ్ మహీంద్రా తగ్గించే కార్లలో అత్యంత ఖరీదైన కారుగా ఆల్ట్రాస్ జీ4 ఎస్‌యూవీ నిలించింది. ఈ కారుపై రూ.81,500వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. కాగా ఆల్ట్రాస్ జీ4 ఎస్‌యూవీ దేశీయ మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్ కార్లకు ప్రత్యర్ధిగా నిలిచిన విషయం తెలిసిందే. మహీంద్రా ఆల్టురాస్ జీ4 రూ.50,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌లు, ఇతర ఆఫర్‌లు అదనంగా రూ.31,500 వరకు పొందవచ్చు.
మహీంద్రా సబ్కాం పాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 300 కారుపై మహీంద్రా రూ.69,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కారు రూ.30వేల తగ్గింపుతో పాటు మహీంద్రా ఎక్స్‌యూవీ 300ని ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.25,000, కార్పొరేట్ తగ్గింపు రూ.4,000, రూ.10,000 విలువైన ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.
మహీంద్రా మనదేశంలో ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీని 16 వేరియంట్లలో అందిస్తోంది. బేస్ 1.2-లీటర్ పెట్రోల్ డ్ల్యూ4 వేరియంట్ ధర రూ.8.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
ఎస్‌యూవీ కేయూవీ 100నెక్ట్స్ రూ.60,000 కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఎస్‌యూవీకి ఇతర ప్రయోజనాలతో పాటు రూ38,000 విలువైన నగదు తగ్గింపును అందిస్తోంది. మొత్తం రూ.61,000వరకు ఉంటుంది.
ఈ మూడు ఎస్‌యూవీలతో పాటు, మహీంద్రా ఈ నెలలో స్కార్పియోకు రూ.34,000, బొలెరో ఎస్‌యూవీలకు రూ.24,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.