Mahindra XUV 700 Car Unvieled Highlights: విదేశీ కార్లు అందించే ప్రీమియం ఫీచర్లతో దేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త వాహనాన్ని మార్కెట్‌లోకి రీలీజ్ చేయనుంది. ఎంతో కాలంగా ఆటోమోబైల్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన ఫీచర్లను మహీంద్రా వెల్లడించింది.
కొత్త లోగోతో
మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్‌యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.
సాటిలేని ఫీచర్లు
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిస్తు‍్న ఆకారుగా మహీందద్రా ఎక్స్‌యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇన్ఫోంటైన్‌మెంట్‌లో
ఇంటీరియర్‌లో అడ్రినాక్స్ఎక్స్ ఓఎస్ ఇంటిలిజెన్స్ ఆధారిత 10.25 ఇంచ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో మాత్రమే ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పానోరోమిక్ సన్‌రూఫ్, , స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ , డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, సోనీ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, 12 స్పీకర్లు, వాయిస్-ఎనేబుల్డ్ కమాండ్‌లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇతర కీ ఫీచర్లు
- జిప్, జాప్, జూమ్, కస్టమ్ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.
- డ్రైవర్‌తో పాటు పక్కన ఉండే ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు.
- 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్‌లను ఫిల్టర్ ఔట్ చేయగల వ్యవస్థను అమర్చారు.
- ఎక్స్‌యూవీ 700లో 7 సీట్, 5 సీట్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయి.
- హై ఎండ్ మోడల్‌లో 360 డిగ్రి కెమెరా, సోని 3డీ సౌండ్ సిస్టమ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ ఫీచర్లు ఉన్నాయి.
You've heard about it
— MahindraXUV700 (@MahindraXUV700) August 13, 2021
You've talked about it,
You've seen it in disguise.
It’s the most awaited SUV
It is the XUV700 driven by AdrenoX.
Watch its debut using this link https://t.co/2yS6hOBboX
on 14th August at 4 pm and experience a rush like never before. pic.twitter.com/9bcB8nHJIm
Comments
Please login to add a commentAdd a comment