Sports Utility Vehicle (SUV)
-
ఎస్యూవీ.. కూపే అవతార్!
కుర్ర’కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ).. ఆటోమొబైల్ కంపెనీలకు కూడా గత కొన్నేళ్లుగా కాసులు కురిపిస్తున్నాయ్. అయితే, కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీల షేపు, స్టయిల్, డిజైన్‌లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘ఎస్యూవీ కూపే’ పేరుతో కొత్త సెగ్మెంట్నుక్రియేట్ చేయడం ద్వారా అమ్మకాల గేరు మార్చేందుకు పోటీ పడుతున్నాయి వాహన దిగ్గజాలు. దేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 55 శాతం వాటా ఎస్‌యూవీలదే కావడం వాటి క్రేజ్‌కు నిదర్శనం. అయితే, కొద్ది నెలలుగా డిమాండ్ కాస్త మందగించడంతో సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు వాటికి కొత్తదనాన్ని జోడిస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో ఎస్యూవీ కూపేలు ఇప్పుడు నయా ట్రెండ్. టాటా మోటార్స్ ‘కర్వ్’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపేను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనే తాజాగా పెట్రోల్, డీజిల్ మోడల్‌ను కూడా తెచి్చంది. ఇక ఫ్రెంచ్ ఆటో దిగ్గజం సిట్రాన్ ఎస్యూవీ కూపే ‘బసాల్ట్’ను బరిలోకి దించింది. దీని రేటు, డిజైన్ కూడా ఊరించేలా ఉంది. త్వరలోనే మహీంద్రా తన పాపులర్ మోడల్ ఎక్స్‌యూవీ 700లో కూపే మోడల్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్లు టాక్. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపే కూడా క్యూలో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచి్చన టాటా, సిట్రాన్ కూపే ఎస్‌యూవీలకు కస్టమర్ల రెస్పాన్స్ అదిరిపోవడంతో ఇతర కంపెనీలూ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచాయి. ఫోక్స్‌వ్యాగన్, రెనో సైతం భారత్ మార్కెట్ కోసం కూపే ఎస్వీయూలను రెడీ చేస్తున్నాయట! ప్రీమియం లుక్, లగ్జరీ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో కూపే మోడల్‌ను కోరుకునే వారిని ఈ ఎస్యూవీ కూపేలతో టార్గెట్ చేయాలనేది కార్ల కంపెనీల ప్లాన్. అమ్మకాల్లో వాటిదే హవా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవాయే నడుస్తోంది. హైఎండ్ లగ్జరీ ఎస్వీయూల రేటు భారీగా ఉండటంతో కస్టమర్లకు అదే లుక్కు, ఫీచర్లతో రూ. 10–20 లక్షల ధరలో దొరుకుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఎంజీ ఆస్టర్, సిట్రాన్ సీ3 ఎయిర్‌క్రాస్ వంటివి హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. మరోపక్క, చిన్నకారు కొనే యోచనలో ఉన్నవారిని సైతం ఊరించే విధంగా రూ. 10 లక్షల స్థాయిలో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలను తీసుకొచ్చి మార్కెట్‌ను విస్తరించాయి కార్ల కంపెనీలు. మారుతీ బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నెట్, రెనో కైగర్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, టయోటా ట్రైసర్ వంటివి సబ్‌కాంపాక్ట్ సెగ్మెంట్లో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. గత రెండు మూడేళ్లుగా ఈ రెండు విభాగాల్లో పోటీ పెరిగిపోవడంతో.. ఇప్పుడు ఎస్యూవీ కూపేతో జెన్ జెడ్‌తో పాటు యువ కస్టమర్లను ఆకట్టుకోవాలనేది కార్ల కంపెనీల కొత్త వ్యూహం. ఇప్పటికే లగ్జరీ కూపే కార్లున్నాయ్..మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ల్యాండ్‌రోవర్, పోర్షే, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల దిగ్గజాలు ఇప్పటికే కూపే ఎస్‌యూవీలను మన మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే, వీటి లుక్కు, డిజైన్లాగే ధర కూడా ‘టాప్’లేపేలా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఎస్యూవీ కూపేల్లో బీఎండబ్ల్యూ ఎక్స్4 రేటే చాలా తక్కువ. ఎంతంటే జస్ట్ రూ. 96 లక్షలే! (ఎక్స్ షోరూమ్) అ‘ధర’పోయింది కదూ! అందుకే అచ్చం అలాంటి డిజైన్లోనే హాట్ సెల్లింగ్ మిడ్–ఎస్యూవీ రేంజ్‌లోనే ఈ స్టయిలిష్ కూపేలను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మరింత వైవిధ్యాన్ని అందించేందుకు వాహన కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గతేడాది మొత్తం కార్ల అమ్మకాల్లో 16 శాతం వాటా మిడ్–ఎస్‌యూవీలదే కావడం విశేషం!ఎస్యూవీ కూపే అంటే... ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎస్‌యూవీలన్నీ దాదాపు బాక్స్ ఆకారంలో రగ్గ్డ్ లుక్‌తోనే ఉంటున్నాయి. బలిష్టమైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, ఎత్తుగా, స్పోర్ట్స్ లుక్ కూడా ఉండటంతో ఎస్‌యూవీలు మార్కెట్‌ను కొల్లగొడుతూనే ఉన్నాయి. కస్టమర్లకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. అయితే, లగ్జరీ స్పోర్ట్స్ కూపే కార్లలోని స్లీక్ డిజైన్‌ను, ఎస్‌యూవీల్లోని రగ్గ్డ్ లుక్‌ను కలగలిపినవే ఈ కూపే ఎస్‌యూవీలు. దీనిలోని ప్రత్యేకత ఏంటంటే, ముందువైపు చూస్తే చాలా భారీగా ఎస్యూవీ స్టయిల్లోనే కనిపిస్తుంది. వెనక్కి వెళ్లే కొద్దీ రూఫ్‌లైన్ బాగా ఏటవాలుగా వంగి కూపే లుక్‌తో ఉంటుంది. ఇతర ఫీచర్లన్నీ ఎస్యూవీ మాదిరే ఉంటాయి. చాలావరకు లగ్జరీ కార్లలో ఇలాంటి డిజైన్‌ను మనం చూడొచ్చు. కస్టమర్లు సాధారణ బాక్స్ డిజైన్ కంటే స్పోర్ట్ లుక్‌తో ఉండే లైఫ్‌స్టయిల్ ఎస్‌యూవీలకే మొగ్గు చూపుతుండటంతో ఎస్యూవీ కూపే క్రాసోవర్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో లగ్జరీ, కాంపాక్ట్, సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలకు తోడుగా బడ్జెట్ ధరల్లో కూపే ఎస్యూవీ సెగ్మెంట్‌తో దుమ్మురేపేందుకు కంపెనీలు సై అంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫిబ్రవరిలోనూ ‘రయ్ రయ్’
ముంబై: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు ఆదరణ పెరగడంతో ఫిబ్రవరిలోనూ రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. మొత్తం 3.73 లక్షల ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు జరిగాయి. తద్వారా పరిశ్రమ చరిత్రలో అత్యధిక పీవీలు అమ్ముడైన మూడో నెలగా ఫిబ్రవరి ఆవిర్భవించింది. ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ కొనసాగింది. కాగా ట్రాక్టర్స్ అమ్మకాల వృద్ధిలో క్షీణత జరిగింది. -
కొనసాగిన ఆటో అమ్మకాల జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల ఏప్రిల్‌లో ఆటో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. ప్రధానంగా స్పోర్ట్స్ యుటిలిటి వాహనాల(ఎస్యూవీ)కు డిమాండ్ కలిసొచ్చింది. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ సంస్థలు డీలర్లకు అధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేశాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో మొత్తం 1,50,661 వాహనాలను విక్రయించగా, ఏప్రిల్‌లో ఈ సంఖ్య 7 శాతం మేర పెరిగి 1,60,529 యూనిట్లకు చేరింది. ‘‘చిప్ కొరతతో గత నెలలో కొంత ఉత్పత్తి నష్టం జరిగింది. అయితే ఎస్యూవీ విభాగంలో 21 శాతం వృద్ధి నమోదు కావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం పెరిగింది. ద్రవ్యోల్బణ సమస్య, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో సెంటిమెంట్ స్తబ్ధుగా ఉండొచ్చు’’ అని ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. హీరో మోటోకార్ప్(5% క్షీణత) మినహా టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, హెచ్ఎంఎస్ఐ అమ్మకాలు వరుసగా 4%, 18%, 6% చొప్పున పెరిగాయి. ► విద్యుత్ ద్విచక్ర వాహన అమ్మకాలు ఏప్రిల్‌లో గణనీయంగా తగ్గాయి. నెల ప్రాతిపదికన మార్చిలో 82,292 యూనిట్లు అమ్ముడయ్యాయి. అవి ఈ ఏప్రిల్‌లో 62,581 యూనిట్లకు తగ్గాయి. -
మహీంద్రా థార్ కొత్త శ్రేణి
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ థార్ మోడల్లో రేర్ వీల్ డ్రైవ్ ట్రిమ్స్‌ను ప్రవేశపెట్టింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో వీటిని రూపొందించింది. ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం. వీటిలో డీజిల్‌లో రెండు మాన్యువల్, పెట్రోల్‌తో ఆటోమేటిక్ వేరియంట్ ఉంది. కస్టమర్ల నుంచి వచ్చిన సూచనల మేరకు నూతన శ్రేణిని పరిచయం చేసినట్టు కంపెనీ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. ఔత్సాహిక కస్టమర్లకు థార్ మరింత చేరువ అవుతుందని చెప్పారు. ఇక 4 వీల్ డ్రైవ్ శ్రేణి ఇప్పుడు ఆధునిక ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ సిస్టమ్‌తో తయారైందని కంపెనీ తెలిపింది. -
ఎస్‌యూవీల్లోకి హోండా రీ–ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్‌యూవీలైన సీఆర్–వి, బీఆర్–వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్–వి, జాజ్ ఎస్‌యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్‌తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
MAHINDRA XUV700: అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే ఇంటిలిజెన్స్..
Mahindra XUV 700 Car Unvieled Highlights: విదేశీ కార్లు అందించే ప్రీమియం ఫీచర్లతో దేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి రీలీజ్ చేయనుంది. ఎంతో కాలంగా ఆటోమోబైల్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన ఫీచర్లను మహీంద్రా వెల్లడించింది. కొత్త లోగోతో మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్‌యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. సాటిలేని ఫీచర్లు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిస్తు్న ఆకారుగా మహీందద్రా ఎక్స్‌యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోంటైన్మెంట్లో ఇంటీరియర్‌లో అడ్రినాక్స్ఎక్స్ ఓఎస్ ఇంటిలిజెన్స్ ఆధారిత 10.25 ఇంచ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో మాత్రమే ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పానోరోమిక్ సన్‌రూఫ్, , స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ , డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, సోనీ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, 12 స్పీకర్లు, వాయిస్-ఎనేబుల్డ్ కమాండ్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇతర కీ ఫీచర్లు - జిప్, జాప్, జూమ్, కస్టమ్ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. - డ్రైవర్‌తో పాటు పక్కన ఉండే ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. - 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్‌లను ఫిల్టర్ ఔట్ చేయగల వ్యవస్థను అమర్చారు. - ఎక్స్‌యూవీ 700లో 7 సీట్, 5 సీట్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయి. - హై ఎండ్ మోడల్లో 360 డిగ్రి కెమెరా, సోని 3డీ సౌండ్ సిస్టమ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ ఫీచర్లు ఉన్నాయి. You've heard about it You've talked about it, You've seen it in disguise. It’s the most awaited SUV It is the XUV700 driven by AdrenoX. Watch its debut using this link https://t.co/2yS6hOBboX on 14th August at 4 pm and experience a rush like never before. pic.twitter.com/9bcB8nHJIm — MahindraXUV700 (@MahindraXUV700) August 13, 2021 -
మారుతీ మినీ ఎస్యూవీ.. ఎస్–ప్రెసో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ మినీ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్), ఎస్–ప్రెసోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మినీ ఎస్యూవీ ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్ ధరలు)లో ఉన్నాయి. స్టాండర్డ్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లు, ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతోంది. రెనో క్విడ్, డాట్సన్ రెడీ–గో, మారుతీ సుజుకీ కంపెనీకే చెందిన ఆల్టో కే10 కార్లకు ఈ ఎస్–ప్రెసో గట్టి పోటీనిస్తుందని అంచనా. ఎనిమిదవ బీఎస్–సిక్స్ మారుతీ మోడల్ మారుతీ కంపెనీ ఐదవ తరం హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ కారు లీటర్‌కు 21.7 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్(భారత్ స్టేజ్)–సిక్స్ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1 లీటర్ కే10 పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును తయారు చేశామని పేర్కొన్నారు. తమ కంపెనీ నుంచి బీఎస్–సిక్స్ ఇంజిన్‌తో వస్తున్న ఎనిమిదవ మోడల్ ఇదని తెలిపారు. ఈ కారు మాన్యువల్(5 గేర్లు), ఆటో గేర్ షిఫ్ట్(ఏజీఎస్) ఆప్షన్లలో లభిస్తుందని తెలిపారు. వివిధ భద్రతా ఫీచర్లతో ఈ కారును రూపొందించామని చెప్పారు. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటీ–లాక్బ్రేకింగ్ సిస్టమ్) లిమిటర్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, హైస్పీడ్ వారి్నంగ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు.. తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ట్విన్ చాంబర్ హెడ్‌ల్యాంప్స్, సిగ్నేచర్ సి షేప్డ్ టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ బంపర్స్, ఓఆర్వీఎమ్స్ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే, ఆడియో, వాయిస్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7–అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. రూ. 640 కోట్ల పెట్టుబడులు... ఈ కారు తయారీలో స్థానిక విడిభాగాలను 98 శాతం మేర ఉపయోగించామని అయుకవ చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.640 కోట్లు ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతమున్న మందగమనం తాత్కాలికమేనని భావిస్తున్నామని చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చడానికి ఎస్–ప్రెసో తోడ్పడగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాంపాక్ట్ కార్లకే మొగ్గు.... ఇటీవలి కాలంలో వినియోగదారులు కాంపాక్ట్ కార్ల కొనుగోలుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయుకవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో తాజా డిజైన్‌తో కూడిన కారు అవసరం ఉందని, దీని కోసమే ఎస్–ప్రెసో కారును అందుబా టులోకి తెచ్చామని వివరించారు. తర్వాతి తరం కాంపాక్ట్ కార్ల డిజైన్‌కు ఎస్–ప్రెసో దారి చూపుతుందని తెలిపారు. ఎరెనా రిటైల్ నెట్వర్క్ ద్వారా ఈ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. -
మార్కెట్లోకి ఫియట్ అవెంచురా
ధర రూ. 5.99 - రూ. 8.17 లక్షలు న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా మంగళవారం భారత మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) అవెంచురాను ఆవిష్కరించింది. దీని ధర రూ. 5.99- రూ. 8.17 లక్షల శ్రేణిలో (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ వేరియంట్ రేటు రూ. 5.99-రూ. 7.05 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ. 6.89- రూ. 8.17 లక్షల శ్రేణిలో ఉంటుందని వివరించింది. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంటులో అవెంచురాను ఉత్పత్తి చేస్తామని, ప్రాథమికంగా దేశీ మార్కెట్లోనే విక్రయిస్తామని సంస్థ భారత విభాగం ఎండీ నగేశ్ బసవనహళ్లి తెలిపారు. ఇప్పటిదాకా 500 ప్రీ-లాంచ్ బుకింగ్స్ జరిగాయని.. 15,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చాయని నగేశ్ వివరించారు. ఈ ఏడాది మొత్తం అయిదు మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్న ఫియట్... త్వరలో లగ్జరీ కారు అబార్త్ 500ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఇక, రాబోయే అయిదేళ్లలో 12 మోడల్స్‌ను ఆవిష్కరించాలని, 2015 నాటికి జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లో ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యం 1,35,000గా ఉంది. దీన్ని 2018 నాటికల్లా 2,45,000 యూనిట్లకు పెంచుకోవాలని ఫియట్ నిర్దేశించుకుంది.