న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ మినీ ఎస్‌యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్), ఎస్–ప్రెసోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మినీ ఎస్‌యూవీ ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్ ధరలు)లో ఉన్నాయి. స్టాండర్డ్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లు, ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతోంది. రెనో క్విడ్, డాట్సన్ రెడీ–గో, మారుతీ సుజుకీ కంపెనీకే చెందిన ఆల్టో కే10 కార్లకు ఈ ఎస్–ప్రెసో గట్టి పోటీనిస్తుందని అంచనా.
ఎనిమిదవ బీఎస్–సిక్స్ మారుతీ మోడల్
మారుతీ కంపెనీ ఐదవ తరం హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ కారు లీటర్‌కు 21.7 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్(భారత్ స్టేజ్)–సిక్స్ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1 లీటర్ కే10 పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును తయారు చేశామని పేర్కొన్నారు. తమ కంపెనీ నుంచి బీఎస్–సిక్స్ ఇంజిన్‌తో వస్తున్న ఎనిమిదవ మోడల్ ఇదని తెలిపారు. ఈ కారు మాన్యువల్(5 గేర్లు), ఆటో గేర్ షిఫ్ట్(ఏజీఎస్) ఆప్షన్లలో లభిస్తుందని తెలిపారు.
వివిధ భద్రతా ఫీచర్లతో ఈ కారును రూపొందించామని చెప్పారు. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటీ–లాక్‌బ్రేకింగ్ సిస్టమ్) లిమిటర్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, హైస్పీడ్ వారి్నంగ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు.. తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ట్విన్ చాంబర్ హెడ్‌ల్యాంప్స్, సిగ్నేచర్ సి షేప్‌డ్ టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ బంపర్స్, ఓఆర్‌వీఎమ్స్ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే, ఆడియో, వాయిస్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7–అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.
రూ. 640 కోట్ల పెట్టుబడులు...
ఈ కారు తయారీలో స్థానిక విడిభాగాలను 98 శాతం మేర ఉపయోగించామని అయుకవ చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.640 కోట్లు ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతమున్న మందగమనం తాత్కాలికమేనని భావిస్తున్నామని చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చడానికి ఎస్–ప్రెసో తోడ్పడగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
కాంపాక్ట్ కార్లకే మొగ్గు....
ఇటీవలి కాలంలో వినియోగదారులు కాంపాక్ట్ కార్ల కొనుగోలుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయుకవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో తాజా డిజైన్‌తో కూడిన కారు అవసరం ఉందని, దీని కోసమే ఎస్–ప్రెసో కారును అందుబా టులోకి తెచ్చామని వివరించారు. తర్వాతి తరం కాంపాక్ట్ కార్ల డిజైన్‌కు ఎస్–ప్రెసో దారి చూపుతుందని తెలిపారు. ఎరెనా రిటైల్ నెట్‌వర్క్ ద్వారా ఈ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment