ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధం వాహన పరిశ్రమకు అత్యుత్తమంగా నిలిచింది. ప్యాసింజర్ విభాగంలో మొత్తం 20 లక్షల వాహనాలు విక్రమయ్యాయి. ఇక నెలవారీగా జూన్ ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్దగా కలిసిరాలేదు. మొత్తం 3.37 లక్ష వాహన అమ్మకాలు జరిగాయి. ఏడాది ఇదే నెలలో సరఫరా చేసిన 3.21 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 1.9% మాత్రమే అధికంగా ఉంది. కార్ల తయారీ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్.. అమ్మకాల్లో ఓ మోస్తరు వృద్ధి నమోదైంది.
► మారుతి సుజుకీ జూన్‌లో మొత్తం 1,33,027 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలి్చతే కేవలం ఎనిమిది శాతం (1,22,685 యూనిట్లు) వృద్ధి నమోదైంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలు విక్రయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
► హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాల్లో కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. కంపెనీ ఈ కాలంలో 50,001 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
► టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎంజీ మోటార్, టాటా మోటార్స్ విక్రయాలు వరుసగా 19%, 14%, ఒక శాతం పెరగగా కియా, హోండా కార్ల విక్రయాలు మాత్రం వరుసగా 19%, 35% మేరకు క్షీణించాయి.
6 నెలల్లో 20 లక్షల వాహన విక్రయాలు
Published Mon, Jul 3 2023 4:41 AM | Last Updated on Mon, Jul 3 2023 4:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment